వాడుకరి చర్చ:Madhu199235

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Madhu199235 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Madhu199235 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Bhaskaranaidu (చర్చ) 04:29, 8 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
సాంకేతిక ఇబ్బందులు

వ్యాసం అయితే వ్రాస్తాను గాని మూసలూ, పట్టికలూ, లింకులూ ఇలాంటి సాంకేతిక విషయాలతో చాలా గందరగోళంగా ఉంది.

వికీలో సరైన సమాచారంతో, మూలాలతో వ్యాసం వ్రాయడమే అత్యంత ప్రధానమైన అంశం. దానికొరకు {{cite web}} లాంటి మూస వాడడం తప్పదు. కొత్త విజువల్ ఎడిటర్ కు మారితే, సులభంగా మూసలు, పట్టికలు, లింకులు చేర్చవచ్చు. మరిన్ని వివరాలకు మీ చర్చాపేజీలోని తొలి స్వాగత సందేశంలో లింకులు చూడండి. ఇంకా మీకు సందేహాలుంటే, మీ చర్చాపేజీలో అడగండి. సహసభ్యులు స్పందనలతో కొద్ది రోజుల్లో మీరు నేర్చుకోగలుగుతారు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల Bhaskaranaidu (చర్చ) 04:29, 8 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

మూడవ మనీషి వ్యాసం గురించి[మార్చు]

వికీపీడియాలోని వ్యాసాలు కింది నియమాలను పాటించాలి.

  • మౌలిక పరిశోధనలు చెయ్యకూడదు. అంటే మన స్వంత ఆలోచనలు, అభిప్రాయాలు, పరిశోధనలు ఇక్కడ రాయకూడదు.
  • ఇక్కడ రాసిన విషయాన్ని వేరే ఇతర వనరుల ద్వారా నిర్ధారించుకునే వీలుండాలి.
  • పాఠ్యంలో అవసరమైన చోట్ల తగు ద్వితీయ/తృతీయ స్థాయి మూలాలను చూపించాలి.

అయితే, మూడవ మనీషి వ్యాసం ప్రస్తుతమున్న రూపంలో ఈ మూడు నియమాలనూ అనుసరించడం లేదు. దీన్ని మెరుగుపరచేందుకు, ముందుగా ఈ వ్యాసంలోని పాఠ్యాన్ని మీరు ఏయే చోట్ల నుండి తెచ్చారో రాయండి. ఆయా వనరులను పరిశీలించి, వ్యాసార్హతను నిర్ణయించవచ్చు. ఇవి చెయ్యకపోతే ఈ వ్యాసాన్ని తొలగించే అవకాశముంది.__చదువరి (చర్చరచనలు) 03:08, 19 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

బలహీనత[మార్చు]

          ప్రాణం ఉన్న ప్రతి జీవికి బలహీనత ఉండక పోవచ్చు కానీ మానవునికి మాత్రం బలహీనత ఉండటం సహజం. ప్రతి మనిషి జీవితం లో బలహీనత అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మానవ సంబందాల విషయం లో ఎక్కువ బలహీనత ను కలిగి ఉంటాం. తల్లి తండ్రుల విషయం లో ప్రేమించే స్నేహితుల విషయం లోను ఎక్కువ బలహీనతలను కలిగి ఉంటాం. మనం ఎక్కువగా ఇష్టపడే వ్యక్తులలో బలహీనత ఉంటుంది అనడం లో అతిశయోక్తి లేదు. నిజానికి మనం ఇష్టపడే వ్యక్తుల విషయం లో బలహీనత ఎంత ఎక్కువగా ఉంటే వారి మీద మనకు అంత ఎక్కువ ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఉన్నట్టు. 

ఉదాహరణ:- చాల సినిమాలలో కథానాయకుడు తను ప్రేమించే అమ్మాయి, స్నేహితులు, తల్లితండ్రులకు ఏదయినా చిన్న ఆపద ఎదురైనా కుడా తట్టుకోలేడు దానికి కారణం వారిని అమితంగా ఇష్టపడటం. అదే బలహీనతను ఆసరాగా చేసుకుని ప్రతి నాయకుడు ఒక ప్రతికూల పరిస్తితులను సృష్టించడం జరుగుతుంది. అలాంటి ఒక ప్రతికూల పరిస్తితిని యుక్తిగా ఎదురించి పోరాడడానికి తనలో ఉండే ఆ బలహీనత ను సైతం అనుకూలంగా మలుచుకోవడం జరుగుతుంది.

         సినిమాలలోనే కాకుండా నిజ జీవితం లో కూడా ఇటువంటి పరిస్తితులను మనం గమనిస్తూ ఉంటాం. ఉద్యోగ ఇంటర్వ్యూ ల విషయానికి వచ్చినప్పుడు చాలా సంధర్బాలలో నిరాశ కలిగినప్పుడు మనలో ఉండే ఆ బలహీనత మనకు ఒక అనుభవం అవుతుంది. ఆ అనుభవం నుంచే నిరాశ ను జయించి మనం అనుకున్నది సాధించగలమనే నమ్మకం ఏర్పడుతుంది. మనలో అటువంటి నమ్మకం ఎప్పుడయితే ఏర్పడుతుందో ఆత్మ విశ్వాసం పెంపొంది౦చబడి మన గమ్యాన్ని సులువుగా చేదించగలము. బలహీనత కూడా ఇలాంటి సందర్బాలలో ఉపయోగ పడుతుందని మనం గ్రహించాలి. 

ఒంటరితనం:- ఒంటరిగా జీవించాలి అనుకోవడం కూడా ఒక బలహీనత గా మనం భావిస్తే అసలు ఎందుకు ఒంటరిగా జీవించాలి అనే ప్రశ్న మనకు ఎదురవుతుంది. మనం ఇష్టపడే వ్యక్తులు, ఇష్టంగా చేసే పనులు ఎప్పుడయితే మనకు దూరం అవుతాయో వాటిని మనం మనకు ఇష్టం లేకుండానే త్యాగం చేయాల్సి వచ్చిన్నప్పుడు ఆ సమయం లో మనకు ఎవరు తోడు లేకుండా ధైర్య౦ చెప్పక పోవడం తో అగమ్యగోచరమైన పరిస్తితి కి ఎదురు నిలువలేక ఒంటరి తనాన్ని కోరుకోవడం జరుగుతుంది. ఒంటరిగా ఉన్నా కుడా సంతోషంగా ఉండగలమా లేదా అనేది మనకు ఎదురయ్యే పరిస్తితి యొక్క ప్రభావం మీద ఆదారపడి ఉంటుంది. కాని నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒంటరిగా జీవించడం వలన ఎక్కువ ఒత్తిడికి లోనవడం చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం దాని వలన నిరశ నిస్పృహలు ఏర్పడి జీవితం మీద విరక్తి కలిగి మనల్ని మనమే శాపంగా భావించి ఆత్మ హత్య చేస్కొడానికి సిద్ద పడటం జరుగుతుందని అందుకే ఒంటరిగా ఉన్నవాళ్ళే ఎక్కువ శాతం ఆత్మ హత్యలకు పాల్పడటం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇలాంటి ఒక భాదా కరమైన పరిస్తితులు మనకు ఎదురవడానికి కారణం కూడా బలహీనత అనే చెప్పొచ్చు. మన బలహీనత మరొకరికి ప్రయోజనకరంగా ఎప్పుడైతే మారుతుందో ఆ క్షణ౦ మనలో కలిగే భాద వర్ణనాతీతంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాలు కూడా ఒంటరిగా జీవించడానికి కారణం అవుతున్నాయి. ఒంటరి తనాన్ని పక్కకు నెట్టి సంబంద బాందవ్యాలు పెంపొందించుకోవడానికి స్నేహం చాల గొప్పగా ఉపయోగపడుతుంది. కాని ఒకరితో స్నేహం చేయడానికి సిద్దంగా ఉన్నాకూడా అవతలి వ్యక్తి కి మనలో నచ్చే గుణాలు ఉన్నాయో లేవో అని ఆలోచించుకుంటూ ధైర్య౦గా ముందుకు సాగాలేరు. ఒకరి కోసం మన గుణాలను మన అలవాట్లను ఇష్టాలను వదులుకోవడం అంత సులువైన పని కాదు. కాని మనసు ప్రశాంతతను కోరుకున్నప్పుడు మనం సంతోషంగా ఉండగలం అని అనుకున్నప్పుడు మనలో ఉండే స్వార్థాన్ని సైతం వదులుకుని స్నేహ బందాన్ని కోరుకోవడం లో తప్పు లేదు. ఇలాంటి ఒక నిర్ణయమే మనం సంతోషంగా ఉండేందుకు ఎక్కువ సహాయపడతాయి.

భానిస:- ఇష్టాలు, అలవాట్లు, కోరికలు మనలో ఉండే బలహినత కు భానిస అవడానికి ఎక్కువగా తోడ్పడుతాయి. ప్రేమించే వ్యక్తి కి భానిస అవడం ఆ వ్యక్తి మీద మనకు ఉండే అమితమైన ప్రేమ వలన కలిగే బలహీనత ఒక కారణం. ప్రేమ ను దేనితోను పోల్చలేని ఒక అనుభూతి. ప్రతీ క్షణ౦ తపించే మనసు కోరుకునే ఒక శక్తి. అలంటి ప్రేమ విషయం లో బలహీనత ఏర్పడి భానిసలుగా మారడం జరుగుతుంది. ప్రేమించడం లో తప్పు లేకపోయినా కుడా ప్రేమకు భానిస అవ్వడ౦ వలన దయనందిన జీవితం లో కోలుకోలేని దెబ్బలు తగులుతాయి. కానీ అది వయసు రిత్యా మన ఆలోచన విధానం లో కలిగే మార్పులు అలంటి బలహీనత నుంచి దూరం కావడానికి సహాయ పడుతుంది. వయసు రిత్యా వచ్చే మనలో వచ్చే మార్పులలో అలవాట్లు కోరికలకు కూడా భానిస అవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. మనం ఇష్టపడేవి మన నుంచి దూరం అయినప్పుడు వాటి ఆలోచన నుంచి మనం బయట పడడానికి కొన్ని అలవాట్లకు అనుకోకుండా భానిస కావడం ఆ అలవాట్లే మనకు బలహీనత గా మారడం జరుగుతుంది. కానీ అలవాట్లు అనేవి ఆరోగ్య కరమైనవా కాదా అని ప్రశ్ని౦చుకున్నప్పుడు ఎక్కువ శాతం ప్రజలు అనారోగ్యానికి కారణం అయిన తాత్కాలిక ఆనందాన్ని ఎక్కువగా కోరుకుని సమస్యలకు కారణం అవుతున్నారు. ఇలాంటి తాత్కాలిక ఆనంద౦ వలన మనలో కలిగే మానసిక మార్పులు సమస్యను ఎదురించి పోరాడడానికి సహాయం చేయడం జరిగినప్పుడే ఆ బలహీనత నుంచి బయటపడగాలము.

మూలాలు చేర్చండి[మార్చు]

మీరు వ్రాసిన బలహీనత వ్యాసంలో మూలాలను చేర్చండి.----కె.వెంకటరమణచర్చ 06:21, 22 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]