తెలుగు సినిమాలు 1948
Jump to navigation
Jump to search
విడుదలైన చిత్రాలు
[మార్చు]విశేషాలు
[మార్చు]- ఈ సంవత్సరం ఎనిమిది చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
- ఈ యేడాదే కె.యస్.ప్రకాశరావు 'స్వతంత్ర ఫిలిమ్స్' స్థాపించి యల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో తీసిన ద్రోహి సుమారుగా ఆడింది.
- సి.పుల్లయ్య 'వింధ్యరాణి' ద్వారా పింగళి నాగేంద్రరావు రచయితగా పరిచయమయ్యారు.
- ప్రతిభావారి 'బాలరాజు' అఖండ విజయం సాధించింది. ఫిబ్రవరి 26న మొదటి బ్యాచ్లో 10 ప్రింట్లతో విడుదలైన ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదలైన
'చంద్రలేఖ' తమిళ చిత్రంతో కొన్ని కేంద్రాలలో షిప్టు చేయబడింది. ఏలూరు-గోపాలకృష్ణ, బెజవాడ - జైహింద్, గుంటూరు - సరస్వతి, రాజమండ్రి- కృష్ణా (మినర్వా నుండి కృష్ణాకు షిప్టు చేయబడి) వందరోజులు పూర్తి చేసుకుంది. కాగా జూన్ 4 నుండి 7 వరకు ఈ చిత్రం వందరోజులు పూర్తి చేసుకున్న కేంద్రాలలో వేడుకలు చేశారు. తెలుగు సినిమా రంగంలో 100 రోజుల వేడుకలు జరిపే సంప్రదాయానికి ఈ సినిమా శ్రీకారం చుట్టింది. అలాగే ఏలూరులో గోపాలకృష్ణ నుండి రామకృష్ణకు షిఫ్టు చేయబడి రజతోత్సవం పూర్తి చేసుకుంది. ఆగస్టు 16న రామకృష్ణ థియేటర్‌లో 25 వారాల వేడుక జరిగి, తెలుగులో తొలి రజతోత్సవ చిత్రంగా 'బాలరాజు' నిలిచింది.
- కాగా, ఇదే ఏడాది విడుదలైన 'చంద్రలేఖ' సంచలన విజయం సాధించింది. ఈ సినిమా తమిళనాటనే కాకుండా ఆంధ్రదేశంలో కూడా అఖండ విజయం సాధించి,
విజయవాడ- మారుతి, విజయనగరం - మినర్వాలో రజతోత్సవం జరుపుకొని తెలుగునాట సింగిల్ థియేటర్‌లో రజతోత్సవం జరుపుకున్న తొలి చిత్రంగా చరిత్ర సృష్టించింది.
తెలుగు సినిమాలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | |