Jump to content

తెలుగు సినిమాలు 1977

వికీపీడియా నుండి
అడవిరాముడు

ఈ సంవత్సరం 78 చిత్రాలు విడుదలయ్యాయి. సత్యచిత్ర 'అడవిరాముడు' చరిత్రలో కలకాలం నిలచిపోయేరీతిలో భారీ సూపర్‌హిట్‌గా విజయం సాధించి, కమర్షియల్‌ సినిమాకు (ఇప్పటికీ అనుసరిస్తున్న) కొత్త గ్రామర్‌ను నేర్పింది. అదే విధంగా కలెక్షన్లలో, రన్‌లో అంతకు ముందున్న చిత్రాలకంటే రెండు, మూడు రెట్లు ఎక్కువగా రికార్డ్‌ సృష్టించి, అనూహ్య విజయం సాధించిందీ చిత్రం. అంతకు ముందు తెలుగు సినిమా అత్యధిక కలెక్షన్‌ కోటి రూపాయలు రికార్డు కాగా, ఈ చిత్రం ఏకంగా యేడాదిలోనే రూ.4 కోట్లు సంపాదించి, అన్ని భాషా చిత్రరంగాల్లో చర్చనీయాంశమైంది. ఒకే రాష్ట్రంలో నాలుగు కేంద్రాలలో రెగ్యులర్‌ షోలతో స్వర్ణోత్సవాలు జరుపుకొని అంతకు ముందున్న 'షోలే' (మహారాష్ట్రలో మూడు కేంద్రాలు) రికార్డును అధిగమించింది. ఈ రికార్డును ఇప్పటివరకు మరే చిత్రం అధిగమించలేదు. తరువాత ఒక తెలుగు చిత్రం, ఒక హిందీ చిత్రం ఈ రికార్డును సమం చేశాయి. చాలా రోజుల తరువాత ఒకే ఇతివృత్తంతో 'దానవీరశూర కర్ణ', 'కురుక్షేత్రం' పోటీ చిత్రాలుగా విడుదలయ్యాయి. "దానవీర శూర కర్ణ, యమగోల" చిత్రాలు సంచలన విజయం సాధించి, 250 రోజులు ప్రదర్శితం కాగా 'అమరదీపం' (డైరెక్టుగా),'ఆలుమగలు' రజతోత్సవాలు జరుపుకొని, ఘనవిజయం సాధించాయి. ఇంకా "సావాసగాళ్ళు, దొంగలకు దొంగ, చక్రధారి, బంగారుబొమ్మలు, చిల్లరకొట్టు చిట్టెమ్మ, చాణక్య-చంద్రగుప్త, ఎదురీత (సింగిల్‌ షిఫ్ట్‌)" చిత్రాలు శతదినోత్సవం జరుపుకున్నాయి. "ఆమె కథ, ఇదెక్కడి న్యాయం, ఈనాటి బంధం ఏనాటిదో, చిలకమ్మ చెప్పింది, దేవతలారా దీవించండి, ప్రేమలేఖలు, సంసారంలో సరిగమలు" సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమయ్యాయి.


  1. అడవిరాముడు
  2. అదృష్టవంతురాలు
  3. అమరదీపం
  4. అర్ధాంగి
  5. అత్తపోరు
  6. అందమె ఆనందం
  7. అందాలరాజా
  8. అన్నదమ్ముల శపధం
  9. ఆలుమగలు
  10. ఆమెకథ
  11. ఆత్మీయుడు
  12. ఇదెక్కడి న్యాయం
  13. ఇంటిని దిద్దిన ఇల్లాలు
  14. ఇంద్రధనస్సు
  15. ఈనాటి బంధం ఏనాటిదో
  16. ఈతరం మనిషి
  17. ఎదురీత
  18. ఎవరు దేవుడు
  19. ఒక ఊరి కథ
  20. ఒక తల్లి కథ [1]
  21. ఒకే రక్తం
  22. కల్పన
  23. కన్యాకుమారి
  24. కురుక్షేత్రం
  25. కోయిలమ్మ కూసింది
  26. ఖైదీ కాళిదాసు
  27. గడుసు అమ్మాయి
  28. గడుసు పిల్లోడు
  29. గంగా యమునా సరస్వతి
  30. గీత సంగీత
  31. గృహప్రవేశం
  32. చాణక్య చంద్రగుప్త
  33. చక్రధారి
  34. చరిత్రహీనులు
  35. చిలకమ్మ చెప్పింది
  36. చిల్లరకొట్టు చిట్టెమ్మ
  37. చిరంజీవి రాంబాబు
  38. జరుగుతున్న కథ
  39. జన్మజన్మల బంధం
  40. జడ్జిగారి కోడలు
  41. జీవనతీరాలు
  42. జీవితనౌక
  43. జీవితంలో వసంతం
  44. జీవితమే ఒక నాటకం
  45. తల్లే చల్లని దైవం
  46. తల్లి లేని పిల్ల
  47. తరం మారింది
  48. తొలిరేయి గడిచింది
  49. శ్రీ తిరుపతిక్షేత్ర మహాత్మ్యం [2]
  50. దాన వీర శూర కర్ణ
  51. దొంగకు దొంగ
  52. దేవతలారా దీవించండి
  53. ధర్మాత్ముడు
  54. నేరం ఎవరిది? [3]
  55. పంచాయితీ
  56. పంతులమ్మ
  57. ప్రయాణంలో పదనిసలు
  58. ప్రేమలేఖలు
  59. ప్రేమించి పెళ్ళిచేసుకో
  60. బంగారక్క
  61. బంగారు బొమ్మలు
  62. భలే అల్లుడు
  63. భలే రాజు
  64. భద్రకాళి
  65. మనస్సాక్షి
  66. మా ఇద్దరి కథ
  67. మార్పు
  68. మంచిని పెంచాలి
  69. మంచి రోజు
  70. మొరటోడు
  71. యమగోల
  72. రాగద్వేషాలు [4]
  73. రాజా రమేష్
  74. రంభ ఊర్వశి మేనక
  75. సతీ సావిత్రి
  76. సావాసగాళ్లు
  77. సీత గీత దాటితే
  78. సీతారామ వనవాసం
  79. సూర్యచంద్రులు
  80. స్వర్గానికి నిచ్చెనలు
  81. స్నేహం

మూలాలు

[మార్చు]
  1. "Oka Thalli Katha (1977)". Indiancine.ma. Retrieved 2021-05-20.
  2. "Sri Thirupathi Kshetra Mahathyam (1978)". Indiancine.ma. Retrieved 2021-05-20.
  3. "Neram Evaridhi (1977)". Indiancine.ma. Retrieved 2021-05-20.
  4. "Raga Dweshalu (1977)". Indiancine.ma. Retrieved 2021-05-20.




తెలుగు సినిమాలు సినిమా
| | | | | | | | | | | | అం | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |