వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/వ్యాసాల అభివృద్ధి ఉద్యమం 2020 ఏప్రియల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జీవ ఇంధనం వ్యాసం అబివృద్ధి గురించి[మార్చు]

చదువరి గారూ ఈ ప్రాజెక్టు క్రింద జీవ ఇంధనం వ్యాసం అభివృద్ఝి చేయుట ఆరంభించాను.కొంత భాగం ఆంగ్ల వ్యాసం నుండి అనువదించగా జీవద్రవ్య ఇంధనాలు అనే మరొక వ్యాసం కనుగొనుట జరిగింది.ఈ రెండూ ఒకే కోవకు చెందిన వ్యాసాలు అనే సందేహం తలెత్తింది.విలీనం చేయవలసి ఉంటుందోమోనని అభిప్రాయం.జీవద్రవ్య ఇంధనాలు అనే వ్యాసం Palagiri గారిచే సృష్టించి దాదాపుగా పూర్తి అభివృద్ధి చేసిన వ్యాసం ఉంది.దీని వికీ డేటా లింకు పరిశీలించగా మరోక ఆంగ్ల వ్యాసం లేదు.జీవ ఇంధనం వ్యాసం కేవలం రెండు వాఖ్యాలుతో సృష్టించబడింది.దారి మార్పు చేస్తెే సరిపోతుందని నా అభిప్రాయం. సందేహం నివృత్తి చేయగలరు.--యర్రా రామారావు (చర్చ) 15:48, 1 ఏప్రిల్ 2020 (UTC)

యర్రా రామారావు గారూ, రెండు వ్యాసాలూ ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి. జీవద్రవ్య ఇంధనాలు పేజీలో సమాచారం బాగుంది, అదే ముందు తయారుచేసినది కూడా. నా అభిప్రాయం - జీవద్రవ్య ఇంధనాలు పేజీ లోకి జీవ ఇంధనం పేజీని విలీనం చెయ్యాలి. రివర్సులో చెయ్యరాదు. పేరు మాత్రం "జీవ ఇంధనం" సరైనదనిపిస్తోంది. జీవద్రవ్యం ఏమిటో నాకు తెలీలేదు. జాలంలో చూస్తే అది కణాల్లో ఉండే పదార్థమేదో నని అనిపించింది. ఈ సందర్భానికి సరిపోతుందో లేదో తెలీదు. పాలగిరి గారే చెప్పాలి. __చదువరి (చర్చరచనలు) 17:05, 1 ఏప్రిల్ 2020 (UTC)
యర్రా రామారావుగారూ, ఈ రెండు వ్యాసాలు ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి. biomass అనగా జీవద్రవ్యం. కనుక రెండు వ్యాసాల శీర్సిక ఒక్కటే. శీర్షిక "జీవ ఇంథనం" అంటే బాగుంటుంది. కనుక విలీనం చేయవచ్చు.--కె.వెంకటరమణచర్చ 17:27, 1 ఏప్రిల్ 2020 (UTC)
సందేహం నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు.ఈ రెండు వ్యాసాలును వెంకటరమణ గారిని పై అభిప్రాయాలకు అనుగుణంగా సరియైనరీతిలో సవరించగలందులకు కోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 03:53, 2 ఏప్రిల్ 2020 (UTC)

ప్రాజెక్టు పనిలో పాల్గోనలేక పోయాను[మార్చు]

  1. - vmakumar: సర్, లాక్ డౌన్ సమయంలో కొంత విరామం దొరుకుతుందని భావించి ఈ ప్రాజెక్ట్ లో పాలు పంచుకోవాలని ఆశించాను. కానీ నా సాధారణ విధులకు అదనంగా రాజమండ్రి మునిసిపల్ కార్పొరేషన్ లో COVID-19 కు సంబందించిన Enforcement duties, కో-ఆర్డినేటర్ విధులలో పూర్తిగా నిమగ్నం కావడంతో అసలు సమయం చిక్కక, ఎన్నుకొన్న వ్యాసాలలో కనీసం ఒక్క వ్యాసం కూడా పూర్తి చేయలేకపోయాను. అయినప్పటికీ వాటిని మరి కొద్ది రోజులలో తప్పనిసరిగా పూర్తిచేయగలను. --Vmakumar (చర్చ) 00:19, 1 మే 2020 (UTC)
Vmakumar గారూ పర్వాలేదు లేండి.వృత్తి ముందు న్యాయం చేయాలి.ముందు అది ముఖ్యం.మీ స్పందనకు ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 03:50, 1 మే 2020 (UTC)