Jump to content

తెలుగు సినిమాలు 1983

వికీపీడియా నుండి
అడవిసింహాలు

నటరత్న యన్‌.టి.రామారావు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి, చలనచిత్ర రంగం నుండి నిష్క్రమించారు. ఈ సంవత్సరం 104 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ 'ముందడుగు' అత్యధిక వసూళ్ళు సాధించి, రజతోత్సవం జరుపుకుంది. ఈతరం పిక్చర్స్‌ 'నేటి భారతం' కూడా సూపర్‌ హిట్టయి, ద్విశతదినోత్సవం జరుపుకొని, ఉదయం ఆటలతో స్వర్ణోత్సవం చేసుకుని టి.కృష్ణ శైలి సామాజిక చిత్రాలకు, విజయశాంతి హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలకు నాంది పలికింది. 'ఖైదీ' సంచలన విజయం సాధించి, అప్పటి యంగ్‌ హీరో చిరంజీవిని స్టార్‌గా నిలిపి, ఉదయం ఆటలతో స్వర్ణోత్సవం జరుపుకుంది. ఇంకా "అభిలాష, ఎమ్‌.ఎల్‌.ఎ. ఏడుకొండలు, కిరాయి కోటిగాడు, ధర్మాత్ముడు, పోరాటం, ప్రజారాజ్యం, బహుదూరపు బాటసారి, మగమహారాజు, మనిషికోచరిత్ర, రాముడు కాదు కృష్ణుడు, శక్తి, శ్రీరంగనీతులు, సాగరసంగమం, అడవి సింహాలు" శతదినోత్సవాలు జరుపుకోగా,"గూఢచారి నంబర్‌ వన్‌, చండశాసనుడు, మంత్రిగారి వియ్యంకుడు, పండంటి కాపురానికి 12 సూత్రాలు, పిచ్చిపంతులు, పెళ్ళిచూపులు, ముక్కుపుడక, మూడుముళ్ళు, రామరాజ్యంలో భీమరాజు, సంఘర్షణ" కూడా హిట్‌ చిత్రాలుగా నిలిచాయి. 'చండశాసనుడు'తో శారద ట్రాజెడీ బ్రాండ్‌ నుండి బయటకు వచ్చి దశాబ్దంపైగా సీరియస్‌ కేరెక్టర్స్‌ పోషించగలిగారు. 'ప్రేమసాగరం' డబ్బింగ్‌ సినిమా సంచలన విజయం సాధించి, ఉదయం ఆటలతో 450 రోజులు అనేక కేంద్రాలలో రిలీజ్‌ అయిన థియేటర్లలోనే ప్రదర్శితమైంది. అక్కడ నుండి తెలుగులోకి డబ్బింగ్‌ సినిమాల వెల్లువ ఆరంభమైంది. 'సాగరసంగమం' బెంగుళూరులో 511 రోజులు ఉదయం ఆటలతో ప్రదర్శితమైంది. ఈ యేడాది ఐదు డైరెక్టు శతదినోత్సవాలతో కృష్ణ కెరీర్‌లో రికార్డు నమోదు చేసింది.

