సదాశివ్ షిండే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సదాశివ్ షిండే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సదాశివ్ గణపత్‌రావ్ షిండే
పుట్టిన తేదీ(1923-08-18)1923 ఆగస్టు 18
బొంబాయి, బాంబే ప్రెసిడెన్సీ, బ్రిటిషు భారతదేశం
మరణించిన తేదీ1955 జూన్ 22(1955-06-22) (వయసు 31)
బొంబాయి
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుLegbreak googly
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 33)1946 జూన్ 22 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1952 జూన్ 19 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 7 79
చేసిన పరుగులు 85 871
బ్యాటింగు సగటు 14.16 14.04
100లు/50లు 0/0 0/1
అత్యధిక స్కోరు 14 50*
వేసిన బంతులు 1,515 14,961
వికెట్లు 12 230
బౌలింగు సగటు 59.75 32.59
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 12
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 6/91 8/162
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 16/–
మూలం: CricInfo, 2022 నవంబరు 20

సదాశివ గణపత్రావు "సాదు" షిండే (1923 ఆగస్టు 18 - 1955 జూన్ 22) 1946 నుండి 1952 వరకు ఏడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన భారతీయ క్రికెట్ ఆటగాడు. అతని కుమార్తె, ప్రతిభా పవార్, రాజకీయ నాయకుడు శరద్ పవార్ భార్య.

క్రికెట్ కెరీర్

[మార్చు]

లెగ్-స్పిన్నరైన షిండే[1] లెగ్ బ్రేక్, సాంప్రదాయ గూగ్లీలే కాకుండా, వేరే గూగ్లీని కూడా బౌలింగ్ చేయగలడు. సుజిత్ ముఖర్జీ ప్రకారం, "మామూలుగా వేసే మణికట్టుతో తిప్పే బంతి తరువాత వచ్చే ఈ బంతి ఎప్పుడూ ఆశ్చర్యాన్ని కలిగించేది. మూడవ వేలును బంతి పైన పెట్టి తిప్పి స్పిన్ చేసే ఈ బంతి, పిచ్ నుండి ఊహించని విధంగా వేగంగా లేచేది. షార్ట్ పిచ్‌లో వేస్తే దాని రహస్యం తెలిసిపోతుంది గానీ, సరిగ్గా పిచ్ చేస్తే, దాన్ని ఆడడం దాదాపు అసాధ్యం." [1]

1943-44లో బాంబేపై మహారాష్ట్ర తరపున 75.5 ఓవర్లలో 186 పరుగులకు 5 వికెట్లు తీయడం ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో షిండే మొదటి ప్రదర్శన. ఆ మ్యాచ్‌లో విజయ్ మర్చంట్ బాంబే తరపున 359 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. [2] షిండే 1946లో భారత జట్టుతో కలిసి ఇంగ్లండ్‌లో పర్యటించాడు. టూర్ మ్యాచ్‌లలో 39 వికెట్లు పడగొట్టాడు. లార్డ్స్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో మాత్రమే కనిపించిన షిండే, రుసీ మోడీతో కలిసి చివరి వికెట్‌కు 43 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. కానీ బంతితో సాధించినది తక్కువే.[3] ఆ తర్వాత ఐదేళ్లలో అతను మరొక్క టెస్టు మాత్రమే ఆడాడు.

1951–52లో ఇంగ్లండ్‌పై ఢిల్లీలో జరిగిన టెస్టుల్లో అతని ఒక పెద్ద విజయం లభించింది. సిరీస్‌లో మొదటి రోజు లంచ్‌కు ముందు మూడో మార్పుగా అతడు బౌలింగ్‌లోకి వచ్చాడు. భోజనం చేసిన వెంటనే అతను గూగ్లీతో డాన్ కెన్యాన్ మిడిల్ స్టంప్‌ను బౌల్డ్ చేసాడు. జాక్ రాబర్ట్‌సన్ ఎల్‌బిడబ్ల్యు, డొనాల్డ్ కార్‌కు లెగ్ బ్రేక్‌ వేసి, వికెట్ కీపర్ నానా జోషికి క్యాచ్ ఇప్పించాడు. ఈ సమయంలో అతను 8-2-16-3తో ఉన్నాడు. టీ తర్వాత అతను మరో మూడు వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్ ముగింపుకు ఐదు నిమిషాల ముందు 203 పరుగులకే ఆలౌట్ అయింది. షిండే గణాంకాలు 6/91. భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను ఔట్ చేయడానికి రెండు రోజుల సమయం ఉంది. కానీ షిండే తన బౌలింగ్‌లో వికెట్‌ పొందే అవకాశాలు ఏడింటిని కోల్పోయాడు.[1] మరీ ముఖ్యంగా జోషి, దత్తాజీరావు గైక్వాడ్ల చేతుల్లో. ఇంగ్లాండ్ ఆ మ్యాచ్‌ను కాపాడుకోగలిగింది. షిండే స్వయంగా ఒక రనౌట్‌ చేసే అవకాశాన్ని జారవిడుచుకున్నాడు.[4]

షిండే 1952లో ఇంగ్లండ్‌కు జట్టులో చోటు సంపాదించాడు (బహుశా సుభాష్ గుప్తే స్థానంలో). అతను టూర్ మ్యాచ్‌లలో 39 వికెట్లు తీశాడు, అయితే లీడ్స్‌లో పీటర్ మే వికెట్టు టెస్టుల్లో అతని చివరి వికెట్.


కనీసం పది ఇన్నింగ్స్‌లు ఆడిన టెస్ట్ క్రికెటర్లలో, వారు చేసిన అత్యధిక స్కోరును మించి, బ్యాటింగ్ సగటు ఉన్న ఇద్దరిలో షిండే ఒకరు. [5] మరొకరు పాకిస్థాన్ ఆటగాడు అంటావో డిసౌజా. [5]

రంజీ ట్రోఫీలో మహారాష్ట్ర, బాంబే, బరోడాలకు ప్రాతినిధ్యం వహించిన షిండే, ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 230 వికెట్లు పడగొట్టాడు. అతని అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 1950-51లో రంజీ ట్రోఫీలో గుజరాత్‌పై బాంబే తరఫున 162 పరుగులకు 8 వికెట్లు. అయితే ఆ మ్యాచ్‌ను గుజరాత్, ఇన్నింగ్స్ 166 పరుగులతో గెలిచుకుంది. [6]

షిండే [7] సంవత్సరాల వయస్సులో టైఫాయిడ్‌తో మరణించాడు. షిండే రాజకీయ నాయకుడు, BCCI మాజీ అధ్యక్షుడూ అయిన శరద్ పవార్‌కు మామ.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Sujit Mukherjee, Playing for India, Orient Longman, 1988, pp. 217–219
  2. "Bombay v Maharashtra 1943-44". Cricinfo. Retrieved 27 June 2023.
  3. "1st Test, Lord's, June 22 - 25, 1946, India tour of England". Cricinfo. Retrieved 27 June 2023.
  4. "1st Test, Delhi, November 02 - 07, 1951, England tour of India". Cricinfo. Retrieved 27 June 2023.
  5. 5.0 5.1 Frindall, Bill (2009). Ask Bearders. BBC Books. pp. 91–92. ISBN 978-1-84607-880-4.
  6. "Gujarat v Bombay 1950-51". CricketArchive. Retrieved 27 June 2023.
  7. Christopher Martin-Jenkins, The Complete Who's Who of Test Cricketers