వికీపీడియా చర్చ:తెవికీ బడి
ఈసరికే పనిచేస్తున్న వాడుకరుల కోసం
[మార్చు]ప్రస్తుతం ఈ పేజిలో ఉన్న జాబితా బాగుంది. ఇప్పుడిప్పుడే తెవికీ పరిచయమై, రాయాలన్మి ఉత్సాహం ఉన్న కాబోయే వాడుకరులకు, సరికొత్త వాడుకరులకూ ఇవి ప్రయోజన కరంగా ఉంటాయి.
ఈ సరికే తెవికీలో కృషి చేస్తూ కొంత అనుభవం సంపాదించిన వాడుకరుల కోసం కూడా కొన్ని ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఉండాలని నా అభిప్రాయం. అందుకోసం తయారు చేసే శిక్షణ కార్యక్రమాల్లో కొన్ని ఇక్కడ రాస్తున్నాను. Pranayraj1985 గారూ, పరిశీలించండి.
నాకు తోచినవి వరసగా రాసుకుంటూ పోయాను. కార్యక్రమాలు ఇదే వరసలో జరగాలని ఏమీ లేదు. శిక్షణ ఎవరు ఇవ్వాలనేది సూచనా మాత్రం గానే రాసాను. వెంకటరమణ గారికి ఒకవేళ వీలు కుదరని పక్షంలో మరొకరు ఉండాలని రెండో పేరు కూడా రాసాను. ఈ పేర్లన్నీ మీ ఇష్టం వచ్చినట్లు, ఆయా వాడుకరుల వీలుకు తగినట్లుగా మార్చేయవచ్చు.
- అనువాద పరికరం వాడడంలో చిట్కాలు, ప్రయోజనాలు, సమస్యలు వగైరా (అరగంట) ప్రణయ్
- యాంత్రికానువాదంలో దొర్లే సాధారణ దోషాలు. వాటిని సవరించాల్సిన అవసరం, సవరించడంలో చిట్కాలు. (అరగంట) ప్రణయ్
- మూలాల గురించి సమూలంగా (అరగంట) కశ్యప్
- AWB తో పనిచెయ్యడం ఎలా? ఎలా స్థాపించుకోవడం? ఖాతా అనుమతి పొందడం ఎలా? చెయ్యదగ్గ పనులేవి? - ప్రాథమిక అవగాహన (అరగంట) చదువరి
- AWB తో పనిచెయ్యడం ఎలా? - ఉన్నత అంశాలు (అరగంట) చదువరి
- నిర్వాహకులు, నిర్వాహక్కులు, బాధ్యతలు. ఎలా అవుతారు, ఎలా విరమిస్తారు, ఎవరు కావచ్చు (అరగంట) రవిచంద్ర
- నేను నిర్వాహకురాలిని/నిర్వాహకుణ్ణి కావాలనుకుంటున్నాను - ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో చెప్పండి (అరగంట) ప్రణయ్
- మూసల గురించి ఉన్నత అవగాహన, మాడ్యూళ్ళ గురించి ప్రాథమిక అవగాహన (అరగంట) వెంకటరమణ/రవిచంద్ర
- వర్గీకరణ - ఎందుకు, ఎలా? (అరగంట) రవిచంద్ర
- వ్యాసాల తొలగింపు ప్రక్రియ ఏమిటి? ఎప్పుడు, ఎందుకు, ఎలా చెయ్యాలి? తొలగింపు ప్రక్రియ అంటే రక్షించే ప్రక్రియ కూడా! ఎలా రక్షించాలి? (అరగంట) వెంకటరమణ/రవిచంద్ర
- కాపీహక్కులు, మందుపాతరలూ - ఏంటసలివి? (అరగంట) పవన్
- విధానాలు, మార్గదర్శకాల గురించిన మెటా అంశాలు -ఏమిటి, ఎందుకు, తేడాలు, వగైరాలు (అరగంట) రాజశేఖర్
- ఈ రోజు వికీపీడియాను మీరు ఎలా మెరుగుపరచారు? సంతృప్తి స్థాయిలను నిర్వచిద్దాం. ఏరోజుకారోజు వికీపీడియన్ కృషికి ఇచ్చుకునే గుర్తింపు (అరగంట) చర్చ
- వికీప్రాజెక్టులు - రూపకల్పన, నిర్వహణ (అరగంట) చదువరి
- కొత్త వ్యాసం రాస్తేనే కృషి చేసినట్టు కాదు. వికీకి మెరుగుపెట్టే పనులు ఇంకా అనేకం ఉన్నై (అరగంట) కశ్యప్
- మెరుగైన వ్యాసాలు, మంచి వ్యాసాలు - నాణ్యతారోహణ (కనీస స్థాయి నుండి మంచి వ్యాసం దాకా) (అరగంట) పవన్
- తెవికీలో రాయడంలో నాకు ఎదురౌతున్న ఇబ్బంది. (ప్రతివారం ఒక పావుగంట చర్చ. గరిష్ఠంగా రెండు అంశాలు) చర్చ
- గ్రూపులు కడదాం రండి! వివిధ కార్యక్రమాల కోసం చిన్న చిన్న గుంపులు ఏర్పరచడంపై చర్చ. ఉదాహరణకు కొత్తవాడుకరుల కోసం ఒక గ్రూపు, ఇటీవలి మార్పులు పర్యవేక్షణ కోసం ఒక గ్రూపు, మంచి/మెరుగైన వ్యాసాల కోసం ఒకటి వగైరా. ఇవి ఒక్కొక్కటీ ఒక్కో వికీప్రాజెక్టుగా కూడా ఉండవచ్చు. (అరగంట) ఇది చర్చ
- చర్చల్లో పాల్గొనడం, చర్చించడం, అభిప్రాయాలు చెప్పడం. ఆవశ్యకత గురించి (అరగంట) యర్రా రామారావు
- వికీలో నేను ఇంత కృషి చేసానే.. నాకు గుర్తింపేదీ!?! చర్చ (అరగంట) చర్చ
- ప్రతీ వారం శిక్షణ మొదలుపెట్టబోయే ముందు, ఆ వారంలో జరిగిన ఒక మంచి కృషి గురించి, దాని కర్త గురించీ చెప్పాలి. ఇందులో సంఖ్యలూ అంకెల కంటే చేసిన కృషిలో ఉన్న విశిష్టతకు, ప్రాముఖ్యతకే ప్రాధాన్యత ఇవ్వాలి (5 నిమిషాలు)
__ చదువరి (చర్చ • రచనలు) 15:55, 22 ఫిబ్రవరి 2024 (UTC)
- శిక్షణ కార్యక్రమం గురించి సూచనలు అందించినందుకు ధన్యవాదాలు @Chaduvari గారు. వీట ప్రకారం శిక్షణ కార్యక్రమ ప్రణాళికను తయారుచేస్తాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:50, 27 ఫిబ్రవరి 2024 (UTC)
వ్యాసాల నాణ్యత ఎలా మెరుగు పర్చాలి
[మార్చు]ముందుగా శ్రమకోర్చి అన్ని విభాగాలు చాలవరకు ఈ ప్రాజెక్టులో తీసుకొచ్చినందుకు ప్రణయ్ రాజ్ గార్కి ధన్యవాదాలు. ఇంకొక విషయం. ఈ విభాగంలో శైలితోపాటు, మీడియా ఫైల్స్ వ్యాసాలలో ఎలా ఉండాలి, ఎన్ని ఎక్కించాలి, పట్టికలు ఎలా కూర్పు చేయాలి అలాంటి కొన్ని విషయాలు ఈ విభాగం కింద సింపుల్ గా చెప్పాలంటే రాశి కన్నా వాసి ముఖ్యం అనే భావనలో చేర్చితో బాగుంటుందని నా అభిఫ్రాయం. యర్రా రామారావు (చర్చ) 05:00, 29 ఫిబ్రవరి 2024 (UTC)
- ధన్యవాదాలు @యర్రా రామారావు గారు, వ్యాసాలలో ఫోటోలు చేర్చడం అనే అంశం కూడా ఉంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:42, 1 ఏప్రిల్ 2024 (UTC)
తెలుగు ఇతర ప్రాజెక్టులు
[మార్చు]తెలుగు వికీసోర్స్,విక్షనరీ వికీవ్యాఖ్య మొదలగు వాటిగురించి కూడా చేరిస్తే ఉపయోగంగా ఉంటుంది. ధన్యవాదాలు. VJS (చర్చ) 04:41, 24 మార్చి 2024 (UTC)
- ధన్యవాదాలు @Vjsuseela గారు. తెవికీ బడి కాబట్టి వికీ సోదర ప్రాజెక్టుల గురించి కూడా శిక్షణలు ఉంటాయి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:49, 1 ఏప్రిల్ 2024 (UTC)
తెవికీ బడి ఆన్‌లైను శిక్షణ తరగతుల సమయం గురించి చర్చ
[మార్చు]కొన్ని వారాలుగా ఆన్‌లైనులో తెవికీ బడీ శిక్షణ తరగతులు నిరంతరాయంగా జరుగుతున్న సంగతి తెలిసినదే. ఈ కార్యక్రమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో, మరింత మంది వీటిని వాడుకునే వీలు కలిగించే ఉద్దేశంతో యూజర్‌గ్రూపు కొన్ని చర్యలు తలపెట్టింది. వీటిలో తరగతుల సమయం ఒకటి. ప్రస్తుతం ఇవి ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2:00 గంటలకు మొదలై 2-3 గంటల సేపు జరుగుతున్నాయి. ఈ సమయం అనుకూలంగా లేక ఎవరైనా రాలేకపోతున్నట్లైతే, ఎక్కువ మందికి అనుకూలంగా ఉండేలా వేరే సమయానికి మార్చే ప్రయత్నం చెయ్యవచ్చనే ఆలోచన ఉంది. వాడుకరులు తమకు నచ్చిన సమయాన్ని కింద రాయవలసినదిగా మనవి. పని రోజుల్లో కంటే, శని,ఆది వారాల్లో అయితేనే ఎక్కువ మందికి వీలుగా ఉంటుంది కాబట్టి ఆ రెండు రోజుల్లోనే తగు సమయాన్ని ఇవ్వవలసినదిగా మనవి. మొదలయ్యే సమయం ఇస్తే సరిపోతుంది.
# 1. రోజు - మొదలయ్యే సమయం 2. రోజు - మొదలయ్యే సమయం 3. రోజు - మొదలయ్యే సమయం - సంతకం
- ఇలా రాయవలసినది
- 1. ఆదివారం - మధ్యాహ్నం 2:00; 2. ఆదివారం - ఉదయం 11:00 - చదువరి (చర్చ • రచనలు)
- శనివారం - ఉదయం 11:00 --Kasyap (చర్చ) 05:02, 14 మే 2024 (UTC)
- 1. శనివారం - మధ్యాహ్నం 2:00; 2. ఆదివారం - మధ్యాహ్నం 2:00 - కిమీర (చర్చ) 16:49, 15 మే 2024 (UTC)
- 1. ఆదివారం - ఉదయం 11:00 2. శనివారం, లేదా ఆదివారం రాత్రి 8 గంటలకు - ప్రభాకర్ గౌడ్చర్చ 01:00, 19 మే 2024 (UTC)
- 1. ఆదివారం - మధ్యాహ్నం 2:00; 2. ఆదివారం - ఉదయం 11:00 - --ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 08:38, 19 మే 2024 (UTC)
ఈ పేజీకి తెవికీ హోం పేజీ నుంచి ఎలా రావాలి?
[మార్చు]te.wikipedia.org నుంచి ఈ పేజీకి ఎలా రావాలో తెలియలేదు. రచ్చబండ లో ఆంశం నుంచి చేరుకున్నా. Saiphani02 (చర్చ) 06:02, 26 జూన్ 2024 (UTC)
- అవునండి. ఈ విషయం నిర్వాహకుల పరిశీలనకు పంపాను V.J.Suseela (చర్చ) 07:06, 26 జూన్ 2024 (UTC)
- @Saiphani02, @Vjsuseela గార్లకు, వికీపీడియా శోధనపెట్టెలో ఈ పేజీ పేరు అనగా 'వికీపీడియా:తెవికీబడి' అని టైపు చేసి వెతికితే సరి. అర్జున (చర్చ) 14:38, 26 జూన్ 2024 (UTC)
- ఈ పేజీ ఉందని తెలియని వారికి హోం పేజీ నుంచి వచ్చే విధంగా ఉండాలి అని నా ప్రశ్న Saiphani02 (చర్చ) 14:51, 27 జూన్ 2024 (UTC)
- @Saiphani02 గారు, ఇలాంటివి కొత్తగా ప్రారంభించినపుడు ప్రతి వాడుకదారికి కనిపించేటట్లుగా పేజీ పై భాగంలో ప్రకటనలు ఒక వారం, లేక రెండు వారాలు నడుపుతారు. సముదాయ పందిరి నుండి లింకులివ్వవచ్చు కాని తెవికీలో ఆ పేజీ వాడడం చాలా తక్కువ. అర్జున (చర్చ) 15:58, 27 జూన్ 2024 (UTC)
- ఈ పేజీ ఉందని తెలియని వారికి హోం పేజీ నుంచి వచ్చే విధంగా ఉండాలి అని నా ప్రశ్న Saiphani02 (చర్చ) 14:51, 27 జూన్ 2024 (UTC)
- @Saiphani02, @Vjsuseela గార్లకు, వికీపీడియా శోధనపెట్టెలో ఈ పేజీ పేరు అనగా 'వికీపీడియా:తెవికీబడి' అని టైపు చేసి వెతికితే సరి. అర్జున (చర్చ) 14:38, 26 జూన్ 2024 (UTC)