Jump to content

శ్యామ్ సింగరాయ్

వికీపీడియా నుండి
శ్యామ్ సింగరాయ్
సినిమా పోస్టర్
దర్శకత్వంరాహుల్‌ సాంకృత్యన్‌
రచనజాంగా సత్యదేవ్‌
నిర్మాతవెంకట్‌ బోయనపల్లి
తారాగణంనాని
సాయి పల్లవి
కృతి శెట్టి
మడోన్నా సెబాస్టియన్
ఛాయాగ్రహణంసాను వర్గీస్
కూర్పునవీన్ నూలి
సంగీతంమిక్కీ జె. మేయర్
నిర్మాణ
సంస్థ
నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌
విడుదల తేదీ
2021 డిసెంబర్ 24
దేశంభారతదేశం
భాషతెలుగు

శ్యామ్‌ సింగరాయ్ కలకత్తా నేపథ్యంలో పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న తెలుగు సినిమా. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని హీరోగా, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్యామ్‌ సింగరాయ్‌ కి‌ రాహుల్‌ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి కథ సత్యదేవ్‌ జంగా, ఎడిటింగ్ నవీన్ నూలి, మిక్కీ జె. మేయర్ సంగీతమందిస్తున్నాడు.[1] శ్యామ్‌ సింగరాయ్‌ 2021 డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ దక్కించుకోగా 2022 జనవరి 21 నుంచి డిజిటల్ ప్రేక్షకులను అలరించనుంది.[2]

నటీనటులు

[మార్చు]

సినిమా షూటింగ్ ప్రారంభం

[మార్చు]

శ్యామ్ సింగరాయ్ సినిమా షూటింగ్ హైదరాబాదులో 2020, డిసెంబరు 10న ప్రారంభమైంది.[3] ఈ సినిమా పూజా కార్యక్రమాలతో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నాని తండ్రి గంటా రాంబాబు, డైరెక్టర్ అనిల్ రావిపూడి, శివ నిర్వాణ, వెంకీ కుడుముల, మేర్లపాక గాంధీ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. ముహూర్తపు షాట్‌‌కి నాని తండ్రి గంటా రాంబాబు క్లాప్ కొట్టగా.. యువ దర్శకులు శివ నిర్వాణ, వెంకీ కుడుముల స్క్రిప్ట్ అందించారు.[4]మొదటి షెడ్యూల్ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం కోసం కలకత్తా వీధుల్లో షూటింగ్ చేస్తున్నారు.[5]

రూ. 6.5 కోట్ల సెట్‌

[మార్చు]

ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు కోల్‌కతాలో జరగాల్సి ఉండగా, ఆర్ట్‌ డైరెక్టర్‌ అవినాశ్‌ కొల్లా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో పది ఎకరాల విస్తీర్ణంలో రూ.6.5 కోట్లతో ఈ సినిమాకు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ భారీ సెట్ నిర్మించారు. ఈ సెట్ లో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.[6]

పాటలు

[మార్చు]

పాటలను మిక్కీ జె. మేయర్ స్వరపరిచారు. ఆడియో హక్కులను సరిగమ తెలుగు వారు సొంతం చేసుకున్నారు .

No Title Lyricist Singers Length
1. రైజ్ అఫ్ శ్యామ్ కె.కృష్ణకాంత్‌ అనురాగ్ కులకర్ణి,  విశాల్ దద్లాని, సిజ్జి 3.53
2. ఎదో ఎదో కె.కృష్ణకాంత్‌ చైత్ర అంబడిపూడి 3.24
3. సిరివెన్నెల సిరివెన్నెల సీతారామశాస్త్రి అనురాగ్ కులకర్ణి 4.14
4. ప్రణవాలయ సిరివెన్నెల సీతారామశాస్త్రి అనురాగ్ కులకర్ణి 4.22
5. తార కె.కృష్ణకాంత్‌ కార్తీక్ 2.51

మూలాలు

[మార్చు]
  1. TV9 Telugu (25 October 2020). "Official: నాని 'శ్యామ్‌ సింగరాయ్‌'.. సాయి పల్లవి, కృతి శెట్టి ఫిక్స్‌ - Nani Shyam Singha Roy". Archived from the original on 20 April 2021. Retrieved 20 April 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. K, S. (2022-01-09). "Shyam Singha Roy OTT Release Date is Locked 21st Jan Netflix" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2022-01-10. Retrieved 2022-01-10.
  3. The New Indian Express (10 December 2020). "Nani's Shyam Singha Roy launched". Archived from the original on 20 April 2021. Retrieved 20 April 2021.
  4. Sakshi (23 March 2021). "గోదావరి తీరంలొ నాని సినిమా షూటింగ్‌". Archived from the original on 20 April 2021. Retrieved 20 April 2021.
  5. TV9 Telugu (15 February 2021). "Nani Movie : కలకత్తా వీధుల్లో నాని 'శ్యామ్‌ సింగరాయ్' టీమ్.. శరవేగంగా జరుగుతున్న షూటింగ్.. - Natural Star Nani Shyam Singha Roy Movie". Archived from the original on 20 April 2021. Retrieved 20 April 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Eenadu. "రూ. 6.5 కోట్ల సెట్‌లో.. 'శ్యామ్‌ సింగరాయ్‌' - massive set for shyam singha roy". Archived from the original on 20 April 2021. Retrieved 20 April 2021.