Jump to content

సేవాగడ్ దేవాలయం

వికీపీడియా నుండి
(సేవాగడ్ నుండి దారిమార్పు చెందింది)

సేవా గడ్ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపూర్ జిల్లా గుత్తి మండలంలోని చెర్లో పల్లి పంచాయితీ పరిధిలోని గొల్లల దొడ్డి సమీపంలో సేవా గడ్ మఠం ఉంది.ఇది బంజారా ల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ పుట్టి పెరిగిన పవిత్ర స్థలం. సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు పూజారి రంజిత్ నాయక్ 2001 లో సేవా గడ్ స్థాపించి మందిర నిర్మాణం చేసిశారు ఇచట ప్రతి సంవత్సరం జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు.[1][2][3][4].

సేవాగడ్ దేవాలయము (SEVAGAD A LOLY LAND OF SANTH SEVALAL BIRTH)
సంత్ సేవాలాల్ జన్మస్థలం సేవా గడ్ అనంతపూర్
సంత్ సేవాలాల్ జన్మస్థలం సేవా గడ్ అనంతపూర్
పేరు
ఇతర పేర్లు:సంత్ శ్రీ సేవాలాల్ మఠం,మరియామా యాడి
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్
జిల్లా:అనంతపూర్
ప్రదేశం:గుంతకల్ రెవెన్యూ డివిజన్, గుత్తి మండలం, చెర్లోపల్లి గ్రామపంచాయితీ,గొల్లలదొడ్డి సమీపంలో సేవాగడ్.
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ శ్రీ దండి భవాని జగన్మాత.
కవులు:యస్ ఎన్ క్రిష్ణా నాయక్,ఢాడి క్రిష్ణా నాయక్,డా.రాజేంద్ర ప్రసాద్ గురుజీ, సుబ్రమణ్యం.
ముఖ్య_ఉత్సవాలు:సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జన్మోత్సవాలు (జన్మస్థలం)
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :దక్షిణ భారత నిర్మాణ శైలి హిందూమతము, బంజారా సుగాలీ సమాజం
దేవాలయాలు మొత్తం సంఖ్య:దేవాలయం రెండు
కట్టడాల సంఖ్య:సేవాలాల్ పగోడా,స్వాగత తోరణం, నిత్యాన్నదాన సత్రం,కళ్యాణ మండపం,గెస్టు హౌసులు,గురుకుల పాఠశాల,
ఇతిహాసం
నిర్మాణ తేదీ:22 అక్టోబర్ 2004
సృష్టికర్త:2001లో సేవాగడ్ పూజారి రంజిత్ నాయక్ స్థాపించారు.

చరిత్ర

[మార్చు]

బంజారా సమాజ ప్రజల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహారాజ్ వారు కన్ను మూసినా ప్రాంతం రూయిగడ్, డిగ్రేస్ తాలుకా ఎవత్మాల్ జిల్లా,సమాధి స్థలం పొవరా దేవి (గడ్) వాసీం జిల్లా మనోరా తాలుక మహారాష్ట్ర లో ఉంది. ప్రతి సంవత్సరం ఇచట వారం రోజులు పాటు నుండి శ్రీరామ నవమి వరకు జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది.దేశ నలుమూల నుండి ఇతర దేశాల నుండి లక్షలలో బంజారా భక్తులు హాజరై పొహరా దేవి ని దర్శించుకుంటారు.అదే విధంగా సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జన్మించిన ప్రదేశం ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ జిల్లా గుత్తి మండలంలోని చెర్లోపల్లి గ్రామపంచాయితీ లోని సేవా గడ్ ప్రాంతము[5] [6].ఈ ప్రాంతం బ్రిటీషు ప్రభుత్వం పరిపాలనా కాలంలో మద్రాసు ప్రెసిడెన్సీ పరిదిలో ఉండేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది అనంతపూర్ జిల్లా గుంతకల్ రెవిన్యూ డివిజన్ భూమి రికార్డులో సంత్ సేవాలాల్ మహారాజ్ తాతా రామావత్ రాంజీ నాయక్,వారి తాండా పేరుతో దాదాపు పద్దెనమిది ఎకరాల పై చిలుకు భూమి సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ వారి వంశం వారిదిగా అధికారులు గుర్తించడం జరిగినది.

సమాజ ప్రముఖులు,పరిశోధకులు పరిశోధన చేసి అన్వేసించినంతరం పూజారి రంజిత్ నాయక్ ఆధ్వర్యంలో దేశనలుముల నుండి బంజారా ప్రముఖుల తో పాటు కొంత మంది స్థానిక గిరిజనేతరులు దైవకార్యానికి గొల్లలదొడ్డి, పెద్దదొడ్డి, చెర్లోపల్లి మొదలగు గ్రామస్థుల సహాయంతో భూములు ఇవ్వడం జరిగింది.అందరి సహాయ సహకారంతో పూజారి రంజిత్ నాయక్ నాయకత్వంలో ఒక ట్రస్టు ను ఏర్పాటు చేసి తేదీ: 23 జూలై 2001 లో ఇరువై ఐదు మంది సభ్యులతో ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ 1882/25 ప్రకారం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చారిటబుల్ ట్రస్టు రిజిష్ట్రేషన్ చేసి సేవాగడ్ ను నిర్మించి వారి జయంతి ఉత్సవాలు,జాతర, మహాభోగ్ భండార్ కార్యక్రమాలు నిర్వహిస్తూంది.

మందిర నిర్మాణం

[మార్చు]

సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ మందిర నిర్మాణం కోసం చారిటిబుల్ ట్రస్టు సభ్యులు కేటాయించిన మొత్తం 40.48 ఎకరాల విస్తీర్ణం గల భూమిలో మందిర నిర్మాణం యొక్క భూమి పూజ సమస్త బంజారా సమాజ ప్రముఖులు, ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు పూజారి చంద్రకళా రంజిత్ నాయక్,గురువులు శ్రీ లక్ష్మణ్ దాస్ చైతన్య బాపుజీ, దుర్గాదాస్ మహారాజ్ పౌవరాదేవి వారి కర మలంతో భూమి పూజ తేదీ:15 ఫిబ్రవరి 2002 న సంత్ సేవాలాల్ మహారాజ్ వారి 263వ జయింతి సందర్భంగా జరిగినది.[7]. భూమి పూజ జరిగి రెండు సంవత్సరాల తర్వాత 2004 లో మఠం నిర్మాణ కమిటీని ఏర్పాటు చేశారు.కమిటీ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ ఐ.పి.యస్ ఐ.జి అధికారి కె జగన్నాథ్ రావు ను కమిటీ ఏకగ్రీవంగా ఎంపిక చేసి ఇతర సభ్యులుగా కే. కేశవ్ నాయక్,ఎల్.రామా నాయక్,బి. లాల్యానాయక్,అర్జున్ రాథోడ్,శంకర్ పవార్,శంకర్ నాయక్, క్రిష్ణాసింగ్ మొదలగు వారిని కమిటీ గౌరవ సభ్యులుగా ఎంపిక చేసింది. తేదీ:22 అక్టోబర్ 2004 లో ఐ.పి.ఎస్ డి జి.రిటైర్డ్ డాక్టర్.డి.టి నాయక్ చేతుల మీదుగా మందిరం యొక్క శంకుస్థాపన జరిగినది.

సేవాభాయా చిత్రం

[మార్చు]

సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క చిత్రపటాన్ని హైదరాబాదు నిజాం దక్కన్ సుబేదారుడు మీర్ అలి సలాబత్ జంగ్ 1759 లో నిజాం రాజ్యంలోని చిత్రకారుడు అయిన చిన్ హుసేన్ లాల్ వారి చేతుల మీదుగా చిత్రాన్ని గీయించారు.ఈ చిన్న చిత్రాన్ని 2001 లో కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజక వర్గంలోని నస్రూల్లా బాద్ మండలంలోని అంకోలా తాండాకు చెందిన మెగావత్ చంద్రభాణ్ ఎంతో వ్యయప్రయసలు పడి నిజాం రాజ్యం నుండి చిత్రం సంపాదించి బంజారా సమాజానికి అందించారు.దానిని పూజారి రంజిత్ నాయక్ ప్రముఖ ముంబాయి చిత్రకారుడు అయిన కె.పి అందోర్కర్ తో మెరుగులు దిద్దించి నూతనంగా గీసిన సంత్ సేవాలాల్ మహారాజ్ వారి చిత్రపట్టాన్ని తేదీ: 15 ఫిబ్రవరి 2002 లో సేవాలాల్ మహారాజ్ జయంతి సంద్భంగా సేవాగడ్ చారిటిబుల్ ట్రస్టు వారు ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు.

విగ్రహ ప్రతిష్టాపన

[మార్చు]

సేవాగడ్ ప్రాంతంలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్, జగన్మాత శ్రీ దండీ భవాని ఆలయం సేవాగడ్ పుణ్య స్థలంలో మెరుగైన సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఆలయంలో మహారాజ్ వారి ధవళకాంతుల సుందర విగ్రహన్ని , నిర్గుణ నిరంకారి,బాల బ్రహ్మాచారి,తపస్వి, పొవరా గడ్ పీఠాదీపతి సంత్ రామారావు మహారాజ్ స్వర్ణహస్తాలతో తేదీ:15 ఫిబ్రవరి 2009న ప్రతిష్టించారు.ఐదు రోజులు జరిగిన ఈ కార్యక్రమంలో తొమ్మిది మంది బ్రాహ్మణులు వేదమంత్రాలు హోమాలు చేసి ప్రాణ ప్రతిష్ఠ చేశారు.

చారిటిబుల్ ట్రస్టు కార్యక్రమాలు

[మార్చు]

సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చారిటిబుల్ ట్రస్టు సేవాగడ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వారి అధ్వర్యంలో యువకులకు,విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలు, భక్తులకు, తాండా ప్రజలకు వివిధ సౌకర్యాలు కల్పించేందుకు అనేక అభివృద్ది కార్యక్రమాలు జరిగినాయి. కమ్యూనిటి హాల్ నిర్మాణం, కళ్యాణ మండపం, విద్యార్థులకు కోసం వసతి గృహము, విద్యార్థులకు ఫర్నిచర్ సౌకర్యాలు,భక్తుల నివాస గృహం, గోశాల, నిత్య అన్నదాన కార్యక్రమం, సౌచాలయం,స్నానపు గదులు మంచి నీటి సౌకర్యాలు,భజన కళాధామం, ఆలయ స్వాగత తోరణం, సేవా శక్తి మూలా ధారణ, కాళ్యాకుండ్ మరమత్తులు, ప్రయాణ ప్రాంగణం,మొదలగు కార్యక్రమాలు జరిగినవి.[8].

ధూప,దిప, నైవేద్యం :-

సేవాగడ్ చారిటిబుల్ ట్రస్టు వారు వివిధ బ్యాంకులలో రూ, యాభై లక్షల వరకు ఫిక్సడ్ డిపాజిట్లు చేసి డిపాజిట్ డబ్బుల పై వచ్చే వడ్డితో రోజు రెండు పూటలు ధూప, దిప, నైవేద్యం ఆలయంలో పూజారి వారి ఆధ్వర్యంలో జరుగుతుంది.

కాళ్యాకుండ్ :-

కాళ్యాకుండ్ పేరుతో ఉన్న జలాషయం సేవాగడ్ చారిటిబుల్ ట్రస్టు వారు అతి పురాతన జలాసయం కాళ్యాకుండ్ ను రూ. లక్షా ఎనభై వేల ఖర్చుతో మరమత్తులు చేయడం జరిగింది.

స్వాగత తోరణం :-

సేవాగడ్ లో ఆలయ స్వాగత తోరణాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ రహదారి నెం 57 మీద బళ్ళారి, గుంతకల్లు, గుత్తి,నెల్లూరు జాతీయ మార్గాల్లో చెర్లోపల్లి స్టాపు నుండి సేవాగడ్ వెళ్ళే కూడలిలో హైదరాబాదు శ్రీ సాగర్ సిమెంటు వారిచే రూ, ఇరువై రెండు లక్షల నిధులతో శ్రీ జగదాంబదేవి శ్రీ సేవాలాల్ ఆలయ మహద్వారము బంజారా సంస్కృతి సాంప్రదాయం ప్రకారం బంజారా మహిళల పూలమాలలతో స్వాగతం పలుకగా వెనుక వైపు బంజారా వీర పురుషుడు నాయక్ ధన్యవాదాలు చెబుతూ పునః దర్శనం ప్రాప్తి రస్తుమంటు వీడ్కోలు పలికే అద్భత శిల్పాలు బంజారా సంస్కృతి కి అద్దంపడుతుంది. పై భాగంలో గరిష్యా షాండ్,విష్ణు,హతిరామ్ బావాజీ, రామాలక్ష్మణా,జానకి అంజనేయ స్వామి దేవుళ్ళ చిత్రపటాలు ముందు నుండి వచ్చే భక్తులను ఆశీర్వదిస్తూ ఉండగ వెనుక వైపున క్షేమంగా వెళ్ళి లాభంగా రండంటు వీడ్కోలు పలుకుతున్నా దృశ్యాలు చూపరులను కనువిందు చేస్తాయి.

శిక్షణ కార్యక్రమాలు :-

యువకులకు నాయకత్వ లక్షణాలు పెంపోందించడానికి వారం రోజుల పాటు సేవాగడ్ లో బెంగుళూరు నుండి పండిత్ రవిశంకర్ గురూజీ వారి ఆశ్రమ శిక్షణ సభ్యులు కానన్ ఉపాధ్యాయిని ద్వారా ప్రతి సంవత్సరం శిక్షణ కార్యక్రమం,యోగా నేర్పడం,జాతీయ సేవా కార్యక్రమాలు నిర్వహించ బడును.

విద్యార్థుల కోసం :-

ట్రస్టు సభ్యుల కృషితో ప్రభుత్వం సేవాగడ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే గిరిజన గురుకుల ఉన్నత పాఠశాలను నేలకోల్పడం జరిగినది.నిరుపేద గిరిజన విద్యార్థుల కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ హైయిస్ స్కూల్ స్థాపించి,సర్వ సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తుంది.[9][10][11].

కమ్యూనిటి హాల్ నిర్మాణం :-

దేశంలోని వివిధ రాష్ట్రాల నుండే వచ్చే భక్తుల కోసం స్థానిక ప్రజాప్రతి నిధుల నుండి విరాళాలు సేకరించి రూ, ముఫ్ఫై ఐదు లక్షలలో కమ్యూనిటి హాల్ నిర్మాణం చేసినారు.

కళ్యాణ మండపం :-

టి.టి.డి తిరుమల తిరుపతి దేవస్థానము ముఖ్య కార్యనిర్వహణ అధికారి,చైర్మన్ వారిచే సేవాగడ్ లో ఒక కోటి రూపాయలతో 2017 లో టి.టి.డి కళ్యాణ మండపాన్ని నిర్మించి ఇచ్చింది.

భజన కళా ధామం :-

2017 లో భజన కళా ధామం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారు రూ, ఏడు లక్షల వ్యయంతో సంత్ శ్రీ సేవాలాల్ మాహారాజ్ కళాధామం, దర్మణి యాడిరో మెళో పేరుతో ఓపెన్ స్టేజి నిర్మించి ఇచ్చారు.

గోశాల :-

సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చారిటి బుల్ ట్రస్టు వారు సేవాగడ్ లో గోశాల నిర్మాణం కూడా ప్రారంభించారు.

