సీమ్‍ వెల్డింగు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సీమ్ వెల్డింగు (seam welding) అను ప్రక్రియ లేదా విధానం లోహంలను అతుకు పద్ధతి.స్పాట్ వెల్డింగు, బట్ వెల్డింగువలనే ఇదికూడా లోహంల విద్యుత్తు వాహక నిరోధక గుణాన్ని ఉపయోగించి, అతుకవలసిన లోహం అంచు లేదా చివరను అతుకు వెల్డింగు పద్ధతి. అయితే స్పాట్ వెల్డింగు పద్ధతిలో అతుకవలసిన లోహ పలకలను ఒకదానిమీద ఒకటి వుంచి, ఒక ప్రత్యేకమైన చిన్నప్రదేశంలో విద్యుత్తును ప్రవహింపచేసి, లోహంయొక్క వాహకనిరోధకత కారణంగా అంచుల వద్ద ఏర్పడిన వేడిని ఉపయోగించి చిన్నచుక్కవలె ఒక నిర్ధిష్ట ప్రాంతంలో అతకడం జరుగుతుంది.ఇందులో విద్యుత్తును ప్రవహింపచేయు ఎలక్ట్రోడులు టంగ్‌స్టన్ నిర్మితమై, ఎలక్ట్రోడుల అంచులు సూచిగా, శంకువు ఆకారంలో వుండి చిన్నస్తుపాకార దిమ్మల వలెవుండును.దిగువ ఎలక్ట్రోడు స్థిరంగావుండగా పై ఎలక్ట్రోడుకదిలే అమరికకలిగివుండి, ఒకలివరు సహాయంన అతుకులోహ పలకలపై బలంగా నొక్కి, విద్యుత్తును ప్రవహింపచేసి అతికించడం జరుగుతుంది.వెల్డింగు రెండు లోహపలకల లోపలి భాగాన ఒకచిన్న చుక్క (spot) వలె ఏర్పడును.బట్ వెల్డింగు పద్ధతిలో ప్రత్యేకంగా వెల్డింగు ఎలక్ట్రోడులు వుండవు.అతుకబడు లోహాలే ఎలక్ట్రోడులుగా పనిచేయును.

సీమ్‌ వెల్డింగు నిర్వచనం[మార్చు]

సీమ్ వెల్డింగు పద్ధతిలో ఎలక్ట్రోడులు చిన్నవృత్తాకార చక్రంవలెవుండును.ఇందులో క్రింద చక్రం ఒక స్థిరమైన యంత్రభాగానికి అమర్చబడి వుండగా, పై ఎలక్ట్రోడు చక్రం పైకి, క్రిందకు ఒక లివరు సహాయంన జరుపు అమరిక కలిగి వుండును.ఈ విధానంలో కూడా అతుకవలసిన లోహ పలకలు ఒకదానిమీద ఒకటి వుంచినను, అతుకు మాత్రం చిన్న చిక్కవలె కాకుండా పలకపొడవున ఏర్పడును[1].ఈ విధానంలో ఎలక్ట్రోదులకు ఇరువైపుల సన్నని గొట్టలుండి, అతుకు ప్రక్రియ ముగిసిన వెంటనే, గొట్టాలద్వారా నీటిని చిమ్మి, వెల్డింగు అయ్యిన భాగాన్ని చల్లార్చెదరు[2] .ఈ విధానంలో ఎలక్ట్రోడులకు పంపిణీ చెయ్యు విద్యుత్తు వెల్డింగు జరుగునప్పుడు నిరంతరం (continuous) గా కాకుండా చిన్న విరామంతో (intermittent) అనగా ఆపి, ఆపి ప్రవహింపచేయుదురు.విద్యుత్తు విరామ సమయం తక్కువగా వుంచి అతికినచో దానిని కుట్టు (stitch) అతుకు అనియు[3], విద్యుత్తు ప్రవాహంలో ఎక్కువ విరామం ఇచ్చి వెల్డింగు చేసిన ఆ అతుకును రోల్ స్పాట్ వెల్డింగు అనియు అంటారు.

సీమ్ వెల్డింగు యంత్రం/పరికరం[మార్చు]

సీమ్‌ వెల్డింగు చెయ్యు యంత్రపరికరం స్పాట్ వెల్డింగు చెయ్యు వెల్డింగు యంత్రం వంటిదే.సీమ్‌ వెల్డింగు యంత్రంలో అతుకు ఎలక్ట్రోడులు తిరిగే డిస్కు (disc) అకారంలో వుండగా, స్పాట్ వెల్డింగు పరికరంలో క్రింది భాగం శంకువు లా వున్న స్తూపాకారం.సీమ్‌ వెల్డింగు పరికరానికి సాధారణంగా ఏకదశ/ సింగిల్ ఫేజ్ (single phase) కలిగినఎ.సి./A.C/వికల్ప విద్యుత్తును ఉపయోగిస్తారు.కొన్ని పర్యాయాలు మూడు దశల విద్యుత్తును వాడెదరు.తక్కువ వోల్టేజి (voltage) ఎక్కువ కరెంటు/ఆంఫియర్లు వున్న విద్యుత్తును వెల్డింగు చేయుటకు ఉపయోగిస్తారు.సీమ్‌ వెల్డింగు యంత్రాలలో కూడా రకరకాలైన ఉత్పత్తులున్నాయి.వ్యక్తి పర్యవేక్షణలో పనిచేయు వెల్డింగు యంత్రాలు.మానవ పర్యవేక్షణ అవసరం లేని స్వయం చలిత యంత్రాలు (automatic, కంప్యూటరు విజ్ఞానం వినియోగించుకొనే (PLC) యంత్రాలు ఉపయోగంలో ఉన్నాయి.

ఇవికూడా చూడండి[మార్చు]

  1. వెల్డింగు

బయటి లింకులు[మార్చు]

  1. [1] సీమ్‌ వెల్డింగు చిత్రాలు
  2. [2] సీమ్‌ వెల్డింగ్

సూచికలు[మార్చు]

  1. "seam welding". esab.com. http://www.esab.com/gb/en/education/processes-seam-welding.cfm. Retrieved 1-3-2014. 
  2. "Seam Welding". primetals.com. http://primetals.com/index.php?option=com_content&view=article&id=35&Itemid=34. Retrieved 2-3-2014. 
  3. "Resistance Seam Welding". mechanicalengineeringblog.com. http://www.mechanicalengineeringblog.com/tag/resistance-seam-welding-parameters/. Retrieved 2-3-2014.