Jump to content

వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/తెలుగు ప్రముఖులు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
అనుకున్న విధంగా పని ప్రారంభించడం అభినందనీయం. పని ప్రారంభించిన రాజశేఖర్, రమణ మరియు ప్రసాదుగార్లకు ధన్యవాదాలు. t.sujatha (చర్చ) 12:41, 15 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
జీవితచరిత్రలు అనడం బాగుండదు. ఇక్కడ ఉండేవి వ్యక్తుల వ్యాసాలే కాబట్టి ప్రముఖ వ్యక్తులు అనడం మేలు. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:06, 15 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
చంధ్రకాంత్ గారి అభిప్రాయం సరి అయినదే. ప్రముఖుల వ్యాసాలు అని మాత్రమే ఉండాలి. జీవిత చరిత్రలన్నా ఆత్మకథలన్న సమగ్రమైన పుస్తక రూపంలో ఉండాలి. పేరు కనుక మార్చవలసిన

అవసరం ఉంది. t.sujatha (చర్చ) 03:27, 16 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

చర్చలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. ఉగాది ఉత్సవాలలో అధికులు తెలుగువారి జీవిత చరిత్రలను గురించిన వ్యాసాలు తెలుగు వికీపీడియాలో సమగ్రంగా లేవని. ఇవి భావితరాల వారికి బాగా ఉపయోగపడతాయని చెప్పారు. అందుకని ఈ ప్రాజెక్టును ప్రారంభించాను. సభ్యులు, నిర్వాహకులు, అధికారులు ప్రాజెక్టు పేజీని తీర్చిదిద్దడంలో సహాయం చేయమని కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 11:30, 16 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
మనం అనుకున్న విధంగా పని ప్రారంభించినందులకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే ఎవైనా ప్రముఖుల గురించి ఆంగ్ల వికీపీడియాలో వ్యాసం ఉంటే వాటిని మొదలు గుర్తించడం ఒక పనిగా. ఆమేరట వాటిని అనువదించడం విస్తరించడం మరో పనిగా పెట్టుకుంటే బాగుంటుందేమో. పరిగణించ కోరుతున్నాను. విష్ణు (చర్చ)15:26, 18 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు శిర్షిక

[మార్చు]

ఈ ప్రాజెక్టు లో చాలామంది ప్రముఖులను చేర్చవచ్చు. కాని శీర్షికను తెలుగు ప్రముఖులు అని పరిమితం చేశారు. తెలుగు ప్రముఖులను మాత్రమే చేర్చాలా? కె.వెంకటరమణ చర్చ 11:51, 16 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రముఖులు అన్నది అసలు ఉద్దేశం...! మన తెలుగు నేలపై జన్మించిన పెద్దలందరినీ తెలుగు ప్రముఖులు ఒకచోట చేరిస్తే బావుంటుందని ఆలోచన...! మన దేశంలో మిగిలిన రాష్ట్రాలలో జన్మించిన ప్రముఖులను భారతదేశ ప్రముఖులుగా చేర్చుదాం....! ...Malladi kameswara rao (చర్చ) 11:59, 16 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రముఖ వ్యక్తులు అనిన బాగుండునేమో పరిశీలించండి కె.వెంకటరమణ చర్చ 13:12, 16 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటి విడత పరిధి

[మార్చు]

ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. ప్రాజెక్టు మొదటి విడతకు స్పష్టమైన లక్ష్యాలు దానికి తగిన కాలపరిమితి నిర్ణయిస్తే పాల్గొనే వారికి వుత్సాహం మెరుగయ్యే అవకాశం వుంది, ప్రాజెక్టు కాలపరిమితి ముగిసినతరువాత ఎంత వరకు విజయం సాధించింది బేరీజువెయ్యటానికి తదుపరి విడత కార్యక్రమాలను చేపట్టటానికి సౌలభ్యంగావుంటుంది. కనుక మొదటి మూడు నెలలకు లక్ష్యాలను స్పష్టీకరించడం మంచిది.

