తెలుగు సినిమాలు 1954

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అగ్గిరాముడు

ఈ యేడాది తొలిసారిగా 30 చిత్రాలు విడుదలయ్యాయి. యన్టీఆర్‌ ఎనిమిది చిత్రాల్లోనూ, ఏయన్నార్‌ నాలుగు చిత్రాల్లోనూ, ఇద్దరూ కలసి ఒక చిత్రంలోనూ నటించారు. పక్షిరాజా వారి 'అగ్గిరాముడు' సూపర్‌హిట్టయి మాస్‌ చిత్రాల ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది, 'పెద్ద మనుషులు' కూడా ఘనవిజయం సాధించగా, 'సతీ సక్కుబాయి', 'సంఘం', 'వద్దంటే డబ్బు', 'రాజు-పేద' చిత్రాలు శతదినోత్సవం జరుపుకున్నాయి. కన్నడ నటుడు రాజ్‌కుమార్‌ తొలి చిత్రం 'కాళహస్తీశ్వర మహాత్మ్యం' (ద్విభాషా చిత్రం) కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. యన్‌.ఏ.టి. వారి 'తోడుదొంగలు' ప్రశంసలు పొందినా, పరాజయం చవిచూసింది. ఈ యేడాది నుండే ఉత్తమ చిత్రాలకు రాష్ట్రపతి బహుమతులు ప్రదానం చేయడం ఆరంభమైంది. 'పెద్ద మనుషులు' చిత్రానికి రజత పతకం లభించగా, 'తోడుదొంగలు', 'విప్రనారాయణ' చిత్రాలు మెరిట్‌ సర్టిఫికెట్స్‌ పొందాయి. కె.యస్‌. ప్రకాశరావు 'బాలానందం' పేరుతో "బూరెల మూకుడు, కొంటె కిష్టయ్య, రాజయోగం పేర్లతో మూడు భాగాల పిల్లల చిత్రం రూపొందించారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకునిగా, డి.వి.నరసరాజు రచయితగా ఈ యేడాదే పరిచయమయ్యారు.

డైరెక్ట్ సినిమాలు

[మార్చు]
  1. అంతా మనవాళ్లే
  2. అగ్గిరాముడు
  3. అన్నదాత
  4. అమరసందేశం
  5. ఇద్దరు పెళ్ళాలు
  6. కాళహస్తీ మహత్యం
  7. చక్రపాణి
  8. జాతకఫలం
  9. జ్యోతి
  10. తోడుదొంగలు
  11. నిరుపేదలు
  12. పరివర్తన
  13. పల్లె పడుచు
  14. పెద్దమనుషులు
  15. ప్రజారాజ్యం
  16. బంగారుపాప
  17. బంగారుభూమి
  18. బాలానందం
  19. మనోహర
  20. మనోహరం
  21. మాగోపి
  22. మేనరికం
  23. రాజుగురు
  24. రాజు పేద
  25. రాజీ నాప్రాణం
  26. వద్దంటే డబ్బు
  27. విప్రనారాయణ
  28. సతీ సక్కుబాయి
  29. సంఘం

డబ్బింగ్ సినిమాలు

[మార్చు]

లేవు


తెలుగు సినిమాలు సినిమా
| | | | | | | | | | | | అం | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |