వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూలై 25
స్వరూపం
- 1935: తెలుగు సినీ నటుడు, భారత పార్లమెంటు సభ్యుడు కైకాల సత్యనారాయణ జననం (మ. 2022). (చిత్రంలో)
- 1952: ప్రముఖ మిమిక్రీ, వెంట్రిలాక్విజం కళాకారుడు లోకనాథం నందికేశ్వరరావు జననం.
- 1977: భారత రాష్ట్రపతి గా నీలం సంజీవరెడ్డి అధికారం చేపట్టాడు.
- 1981: శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము అనంతపురం లో స్థాపించబడినది.
- 1982: భారత రాష్ట్రపతిగా జ్ఞానీ జైల్సింగ్ పదవీ బాధ్యతలు స్వీకరించాడు.
- 1987: భారత రాష్ట్రపతిగా ఆర్.వెంకట రామన్ అధికారంలోకి వచ్చాడు.
- 1992: శంకర్ దయాళ్ శర్మ భారత రాష్ట్రపతిగా పదవిలోకి వచ్చాడు.
- 1997: కె.ఆర్.నారాయణన్ భారత రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టాడు.
- 2002: భారత రాష్ట్రపతిగా ఎ.పి.జె.అబ్దుల్ కలాం అధికారం చేపట్టాడు.
- 2007: భారత తొలి మహిళా రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ అధికార బాధ్యతలు స్వీకరించింది.
- 2012: భారత రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ అధికారం చేపట్టాడు.
- 2017: భారత రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ అధికార బాధ్యతలు చేపట్టాడు.
- 2022: భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము అధికారం చేపట్టింది.