Jump to content

శ్రీ వెంకటేశ్వర మహత్యం

వికీపీడియా నుండి
(శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం నుండి దారిమార్పు చెందింది)

తన దర్శకత్వంలో సి.ఎస్.ఆర్., శాంతకుమారి లతో నిర్మితమై 1960లో విడుదలై విజయవంతమైన శ్రీవేంకటేశ్వర మహత్యం (బాలాజీ) చిత్రాన్ని పునర్నిర్మించారు పి.పుల్లయ్య.. తొలచిత్రం ఎంత సంచలనం సృష్టించందో ఈ చిత్రం కూడా అంత సంచలనం సృష్టించింది..

శ్రీ వెంకటేశ్వర మహత్యం
(1960 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.పుల్లయ్య
తారాగణం నందమూరి తారక రామారావు,
సావిత్రి,
ఎస్.వరలక్ష్మి
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
కళ ఎస్.వి.ఎస్. రామారావు
నిర్మాణ సంస్థ పద్మశ్రీ పిక్చర్స్
భాష తెలుగు

చిత్రకథ

[మార్చు]

లోక కల్యాణానికి సప్త ఋషులు చేస్తున్న యజ్ఞంలో ఆవిష్షును త్రిమూర్తులలో ఎవరికి సమర్ఫిస్తున్నారన్న నారదుని ప్రశ్నకు త్రిమూర్తులను పరీక్షించుటకు భృగు మహార్షి బయలు దేరతాడు. బ్రహ్మ, సరస్వతి వీణానాదంలో మైమరచి భృగును పట్టించుకోడు. భూలోకంలో బ్రహ్మకు పూజలు జరగవని శపించి కైలాసానికి వెళతాడు. అక్కడ శివుడు పార్వతితో తాండవంతో మునిగి భృగు రాకను గమనించడు.. శివునికి లింగ రూపంలోనే పూజలు జరుగు తాయని శపించి వైకంఠానికి వెళతాడు..లక్ష్మీదేవి పాదాలు వత్తుతూ ఉండగా నిదురలో ఉన్న శ్రీ మహావిష్ణువు భృగు రాక గమనించడు..భృగు కోపించి శ్రీమహావిష్ణువు వక్షస్ఠలము పై కాలితో తంతాడు.. శ్రీ మహా విష్ణువు లేచి భృగుని శాంతపరిచే నెపంతో పాద సంహానం చేస్తూ భృగు పాదంలో ఉన్న కంటిని వత్తుతాడు.. భృగుకు జ్ఞానోదయమవుతోంది.. తన నివాస స్థలాన్ని కాలితో తన్ని అవమానించాడని శ్రీమహాలక్ష్మి విష్ణువుపై అలుక వహించి భూలోకానికి వేళతుంది. శ్రీమహాలక్ష్మిని వెతుకుతూ శ్రీమహవిష్ణువు భూలోకానికి వచ్చి తపస్సులో నిమగ్నవుతాడు శ్రీమహావిష్ణువు.. శ్రీ మహా విష్ణువు ఆకలి తీర్చడానికి శివుడు, బ్రహ్మఆవు దూడలు కాగా శ్రీమహాలక్ష్మి గోప కాంత యై ఆ ఆవుదూడలను ఆ రాజ్యాన్ని ఏలుతున్న మహారాజుకు అమ్ముతుంది. ఆవు మంద నుండి వేరుపడి శ్రీ మహావిష్ణువు తపస్సు చేస్తున్న వల్మీకంపై పాలను వర్షిస్తుంది. ఆవ ు పాలను తక్కువగా ఇస్తూ ఉండడంతో ఆవును వెంటాడిన గోపాలకుడు ఆవును కొట్టబోగా ఆ దెబ్బ శ్రీమహావిష్ణువుకు తగులుతుంది. గోపాలుడు మరణిస్తాడు.. రాజును పిశాచిగా మారమని శపిస్తాడు..గాయపడిన మహావిష్ణువు సమీపంలో ఉన్న వకుళ మాతను చేరతాడు.. అతనిని శ్రీనివాసునిగా పిలుస్తూ అతనిపై పుత్ర వాత్సల్యం చూపుతుంది. వ్యాహళికి బయలుదేరిన శ్రీనివాసుడు, ఆకాశరాజు కుమార్తె పద్మావతిని చూసి ఆమెను వలిచి ఆ విషయాన్ని వకుళకు చెబుతాడు..వకుళ ఆకాశరాజను కలిసి వివాహానికి అతడిని అంగీకరింప చేస్తుంది. కుబేరుని ఆర్థిక సహాయంతో శ్రీనివాసుని వివాహం ఆకాశరాజు కుమార్తె పద్మావతితో జరుగుతుంది..ఈ విషయం తెలిసిన శ్రీమహాలక్ష్మి అచ్చటకు చేరుతుంది.. సపత్నుల కలహంతో శిలగా మారతాడు శ్రీనివాసుడు.. అతనితో సతులూ.. పిమ్మట బావాజీ వృత్తాంతం, శ్రీనివాసుని మహిమలు చూపే ఇతర కథలు చిత్రంలో పొందు పరిచారు.

విశేషాలు

[మార్చు]
  • రెండు సార్లు నిర్మితమైన చిత్రాలకు పి.పుల్లయ్య దర్శకత్వం వహించారు..
  • పి.పుల్లయ్య స్వంతంగా స్ధాపించిన పద్మశ్రీ పిక్చర్స్ తొలి చిత్రం.
  • ఈ చిత్ర విజయం లవకుశ సినిమా పునర్మిణానికి స్ఫూర్తి కలిగించింది.
  • 1939లో నిర్మితమైన చిత్రంలో పద్మావతిగా నటించిన శాంతికుమారి ఈ చిత్రంలో వకుళమాతగా నటించారు.
  • ఈ చిత్రం ప్రదర్శితమైన సినిమా హాళ్లలో వెంకటేశ్వరుని విగ్రహాలు ప్రతిష్ఠించి దేవాలయాలుగు విలసిల్లేయి.. ప్రేక్షకులు భక్తి భావంతో కానకలు సమర్పించేవారట.

నటవర్గం

[మార్చు]
నటులు పాత్రలు
నందమూరి తారక రామారావు శ్రీ మహా విష్ణువు శ్రీనివాసుడు
సావిత్రి పద్మావతి
ఎస్. వరలక్ష్మి శ్రీ మహాలక్ష్మి
గుమ్మడి వెంకటేశ్వరరావు భృగుమహార్షి
ఎ. వి. సుబ్బారావు ఆకాశరాజు
రమణారెడ్డి శరభ
సురభి బాలసరస్వతి శరభునిభార్య
నాగయ్య బావాజీ
శాంతకుమారి వకుళ
ఋష్యేంద్రమణి ధరణీదేవి
పి. సూరిబాబు నారద
ఎ. వి. సుబ్బారావు జూనియర్ బ్రహ్మ
సంధ్య సరస్వతీ దేవి
లంక సత్యం యాత్రికుడు
వెంపటి సత్యం మహాశివ
పేకేటి శివరాం శ్రీనివాసుని స్నేహితుడు
షావుకారు జానకి ఎఱుకల సాని
ఘంటసాల వెంకటేశ్వరరావు అతిధిపాత్రలో శేషశైలావాస పాటలో కనిపిస్తారు
ఆర్. నాగేశ్వరరావు
రేలంగి వెంకట్రామయ్య
వల్లూరి బాలకృష్ణ
వంగర వెంకట సుబ్బయ్య

పాటలు

[మార్చు]
పాట రచయిత సంగీతం గాయకులు
1.ఎవరో అతడెవరో ఆ నవమోహనుడెవరో నా మానస చోరుడెవరో ఆత్రేయ పెండ్యాల ఘంటసాల, పి.సుశీల
2.కలగా కమ్మని కలగా మన జీవితాలు మనవలెగా ఆత్రేయ పెండ్యాల ఘంటసాల, పి.సుశీల
3 వరాల బేరమయా వనరం బేరమయా ఆత్రేయ పెండ్యాల ఎస్. వరలక్ష్మి
4.శేష శైలావాస శ్రీ వేంకటేశా, శయనించు మా అయ్య శ్రీ విద్విలాసా ఆత్రేయ పెండ్యాల ఘంటసాల
5.శ్రీదేవిని నీదు దేవేరిని ఆరుద్ర పెండ్యాల ఎస్. వరలక్ష్మి
6.జయజయ జగన్నాయక మల్లాది పెండ్యాల బృందం

7.పావనం భయ్యేనయ్య. రచన : నారపరెడ్డి. పెండ్యాల. గానం.ఘంటసాల.(పద్యం)

8.చిలిపిచేస్టలతన్నిన.రచన : నారపరెడ్డి.పెండ్యాల. గానం.ఘంటసాల(పద్యం)

9.ఒంటివాడనేనుఉనికి . రచన :నారపరెడ్డి.పెండ్యాల. గానం..ఘంటసాల(పద్యం)


10.కళ్ళు తెరవరా నరుడా , పెండ్యాల, రచన, ఆత్రేయ, గానం . పి సూరిబాబు

11.ఈ శ్రీనివాసుడు ఏడుకొండలపైన కలియుగదైవమై(పద్యం), గానం.పి సూరిబాబు, రచన: నారపారెడ్డి

12.అన్యులేదుటన తన నాథుడు దైవముచేత(పద్యం), గానం.పి.సూరిబాబు , రచన: నారపారెడ్డి

13.ఈ నిరాదరణ భరించలేను స్వామి(పద్యం), గానం.ఎస్.వరలక్ష్మి , రచన: నారపారెడ్డి

14.ఎట్టి తపంబు చేయబడే ఎట్టి చరిత్రముల,(పద్యం), గానం.పి.సూరిబాబు ,

15.ఎన్నాళ్ళని నాకన్నులు కాయగా ఎదురు చూతురా గోపాలా , గానం.శాంతకుమారి , బృందం, రచన: ఆచార్యా ఆత్రేయ

16.కన్నుల కండకావరము గప్ప మదాంధుడినై (పద్యం), గానం.మాధవపెద్ది , రచన: నారపారెడ్డి

17.కలయే జీవితమన్న నీ పలుకే బ్రతుకు (పద్యం), గానం.పి సుశీల, రచన: నారపారెడ్డి

18.కళ్యాణ వైభవమీనాడే మన పద్మావతి, గానం.పి.లీల, జిక్కి, వైదేహి,మాధవపెద్ది బృందం , రచన: ఆత్రేయ

19.చిరు చిరు నగవుల చిలికే తండ్రి, గానం.శాంతకుమారి , స్వర్ణలత, బాల, రచన: ఆత్రేయ

20.చిలకో చిక్కావే ఈనాడు సింగార మొలుకుతూ, గానం.పిఠాపురం, స్వర్ణలత, బాల, రచన: ఆత్రేయ

21.చిన్నారి ఓ చిలుక విన్నావా ఇన్నాళ్ల కోరిక ఈడేరే , గానం.పి సుశీల , రచన: ఆత్రేయ

22 జయ జయ జగన్నాయకా జయ జయ , గానం.బృంద గీతం, గుమ్మడి మాటలు , రచన: మల్లాది

23. నమో నారాయణాయ నటభక్త లోకాయనమో,(పద్యం), గానం.మాధవపెద్ది, రచన: నారపారెడ్డి

24. నా కుటీరమందు నడయాడుచున్నట్లు మురళీ,(పద్యం), గానం.శాంతకుమారి , రచన: నారపరెడ్డి

25.పదవే పొదాము గౌరి పరమాత్ముని చూడు పదవే బంగారు , గానం.పిఠాపురంబృందం , రచన: ఆత్రేయ

26.పాహి హరే పరి పాహి హరే పాలయాo , గానం.మాధవపెద్ది , రచన: ఆత్రేయ

27.లక్ష్మీ నివాసా నిరవర్జ గుణైక సిందో(సుప్రభాతం), గానం.ఘంటసాల

28.వెళ్ళిరా మాతల్లి చల్లగా వెయ్యేళ్ళువర్ధిల్లు , గానం.పి.లీల, వైదేహి బృందం, రచన:ఆత్రేయ

29.వేగరారా ప్రభో వేగరారా వేడుకగా ఆడుకొన వేళాయరా, గానం.మాధవపెద్ది , రచన: ఆత్రేయ

30.జుమ జుమ జుం జుo జుo , గానం.పి.సుశీల , ఎస్.జానకి, వైదేహి బృందం, రచన: ఆచార్య ఆత్రేయ.

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]