రబీ రాయ్
రబీ రాయ్ | |
---|---|
ରବି ରାୟ | |
9th Speaker of the Lok Sabha | |
In office 19 December 1989 – 9 July 1991 | |
ప్రధాన మంత్రి | Vishwanath Pratap Singh Chandra Sekhar |
Deputy | Shivraj Patil |
అంతకు ముందు వారు | Balram Jakhar |
తరువాత వారు | Shivraj Patil |
Minister of Health and Family Welfare | |
In office 25 January 1979 – 14 January 1980 | |
ప్రధాన మంత్రి | Morarji Desai |
అంతకు ముందు వారు | Raj Narain |
తరువాత వారు | Mohsina Kidwai |
Member of Parliament, Lok Sabha | |
In office 1989–1996 | |
అంతకు ముందు వారు | Sarat Kumar Deb |
తరువాత వారు | Srikant Kumar Jena |
నియోజకవర్గం | కేంద్రపారా |
In office 1967–1971 | |
అంతకు ముందు వారు | Bibudhendra Mishra |
తరువాత వారు | Banamali Patnaik |
నియోజకవర్గం | పూరీ |
Member of Parliament, Rajya Sabha | |
In office 3 April 1974 – 2 April 1980 | |
నియోజకవర్గం | Odisha |
వ్యక్తిగత వివరాలు | |
జననం | Bhanagarh, Puri district, Odisha, British India | 1926 నవంబరు 26
మరణం | 2017 మార్చి 6 Cuttack, Odisha, India | (వయసు 90)
రాజకీయ పార్టీ | Janata Dal |
ఇతర రాజకీయ పదవులు | Janata Party (Secular), Janata Party, Samyukta Socialist Party, Socialist Party |
As of 11 July, 2009 Source: [1] |
రబీ రాయ్, (1926 నవంబరు 26 - 2017 మార్చి 6) ఒక భారతీయ సమాజవాది, రాజకీయవేత్త, గాంధేయవాది, లోక్‌సభ స్పీకర్, మాజీ కేంద్ర మంత్రి. అతను ఒడిశాకు చెందినవాడు. అతను 1948లో సోషలిస్ట్ పార్టీలో చేరాడు. తరువాత సంయుక్త సోషలిస్ట్ పార్టీ, జనతా పార్టీ, జనతాదళ్ పార్టీలలో సభ్యుడయ్యాడు. [1] [2]
జీవితం తొలిదశ
[మార్చు]రబీ రాయ్, 1926 నవంబరు 26న ఒరిస్సాలోని పూరీ జిల్లా, భనరాగఢ్ గ్రామంలో జన్మించాడు. అతను కటక్ లోని రావెన్‌షా కళాశాల నుండి చరిత్రలో బి.ఎ. గౌరవ పట్టా పొందాడు. తరువాత కటక్‌లోని మధుసూదన్ న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించాడు.[1] అతను వైద్యురాలు సరస్వతి స్వైన్‌ను వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత అతని భార్య సరస్వతి, ఆమె ఇంటిపేరును మార్చుకుంటుందని రబీ రాయ్ ముందుచూపుతో ఊహించలేదు. ఆమె అతని రాజకీయ జీవితంలో ప్రేరణగా నిలిచింది. అతను సామ్యవాది. వివాహం తర్వాత కటక్‌లోని ఎస్.సి.బి. వైద్య కళాశాలలో ఆచార్యుడుగా చేరాడు.
రాజకీయ జీవితం
[మార్చు]రబీ రాయ్, క్రియాశీల రాజకీయాల్లోకి రాకముందు స్వాతంత్ర్య సమరయోధుడు. 1947 ప్రారంభంలో అతను కటక్‌లోని రావెన్‌షా కళాశాలలో చరిత్ర చదువుతున్నప్పుడు, రావెన్‌షా కళాశాల అవరణలో భారత జాతీయ జెండాను ఆవిష్కరించినందుకు బ్రిటిష్ సైన్యం అతన్ని అరెస్టు చేసింది. విదేశీ పాలనలో ఉన్నప్పటికీ, విద్యాసంస్థల్లో త్రివర్ణ భారత జెండాను ఎగురవేయాలనే విద్యార్థుల వత్తిడికి చివరిరోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం తలొగ్గింది.