నిత్య అన్నదానము :-

సేవాగడ్ ట్రస్టు సభ్యులైన డా.రాజేంద్ర ప్రసాద్ గురూజీ, శేఖర్, మీటు, పుడ్ కార్పోరేషన్ ఉద్యోగులు, నంది పైపుల యాజమాన్యం, గణపతి నాయక్ బంజారా మొదలగు వారి ఆద్వర్యంలో వారు 2005 లో నిత్య అన్న దానము ప్రారంభించి భక్తులందరికీ కడుపు నిండుగా భోజనాలు ఇవ్వడం రుగుతుంది.

భక్తులకు శుద్ధ జలం :-

భక్తులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో సేవాగడ్ ట్రస్టు చైర్మన్ కె.జగన్నాథ్ రావు ఆధ్వర్యంలో 2017లో సేవాలాల్ మహారాజ్ 278 వ. జయంతి సంద్భంగా రూ,ఇరువై లక్షల వ్యయంతో అరువై వేల లీటర్ల సామర్థ్యం గల మినిరల్ వాటర్ ప్లాంట్ నిర్మించారు.

మరుగుదొడ్లు :-

సేవాగడ్ లో అత్యున్నత ప్రమాణ పరిశుభ్రత పాటించుట కోసం మహిళలకు ఇరువై స్నానపు గదులు,ఇరువై మరుగుదొడ్లు,పురుషులకు ఇరువై స్నానపు గదులు ఇరువై సౌఛలయాలు 2017 లో రూ, ఇరువై ఐదు లక్షల ఖర్చుతో అనంతపూర్ జిల్లా కలెక్టర్ హరిరామ్ నాయక్ నిర్మించారు.

వ్వవస్థాపక ధర్మకర్తలు

[మార్చు]

మహారాష్ట్ర నుండి

పూజారి రంజీత్ నాయక్, ముఖరామ్ బండుజీ పవార్,రాజు ఆర్ నాయక్,శంకర్ టి జాదవ్,భీంరావు ఆర్ చౌహాన్,అర్జున్ ఆర్ రాథోడ్,కే బి జాదవ్, చంద్రకళా రంజీత్ నాయక్,విజయ్ బి చౌహాన్, హారిలాల్ పి నాయక్,శంకర్ పవార్ మొదలగువారు మహారాష్ట్ర నుండి పాల్లొన్నారు.

గుజరాత్ రాష్ట్రం నుండి

కే.జి బంజారా గుజరాత్ వాసులు.

ఆంధ్రప్రదేశ్ నుండి

యల్ రామా నాయక్,ఎస్ కే కేశవ్ నాయక్,టి కిషన్ సింగ్,ఎస్ రాములు నాయక్,బి లాల్యా నాయక్.

కర్నాటక నుండి

తారా నాథ్ పవార్, బాబూరావు చౌహాన్,కల్యాణ్ నాయక్,డా.యం శంకర్ నాయక్,సుశిలా ఆర్ ఎల్ నాయక్, సులోచనా కే నాయక్,ఆర్ శర్మా నాయక్,జి.భీమ్లా నాయక్.మొదలగు వారు ముఖ్య పాత్ర పోషించారు.

సేవా శక్తి మూలధారణ

[మార్చు]

శ్రీ సేవా శక్తి మూల ధారణ సేవాగడ్ ఆలయంలో ప్రతి సంవత్సరం మాలాధారణ గురుజీ కరంటోట్ రాజేంద్ర ప్రసాద్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది.మాలధారణలో భక్తులు వారి వారి కోరిక మేరకు పదకొండు రోజులు, ఇరువై ఒక రోజులు ,లేదా నలభై ఒక రోజులు సేవా వారి దీక్షలో ఉండి సేవాలాల్ జన్మఓత్సవం రోజున అత్యంత వైభవంగా కార్యక్రమాలు నిర్వహించి మాల ఉపసంహరణ చేసి మాతా జగదాంబ దేవి, సేవాలాల్ కు అంకితం చేస్తారు.

ప్రభుత్వ పరంగా నిర్వహించే కార్యక్రమాలు

[మార్చు]

సేవాగడ్ సంత్ శ్రీ సేవాలాల్ చారిటిబుల్ ట్రస్టు వారు నిర్వహించే మూడు రోజుల జాతర లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వారు ఈ క్రింది కార్యక్రమాలు నిర్వహించడం జరుగును.

1. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ గుంతకల్లు, గుత్తి డిపోల నుండి ప్రతి సంవత్సరం సేవాలాల్ జయంతి ఉత్సవాలు సందర్భంగా ఫిబ్రవరి 14,15,16 తేదీలలో సెటల్ సర్వీస్ బస్సులు ప్రతి గంటకు నడపబడుచున్నవి.

2.అనంతపూర్ జిల్లా గుంతకల్లు, గుత్తి పోలీస్ స్టేషన్ ఎస్ ఐ ఆధ్వర్యంలో శాంతి భద్రతలను పరిరక్షణలో భాగంగా భారీ భందోబస్తు నిర్వహించడం జరుగును.

3. అనంతపూర్ జిల్లా ఆరోగ్య శాఖవారు మూడు రోజుల పాటు జాతరలో సంచార వైద్యశాలలు ఎర్పాటు చేసి భక్తులకు వైద్య సేవలు కల్పిస్తారు.

4. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ ప్రచార విభాగం వారి ఆద్వర్యంలో భక్తుల ప్రదర్శన కోసం స్టాల్ ఏర్పాటు చేస్తారు.

5. భారత దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి కవులు, రచయితలు వచ్చి పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరుగుతుంది.

6. బంజారా కళాకారులచే సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ వారి జీవిత చరిత్ర పై పాటల కార్యక్రమాలు నిర్వహిస్తారు.

7. మూడు రోజుల పాటు జరిగే జాతరాలలో వివిధ రకాల దుకాణాలు, స్టాలు మనకు దర్శనం ఇస్తుంది.

8. బంజారా సంస్కృతి సాంప్రదాయాలకు సంబందించిన అన్ని రకాలు వస్త్రాలు, అభరణాలు, బ్యాగులు,పగడీలు,కుట్టు దారాలు, అన్ని రకాల వస్తువులు దుకాణాల్లో లభించును.

9. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ,జగదాంబ యాడి, సంత్ రామారావు మహారాజ్, వివిధ రకాల దేవుళ్ళు ఫోటోలు కూడా లభిస్తాయి.

చిత్రమాలికలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Today, Telangana (2021-02-21). "The journey and life of Sant Sri Sevalal Maharaj". Telangana Today (in ఇంగ్లీష్). Retrieved 2024-12-09.
  2. Today, Telangana (2021-02-21). "The journey and life of Sant Sri Sevalal Maharaj". Telangana Today (in ఇంగ్లీష్). Retrieved 2024-04-16.
  3. "285th Birthday Celebrations (Jayanthi) of Santh Sree Sevalal Maharaj, Sevagad, Gooty Mandal, Ananthapuramu District, Andhra Pradesh, India". utsav.gov.in (in ఇంగ్లీష్). Retrieved 2024-04-16.
  4. "Sevagad – The Birth place of Santh Sri Sevalal Baba" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-04-16.
  5. "Sevagad – The Birth place of Santh Sri Sevalal Baba" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-12-09.
  6. Adella, Suresh (2024-02-02). "సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ వారి జయంతి మహోత్సవాలను విజయవంతం చేయాలి". విశాలాంధ్ర (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2024-02-02. Retrieved 2024-04-16.
  7. "285th Birthday Celebrations (Jayanthi) of Santh Sree Sevalal Maharaj, Sevagad, Gooty Mandal, Ananthapuramu District, Andhra Pradesh, India". utsav.gov.in (in ఇంగ్లీష్). Retrieved 2024-04-16.
  8. "About Trust – Sevagad" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-04-16.
  9. "APTWR HS SEVAGAD, GOOTY". www.schoolsworld.in. Retrieved 2024-04-16.
  10. "Sevagad, Hindu Temple". VYMaps (in ఇంగ్లీష్). Retrieved 2024-04-16.
  11. "Aptwr Hs Sevagad". www.onefivenine.com. Retrieved 2024-04-16.