వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/గ్రామాల పేర్ల సవరణ
Appearance
ప్రభుత్వ శాఖల నుండి గ్రామాల పేర్లకు సంబంధించిన గెజిట్లు తెప్పించడం
[మార్చు]ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/గ్రామాల పేర్ల సవరణకోసం ప్రభుత్వ శాఖల నుండి గ్రామాల పేర్లకు సంబంధించిన గెజిట్లు తెప్పించుకుంటే ఎలాంటి సందేహాలు లేకుండా గ్రామాల పేర్ల సవరణను చేయొచ్చని నా అభిప్రాయం. Pranayraj Vangari (Talk2Me|Contribs) 09:17, 15 ఆగస్టు 2019 (UTC)
- ప్రణయ్ రాజ్ గారూ, ప్రభుత్వ మిచ్చే అధికారిక డేటాను మించినది లేదు. అది లభిస్తే మంచిదే. __చదువరి (చర్చ • రచనలు) 16:16, 15 ఆగస్టు 2019 (UTC)
సవరణలకు సూచనలు, వనరులు
[మార్చు]- ఇది 'ధరణి' తెలంగాణ రాష్ట్రానికి చెందిన అధికారక వెబ్‌సైట్. దీనిలో రెవెన్యూ గ్రామాలు పేర్లు తెలుగులో ఉన్నవి.దీనిలో తప్పులు లేవని కాదు. దాదాపుగా ఎక్కువ భాగం సరిగానే ఉన్నవి. ఈ వెబ్‌సైట్ ఆధారంగా సరిపోల్చుకొని, చేసేటప్పుడు తప్పుగా ఉన్న గ్రామం పేరుపై సందేహం కలిగితే పూర్తిగా దానిమీదనే ఆధారపడకుండా, ప్రాజెక్టుపేజీలో వివరించినట్లు గూగుల్ లో వెదికి, ఆ గ్రామానికి సంభందించిన లింకులుతో దిన పత్రికలు, సామాజిక మాధ్యమాల ద్వారా సరియైన గ్రామం పేరు నిర్థారించుకొని తెలంగాణ రాష్ట్రంలో మండలాల పునర్య్వస్థీకరణ, జణన గణన డేటా ఎక్కించేటప్పుడు నేను దాదాపు 300 గ్రామాలకు పైన తరలింపు ద్వారా సవరించాను.
- అలాగే ఇది 'మా భూమి' ఆంధ్ర్రదేశ్ రాష్ట్రానికి చెందిన అధికారక వెబ్‌సైట్ పైన చెప్పిన మాదిరిగానే ఈ వెబ్‌సైట్ లో రెవెన్యూ గ్రామాలు తెలుగులో ఉన్నవి.పైన చెప్పిన మాదిరిగా కొంతవరకు పరిష్కారం చూపగలదని నేను భావిస్తున్నాను
- నా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని నేను గమనించిన సూచనలు
- అదే పేరు గల గ్రామం మరొక జిల్లాలో,అదే జిల్లాలోని ఇంకొక మండలంలో,అదే మండలంలో కూడా ఉండటానికి ఆస్కారం ఉంది. అది తెలుసుకోవాలంటే గ్రామం పేరుకు ఉన్న లింకు తాత్కాలికంగా తొలగించి, మరలా లింకును కలపటానికి ప్రయత్నం చేసినప్పుడు ఇలాంటి పేర్లు మనకు తెలిసినప్పుడు ఆ గ్రామం పేరు సవరణలోతో పాటు, బ్రాకెట్లో మండలం పేరు ఉదహరిస్తేనే వివరంగా ఉంటుంది.అలాంటి గ్రామాలు ఇక్కడ చూడండి. గోపాల్‌పేట, గోపాల్‌పేట్ - రేగుల చిలక, రేగులచిలక - ఉప్పరగూడెం, ఉప్పెరగూడెం మొదలగునవి.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామాలకన్నా సవరించవలసిన గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉంటాయని భావిస్తున్నాను.ఈ పని చాలా ఓపికతో చేయాల్సినపని.తొందరగా అయిపోగొడదాం అనుకుంటే అది జరిగేదికాదు.ఏది ఏమైనా ప్రతి గ్రామం పరిశీలించినప్పుడే పూర్తి సవరణలు జరిగినట్లుగా భావించాలి. గౌరవ వికీపీడియన్లు వారు చేపట్టిన జిల్లా సవరింపుల పని మరొకరితో పనిలేకుండా పూర్తిగా అయ్యేంతవరకు చేపట్టగలరని ఆశిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 18:11, 15 ఆగస్టు 2019 (UTC)
- యర్రా రామారావు గారూ, ధరణి గురించి నాకు తెలియదు. కానీ మీభూమిలో మాత్రం తప్పులుంటాయి. నేను గుంటూరు జిల్లా గ్రామాల విషయంలో ఇది గమనించాను. మా మండలంలోని గ్రామాల పేర్లలో 30% శాతం తప్పులున్నాయి. అలాగే మా చుట్టుపక్క్లల మండలాల్లో కూడా తప్పులు కనిపించాయి. దానిపై అంతగా ఆధారపడలేమని నా ఉద్దేశం. __చదువరి (చర్చ • రచనలు) 05:48, 16 ఆగస్టు 2019 (UTC)
- చదువరి గారూ నేను అనంతపురం జిల్లా చేపడుతున్నాను.ఆ జిల్లాలోని గ్రామ పంచాయితీలు జాబితా సమాచారహక్కు చట్టం ద్వారా తెలుగులో పొందాను.వాటితో సరిపొల్చుకోవచ్చా?--యర్రా రామారావు (చర్చ) 16:41, 16 ఆగస్టు 2019 (UTC)
- నిరభ్యంతరంగా వాడండి సార్. ప్రభుత్వ సమాచారం అసలు పరిగణించవద్దని నేను అనడం లేదండి. కాకపోతే, కొన్ని తప్పులను గమనించాను కాబట్టి ఇతర సమాచారంతో కూడా పోల్చి చూసుకుంటే మంచిదని నేను భావిస్తున్నానంతే. __చదువరి (చర్చ • రచనలు) 00:58, 17 ఆగస్టు 2019 (UTC)
- చదువరి గారూ నేను అనంతపురం జిల్లా చేపడుతున్నాను.ఆ జిల్లాలోని గ్రామ పంచాయితీలు జాబితా సమాచారహక్కు చట్టం ద్వారా తెలుగులో పొందాను.వాటితో సరిపొల్చుకోవచ్చా?--యర్రా రామారావు (చర్చ) 16:41, 16 ఆగస్టు 2019 (UTC)
- యర్రా రామారావు గారూ, ధరణి గురించి నాకు తెలియదు. కానీ మీభూమిలో మాత్రం తప్పులుంటాయి. నేను గుంటూరు జిల్లా గ్రామాల విషయంలో ఇది గమనించాను. మా మండలంలోని గ్రామాల పేర్లలో 30% శాతం తప్పులున్నాయి. అలాగే మా చుట్టుపక్క్లల మండలాల్లో కూడా తప్పులు కనిపించాయి. దానిపై అంతగా ఆధారపడలేమని నా ఉద్దేశం. __చదువరి (చర్చ • రచనలు) 05:48, 16 ఆగస్టు 2019 (UTC)
తప్పు పేర్లని దారిమార్పులేకుండా తరలించటం
[మార్చు]ప్రాజెక్టు పేజీలో సూచించినట్లు తప్పు పేర్లని దారిమార్పుతో తరలించితే తప్పులు జీవంతో వుండిపాతాయి. నా దృష్టిలో దారిమార్పు లేకుండా తరలించి, దానికి లింకులున్నచోట కొత్తపేరుతో మార్చటం మంచిది. --అర్జున (చర్చ) 01:15, 16 ఆగస్టు 2019 (UTC)
- అర్జున గారూ, సరైన పేరుకు పేజీలను తరలించాలి, పాత పేజీలను తొలగించాలి, పాత లింకులను కొత్త లింకులతో మార్చాలి -ఇదీ మీరు సూచిస్తున్నది. ఈ సూచనలోని ఉచితానుచితాలను నేను చర్చించను.
- "దారిమార్పు లేకుండా తరలించి, దానికి లింకులున్నచోట కొత్తపేరుతో మార్చటం మంచిది" అని అన్నారు- పాత లింకుల స్థానంలో కొత్త లింకులు పెట్టడానికి పాత పేజీని తీసెయ్యడం ఎందుకు? దాన్నలాగే ఉండనిచ్చి లింకులను మార్చొచ్చు గదా!? లింకులను మార్చడం కోసం దారిమార్పును తీసెయ్యాల్సిన అవసరముందా..? లేదు! పోతే..
- ఒక సంగతి.. లింకులను మార్చడం అనేది ఈ ప్రాజెక్టు పరిధిని పెంచుతుంది. పని మందగిస్తుంది. కొసరు పని వలన అసలు పని ఆలస్యమౌతుంది. కాబట్టి దాన్ని ఈ ప్రాజెక్టులో భాగం చెయ్యకపోవడమే మంచిది.
- మరో సంగతి.. దారిమార్పు లింకులన్నిటినీ మార్చగలిగేలా బాటు తయారు చెయ్యడం మీవంటి సాంకేతికులకు తేలిక. బాటుతో చిటికెలో అయిపోయే పని కోసం వాడుకరులకు ఆ పని పెట్టడమెందుకు? ప్రాజెక్టు పరిధిని పెంచడమెందుకు?
- ఇంకో సంగతి.. అలాంటి బాటు ఎన్వికీలో ఉండే ఉంటది. వెతికి, దాన్ని ఇక్కడ కూడా నడపొచ్చేమో చూడండి. ఈ పేజీలతో పాటు దారిమార్పు లింకులన్నీ బాగుపడతాయి. ఆ తరువాత మీరు కోరినట్లు తప్పు పేర్లతో ఉన్న గ్రామ వ్యాసాల దారిమార్పు పేజీలను తొలగించవచ్చు కూడా -సముదాయం అది సబబని భావిస్తే! __చదువరి (చర్చ • రచనలు) 05:34, 16 ఆగస్టు 2019 (UTC)
- చదువరి గారికి, తప్పుగా వాడిన పాత పేజీని దారిమార్పుతో తరలించినపుడు, ఆ తరువాత పాతపేజీ లింకులు మార్చినపుడు అది అనాధ పేజీ అవుతుంది, దాని అవసరంతీరిపోయింది కాబట్టి తొలగించడం మంచిది. దీనితో పని పెరుగుతుంది కాని, నాణ్యత పై ధ్యాస వుంటే ఈ పని ఇప్పడుకాకపోతే తరువాతి దశలో నైనా చేయాలి. కాకపోతే గ్రామపేజీల పేరు మార్పులు మండలానికి ఒకటో, రెండో వున్నప్పుడు, లింకుమార్పులు ఒకటో రెండో మార్పులయి, ఒక లింకు మార్పు మండల మూసలో ప్రాజెక్టు పరిధిలో ఇప్పటికే వున్నప్పుడు, మిగతా పని సరిగా చేయడం పెద్ద కష్టం కాదని నా అభిప్రాయం. పేరుమార్పులు కొన్ని నాణ్యతకు అంత ఇబ్బందికరం కాకపోయినా, 'డ', 'ద' లు లేక 'ఈ' 'ఎ' లు, లాంటివి తారుమారైన చోట ఆ తప్పు పేర్లు అలానే తెవికీలో కనబడటం మంచిది కాదని నా అభిప్రాయం. ఇక తరువాత బాట్ తో చేయాలన్నా, దానికి కావలసిన సమాచారం ఒకచోట వుంటే అది సులభమవుతుంది. ఇప్పటికే నేను పరిశీలించిన మార్పులలో మీరు, మరికొంతమంది వివరంగా ఏ వ్యాసాలకు మార్పులు జరిగింది రాస్తున్నారు,ఇతర ప్రాజెక్టు సభ్యులు ఆ వివరాలు రాయటం లేదు. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు, గతానుభవం ద్వారా తెలిసేది ఏమంటే, ప్రారంభంలో సభ్యులు ఉత్సాహం ప్రదర్శించినా, ఎంతమందిలో ఆ ఉత్సాహం కొనసాగుతుందో మొత్తం పరిధి పూర్తవటానికి ఎంత సమయం పడుతుందో తెలియదు. గతంలోని భారతజనగణన ప్రాజెక్టులో దోషాలను ఎత్తి చూపి, వాటిని సరిచేయటానికి పైలట్ ప్రాజెక్టు ప్రారంభించినా, వాటిని సరిచేయటంలో తోడ్పటానికి సరికదా, కనీసం స్పందించేవారు కూడా తెవికీలో కరవైనారు. ప్రాజెక్టు ప్రారంభికునిగా మరియు సమన్వయకర్తగా, నాణ్యత దిశగా ఈ ప్రాజెక్టు లో పని, నిర్వహణ మరింత బాగా చేస్తారని, ప్రాజెక్టు సభ్యులు కూడా నాణ్యత పాటించేలా ఆ దిశగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను.-- అర్జున (చర్చ) 00:05, 17 ఆగస్టు 2019 (UTC)
- అర్జున గారూ, నిరాశావాదం, నిరుత్సాహకరం, రంధ్రాన్వేషణ! భారత జనగణన ప్రాజెక్టులో గానీ, ఇప్పుడు గానీ మీరు ఎత్తి చూపింది, చూపిస్తున్నదీ దోషాలు కాదు- రంధ్రాన్వేషణ. మీరు ప్రదర్శించింది, ప్రదర్శిస్తున్నదీ.. పని చెడగొట్టే నిరాశావాద దృక్పథం. నిరుత్సాహం కలిగిస్తోందది.
- ప్రాజెక్టు అంటే నిర్వహించడం మాత్రమే కాదు. ముందు ప్రాజెక్టు ఉద్దేశించిన పని చెయ్యాలి, ఆ తరవాతే నిర్వహణ. పని చేసేది లేకుండా తీరిగ్గా కూచుని నిర్వహణ గురించి మాట్టాడుతూ ఉంటే పని ముందుకెలా వెళ్తుంది? సమయం వృథా అవుతుందంతే. ఏ ప్రాజెక్టైనా ముందుకెళ్ళాలంటే మీ ఈ దృక్పథం దోహదపడదు. ప్రకాశం జిల్లా తీసుకుని ఆ గ్రామాల పేర్లపై పనిచేస్తే ముందుకెళ్తది. బాటు తయారు చేస్తే ముందుకెళ్తది. లేదా, మీరు వేరే పనుల్తో బిజీగా ఉంటే, ఇక్కడ చేసే వాళ్లను ప్రశాంతంగా చెయ్యనిస్తే ముందుకెళ్తది.
- అసలు ఇప్పుడు పైన నేను కోరిన బాటు చెయ్యడం సాధ్యమేనా? ఈ బాటు చేస్తారా, చెయ్యరా? ఇంతకు ముందు మీరు బాట్‌ల గురించి ప్రతిపాదనలు తెచ్చారు. కొందరం వోట్లూ వేసాం. వాటి సంగతేమైంది? వాటిని నడిపిస్తున్నారా? వాటి పనుల నివేదిక ఏమైనా ఇచ్చారా? ఎక్కడుందది? __చదువరి (చర్చ • రచనలు) 00:52, 17 ఆగస్టు 2019 (UTC)"కనీ
- చదువరి గారికి, విమర్శలు స్వీకరించడం ఎవరికి మాత్రం ఇష్టం. ప్రాజెక్టు సరిగా జరగాలంటే పని జరగటం ఎంత ముఖ్యమో, పని సరిగ్గా జరగటం అంతకన్నా ముఖ్యం. ఆ దిశలో నేను చేసే వ్యాఖ్యలను కొందరైనా స్వాగతిస్తారని భావిస్తాను. నేను ప్రస్తావించిన పనులని సమగ్రంగా జరగటానికి నేను నిరంతరం ప్రయత్నిస్తూనేవుంటాను. ఇంటర్నెట్ ఆర్కైవ్ బాటుకి సంబంధించిన లింకును పరిశీలిస్తే మీకే తెలుస్తుంది. తెవికీలో బాగా వీక్షణలు పొందే వ్యాసాలే అంతగా ఉపయోగపడని