సైజ్ జీరో (సినిమా)
సైజ్ జీరొ / ఇంజి ఇడుపళగి | |
---|---|
దర్శకత్వం | ప్రకాష్ కోవెలమూడి |
రచన |
|
స్క్రీన్ ప్లే | కనికా ధిల్లన్ |
కథ | కనికా ధిల్లన్ |
నిర్మాత | ప్రసాద్ వి పొట్లూరి |
తారాగణం | |
ఛాయాగ్రహణం | నిరవ్ షా |
కూర్పు | ప్రవిన్ పుడి |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | పి.వి.పి. సినిమా |
పంపిణీదార్లు | పి.వి.పి. సినిమా |
విడుదల తేదీ | 27 నవంబరు 2015[1] |
సినిమా నిడివి | 125 నిముషాలు[2] |
దేశం | భారత దేశం |
భాషలు | |
బడ్జెట్ | 25 కోట్లు |
బాక్సాఫీసు | ₹9.5 crore (US$1.2 million)[3] |
సైజ్ జీరో / ఇంజి ఇడుపళగి (తమిళం) 2015లో విడుదలైన తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం. ప్రకాష్ కోవెలమూడి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం ఒకేసారి తెలుగు, తమిళ భాషలలో రూపొందించబడింది. ప్రసాద్ వి పొట్లూరి నిర్మిచిన ఈ చిత్రంలో అనుష్క శెట్టి ముఖ్యపాత్ర పోషించగా ఆర్య, ప్రకాష్ రాజ్, సోనాల్ చౌహాన్ సహయ పాత్రల్లో నటించారు. ఈ చోటి టేల్ డింగ్ డాంగ్ గా ఈ చిత్రం ఒడియాలో పునర్నిర్మించబడింది.
కథాంశం
[మార్చు]స్వీటిగా పిలవబడే సౌందర్య అదిక బరువు ఉన్నా ఎవ్వరి మీదా అదార పదకుండా ఉండే దైర్యవంతురాలు. ఆమె బరువు గురించి కొంచెం బాధ ఉంది కానీ ఆమె నిరుత్సహపడలెదు.తనని పెళ్ళి చుపులు చుడటానికి వచ్చిన అభిషేక్ని( ఆర్య) అమె ప్రేమిస్తుంది.వారు ఇప్పుడు మంచి స్నేహితులు.తర్వాత అతను సిమ్రాన్ (సోనాల్ చౌహాన్) తో ప్రేమలో ఉన్నాడని తెలుసుకుంటుంది.తన అదిక బరువు వల్లె అతను తనని ప్రేమించలేదని స్వీటి చలా బధపడి సైజ్ జీరొ అనే బరువు తగ్గే క్లీనికులో చెరుతుంది. క్లినిక్లో ఇచ్చిన బరువు తగ్గించే మందులు కారణంగా, ఆమెతో ఉన్న క్లినిక్లో ఉన్న తన స్నేహితురాలు జ్యోతి (పావని గంగైర్డి) , మూత్రపిండాల సమస్య ఎర్పడుతుంది.స్వీటి ఆ క్లీనిక్కి వ్యతిరేకంగా పొరాడుతుంది. తనకు అభి,సిమ్రాన్ సహయం చెస్తారు. తను ఆ క్లినిక్పై ఎలా విజయం సాదించి తన ప్రేమలో ఎలా విజయం సదించినది అనేదే మిగతా కథాంశం
తారాగణం
[మార్చు]సౌందర్య(స్వీటి)గా అనుష్క శెట్టి
అభిషేక్(అభి)గా ఆర్య
'సైజ్ జీరో' సత్యానంద్గా ప్రకాష్ రాజ్
సిమ్రాన్గా సోనాల్ చౌహాన్
శేఖర్గా అడివి శేష్
అండ్రాయిడ్ బాబాగా బ్రహ్మానందం
బోబిగా ఆలీ
మౌళి తాతగా గొల్లపూడి మారుతీరావు
స్వీటి తండ్రిగా రావు రమేశ్
అథిది పాత్రలు
నిర్మాణం
[మార్చు]2015 ఫిబ్రవరిలో ప్రసాద్ వి పొట్లూరి అనుష్క శెట్టి, ఆర్య ముఖ్య పాత్రల్లో కొవెలమూడి ప్రకాశ్ దర్శకత్వమ్లో ఒక ద్విభాషా చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు చెప్పారు.సినిమాటోగ్రాఫర్గా నిర్విన్ షా, సంగీత దర్సకుదిగా ఎం. ఎం. కీరవాణిని ఎంచుకున్నరు. దర్శకుడు ప్రకాశ్ భార్య కనిక ఈ చితనికి కథ రచించింది.ఈ చిత్రంలో నాగార్జున అతిది పాత్రలో కనిపించారు.ఆ పాత్రలో తమిళంలో జీవా కనిపించాడు.
అనుష్క పాత్రను పోషించటానికి బరువు పెరగటం ద్వారా తన పాత్ర కోసం తయారయ్యరు.[4][5]
పాటలు
[మార్చు]సంగీతాన్ని ఎం. ఎం. కీరవాణి స్వరపరిచారు.
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "సైజ్ జీరొ" | నీతి మోహన్, రమ్యా బెహ్రాజ్, మౌనిమా,మొహనా భోగరాజు, నెయొల్ సీన్ | |
2. | "మెల్ల మెల్లగా" | అర్జున్ అడపల్లి | |
3. | "సైకిల్" | రంజిత్, ఆదిత్యా | |
4. | "మెల్ల మెల్లగా లల్లు" | స్వేతా పండిత్ | |
5. | "సైజ్ సెక్సి" | మొహనా భోగరాజు | |
6. | "ఇనవా ఇనవా" | మదుమితా, రమ్యా బెహ్రాజ్, పలక్ ముచ్చల్ |
విడుదల
[మార్చు]ప్రపంచవ్యాప్త విడుదల తేదీని గాంధీ జయంతి సందర్బంగా 2015 అక్టోబర్ 2గా ప్రకటించారు.[6] తరువాత, నిర్మాతలు విడుదల తేదీని 2015 అక్టోబర్ 21 వాయిదా వేసింది.[7][7] వారు మళ్లీ విడుదల తేదీని 2015 నవంబర్ 27కు వాయిదా వేశారు[8]
మూలాలు
[మార్చు]- ↑ "Inji Iduppazhagi Movie Database". Archived from the original on 26 నవంబరు 2015. Retrieved 26 November 2015.
- ↑ "INJI IDUPPAZHAGI (PG)". British Board of Film Classification. 24 November 2015. Retrieved 24 November 2015.
- ↑ "Three-day box office collection: Anushka's Size Zero fails to beat Kumari 21F record". International Business Times. 30 November 2015.
- ↑ "Anushka puts on weight for `Size Zero`!". Sify. 28 April 2015. Archived from the original on 9 సెప్టెంబరు 2015. Retrieved 31 July 2015.
- ↑ "Anushka is the Inji Idupazhagi while Arya plays a foreigner!". Behindwoods. 19 March 2015. Retrieved 31 July 2015.
- ↑ Anushka's 'Size Zero' release date – Telugu Movie News. Indiaglitz.com (11 August 2015). Retrieved on 2016-03-17.
- ↑ 7.0 7.1 "Size Zero to release on the 9th of October – Telugu cinema news". Idlebrain.com. Retrieved on 17 March 2016.
- ↑ 'Size Zero' Release Date Confirmed – Telugu Movie News. Indiaglitz.com (16 October 2015). Retrieved on 2016-03-17.