Jump to content

సిరిసిరిమువ్వ

వికీపీడియా నుండి
(సిరిసిరి మువ్వ నుండి దారిమార్పు చెందింది)
సిరిసిరిమువ్వ
(1976 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.విశ్వనాధ్
నిర్మాణం ఏడిద నాగేశ్వరరావు
తారాగణం చంద్రమోహన్ ,
జయప్రద,
సత్యనారాయణ,
దేవదాస్ కనకాల,
రమాప్రభ,
కవిత,
జె.వి. రమణమూర్తి,
సాక్షి రంగారావు
సంగీతం కె.వి.మహదేవన్
గీతరచన వేటూరి సుందరరామమూర్తి
సంభాషణలు జంధ్యాల
ఛాయాగ్రహణం వి.ఎస్.ఆర్. స్వామి
నిర్మాణ సంస్థ గీతా కృష్ణా కంబైన్స్
నిడివి 144 నిముషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఇది ఒక సంగీత నృత్య ప్రధానమైన సినిమా.సిరి సిరి మువ్వ 1976 లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో, గీతాకృష్ణ కంబైన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన చిత్రం. ఈ చిత్రంలో చంద్రమోహన్ , జయప్రద,సత్యనారాయణ, దేవదాస్ కనకాల, నటించగా , జంద్యాల సంభాషణలతో , వేటూరి సుందర రామమూర్తి పాటలతో, వీనులవిందైన కె వి మహదేవన్ సంగీతం చిత్రం విజయానికి ఎంతగానో తోడ్పడింది. ఈచిత్రం హిందీ లో సర్ గమ్ పేరుతో నిర్మించబడింది.

హైమ (జయప్రద) అనే పల్లెటూరి మూగ పిల్లకు నాట్యమంటే ఎనలేని మక్కువ. ఆమె సవతితల్లి (రమాప్రభ) హైమను చిన్నచూపు చూస్తుంది. తన స్వంత కూతురైన సావిత్రి (కవిత)ను నాట్యం నేర్పి హీరోయిన్ చేయాలని ఆమె కోరిక. సాంబయ్య (చంద్రమోహన్) అనే పేద అనాధయువకుడికి హైమ అంటే చాలా ఇష్టం. హైమను కొన్నిసార్లు సవతి బంధువుల దురాగతాలనుండి కాపాడుతాడు.

హైమ తండ్రి (సత్యనారాయణ) మరణించిన తరువాత సాంబయ్య హైమను పట్టణం తీసుకువెళతాడు. హైమ నర్తకిగా మంచిపేరు సంపాదించుకొంటుంది. ఆమె తన ప్రోగ్రాములను ఎరేంజి చేసే రాంబాబును పెళ్ళి చేసుకొంటే బాగుంటుందని సాంబయ్య కోరిక. కాని హైమ మనసులో సాంబయ్యపైనే ఇష్టం ఉంటుంది. ఒక సినిమాలో నటించి చెడ్డపేరు తెచ్చుకొన్న సావిత్రిని కూడా హైమ ఆదుకొంటుంది. చివరిలో హైమకు సాంబయ్యతో పెళ్ళవుతుంది.

పాటలు

[మార్చు]

ఈచిత్రం లోని పాటల రచయిత వేటూరి సుందర రామమూర్తి.

  • ఝుమ్మంది నాదం...సయ్యంది పాదం తనువూగింది ఈవేళ చెలరేగింది ఒక రాసలీల - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల.
  • అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  • గజ్జె ఘల్లుమంటుంటే గుండె ఝల్లుమంటుంది, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • మావూరి దేవుడమ్మా, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పట్టాభి
  • ఒడుపున్న పిలుపు ఒక చిన్న పిలుపు , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • రా దిగిరా దివినుండి భువికి దిగిరా , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • రారా స్వామి రారా... పిలిచాను ఎదుట నిలిచాను, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • గోదారల్లే వెన్నెల్లో గోదారల్లే , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

విశేషాలు

[మార్చు]

ఈ సినిమా హిందీలో "సర్‌గమ్" అనే పేరుతో పునర్నింమింపబడింది. హిందీలో కూడా కథానాయికగా జయప్రద నటించింది. రిషికపూర్ హీరోగా నటించాడు. విజయవంతమైన ఈ హిందీ సినిమాలో "డఫిలీవాలే డఫిలి బజా" అనే పాట పెద్ద హిట్. తరువాత జయప్రద హిందీ సినిమా రంగంలో నిలద్రొక్కుకోవడానికి ఈ సినిమా మార్గం సుగమం చేసింది.

పురస్కారాలు.

1977: ఉత్తమ గాయని , పి. సుశీల.

1977: ఉత్తమ ఎడిటర్ , కె.బాబురావు.

మూలాలు

[మార్చు]
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.