బలీ రామ్ భగత్
బలీ రామ్ భగత్ | |||
బలీ రామ్ భగత్
| |||
పదవీ కాలం 30 June 1993 – 1 May 1998 | |||
ముందు | Dhanik Lal Mandal (Additional charge) | ||
---|---|---|---|
తరువాత | Darbara Singh | ||
పదవీ కాలం 11 February 1993 – 29 June 1993 | |||
ముందు | Surendra Nath (Additional charge) | ||
తరువాత | Gulsher Ahmed | ||
పదవీ కాలం 25 September 1985 – 12 May 1986 | |||
ముందు | Rajiv Gandhi | ||
తరువాత | P. Shiv Shankar | ||
పదవీ కాలం 1976 – 1977 | |||
డిప్యూటీ | G.G. Swell | ||
ముందు | G. S. Dhillon | ||
తరువాత | N. Sanjiva Reddy | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | Patna, Bihar, British India | 1922 అక్టోబరు 7||
మరణం | 2011 జనవరి 2 New Delhi, India | (వయసు 88)
బలి రామ్ భగత్, (1922 అక్టోబరు 7 - 2011జనవరి 2) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడు.
భగత్ 1922 అక్టోబరు 7న బీహార్ రాష్ట్రం లోని పాట్నాలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు.అతను 1939 లో భారత స్వాతంత్ర్యోద్యమంలో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. అతను పాట్నా కళాశాల నుండి బ్యాచిలర్ డిగ్రీని పొందాడు.పాట్నా విశ్వవిద్యాలయం నుండి ఆర్థికశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందాడు.[1]
స్వాతంత్ర్యం తరువాత, అతను మొదటి ఐదు పర్యాయాలు (1952-1977), (1984-1989) సహా ఆరుపర్యాయాలు అర్రా నుండి లోక్‌సభ సభ్యునిగా పనిచేశాడు.[2] 1977 సార్వత్రిక ఎన్నికలలో భగత్ తన స్థానాన్ని, చంద్రదేవ్ ప్రసాద్ వర్మ చేతిలో కోల్పోయాడు. భారతదేశంలోని అర్రా లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ మొదటిసారిగా అధికారాన్ని కోల్పోయింది.
1963, 1967 మధ్య, భగత్ రాష్ట్ర ప్రణాళిక, ఆర్థికశాఖ మంత్రిగా పనిచేసాడు.1967లో కొద్దికాలం పాటు రక్షణ మంత్రిత్వ శాఖలో మంత్రిగా పనిచేసిన అతను అదే సంవత్సరంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. భగత్ 1969లో విదేశీ వాణిజ్య సరఫరా మంత్రిగా మంత్రివర్గంలో సభ్యుడయ్యాడు. తర్వాత ఎనిమిది నెలల పాటు స్టీల్ అండ్ హెవీ ఇంజినీరింగ్ శాఖ మంత్రిగా ఉన్నాడు.[2]
ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ మొదటి హయాంలో గందరగోళంగా ఉన్న చివరి సంవత్సరంలో 1976 నుండి 1977 వరకు భగత్ లోక్‌సభ సభాపతిగా పనిచేసాడు.[2] అతను 1985 నుండి 1986 వరకు రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో భారత విదేశాంగ మంత్రిగా పనిచేసాడు. అతను 1993లో కొంతకాలం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా, 1993 నుండి 1998 వరకు రాజస్థాన్ గవర్నర్‌గా పనిచేసాడు. బలి రామ్ భగత్ 2011 జనవరి 2న న్యూఢిల్లీలో మరణించాడు [1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Former Lok Sabha Speaker Baliram Bhagat passes away". The Hindu. January 3, 2011.
- ↑ 2.0 2.1 2.2 "The Office of Speaker Lok Sabha". speakerloksabha.nic.in. Retrieved 2021-11-13.