షిర్క్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఇస్లామీయ అఖీదా వ్యాసాల క్రమం:
అఖీదాహ్


Mosque02.svg
ఐదు స్థంభాలు (సున్నీ)

షహాద - విశ్వాస ప్రకటన
నమాజ్ - ప్రార్థనలు
జకాత్ - దానధర్మాలు (పేదలకు దానాలు)
సౌమ్ - రంజాన్ మాసంలో ఉపవాసాలు
హజ్ - మక్కా పుణ్యయాత్ర

విశ్వాసాల ఆరు సూత్రాలు (సున్నీ ముస్లిం)

తౌహీద్ - ఏకేశ్వరోపాసన
ఇస్లామీయ ప్రవక్తలు
ఇస్లామీయ ధార్మిక గ్రంధాలు
మలాయిక
యౌమల్ ఖియామ
మగ్‌ఫిరత్ (మోక్షము)

ధార్మిక సూత్రాలు (పండ్రెండుగురు)

తౌహీద్ - ఏకేశ్వరోపాసన
అదాలత్ - న్యాయం
నబువ్వత్ - ప్రవక్త పీఠం
ఇమామా - నాయకత్వం
యౌమల్ ఖియామ

మతావలంబీకరణ (పండ్రెండు ఇమామ్‌లు)

నమాజ్ - ప్రార్థనలు
సౌమ్ - రంజాన్ నెల ఉపవాసాలు
హజ్ - మక్కా పుణ్యయాత్ర
జకాత్ - దానధర్మాలు
ఖుమ్‌ - ఐదవవంతు పన్ను
జిహాద్ - సంఘర్షణ
న్యాయ ఉత్తర్వులు
చెడును త్యజించడం
తవల్లా - అహ్లె బైత్ తో ప్రేమ
తబర్రా - అహ్లె బైత్ శత్రువులతో విభేదన

ఏడు స్తంభాలు (ఇస్మాయిలీ)

వలాయ - సంరక్షణ
తహారా - పరిశుద్ధత
నమాజ్ - ప్రార్థనలు
జకాత్ - ప్రక్షాళణ, దానధర్మాలు
సౌమ్ - రంజాన్ నెల ఉపవాసాలు
హజ్ - మక్కా తీర్థయాత్ర
జిహాద్ - సంఘర్షణ

ఇతరములు

ఖారిజీలు ఇస్లాం ఆరవ స్తంభం.

షిర్క్ (ఆంగ్లం : Shirk) (అరబ్బీ : شرك ), ఇస్లామీయ సాహిత్యంలో ప్రధానంగా ఉపయోగంలో ఉంది. ఇది అరబ్బీ పదజాలము.

పదవ్యుత్పత్తి[మార్చు]

షర్క్, షిర్క్, షరీక్, షిర్కత్, ఇష్తెరాక్, ఇష్తెరాకియ, ఇష్తెరాకియత్ మొదలగు పదాలకు మూలం ష-ర-క. దీని అర్థం భాగస్వామ్యం, మిళితం, కలపడం, కలవడం, పాల్గొనడం వగైరాలు.

షిర్క్ బిఇల్లా (شرك بالله) అనగా, తౌహీద్ అనే పదానికి వ్యతిరేకార్థము గలది. దీనికి మూలార్థం, అల్లాహ్ ఉనికిలో ఇతరులను 'భాగస్వామ్యం'చేయడం, 'కలపడం' లేదా 'చేర్చడం'. ఇదే పదాన్ని ఇస్లామీయ ధార్మిక సాహిత్యంలో ఉపయోగించినపుడు, ఏకేశ్వరుడి (అల్లాహ్) లో ఇతరులను భాగస్వాములు చేయడం. స్థూలంగా బహుదేవతారాధన చేయడం, ఏకేశ్వరుణ్ణి తిరస్కరించడం. ఏకేశ్వరుడిపై సంపూర్ణంగా విశ్వాసం ఉంచడం తౌహీద్ అని, తమ ఆరాధనా మార్గాలలో ఏకేశ్వరుణ్ణి (అల్లాహ్) తప్పించి ఇతరులను శెరణుజొచ్చుటయే ఈ "షిర్క్". షిర్క్ ను ఆచరించేవారిని 'ముష్రిక్'లు అని వ్యవహరిస్తారు.[1]

ఇతర వాడుకలు[మార్చు]

అలాగే ఈ పదాన్ని ఇతర వాడుకలకు ఉపయోగించిన, ఉదాహరణకు 'సామ్యవాదానికి' అరబ్బీ, పర్షియన్ మరియు ఉర్దూభాషలలో 'ఇష్తెరాకియ' అంటారు. అనగా ప్రభుత్వంలో ప్రజలను షిర్క్ లేద్ షరీక్ (భాగస్వామ్యులు) చెయ్యడం.

షిర్క్ కు ఉదాహరణలు[మార్చు]

  • ఏకేశ్వరవాదన పట్ల బలహీన విశ్వాసం
  • బహుదేవతారాధన
  • తమ అవసరాలను బట్టి, వ్యక్తిగత లేదా సామూహిక విశ్వాసానుసారం (ఇష్ట్రానుసారం) అనేక దేవతలకు ఉపాసించడం.

ముస్లింలలో షిర్క్[మార్చు]

స్థూలంగా ముస్లింలు ఏకేశ్వరోపాసకులైనా, కొన్ని సమూహాలు, ఈశ్వరుడి (అల్లాహ్) తో పాటు ఇతరులకూ శరణుజొచ్చుతారు. ఉదాహరణకు, ముస్లింలు దర్గాలకు సందర్శించి ఔలియాలతో నోములు, శరణుకోరటాలు, విద్యాబుద్ధులు, ఉపాధి, సంతానం, వివాహం మొదలగు విషయాల పట్ల తమ కోరికలు ప్రకటించి వాటిని పూర్తి చేయండని ప్రార్థనలు చేయడం మరియు వేడుకోలు చేసుకోవడం. అలాగే, పంజాకు (పీర్లకు), జెండాలకు, జెండామానులకు, జిన్నులకు, పాములకు (జిన్నులుగా భావించి), పాముల పుట్టలకు, ఔలియా నషానులకు ఫాతెహాలు చదువుతారు, నోములు నోచుతారు, ప్రార్థనలు చేస్తారు. ఇస్లాం విశ్వాసాల ప్రకారం ఇది బిద్ అత్ మరియు షిర్క్ లు. ఈ విషయాలన్నీ అంధవిశ్వాసాలు, అంధ-శ్రద్ధల కోవలోకి వస్తాయి. కాబట్టి నిషేధితాలు.

హిందువులలో షిర్క్[మార్చు]

హిందూమత విశ్వాసాలలోనూ ఏకేశ్వరోపాసన మూలమైనా, అనేక సిద్ధాంతాలు ప్రకటింపబడి బహుదేవతారాధన (షిర్క్) ఆచరణలో ఉంది.

క్రైస్తవులలో షిర్క్[మార్చు]

సెమిటిక్, ఆదం, ఇబ్రాహీం మతపరంపరలో ఒక మతమైన క్రైస్తవంలోనూ, యెహోవా, ఏసుక్రీస్తు, మరియ (మేరీ, మరియం), పరిశుద్ధాత్మ మొదలగు వారికి కొలుస్తారు. ఉదాహరణకు కేథలిక్ క్రైస్త్రవంలో మేరీ విగ్రహాలకు పూజిస్తారు.

ఇవీ చూడండి[మార్చు]


మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=షిర్క్&oldid=2193403" నుండి వెలికితీశారు