Jump to content

మనోహర్ జోషి

వికీపీడియా నుండి
మనోహర్ జోషి
మనోహర్ జోషి


పదవీ కాలం
14 March 1995 – 31 January 1999
గవర్నరు P. C. Alexander
డిప్యూటీ Gopinath Munde
ముందు శరద్ పవార్
తరువాత నారాయణ్ రాణే

పదవీ కాలం
10 మే 2002 – 2 ఆగస్టు 2004
డిప్యూటీ పీఎం సయీద్
ముందు జి.ఎం.సి.బాలయోగి
తరువాత సోమనాథ్ ఛటర్జీ

కేంద్ర భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మంత్రి
పదవీ కాలం
19 October 1999 – 9 May 2002
ప్రధాన మంత్రి Atal Bihari Vajpayee
ముందు Chandra Shekhar
తరువాత Anant Geete

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1966
అధ్యక్షుడు Bal Thackeray(till 2012)

Uddhav Thackeray(2012 onwards)


పదవీ కాలం
14 March 1995 – 31 January 1999
ముందు Sharad Pawar
తరువాత Narayan Rane

పదవీ కాలం
22 March 1990 – 12 December 1991
ముందు Mrinal Gore
తరువాత Gopinath Munde

పదవీ కాలం
1976 – 1977
ముందు Mehta
తరువాత Murli Deora

పదవీ కాలం
1999 – 2004
ముందు Ramdas Athawale
తరువాత Eknath Gaikwad
నియోజకవర్గం ముంబై నార్త్ సెంట్రల్ లోక్‌సభ

పదవీ కాలం
2006 – 2012
ముందు Ram Jethmalani
తరువాత Anil Desai
నియోజకవర్గం Maharashtra

పదవీ కాలం
1990 – 1999
ముందు Sharayu Thakur
తరువాత Vishakha Raut
Constituency Dadar

వ్యక్తిగత వివరాలు

జననం (1937-12-02) 1937 డిసెంబరు 2 (వయసు 87)
Raigad, Bombay Presidency, British India
మరణం 2024 ఫిబ్రవరి 23(2024-02-23) (వయసు 86)
ముంబై, మహారాష్ట్ర, ఇండియా
రాజకీయ పార్టీ Shiv Sena
జీవిత భాగస్వామి Anagha Joshi
బంధువులు శార్వరి వాఘ్ (మనవరాలు)
సంతానం 3

మనోహర్ గజానన్ జోషి (జ:1937 డిసెంబరు 2 - 2024 ఫిబ్రవరి 23) మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. అతను 1995 నుండి 1999 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 2002 నుంచి 2004 వరకు లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నాడు.అతను శివసేనకు చెందిన ప్రముఖ నాయకులలో ఒకడు. నాలుగు చట్టసభలకు ఎన్నికైన రెండవ భారతీయుడు.

కుటుంబం నేపథ్యం

[మార్చు]

భారతదేశంలోని మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లాకు చెందిన మరాఠీ మాట్లాడే బ్రాహ్మణ కుటుంబంలో జోషి జన్మించాడు.[1] ఆతని పూర్వీకులు బీడ్ జిల్లా నుండి రాయగడ్ జిల్లా నందివి గ్రామానికి వలస వచ్చారు. ఆయన ముంబయిలోని ప్రముఖ విద్యా సంస్థ వీర్‌మాతా జిజియాబాయ్ టెక్నలాజికల్ ఇన్‌స్టిట్యూట్ (వీజేఐటీ) నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. అతను 1964 మే 14న అనఘా జోషిని వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు ఉన్మేష్, ఇద్దరు కుమార్తెలు అస్మిత, నమ్రత. గిరీష్ వ్యాస్ అతని అల్లుడు. సుండ్యూ బహుళ అంతస్తుల భవన వివాదం దావా జోషి రాజీనామాకు దారితీసింది. పిర్యాదిదారు విజయ్ కుంభార్‌కు భారత సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పును ఇచ్చింది. ప్రస్తుతం ఆభవనం పాఠశాల కోసం ఉపయోగిస్తున్నారు.[2]

కోహినూర్ ఏర్పాటు

[మార్చు]