అర్జునరావు గారు పై వ్యాఖ్యను చేశారు. చాలా చక్కని సలహా. ఇంచుమించు ఇలాంటి వ్యాఖ్యనే వ్రాద్దామని ఇక్కడికి వచ్చాను. ఒక చిన్న భాగంగా విభజించుకొని లక్ష్యంతో పనిచేస్తే బాగుంటుంది. మనకు చాలా ప్రాజెక్టులున్నాయి. కానీ అందరూ కలిసి ఒకే ప్రాజెక్టుపై కేంద్రీకరిస్తే అభివృద్ధి బాగా జరుగుతుంది. ఇదివరకటి ప్రాజెక్టలలా కాకుండా జిల్లాల ప్రాజెక్టు విజయవంతవటానికి ఒక నిర్ధిష్ట పరిధి (23 వ్యాసాలు) ఉన్న ప్రాజెక్టు ఎంచుకోవటంతో పాటు, దాదాపు క్రియాశీలక సభ్యులందరూ ఒకే ప్రాజెక్టుపై దృష్టి పెట్టడం ముఖ్యమైన కారణంగా నాకు తోచింది. ఈ ప్రాజెక్టు పరిధిలోని ఒక వంద వ్యాసాలను తీసుకొని మూన్నెళ్లలో వాటిని విశేషవ్యాసం స్థాయికి చేర్చితే ఎలా ఉంటుంది? --వైజాసత్య (చర్చ) 05:23, 4 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
మంచి సలహా వైజాసత్యగారు. నేను ముందుగా తెలుగు ప్రముఖులందరినీ ఒక వేదిక మీదకు తీసుకొని వస్తున్నాను. వారిలోనుండి వందమందిని మీరు ఎంపికచేయండి. ఒక నెలరోజుల సమయంలో వాటిని అందరం కలిసి విశేష వ్యాసాలుగా విస్తరిద్దాము. అలాంటి నూరు వ్యాసాలను ప్రాముఖ్యతను బట్టి మీరు గుర్తించి ఒక దగ్గర చేర్చండి. ధన్యవాదాలు. అలాగే పనివిభజన సౌలభ్యం కోసం ప్రాజెక్టును ఒక 12-15 భాగాలుగా పట్టిక రూపంలో ప్రాజెక్టు పేజీలో ఉంచాను. ఎవరెవరి అభిరుచిని బట్టి ఆయా ప్రదేశాలలో వారి పేర్లను చేర్చండి.Rajasekhar1961 (చర్చ) 06:32, 4 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రంధాలయశాస్త్ర ప్రముఖులు

[మార్చు]

తెలుగు రాష్ట్రాలలో గ్రంధాలయ ఉద్యమానికి, గ్రంధాలయ సంఘానికి శాస్త్ర విజ్ఞానాభివృద్ధికి కృషిచేసిన వారు చాలమందే ఉన్నారు.

  • అయ్యంకి వెంకట రమణయ్య
  • పాతూరి నాగభూషణం
  • గాడిచెర్ల హరిసర్వోత్తమ రావు
  • కోదాటి నారాయణ రావు
  • అబ్బూరి రామకృష్ణ రావు

మొదలైన ఇంకెందరో ఉన్నారు. వారందరి గురించి ఇక్కడ చేర్చి వ్రాయవచ్చు / గ్రంధాలయశాస్త్ర ప్రముఖులు. సమ్మతమయితే నేను ఈ విషయంలో సహాయం చేయగలను --Vjsuseela (చర్చ) 10:40, 8 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Vjsuseela గారూ, ఎవరి సమ్మతీ అక్కర్లేదు. ఈ ప్రాజెక్టు పేజీ లోని "సభ్యులు" విభాగంలో మీ పేరు చేర్చుకుని, పని మొదలు పెట్టండి. __చదువరి (చర్చరచనలు) 13:57, 8 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]