  1. అక్కమొగుడు చెల్లెలి కాపురం
  2. అగ్నిజ్వాల
  3. అగ్నిసమాధి
  4. అడవి సింహాలు
  5. అభిలాష
  6. అమరజీవి
  7. అమాయక చక్రవర్తి
  8. అమాయకుడు కాదు అసాధ్యుడు
  9. ఆంధ్రకేసరి
  10. ఆడవాళ్ళే అలిగితే
  11. ఆనంద భైరవి
  12. ఆలయ శిఖరం
  13. ఇకనైనా మారండి
  14. ఇది పెళ్ళంటారా?
  15. ఇదికాదు ముగింపు
  16. ఇద్దరు కిలాడీలు
  17. ఈ దేశంలో ఒకరోజు
  18. ఈ పిల్లకు పెళ్ళవుతుందా
  19. ఊరంతా సంక్రాంతి
  20. ఎం.ఎల్.ఏ. ఏడుకొండలు
  21. కళ్యాణ వీణ
  22. కాంతయ్య - కనకయ్య
  23. కాలయముడు
  24. కిరాయి కోటిగాడు
  25. కీర్తి-కాంత-కనకం
  26. కుంకుమ తిలకం
  27. కొంటె కోడళ్ళు
  28. కోకిలమ్మ
  29. కోటికొక్కడు
  30. కోడలు కావాలి
  31. ఖైదీ
  32. గాజు బొమ్మలు
  33. గూఢచారి నెం. 1
  34. గ్రహణం విడిచింది
  35. చండశాసనుడు
  36. చండి-చాముండి [1]
  37. చండీరాణి
  38. చట్టానికి వేయి కళ్ళు
  39. చిలక జోస్యం
  40. డ్రైవర్ రాముడు
  41. తోడు-నీడ
  42. త్రివేణి సంగమం
  43. దుర్గాదేవి
  44. దేవి-శ్రీదేవి
  45. ధర్మపోరాటం
  46. ధర్మాత్ముడు
  47. నవోదయం
  48. నిజం చెబితే నేరమా
  49. నెలవంక
  50. నేటిభారతం
  51. పండంటి కాపురానికి 12 సూత్రాలు
  52. పల్లెటూరి పిడుగు
  53. పల్లెటూరి మొనగాడు
  54. పిచ్చిపంతులు
  55. పులిదెబ్బ
  56. పులి-బెబ్బులి
  57. పెళ్ళి చూపులు
  58. పెళ్ళిచేసి చూపిస్తాం
  59. పోరాటం
  60. పోలీసు వెంకటస్వామి
  61. ప్రజారాజ్యం
  62. ప్రజాశక్తి
  63. ప్రళయ గర్జన
  64. ప్రేమపిచ్చోళ్ళు
  65. బందిపోటు రుద్రమ్మ
  66. బలిదానం
  67. బహుదూరపు బాటసారి
  68. బెజవాడ బెబ్బులి
  69. బొబ్బిలి పులి
  70. భార్యాభర్తల సవాల్
  71. మంత్రిగారి వియ్యంకుడు
  72. మగమహారాజు
  73. మనిషికో చరిత్ర
  74. మరో మాయాబజార్
  75. మా ఇంటాయన కథ
  76. మాయగాడు
  77. మాయింటి ప్రేమాయణం
  78. మా ఇంటికి రండి
  79. ముందడుగు
  80. ముక్కుపుడక
  81. ముగ్గురమ్మాయిల మొగుడు
  82. ముద్దుల మొగుడు
  83. మూగవాని పగ
  84. మూడు ముళ్ళు
  85. మేఘ సందేశం
  86. రంగుల పులి
  87. రఘురాముడు
  88. రాకాసి లోయ
  89. రాజు-రాణి-జాకీ
  90. రాజ్‌కుమార్
  91. రామరాజ్యంలో భీమరాజు
  92. రాముడు కాదు కృష్ణుడు
  93. రుద్రకాళి
  94. రెండుజెళ్ళ సీత
  95. రోషగాడు
  96. లంకె బిందెలు
  97. విముక్తికోసం
  98. శక్తి
  99. శివుడు శివుడు శివుడు
  100. శుభముహూర్తం
  101. శ్రీదత్త దర్శనము
  102. శ్రీరంగనీతులు
  103. సంఘర్షణ
  104. సాగరసంగమం
  105. సింహం నవ్వింది
  106. సింహపురి సింహం
  107. సిరిపురం మొనగాడు
  108. స్వరాజ్యం

మూలాలు

[మార్చు]
  1. "Chandi Chamundi (1983)". Indiancine.ma. Retrieved 2021-05-21.


తెలుగు సినిమాలు సినిమా
| | | | | | | | | | | | అం | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |