తెలుగు సినిమాలు 1976

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంతులేని కథ

ఈ యేడాది 65 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మహానటుడు అక్కినేని తనకు ప్రభుత్వం కేటాయించిన 14 ఎకరాల స్థలంలో అన్నపూర్ణ సినీస్టూడియోస్‌ను జనవరి 14న ఆరంభించారు. మరో మహానటుడు నందమూరి ముషీరాబాద్‌లోని తన సొంతస్థలం మూడున్నర ఎకరాలలో రామకృష్ణా సినీస్టూడియోస్‌ను జూన్‌ 7న ప్రారంభించారు. ఈ యేడాది భాస్కరచిత్ర 'ఆరాధన' సూపర్‌ హిట్‌గా నిలిచి రజతోత్సవం జరుపుకుంది. కె.బాలచందర్‌ విభిన్న శైలిలో రూపొందించిన 'అంతులేని కథ' కూడా సూపర్‌ హిట్‌ అయింది. "మనుషులంతా ఒక్కటే, నేరం నాదికాదు ఆకలిది, సెక్రటరీ, పాడిపంటలు, ఇద్దరూ ఇద్దరే, భక్త కన్నప్ప, సిరిసిరిమువ్వ" డైరెక్టుగా శతదినోత్సవం జరుపుకున్నాయి. అంతకు ముందు డైరెక్టుగా లేదా సింగిల్‌ షిఫ్టుతో మన చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. కాని ఇక్కడ నుండి ఎక్కువ షిప్టింగులతో శతదినోత్సవాలు జరుపుకోవడం మొదలయింది. ఆ విధంగా "అమెరికా అమ్మాయి, అల్లుడొచ్చాడు, జ్యోతి, తూర్పు-పడమర, నా పేరే భగవాన్‌, బంగారు మనిషి, భలే దొంగలు, మొనగాడు" శతదినోత్సవాలు జరుపుకున్నాయి. బాపు 'సీతాకళ్యాణం' ప్రజాదరణ పొందలేకపోయినా విమర్శకుల ప్రశంసలు పొందింది. కె.రాఘవేంద్రరావు, క్రాంతి కుమార్‌ కలయికలో రూపొందిన 'జ్యోతి' మంచి విజయం సాధించింది. జయప్రద, జయసుధ నటీమణులుగా ఈ యేడాది గుర్తింపు సంపాదించారు.


 1. అంతులేని కథ
 2. అల్లుడొచ్చాడు
 3. అమెరికా అమ్మాయి
 4. అత్తవారిల్లు
 5. ఆడవాళ్లు అపనిందలు
 6. ఆదిమానవులు
 7. ఆరాధన
 8. ఉత్తమురాలు
 9. ఊరుమ్మడి బ్రతుకులు
 10. ఒక అమ్మాయి కథ [1]
 11. ఒక దీపం వెలిగింది
 12. ఓ మనిషి తిరిగి చూడు
 13. కొల్లేటి కాపురం
 14. పాడవోయి భారతీయుడా
 15. బంగారుమనిషి
 16. భలేదొంగలు
 17. బ్రహ్మముడి [2]
 18. భక్త కన్నప్ప
 19. తల్లిమనసు [3]
 20. తూర్పు పడమర
 21. దశావతారాలు
 22. దేవుడిచ్చిన భర్త
 23. దేవుడే గెలిచాడు
 24. దేవుడు చేసిన బొమ్మలు
 25. దొరలు దొంగలు
 26. నాడు నేడు
 27. నా పేరే భగవాన్
 28. నేరం నాదికాదు ఆకలిది
 29. నిజం నిద్రపోదు
 30. పల్లెసీమ
 31. ప్రచండ వీరుడు
 32. పాడవోయి భారతీయుడా
 33. పిచ్చోడి పిళ్ళి
 34. పీటలమీద పెళ్ళి
 35. పెద్దన్నయ్య
 36. పెళ్ళి కాని పెళ్ళి
 37. పొగరుబోతు
 38. పొరుగింటి పుల్లకూర
 39. ప్రేమాయణం
 40. ప్రేమ బంధం
 41. మనిషి మృగము
 42. మనిషి మృగము
 43. మనుషులంతా ఒక్కటే
 44. మగాడు
 45. మహాత్ముడు
 46. మహాకవి క్షేత్రయ్య
 47. మహేశ్వరి మహత్యం [4]
 48. మనవడి కోసం
 49. మన ఊరి కథ
 50. మంచికి మరోపేరు
 51. మాదైవం
 52. మాయావి
 53. మాంగల్యానికి మరో ముడి
 54. ముద్దబంతి పువ్వు
 55. ముగ్గురు మూర్ఖులు
 56. ముత్యాల పల్లకి
 57. మొనగాడు
 58. మోసగాడు
 59. మోసగాళ్ళకు సవాల్
 60. యవ్వనం కాటేసింది
 61. రాధ
 62. రాజు వెడలె
 63. రామరాజ్యంలో రక్తపాతం
 64. రత్తాలు రాంబాబు
 65. వధూవరులు
 66. వింతఇల్లు సంతగోల
 67. వేములవాడ భీమకవి
 68. శీలానికి శిక్ష
 69. శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్
 70. శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం
 71. సంసారంలో సరిగమలు
 72. స్వామి ద్రోహులు
 73. సిరిసిరి మువ్వ
 74. సీతాకళ్యాణం
 75. సీతమ్మ సంతానం
 76. సుప్రభాతం
 77. సెక్రటరీ

మూలాలు[మార్చు]

 1. "Oka Ammayi Katha (1976)". Indiancine.ma. Retrieved 2021-05-20.
 2. "Brahma Mudi (1976)". Indiancine.ma. Retrieved 2021-05-20.
 3. "Thalli Manasu (1976)". Indiancine.ma. Retrieved 2021-05-20.
 4. "Maheswari Mahatyam (1976)". Indiancine.ma. Retrieved 2021-05-20.


తెలుగు సినిమాలు సినిమా
| | | | | | | | | | | | అం | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |