Jump to content

శేషభట్టరు సింగరాచార్యులు

వికీపీడియా నుండి

శేషభట్టరు సింగరాచార్యులు మహబూబ్ నగర్ జిల్లా లోని జటప్రోలు సంస్థానంలో ఆస్థానకవిగా ఉండేవాడు. సంస్థానపు ప్రభువు చిన మాధవరావు సింగరాచార్యులను ఆదరించారు. ఇతనికి గడియకు నూరు పద్యాలు చెప్పగల దిట్టని, రోజుకో గ్రంథం రాయగల సమర్థుడని పేరుంది. 'కేశవ విలాసం ' అను ప్రబంధం వీరి ప్రముఖ రచన[1]... చిన మాధవరావు కోరిక మేరకు వీరు 'శూద్ర ధర్మోత్పల ద్యోతినీస్మృతి కౌముది ' అను దీర్ఘ శీర్షిక కలిగిన మరో రచన చేశారు. ఈ గ్రంథం శ్రీరాయ మదనపాలుడు అదే పేరుతో రచించిన గీర్వాణ గ్రంథానికి వ్యాఖ్యాన రూప అనువాదం. శూద్రులకు గర్భధానాది సంస్కారాలు, పల్లెలా తోమాలి, ఎలా పడుకోవాలి మొదలగు అనేక విషయాలు ఇందులో వర్ణితాలు. కవి ఈ గ్రంథాన్ని జటప్రోలు సంస్థానపు ప్రభువైన చిన మాధవరావు తండ్రి నరసింగరావుకు అంకితమిచ్చాడు.

మూలాలు

[మార్చు]
  1. సమగ్ర ఆంధ్ర సాహిత్యం, 12 వ సంపుటం, కడపటిరాజుల యుగం, రచన: ఆరుద్ర, ఎమెస్కో, సికింద్రాబాద్,1968, పుట-29