స్థితికి చేరాయని నా ఇటీవల పనులలో నేను గమనించాను. వాటిని నా వీలుకొలది సవరిస్తున్నాను. ఈ సందర్భంలో ఈ అతి తక్కువ వీక్షణలు పొందే గ్రామాల ప్రాజెక్టు వ్యాస పేజీలలో పనిచేయటానికి నాకు ఆసక్తి లేదు. అయినా నా ఆశయం దృష్ట్యా నాణ్యతకు సంబంధించిన పనులను బాటుతో చేయడానికి నా సహాయ సహకారాలు కావాలంటే వీలువెంబడి చేపడతాను. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 03:45, 17 ఆగస్టు 2019 (UTC)
- ధన్యవాదాలు అర్జున గారు.__చదువరి (చర్చ • రచనలు) 04:24, 17 ఆగస్టు 2019 (UTC)
- చదువరి గారికి, విమర్శలు స్వీకరించడం ఎవరికి మాత్రం ఇష్టం. ప్రాజెక్టు సరిగా జరగాలంటే పని జరగటం ఎంత ముఖ్యమో, పని సరిగ్గా జరగటం అంతకన్నా ముఖ్యం. ఆ దిశలో నేను చేసే వ్యాఖ్యలను కొందరైనా స్వాగతిస్తారని భావిస్తాను. నేను ప్రస్తావించిన పనులని సమగ్రంగా జరగటానికి నేను నిరంతరం ప్రయత్నిస్తూనేవుంటాను. ఇంటర్నెట్ ఆర్కైవ్ బాటుకి సంబంధించిన లింకును పరిశీలిస్తే మీకే తెలుస్తుంది. తెవికీలో బాగా వీక్షణలు పొందే వ్యాసాలే అంతగా ఉపయోగపడని స్థితికి చేరాయని నా ఇటీవల పనులలో నేను గమనించాను. వాటిని నా వీలుకొలది సవరిస్తున్నాను. ఈ సందర్భంలో ఈ అతి తక్కువ వీక్షణలు పొందే గ్రామాల ప్రాజెక్టు వ్యాస పేజీలలో పనిచేయటానికి నాకు ఆసక్తి లేదు. అయినా నా ఆశయం దృష్ట్యా నాణ్యతకు సంబంధించిన పనులను బాటుతో చేయడానికి నా సహాయ సహకారాలు కావాలంటే వీలువెంబడి చేపడతాను. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 03:45, 17 ఆగస్టు 2019 (UTC)
సందేహం
[మార్చు]చదువరి గారూ, ఈ వెబ్‌సైట్లో ఆంధ్రప్రదేశ్ జిల్లాలు, మండలాలు, గ్రామాలు తెలుగులో ఉన్నాయి. వీటిని వాడుకొని సవరణలు చేయవచ్చా?--కె.వెంకటరమణ⇒చర్చ 11:44, 18 ఆగస్టు 2019 (UTC)
- @K.Venkataramana: గారూ, చాలా బావుందండీ ఈ వెబ్సైటు. ప్రభుత్వం మూసేస్తుందో ఏమో ముందు ఉన్న జాబితాలు డౌన్లోడ్ చేసేద్దాం ఎవరికి వారు. ఆపైన వాడవచ్చు. అనుకుంటున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 14:23, 18 ఆగస్టు 2019 (UTC)
- వాడొచ్చు సార్. అయితే, మీభూమి లోను, గుంటూరు సైటులోనూ ఉన్న తప్పుల్లాంటివే ఈ సైటులో కూడా గమనించాను. అంచేత కాస్త అప్రమత్తంగా ఉండాలి. మొత్తమ్మీద, ఈ ప్రభుత్వ సైట్లు చాలావరకు సరైన పేర్లు చూపిస్తాయని, వంద శాతం సరైనవి మాత్రం కావనీ మనం గ్రహింపుతో ఉండాలనేది అర్థ మౌతోంది. __చదువరి (చర్చ • రచనలు) 14:28, 18 ఆగస్టు 2019 (UTC)