న్యాయశాస్త్రంలో ఎం.ఎ., తర్వాత అతను బృహన్‌ ముంబై నగరపాలక సంస్థలో అధికారిగా చేరాడు, కానీ తరువాత యువకుల కోసం ఎలక్ట్రీషియన్, ప్లంబర్, టి.వి./రేడియో,స్కూటర్ రిపేర్ మాన్, ఫోటోగ్రఫీ వంటి వృత్తులకు సెమీ-స్కిల్డ్ శిక్షణ అందించాలనే ఆలోచనతో కోహినూర్ సాంకేతిక-వృత్తి శిక్షణా సంస్థను ప్రారంభించాడు. చివరికి,అతను ముంబై, పూణే, నాగ్‌పూర్, నాసిక్ మొదలైన వాటిలో కోహినూర్ సంస్థ బహుళ శాఖలను ప్రారంభించాడు. తరువాత అతను నిర్మాణం, ఇతర రాజధాని - ఆధారిత వ్యాపారంలో ప్రవేశించాడు.

మనోహర్ జోషి మహారాష్ట్రలోని ఖండాలాలో కోహినూర్ బిజినెస్ స్కూల్ & కోహినూర్-IMI స్కూల్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ను కూడా స్థాపించి ఆ తరువాత జ్ఞానేశ్వర్ విద్యాపీఠ్ ఛాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

ప్రారంభ సంవత్సరాల్లో

[మార్చు]

ఆయన రాజకీయ ప్రస్థానం ఆర్ఎస్ఎస్‌తో మొదలుపెట్టి ఆ తర్వాత శివసేనలో చేరాడు. శివసేన నుంచి మహారాష్ట్ర శాసన మండలికి ఎన్నికై తన రాజకీయ జీవితం ప్రారంభించాడు. అతను 1972 నుండి 1989 వరకు మూడు సార్లు ఎన్నికై పనిచేశాడు.1976 నుండి 1977 వరకు ముంబై మేయర్‌గా పనిచేశాడు. అతను 1990లో శివసేన టిక్కెట్ నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు.[3]

ముఖ్యమంత్రి

[మార్చు]
బిసిసిఐ మాజీ వైస్ ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ అగాషేతో జోషి.

1995లో శివసేన-భారతీయ జనతా పార్టీ (బిజెపి) సంకీర్ణం అధికారంలోకి వచ్చినప్పుడు అతను మహారాష్ట్రలో మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి అయ్యాడు.[4] సాంకేతికంగా శరద్ పవార్ 1978లో భారత జాతీయ కాంగ్రెస్ (సోషలిస్ట్) సభ్యునిగా మహారాష్ట్రలో మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వానికి సాంకేతికంగా నాయకత్వం వహించారు.

వివాదం, రాజీనామా

[మార్చు]

1992-1993 అల్లర్ల సమయంలో ముస్లింలపై హింస కోసం శివసైనికులను ప్రేరేపించినందుకు జోషి, బాల్ థాకరేలను భారత ప్రభుత్వం ఆదేశించిన విచారణలో శ్రీకృష్ణ కమిషన్ నివేదికలో స్పష్టంగా పేర్కొనబడింది. అయితే, అప్పటి బిజెపి-శివసేన ప్రభుత్వంలో ఒక భాగమైన జోషిపై నివేదికను "హిందూ వ్యతిరేకం, ముస్లిం అనుకూల, పక్షపాతం" అని పేరుపెట్టి, కమిషన్ సిఫార్సులను ఆమోదించడానికి నిరాకరించారు.[5][6]

అతను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పూణేలో అతని అల్లుడు గిరీష్ వ్యాస్ అభివృద్ధి చేస్తున్న ఒక భూమి మార్పుకు సంబంధించిన మినహాయింపుల కుంభకోణంలో చిక్కుకున్నాడు.[7] ముంబై ఉన్నత న్యాయస్థానం, జోషి అల్లుడు గిరీష్ వ్యాస్ నిర్మించే గృహసముదాయం చట్టవిరుద్ధమని, గిరీష్ వ్యాస్‌కు చెందిన సుండ్యూ సంస్థగా పేర్కొంటూ వ్యతిరేకంగా తీర్పును వెలువరించడానికి కొన్ని నెలల ముందు పూణేకి చెందిన సమాచార హక్కు చట్టం కార్యకర్త విజయ్ కుంభార్ తీవ్ర ఒత్తిడితో,[8] జోషి రాజీనామా చేశాడు.[9]

తరువాత, భారత అత్యున్నత న్యాయస్థానం, ఉన్నత న్యాయస్థానం నిర్ణయాన్ని సమర్థించింది [10] అయితే మాజీ ముఖ్యమంత్రిపై నేర విచారణ జరపాలనే ఆదేశాన్ని పక్కన పెట్టింది.[11]

లోక్‌సభ స్పీకరుగా

[మార్చు]

1999 సార్వత్రిక ఎన్నికల్లో సెంట్రల్ ముంబై నుంచి గెలుపొందినప్పుడు అతను లోక్‌సభలో ఉన్నత పదవిని పొందాడు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్.డి.ఎ) పరిపాలనలో 2002 నుండి 2004 వరకు లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నాడు.

