అగ్నిజ్వాల
అగ్నిజ్వాల (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.సుబ్బారావు |
---|---|
తారాగణం | మోహన్ బాబు, కవిత |
నిర్మాణ సంస్థ | జి.వి.కె.కంబైన్స్ |
భాష | తెలుగు |
అగ్నిజ్వాల 1983లో విడుదలైన తెలుగు చలన చిత్రం.[1] జి.వి.కె. కంబైన్స్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రానిని బి.సుబ్బారావు దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, కవిత ప్రదాన తారాగణంగా నిర్మించిన చిత్రానికి చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[2]
నేపధ్యం
[మార్చు]ఈ చిత్ర దర్శకుడు బి.సుబ్బారావు ముందుగా స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని ఆ తర్వాత హీరోల కోసం అన్వేషించాడు. ఎవరు బావుంటారని రచయిత పరుచూరి గోపాలరావుని అడగ్గా చిరంజీవి, తమిళ నటుడు విజయ్‌కాంత్ పేర్లు చెప్పాడు. వాళ్లిద్దరు అన్నదమ్ములుగా కనిపిస్తే బావుంటుందని తన మనసులో మాట వినిపించాడు. దర్శకుడు సైతం దానికి అంగీకరించినా వివిధ కారణాల వల ఆ కాంబినేషన్ కుదరలేదు. దాంతో మోహన్ బాబు, నరేశ్ ఈ ప్రాజెక్టులో అడుగుపెట్టారు. సోదరుల అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం అందుకుంది.
తారాగణం
[మార్చు]- మంచు మోహన్ బాబు
- కవిత
- నరేష్
- ముచ్చర్ల అరుణ
- జయంతి
- అన్నపూర్ణ
- సత్యనారాయణ
- ప్రభాకరరెడ్డి
- గిరిబాబు
- అల్లు రామలింగయ్య
- త్యాగరాజు
- సుత్తి వీరభద్రరావు
- సుత్తివేలు
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: బోయిన సుబ్బారావు
- సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
- సంభాషణలు: సత్యానంద్
- ఛాయాగ్రహణం: దేవరాజ్
- నిర్మాత: జి.వి.కృష్ణారావు
- నిర్మాణ సంస్థ: జి.వి.కె కంబైన్స్
పాటలు
[మార్చు]- ఆరని అగ్నిజ్వాలను నేనే! ఆగని సంగరధాటిని నేనే![3] - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం -సంగీతం: సత్యం - రచన: శ్రీశ్రీ
- కొయ్ కోయ్ కోయ్ అరే కోయ్ సొరకాయ కోత కోయ్, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
- తమ్ముడు గంగపొంగి, రచన: ఆచార్య ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.
- మనసులో గుద్దులాట వయసులో ఎందుకంట, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- మీరు నాకు ఉదయము నేను మీకు హృదయము, రచన: ఆత్రేయ, గానం.పి సుశీల, బి.వసంత, రమణ.
మూలాలు
[మార్చు]- ↑ "1983 - RockingTelugu". sites.google.com. Archived from the original on 2020-10-19. Retrieved 2020-08-04.
- ↑ "Devi Kanyakumari (1983)". Indiancine.ma. Retrieved 2020-08-04.
- ↑ సరోజా శ్రీశ్రీ (సంకలనం) (2001). ఉక్కుపిడికిలి - అగ్ని జ్వాల శ్రీశ్రీ సినిమా పాటలు (1 ed.). విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్.
5.ఘంటసాల గాళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.