వాడుకరి చర్చ:Kiran sidam
స్వాగతం
[మార్చు]Kiran sidam గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- తెలుగు వికీపీడియా పరిచయానికి అంచెలంచెల(step by step) పారస్పరిక (interactive)బోధన, వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం) చూడండి. తెలుగు వ్యాసరచన గురించి విషయ వ్యక్తీకరణ, కంప్యూటర్ లో తెలుగు టైపు చెయ్యడం గురించి టైపింగు సహాయం, కీ బోర్డు వ్యాసాలు ఉపయోగపడతాయి.
- "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
- వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
- చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
- వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
- వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
- వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.
ఇకపోతే..
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లోని దాదాపుగా ప్రతీ ఊరికీ, మండలానికీ, జిల్లాకీ, పట్టణానికీ, నగరానికీ వికీలో పేజీ ఉంది. మీ ఊరి పేజీ చూడండి. అందులో సవరణలు ఏమైనా అవసరమనుకుంటే చేసెయ్యండి. వెనకాడకండి.
- ప్రతీ తెలుగు సినిమాకీ ఒక పేజీ పెట్టాలనేది సంకల్పం. అందులో మీరూ పాలుపంచుకోవచ్చు.
- మానవ పరిణామం, మాయాబజార్, ఇస్రో, కృష్ణ (సినిమా నటుడు), జవాహర్ లాల్ నెహ్రూ, చంద్రుడెలా పుట్టాడు, తిరుమల ప్రసాదం, హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు, కొండారెడ్డి బురుజు,..ఇలాంటి వేలాది వ్యాసాలు ఉన్నవి. రండి. విజ్ఞాన సర్వస్వ ప్రపంచంలో విహరించండి. ఇక్కడ రాయండి. తప్పులను సరిదిద్దండి. ఒప్పులకు మెరుగులు పెట్టండి.
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
- ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Nrgullapalli (చర్చ) 12:47, 29 ఆగస్టు 2022 (UTC)
WPWPTE ముగింపు వేడుక
[మార్చు]నమస్కారం !
వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 ప్రాజెక్టులో మీ కృషికి ధన్యవాదాలు.
నవంబరు 12 (రెండవ శనివారం) నాడు హైద్రాబాద్ రవీంద్ర భారతిలో WPWPTE ముగింపు వేడుక నిర్వహిస్తున్నాము. ఆరోజు పోటీలో గెలుపొందిన వారిని సత్కరించుకుందాం, అలాగే ఇటీవల మన సముదాయం కోల్పోయిన వికీపీడియను ఎల్లంకి భాస్కర్ నాయుడు గారిని స్మరించుకుందాం. కావున మీరు తప్పక హాజరవ్వగలరని నా మనవి.
వేడుకకి హాజరయ్యే వారు వేడుక పేజీలో పాల్గొనేవారు అనే శీర్షిక కింద మీ సంతకం చేయగలరు.
పోటీలో పాల్గొన్న వారందరికీ సావనీర్లు అందించాలని తలుస్తున్నాము, వీటికోసం ఈ [1] ఫారంలో మీ వివరాలు చేర్చగలరు.
ధన్యవాదాలు.
NskJnv 05:43, 5 నవంబరు 2022 (UTC)
నమస్కారం @ Kiran sidam గారు,
స్త్రీవాదము - జానపదము అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో వికీపీడియాలో జరిగే అంతర్జాతీయ రచనల పోటీ. వికీపీడియాలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద సంస్కృతి, జానపద కథలతో సంబంధం ఉన్న స్త్రీలకు సంబంధించిన అనేక అంశాలను డాక్యుమెంట్ చేయడం దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా జానపద వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడానికి వికీమీడియా కామన్స్‌లో నిర్వహించబడిన వికీ లవ్స్ ఫోక్‌లోర్ (WLF) ఫోటోగ్రఫీ ప్రచారానికి వికీపీడియా మరోరూపం. ఈ ప్రాజెక్టులో జానపద ఉత్సవాలు, జానపద నృత్యాలు, జానపద సంగీతం, జానపద మహిళలు, విచిత్రమైన జానపద కథలు, జానపద ఆటల క్రీడాకారులు, పురాణాలలో మహిళలు, జానపద కథలలో మహిళా యోధులకు గురించిన కొత్త వ్యాసాలను రాయడం లేదా వికీలో ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.