జోషి 2006 కు ముందు జరిగిన మునుపటి లోక్‌సభ ఎన్నికలలో సెంట్రల్ ముంబై నియోజకవర్గం నుండి ఓడిపోయిన తర్వాత, 2006 మార్చి 20న ఆరు సంవత్సరాల పాటు కొనసాగిన రాజ్యసభకు ఎన్నికయ్యాడు.[12]

ముఖ్యమంత్రిగా

[మార్చు]

మనోహర్‌ జోషి 1995 నుండి 1999 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాడు. ఆయన శివసేన పార్టీ నుంచి మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన తొలి వ్యక్తి.

మరణం

[మార్చు]

మనోహర్ జోషి 86 ఏళ్ల వయసులో ముంబాయిలోని పిడి హిందూజా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2024 ఫిబ్రవరి 23న మరణించాడు.[13][14]

ఇది కూడ చూడు

[మార్చు]
  • మనోహర్ జోషి మంత్రివర్గం
  • మహారాష్ట్ర ముఖ్యమంత్రుల జాబితా

మూలాలు

[మార్చు]
  1. Joshi, Manohar (18 November 2012). "Balasaheb Thackeray stood behind his men like a mountain". Hindustan Times. Archived from the original on 9 November 2014. Retrieved 2015-08-03.
  2. "Civic body starts school at Sundew apartments". The Times of India. 1 October 2013. Retrieved 8 September 2019.
  3. "Former Speakers". Office of the Speaker of Lok Sabha, New Delhi. Retrieved 16 July 2012.
  4. Ananth, Venkat (28 October 2014). "A brief history of Maharashtra's chief ministers". mint. Retrieved 13 January 2021.
  5. "The Shiv Sena indicted". Frontlineonnet.com. Archived from the original on 28 March 2013. Retrieved 2013-06-14. The Sena-Bharatiya Janata Party Government in Maharashtra has rejected the core of the report, which was presented before the two Houses of the legislature on August 6 along with a memorandum of action to be taken thereon. The Action Taken Report (ATR), seeks to establish that the report is one-sided. Going further, Chief Minister Manohar Joshi termed the report "anti-Hindu, pro-Muslim and biased."
  6. Smita Narula (1999). Broken People: Caste Violence Against India's "untouchables". Human Rights Watch. ISBN 1564322289. The reports findings were presented to the government of Maharashtra on February 16, 1998, more than five years after the riots took place. The report determined that the riots were the result of a deliberate and systematic effort to incite violence against Muslims and singled out Shiv Sena leader Bal Thackeray and Chief Minister Manohar Joshi as responsible. The Shiv Sena-BJP government, however, refused to adopt the commission's recommendations and instead labeled the report anti-Hindu.
  7. "Supreme Court indicts Manohar Joshi over land misuse case". NDTV.com.
  8. "Victory for RTI activist in battle against former CM's son-in-law". mid-day. 13 October 2011.
  9. "Pune land controversy back to haunt Shiv Sena". Hindustan Times. 13 October 2011.
  10. "Hand over Sundew Apartment or let PMC raze it: SC to Vyas Construction - Indian Express". Indian Express. 13 October 2011. Retrieved 27 September 2020.
  11. "Former CM Joshi pays 25,000 to petitioner". The Times of India. Archived from the original on 2012-07-20.
  12. "Arjun, Bhardwaj, Shinde elected unopposed to Rajya Sabha". Tribuneindia.com. 20 March 2006. Retrieved 27 September 2020.
  13. TV9 Telugu (23 February 2024). "లోక్‌సభ మాజీ స్పీకర్‌ మనోహర్‌ జోషి కన్నుమూత.. ప్రముఖుల సంతాపం". Archived from the original on 23 February 2024. Retrieved 23 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  14. Andhrajyothy (23 February 2024). "అనారోగ్యంతో మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషీ మృతి". Archived from the original on 23 February 2024. Retrieved 23 February 2024.

వెలుపలి లంకెలు

[మార్చు]