వేదిక:తెలుగు సినిమా/ఈ వారం బొమ్మ/2015-46వ వారం
స్వరూపం
టంగుటూరి సూర్యకుమారి 30వ దశకం నుండి, 60వ దశకం వరకు కొనసాగిన నటి. నటనలోనే కాక, సంగీతం లో కుడా దిట్ట. చూడచక్కని రూపురేఖలు, వినసొంపైన గాత్రం కల సూర్యకుమారి, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు యొక్క తమ్ముడు టంగుటూరి శ్రీరాములు కుమార్తె. తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ భాషలలో ఆమె ఇరవైకి పైగా చిత్రాలలో నటించినది, పాడినది కూడా. ప్రాచ్య, పాశ్చాత్య నృత్య సంగీతాలకు మధ్య సుహృద్భావ సేతువుగా అంతర్జాతీయ కీర్తినందిన మధురగాయని. సూర్యకుమారి నటించిన కొన్ని చిత్రాలు
చిత్ర సౌజన్యం: వైజాసత్య
|