వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూన్ 12
Jump to navigation
Jump to search
- 2002 : ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం
- 1898 : స్పెయిన్ దేశం నుండి ఫిలిప్పీన్స్కు విముక్తి.- ఫిలిప్పీన్స్ స్వాతంత్ర దినం.
- 1902 : భారత స్వాతంత్ర సమరయోధురాలు పాలకోడేటి శ్యామలాంబ జననం (మ.1953).
- 1932 : గ్రంథాలయ గాంధీగా సుపరిచితుడైన వెలగా వెంకటప్పయ్య జననం (మ. 2014). (చిత్రంలో)
- 1955 : కవి, గీత రచయిత నందిని సిధారెడ్డి జననం.
- 1957 : పాకిస్థాన్ క్రికెట్ క్రీడాకారుడు జావేద్ మియాందాద్ జననం.
- 1964 : దక్షిణ ఆఫ్రికా లో నెల్సన్ మండేలా కు జీవిత ఖైదు విధించబడింది.
- 1987 : కోల్డ్ వార్: బెర్లిన్ గోడను పగలగొట్టమని అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ బహిరంగంగా మిఖాయిల్ గోర్బచేవ్ కు సవాల్ విసిరాడు.
- 1987 : 13 సంవత్సరాల కౄర పాలనకు శిక్షగా మధ్య ఆఫ్రికా మహారాజు జీన్-బెడెల బొకాస్సాకు మరణశిక్ష విధించబడింది.
- 1996 : భారత లోక్సభ స్పీకర్గా పి.ఎ.సంగ్మా పదవిని స్వీకరించాడు.
- 1999 : ఆంధ్ర ప్రదేశ్ 6వ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు మరణం (జ.1921).