సిరిచందన పట్టు
సిరిచందన పట్టు | |
---|---|
ప్రాంతం | సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ |
దేశం | భారతదేశం |
సిరిచందన పట్టు అనేది తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్లలో తయారుచేసిన పట్టుచీర. ప్రకృతి సిద్ధమైన రంగులు, 27 సుగంధ ద్రవ్యాలు, పూర్తిపట్టుతో నాలుగురోజులు శ్రమించి నల్ల విజయ్ అనే చేనేత కళాకారుడు తొలిసారిగా ఈ పట్టుచీరను రూపొందించాడు.[1]
నేపథ్యం
[మార్చు]నల్ల విజయ్ గతంలో అగ్గిపెట్టెలో పట్టే చీర, శాలువ.. ఉంగరం, దబ్బడంలో దూరే చీరను తయారుచేసి రికార్డు సృష్టించాడు. నూలుతోపాటు సుగంధ ద్రవ్యాలైన శ్రీగంధం, నాగకేసరాలు, బిల్వగుజ్జు, పాలసుగంధి, జాపత్రి, జాజికాయ, ఇలాచి, జటామాంసి, బావంచాలు, పచ్చ కర్పూరం, కుంకుమ పువ్వు, కోషం, తుంగదుంపలు, గంధం, కచోరాలు, ఎర్రచందనం, కస్తూరి పసుపు, బట్టివేళ్లు, జవ్వాజి, కురువేళ్లు, దేవదారు, వస, గులాబీ రెక్కలు, సంపంగి, విరజాజి, కృష్ణతులసి, తాలిసపత్రి తదితర వాటితో ఉడకబెట్టి ఈ చీరను తయారుచేశాడు. ఉతికినప్పటికీ దీని సువాసనలు ఏడాదిపాటు ఉంటాయి.[2][3]
ఆవిష్కరణ
[మార్చు]హైదరాబాదులోని ప్రగతిభవన్ లో 2022, అక్టోబరు 8న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక, చేనేత, జౌళి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, వైద్యారోగ్యశాఖ మంత్రి టి. హరీశ్‌రావులు ఈ చీరను ఆవిష్కరించారు. విజయ్ విజ్ఞప్తిమేరకు ఈ చీరకు ‘సిరిచందన’ పట్టుగా నామకరణం చేశారు.[4] ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్. రమణ, పవర్ లూం-టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్,తెలంగాణ రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, సినీనటుడు రోషం బాలు తదితరులు పాల్గొన్నారు. 5.50 మీటర్ల పాడవు, 450 గ్రాముల బరువుండే ఈ సిరిచందన పట్టుచీర ధర 12 వేలు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "'సిరిచందన' సౌగంధం". EENADU. 2022-10-09. Archived from the original on 2022-10-30. Retrieved 2022-10-30.
- ↑ telugu, NT News (2022-10-09). "సిరి చందన పట్టు.. సువాసన అదిరేట్టు". Namasthe Telangana. Archived from the original on 2022-10-09. Retrieved 2022-10-30.
- ↑ "మామూలు చీర కాదు.. సిరి చందన పట్టు చీర.. ధర ఎంతంటే!". Sakshi. 2022-10-17. Archived from the original on 2022-10-17. Retrieved 2022-10-30.
- ↑ "సుగంధాల 'సిరిచందన పట్టు'చీర". Sakshi. 2022-10-09. Archived from the original on 2022-10-08. Retrieved 2022-10-30.
- ↑ ABN (2022-10-09). "సుగంధ పరిమళాల 'సిరిచందన పట్టు'". Andhrajyothy Telugu News. Archived from the original on 2022-10-30. Retrieved 2022-10-30.