రబీ రాయ్, కళాశాల రోజుల నుండి సోషలిజంపై అమితమైన విశ్వాసం ఉన్న రబీ రాయ్, 1948లో సోషలిస్ట్ పార్టీలో సభ్యునిగా చేరాడు. అతని సహజసిద్ధమైన నాయకత్వ లక్షణాలు, సోషలిస్టు లక్ష్యం పట్ల అతనికున్న లోతైన నిబద్ధత కారణంగా, ఎల్లప్పుడూ సోషలిస్టు ఉద్యమంలో అగ్రగామిగా నిలిచాడు. 1953-54 సమయంలో, అతను అఖిల భారత సమాజ్ వాదీ యువక్ సభ జాయింట్ సెక్రటరీగా పనిచేశాడు. 1956లో ఒరిస్సాలో రామ్ మనోహర్ లోహియా నేతృత్వంలో సోషలిస్ట్ పార్టీని స్థాపించాడు. [3] ఆ కాలంలో సోషలిస్టు పార్టీ జాతీయ కార్యవర్గం సభ్యుడు. తర్వాత 1960లో దాదాపు ఏడాదిపాటు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.
1967లో ఒరిస్సాలోని పూరీ నియోజకవర్గం నుంచి 4వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు.అతను 4వ లోక్‌సభలో సంయుక్త సోషలిస్ట్ పార్టీ (ఎస్.ఎస్.పి) నాయకుడిగా ఉన్నాడు. అతను 1974 లో ఒరిస్సా నుండి రాజ్యసభకు ఎన్నికయ్యాడు.రాజ్యసభ సభ్యుడుగా అతను 1980 వరకు కొనసాగాడు. అతను మొరార్జీ దేశాయి మంత్రివర్గంలో 1979 జనవరి నుండి 1980 జనవరి వరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేసాడు [1]
1989లో ఒరిస్సాలోని కేంద్రపరా నియోజకవర్గం నుంచి జనతాదళ్ అభ్యర్థిగా 9వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు.1989 డిసెంబరు 19న తొమ్మిదవ లోక్‌సభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 1991లో అదే నియోజకవర్గం నుంచి 10వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు.[1] అంతర్లీనంగా సరళత, సమగ్రతతో అధికారం పొందిన రబీ రాయ్, తన నిష్పాక్షికమైన విధానం ద్వారా లోక్‌సభ స్పీకర్ పదవికి గౌరవ ప్రతిష్టలు కలిగించాడు.
తరువాతకాలంలో సామాజిక పని
[మార్చు]1997 నుండి, అతను రాజకీయేతర సంస్థ, లోక్ శక్తి అభియాన్‌తో అనుబంధం పెంచుకున్నాడు. ఉన్నత స్థానాల్లో అవినీతి, మితిమీరిన కేంద్రీకరణ, క్షీణించిన వినియోగదారుల సంస్కృతికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించాడు. ప్రజా జీవితంలోని అన్ని రంగాలలో విశ్వసనీయత, పారదర్శకతను నిర్ధారించడానికి అతను దేశంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించాడు. అతను "శాంతి కోసం పౌరుల చొరవ" అనే పౌరసమాజ సమూహంలో సభ్యుడుగా, భారతదేశంలో నక్సలైట్-మావోయిస్ట్ తిరుగుబాటు సమస్యకు శాంతియుత పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించాడు. [4] [5] అతను ఒరియా, హిందీ, ఆంగ్ల భాషలో ఉన్న వివిధ ప్రముఖ పత్రికలకు సమకాలీన రాజకీయ, సామాజిక సమస్యలపై క్రమం తప్పకుండా వ్యాసాలను అందించాడు.
అవార్డులు
[మార్చు]- లైట్ ఆఫ్ ట్రూత్, 2002 (రబీ రాయ్, 2002 డిసెంబరు 18 న టిబెటన్ ఫెస్టివల్ ఆఫ్ కంపాషన్ ముగింపు వేడుకలో భారతదేశ ప్రజల తరపున ఈ అవార్డును అందుకున్నాడు. )
- శాంతి దూత్ ఇంటర్నేషనల్ అవార్డ్ - వరల్డ్ పీస్ మూవ్‌మెంట్ ట్రస్ట్ ఇండియా ఈ గౌరవాన్ని అందజేసింది.
- 2008లో కళింగ రత్న అవార్టు పొందాడు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 "Former speakers - Rabi Ray". The Speaker, Lok Sabha official website. Archived from the original on 19 జూలై 2011. Retrieved 21 April 2010. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "speaker" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "Former Lok Sabha Speaker Rabi Ray passes away". The Economic Times. 2017-03-06. Retrieved 2020-02-16.
- ↑ Das, Pradip (2017-03-06). "Rabi Ray, former Lok Sabha Speaker, passes away". The Hindu. ISSN 0971-751X. Retrieved 2020-02-16.
- ↑ "SOUTH ASIA INTELLIGENCE REVIEW-Volume-8-No-16". www.satp.org. October 26, 2009. Retrieved 2020-02-16.
- ↑ Kumar, Vinay (2009-10-20). "Chidambaram: ready for talks with Maoists if they abjure violence". The Hindu. ISSN 0971-751X. Retrieved 2020-02-16.
Mr. Ray, along with other prominent members of civil society, had urged the government to begin a dialogue with the CPI (Maoist) and stop the offensive against naxalites in some States