Jump to content

వికీపీడియా:బాటు/అనుమతి కొరకు అభ్యర్ధన

వికీపీడియా నుండి

తెలుగు వికీపీడియా కొరకు ఇంటర్నెట్ ఆర్కైవ్ బాటు -సముదాయ స్పందన

[మార్చు]

తెలుగు వికీలో వ్యాసాలలో వాడే చాలా తెలుగు మాధ్యమాల లింకులు శాశ్వత లింకులు కాదు కాబట్టి కొద్ది కాలంలోనే అవి పనిచేయని లింకులుగా మారి వికీపీడియా నాణ్యతని దెబ్బతీస్తున్నాయి. దీనికి విరుగుడుగా ఇంటర్నెట్ ఆర్కైవ్ బాటు లింకు చేర్చిన వెంటనే ఆ లింకుని ఇంటర్నెట్ అర్కైవ్ యెక్క వేబాక్ మెషీన్ సేవతో భద్రపరచి లింకుని ఆ వివరంతో తాజా పరుస్తుంది. ఇది ఇప్పటికే బెంగాలీ భాషలో అమలు చేయబడింది. దీనికొరకు సముదాయం నిర్ణయం కావాలి కాబట్టి ఒక వారం రోజులలోగా (అనగా 30 మార్చి 2019లోగా) స్పందించమని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 10:59, 23 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

చర్చ
అర్జున గారూ, ముందుగా విజ్ఞప్తి చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ విజ్ఞప్తిని ఎన్వికీలో లాగా ఒక ప్రత్యేకించిన పేజీలో పెడితే బాగుంటుంది. ఇకముందు రాబోయే బాట్‌లకు ఒక ఉదాహరణగా ఉంటుంది. అలాగే భవిష్యత్తులో అనుమతులు లేకుండా బాట్ నడిపే వాళ్ళు చెప్పేందుకు సాకు లేకుండా చేసినట్లూ అవుతుంది. బాట్‌లకు, AWBలకూ కలిపి ఒక పేజీ పెట్టినా సరిపోతుంది. పరిశీలించండి.__చదువరి (చర్చరచనలు) 14:32, 23 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగే .--అర్జున (చర్చ) 00:41, 24 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

<విషయం చేర్చి సంతకం చేయండి>

అంగీకారం
  1. Support ' ఇది చాలా ప్రయోజనకరం. మరీ ముఖ్యంగా తెలుగునాట పెద్ద పెద్ద పత్రికలే కొన్ని, నెలల వ్యవధి దాటితే అవే లింకుల్లో వేరే సమాచారం వేసేయడం, డెడ్లింకులు చేయడమో చేస్తూంటాయి కాబట్టి మనకు ప్రత్యేకించి ఉపయోగకరం. --పవన్ సంతోష్ (చర్చ) 21:12, 23 మార్చి 2019 (UTC) [ప్రత్యుత్తరం]
  2. మంచి ఆలోచన. నా కిది సమ్మతమే. బాటు జీవిత చక్రానికి - తయారీ, అనుమతులు, పరీక్ష, వాడకం లాంటి వాటికి - మనవద్ద ప్రామాణిక పద్ధతులేమీ లేవు కాబట్టి, వీటికి ఎన్వికీలో ఎలా ఉందో చూసి అలాంటి ప్రామాణిక పద్ధతులను ఇక్కడ కూడా నెలకొల్పితే బాగుంటుందని నా ఉద్దేశం. అర్జున గారు అందుకు తగినవారని, ప్రస్తుత బాటు జీవిత చక్రంలో భాగంగా ఆ పద్ధతులన్నిటినీ నెలకొల్పాలని ఆయన్ను కోరుతున్నాను. ఇక ముందు వచ్చే బాటులన్నీ సదరు పద్ధతులను తు.చ. తప్పకుండా పాటించాలని నిబంధనలు పెట్టుకోవచ్చు. 2019-03-24T07:20:59‎ Chaduvari
  3. నాకు సమ్మతమే. ఇలాంటి మార్పులు చేయడానికి ప్రత్యేకమైన బాటు ఖాతా ఉండాలనే నియమాన్ని నేను కూడా సమర్థిస్తున్నాను. రవిచంద్ర (చర్చ) 06:26, 25 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  4. నాకు అంగీకారమే..అర్జున గారి ఆలోచనను స్వాగతిస్తున్నాను..B.K.Viswanadh (చర్చ) 06:42, 25 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  5. సాంకేతికంగా జరిగే ఇలాంటి అభివృధ్దిని ఎప్పుడూ స్వాగతిస్తూ, నా అంగీకారం తెలుపుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 02:46, 29 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యతిరేకం
  1. < పై లైనులో # తో సంతకం చేయండి>
తటస్థం
  1. < పై లైనులో # తో సంతకం చేయండి>
నిర్ణయం (Decision)

సముదాయం ఏకగ్రీవంగా ఆమోదించింది.(Community has approved unanimously the proposal to deploy Internet Archive bot on Telugu Wikipedia).--అర్జున (చర్చ) 05:02, 3 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

T219962 చూడండి.--అర్జున (చర్చ) 04:03, 17 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ఇవీ చూడండి

[మార్చు]