తెలుగు సినిమాలు 1944
స్వరూపం

1944లో ఏడు చిత్రాలు విడుదల అయ్యాయి. అక్కినేని నాగేశ్వరరావును హీరోగా పరిచయం చేస్తూ రూపొందిన శ్రీ సీతారామ జననం ప్రజాదరణ పొందింది. ఈ చిత్రంలో ఘంటసాల ఓ గ్రూప్ సాంగ్‌లో గళం కలిపి పరిచయమయ్యారు. సర్కస్ కింగ్ అనే చిత్రంతో ఆదుర్తి సుబ్బారావు పాటల రచయితగా పరిచయమయ్యారు.
విడుదలైన సినిమాలు
[మార్చు]- సర్కస్ కింగ్ : ఈ సినిమా 1944 జూన్ 23న విడుదలైంది. భరత్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందింది. [1]
- ఒక రోజు రాజు : ఒక రోజు రాజు 1944 సెప్టెంబరు 27న విడుదలైన తెలుగు సినిమా. పరచూర్ పతాకంపై ఆమంచర్ల గోపాలరావు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.
- సంసార నారది : శోభనాచల పిక్చర్స్ పతాకంపై మిర్జాపురం రాజా నిర్మించిన ఈ సినిమాకు చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వం వహించాడు.
- శ్రీ సీతారామ జననం ఈ చిత్రాన్ని ఘంటసాల బలరామయ్య స్వీయ దర్శకత్వంలో ప్రతిభా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, త్రిపురసుందరి, వేమూరి గగ్గయ్య, రుష్యేంద్రమణి ప్రధాన పాత్రలలో నటించారు. [2]
- తాహసీల్దార్ : దీనిని జగదీష్ పతాకంపై దర్శకుడు వై.వి.రావు నిర్మించాడు.
- భీష్మ : భీష్మ 1944 లో చిత్రపు నారాయణ మూర్తి దర్శకత్వంలో వచ్చిన ఒక తెలుగు సినిమా.[3]
- అనవసర ప్రయాణం : ఇన్‌ఫర్మేషన్ ఫిలింస్ ఆఫ్ ఇండియా పతాకం కింద ఎజ్రా మీర్ నిర్మించిన ఈ సినిమాకు ఎ.పి.సిన్హా దర్శకత్వం వహించాడు. ఇది "స్పేర్ ది వీల్" సినిమా తెలుగు వెర్షన్. యుద్ధ సమయంలో, "జాతీయ అవసరాలు ముందుండాలి. తప్పనిసరి అయినప్పుడు మాత్రమే ప్రయాణించండి." తెలుగు వెర్షన్ డబ్బింగ్ డైరెక్టర్ రామమూర్తి.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Circus King (1944)". Indiancine.ma. Retrieved 2021-05-19.
- ↑ The Hindu, Cinema (25 February 2012). "Blast From The Past: Sri Sita Rama Jananam (1944)" (in Indian English). M.L. Narasimham. Archived from the original on 2018-06-20. Retrieved 29 September 2020.
- ↑ "భీష్మ 1944 సినిమా". gomolo.com. Archived from the original on 3 జూన్ 2017. Retrieved 18 October 2016.
- ↑ "Anavasara Prayanam (1944)". Indiancine.ma. Retrieved 2025-07-16.
| తెలుగు సినిమాలు | |
|---|---|
| అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | | |