వాడుకరి చర్చ:Voglam

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం

[మార్చు]
Voglam గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

Voglam గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగు వికీపీడియా పరిచయానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 02:18, 18 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామాల పేర్లలో ఱ

[మార్చు]

నమస్కారమండి. తెవికీలో చురుగ్గా రాస్తున్నందుకు ధన్యవాదాలు. కొత్తవారైనప్పటికీ, చాలా చొరవగా వ్యాసాల్లో మార్పులు చేస్తున్నందుకు అభినందనలు. మోపర్రు, ప్యాపర్రు, యలవర్రు, గొడవర్రు వంటి అనేక గ్రామాల పేజీల్లో పేర్ల పక్కన బ్రాకెట్లో ర బదులు, ఱ తో పేరు చేర్చడం చూసాను. అలా ఎందుకు చేర్చారో అర్థం కాలేదు.

  • ఒకవేళ భాషా సూత్రాల ప్రకారం ఱ సరైనది అని (సరైనదో కాదో నాకు తెలియదండి) చేరుస్తున్నట్లైతే: పేర్ల విషయంలో భాషా సూత్రాలు వర్తించవన్నది మనం గమనించాలి. నాథుడు అనేది సరైన మాట, నాధుడు కాదు. కానీ కొందరు రామనాధ్, విశ్వనాధ్ అని పేర్లు పెట్టుకోవడం చూస్తుంటాం. ఆ పేర్లు తప్పు అని సవరించరాదు. అలాగే మోపర్రు, ప్యాపర్రు, గొడవర్రు లాంటి పేర్లు కూడా. ఒకవేళ కారణం ఇదే అయితే, మీరు చేసిన మార్పులను రద్దు చేయవలసినది.
  • ఒకవేళ ర్రు అంత విస్తృతంగా కాకపోయినా, ఱ్ఱు అనే పేరు కూడా కొంత వాడుకలో ఉంటే మీరు రాసిన విధంగా బ్రాకెట్లో రాయవచ్చు. కానీ అలా ఉన్నట్లు ఒక్కటైనా ఆధారాన్ని మూలంగా చూపించాలి. మూలం ఎలా పెట్టాలో సందేహం ఉంటే ఆ పేజీల చర్చ పేజీలో రాయండి.
  • ఒకవేళ అసలు ఱ్ఱు అనే పేరే ఎక్కువ వాడుకలో ఉంటే ఆ పేరు బ్రాకెట్లో కాదు నేరుగానే రాయాలి. ఆ పేజీల పేర్లు కూడా మీరు రాసిన విధంగానే మార్చెయ్యాలి -విస్తృతంగా వాడుకలో ఉన్న పేరు తోటే పేజీ ఉండాలి కాబట్టి. కారణం ఇదైతే ఆ విషయాన్ని ఆయా పేజీల చర్చ పేజీల్లో, మూలాలను చూపిస్తూ రాయండి.

పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 01:28, 31 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్క్రారము అయ్యా,. మీరు చెప్పినది అర్థం అయినది, అందుకేనండి బ్రాకెట్లో ఉంచినాను.

౧. పఱ్ఱనేల, ఊషరక్షేత్రము, నిస్సారమగు భూమి. ౨. ఉప్పు పండు నేల. అని బహుజనపల్లి వారి అర్థాలు.

ఇండిక్ మీడియావికి డెవలపర్స్ యూజర్ గ్రూప్ - టెక్నికల్ సంప్రదింపులు 2024

[మార్చు]

నమస్తే,

ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ యూజర్ గ్రూప్ వికీమీడియా ప్రాజెక్ట్‌లకు సహకరిస్తున్నప్పుడు వివిధ సాంకేతిక సమస్యలపై సభ్యుల అవసరాలను అర్థం చేసుకోవడానికి కమ్యూనిటీ టెక్నికల్ కన్సల్టేషన్ ప్రక్రియను ప్రారంభించారు. వీటి లక్ష్యం కమ్యూనిటీలలోని సవాళ్లను బాగా అర్థం చేసుకోవడం, సాధారణ సమస్యలను అర్థం చేసుకోవడం మరియు భవిష్యత్ సాంకేతిక అభివృద్ధి కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం.

మొదటి దశ మీ సాధారణ సమస్యలు, ఆలోచనలు మొదలైనవాటిని ఎక్కడ నివేదించాలనే సర్వే. దయచేసి సర్వేను (మీకు నచ్చిన భాషలో) ఇక్కడ పూరించండి. https://docs.google.com/forms/d/e/1FAIpQLSfvVFtXWzSEL4YlUlxwIQm2s42Tcu1A9a_4uXWi2Q5jUpFZzw/viewform?usp=sf_link

చివరి తేదీ 20 సెప్టెంబర్ 2024.

మీరు బహుళ సమస్యలు లేదా ఆలోచనలను నివేదించాలనుకుంటే, మీరు సర్వేను ఒకటి కంటే ఎక్కువసార్లు పూరించవచ్చు.

కార్యాచరణ గురించి మరింత చదవడానికి, దయచేసి సందర్శించండి: https://w.wiki/AV78

సర్వే తెలుగులో పైన పేజీలో ఉన్నాయ్.

ధన్యవాదాలు! MediaWiki message delivery (చర్చ) 13:29, 9 సెప్టెంబరు 2024 (UTC), ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ తరపున[ప్రత్యుత్తరం]