2024 గాను ఫిబ్రవరి మార్చి రెండు నెలల్లో స్త్రీవాదం- జానపదం ప్రాజెక్టును నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు కూడ అందిస్తున్నాము.
వెంటనే స్త్రీవాదము-జానపదము ప్రాజెక్టు పేజీ సందర్శించి మీ వంతు సహకారం అందించగలరు.
ధన్యవాదాలు.
ఇట్లు
Tmamatha (చర్చ) 17:28, 3 ఫిబ్రవరి 2024 (UTC)
ఇండిక్ మీడియావికి డెవలపర్స్ యూజర్ గ్రూప్ - టెక్నికల్ సంప్రదింపులు 2024
[మార్చు]నమస్తే,
ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ యూజర్ గ్రూప్ వికీమీడియా ప్రాజెక్ట్‌లకు సహకరిస్తున్నప్పుడు వివిధ సాంకేతిక సమస్యలపై సభ్యుల అవసరాలను అర్థం చేసుకోవడానికి కమ్యూనిటీ టెక్నికల్ కన్సల్టేషన్ ప్రక్రియను ప్రారంభించారు. వీటి లక్ష్యం కమ్యూనిటీలలోని సవాళ్లను బాగా అర్థం చేసుకోవడం, సాధారణ సమస్యలను అర్థం చేసుకోవడం మరియు భవిష్యత్ సాంకేతిక అభివృద్ధి కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం.
మొదటి దశ మీ సాధారణ సమస్యలు, ఆలోచనలు మొదలైనవాటిని ఎక్కడ నివేదించాలనే సర్వే. దయచేసి సర్వేను (మీకు నచ్చిన భాషలో) ఇక్కడ పూరించండి. https://docs.google.com/forms/d/e/1FAIpQLSfvVFtXWzSEL4YlUlxwIQm2s42Tcu1A9a_4uXWi2Q5jUpFZzw/viewform?usp=sf_link
చివరి తేదీ 20 సెప్టెంబర్ 2024.
మీరు బహుళ సమస్యలు లేదా ఆలోచనలను నివేదించాలనుకుంటే, మీరు సర్వేను ఒకటి కంటే ఎక్కువసార్లు పూరించవచ్చు.
కార్యాచరణ గురించి మరింత చదవడానికి, దయచేసి సందర్శించండి: https://w.wiki/AV78
సర్వే తెలుగులో పైన పేజీలో ఉన్నాయ్.
ధన్యవాదాలు! MediaWiki message delivery (చర్చ) 13:29, 9 సెప్టెంబరు 2024 (UTC), ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ తరపున
జైనూరు వ్యాసంలో మీ సవరణలు
[మార్చు]@Kiran sidam గారూ వికీపీడియా చేరి, చురుకుగా సవరణలు చేస్తున్నందుకు ధన్యవాదాలు. గ్రామ మండల వ్యాసాలకు మీరు తేడాను గమనించగోరుచున్నాను. జైనూరు మండల కేంద్రం, జైనూరు జనగణన పట్టణం. మీరు మండల కేంద్రం వ్యాసంలో రెవెన్యూ గ్రామాల జాబితా రాసారు. ఇలా రాయనవసరంలోదు. ఎందుకంటే అవి మండల పరిధిలో ఉంటాయి,గానీ గ్రామ పరిధిలో ఉండవు. మీరు రాసినవి తొలగించాను.ఇక ముదు అలారాయకండి.మండలంలోని రెవెన్యూ గ్రామాలు అంటే మండల వ్యాసం లోనే ఉండాలి. ఇంకొక వ్యాసం ఆ జాబితాలా రెవెన్యూ గ్రామాలు మాత్రమె రాయాలి.రెవెన్యూయేతర గ్రామాలు ఉంటే మరియొక విభాగం పెట్టి రాయాలి.మీరు రాయబోయే ముందు అంతకు ముందు ఉన్న వ్యాసాలు కొన్ని పరిశీలించగలరు.ఏదైనా సహాయం కావలిసి వస్తే నేను రాసినట్లుగానే నా చర్చా పేజీకి రాయగలరు.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 03:31, 4 డిసెంబరు 2024 (UTC)