తెలుగు సినిమాలు 1964
ఈ యేడాది 26 చిత్రాలు విడుదలయ్యాయి. యన్టీఆర్ 15 చిత్రాల్లోనూ, ఏయన్నార్ ఆరు చిత్రాల్లోనూ నటించారు. తొలిసారి అత్యధిక భాగం ఔట్ డోర్‌లో చిత్రీకరణ జరుపుకున్న బాబూమూవీస్ వారి 'మూగమనసులు' సంచలన విజయం సాధించి, రజతోత్సవాలు జరుపుకుంది. తరువాతి కాలంలో శతచిత్ర నిర్మాతగా కీర్తి గడించిన డి.రామానాయుడు తమ సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం 'రాముడు-భీముడు' (ఇదే యన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన తొలి చిత్రం కూడా) ఘనవిజయం సాధించింది. ఇంకా "ఆత్మబలం, అమరశిల్పి జక్కన్న, డాక్టర్ చక్రవర్తి, అగ్గి-పిడుగు, మంచి మనిషి, దాగుడుమూతలు, భక్త రామదాసు" చిత్రాలు శతదినోత్సవం జరుపుకున్నాయి. పత్రికలలో 'ఓపెనింగ్ కలెక్షన్ల' ప్రకటనకు శ్రీకారం చుట్టిన చిత్రం 'అగ్గి - పిడుగు'. భారీ చిత్ర నిర్మాణ వ్యయం రూ.5 లక్షలకు పైగా అవుతున్న ఆ రోజుల్లో ఈ చిత్రం మొదటి వారంలోనే రూ.5 లక్షలు గ్రాస్ వసూలు చేసింది. ఈ యేడాది విడుదలైన "మురళీకృష్ణ, గుడిగంటలు, శ్రీసత్యనారాయణవ్రత మహాత్మ్యం, బొబ్బిలియుద్ధం, నవగ్రహపూజా మహిమ, బంగారు తిమ్మరాజు" చిత్రాలు కూడా ప్రజాదరణ చూరగొన్నాయి.
- అగ్గిపిడుగు
- అడవి పిల్ల
- అందీఅందని ప్రేమ
- అమరశిల్పి జక్కన
- ఆత్మబలం
- ఆదర్శ సోదరులు
- ఆనందజ్యోతి
- ఇంటి దొంగ
- ఈడుజోడు
- కలవారి కోడలు
- కలియుగ భీముడు
- కవల పిల్లలు
- కర్ణ
- గుడిగంటలు
- డాక్టర్ చక్రవర్తి
- తోటలోపిల్ల కోటలోరాణి
- దాగుడు మూతలు
- దేశద్రోహులు
- దొంగను పట్టిన దొర
- నాదీ ఆడజన్మే
- నవగ్రహ పూజా మహిమ
- పూజాఫలం
- పీటలమీద పెళ్ళి
- బబ్రువాహన
- బంగారు తిమ్మరాజు
- బొబ్బిలి యుద్ధం
- మంచి మనిషి
- మూగ మనసులు
- మర్మయోగి
- మురళీకృష్ణ
- మైరావణ
- మాస్టారమ్మాయి
- రామదాసు
- రాముడు భీముడు
- వారసత్వం
- వివాహబంధం
- శభాష్ సూరి
- శ్రీ సత్యనారాయణ మహత్యం
- హంతకుడెవరు
తెలుగు సినిమాలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | |