సుమిత్ర మహాజన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుమిత్ర మహాజన్
సుమిత్ర మహాజన్


పదవీ కాలం
6 జూన్ 2014 - 17 జూన్ 19
ముందు మీరా కుమార్
నియోజకవర్గం ఇండోర్

వ్యక్తిగత వివరాలు

జననం (1943-04-12) 1943 ఏప్రిల్ 12 (వయసు 81)
చిప్లున్, రత్నగిరి జిల్లా
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి జయంత్ మహాజన్
సంతానం 2 కుమారులు
నివాసం ఇండోర్, మధ్యప్రదేశ్
6 జూన్, 2014నాటికి

శ్రీమతి సుమిత్రా మహాజన్ లోక్‌సభ స్పీకర్ పదవిని నిర్వహిస్తున్న రెండో మహిళ. సుమిత్ర మహాజన్ మధ్యప్రదేశ్ లోని ఇండోర్ పార్లమెంటరీ నియోజిక వర్గం నుండి భారతీయ జనతా పార్టీ తరుపున గెలిచారు. మధ్యప్రదేశ్ నుంచి సుమిత్రా మహాజన్ ఇప్పటికి ఎనిమిదిసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. మహారాష్ట్రలో జన్మించిన ఆమెను పలువురు తాయి (పెద్దక్క) అని పిలుస్తుంటారు. మదుభాషిణి అయిన ఆమె క్రమశిక్షణతో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆమె రాటుదేలారు.[1]ఆమెకు భారత ప్రభుత్వం 2022 లో పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.

బాల్యం

[మార్చు]

శ్రీమతి సుమిత్ర మహాజన్ తల్లి దండ్రులు శ్రీ పురుషోత్తం నీలకాంథ్ సాథే, శ్రీమతి ఉషా. వీరు 12 ఏప్రిల్, 1942 లో మహారాష్ట్రలోని చిప్లన్ జిల్లా... రత్న గిరిలో జన్మించారు.

చదువు

[మార్చు]

వీరు మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ విశ్వ విద్యాలయంలో ఎం.ఎ. ఎల్.ఎల్.బి చదివి న్యాయవాద వృత్తొ చేసారు.

కుటుంబం

[మార్చు]

వీరు 29 జనవశ్రీ 1965 లో శ్రీ జయంత్ మహాజన్ గారిని పెండ్లాడారు. వీరికి ఇద్దరు కుమారులు.

రాజకీయ ప్రస్థానం

[మార్చు]

శ్రీమతి సుమిత్ర మహాజన్ 1982 - 85 లో ఇండోర్ మునిసిపల్ కార్పోరేటర్ గా పనిచేసారు. 1984-85 లో ఇండోర్ మునిసిపల్ కార్పోరేషన్ కు డిప్యూటి మేయర్ గా పనిచేసారు. 1991 లో భారతీయ జనతా పార్టీ తరుపున ఇండోర్ నియోజకవర్గం] నుండి ఎన్నికై 10వ లోక్‌సభలో కూర్చున్నారు. వీరు 1992-94 లో మధ్య ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వైస్ ప్రెశిడెంటగా ఉన్నారు. 1996లో భారతీయ జనతా పార్టీ తరుపున 11వ లోక్‌సభకు తిరిగి ఎన్నికైనారు. 1999 లో 13వ లోక్‌సభకు కూడా మరళా గెలిచారు. 1999 నుండి 2002 వరకు కేంద్ర మంత్రిగాను పనిచేశారు. 2009 లో జరిగిన ఎన్నికల్లో వరుసగా 7వ సారి భారతీయ జనతా పార్టీ తరుపున గెలిచి లోక్‌సభ సభ్యులయ్యారు.

మూలాలు

[మార్చు]
  1. "స్పీకర్‌గా తాయి". namasthetelangaana.com/. namasthetelangaana. 6 June 2014. Archived from the original on 9 జూన్ 2014. Retrieved 6 June 2014.

ఇతర లింకులు

[మార్చు]

వనరులు

[మార్చు]