Jump to content

హర్కతుల్ జిహాద్ అల్ ఇస్లామీ

వికీపీడియా నుండి
(హుజి నుండి దారిమార్పు చెందింది)
హర్కతుల్ జిహాద్ అల్ ఇస్లామీ
నాయకుడు{{{leaders}}}
కార్యాచరణ తేదీలు1985–ఇప్పటి వరకు
భావజాలంఇస్లామిజం
ఇస్లామిక్ ఛాందసవాదం
హోదాActive
పరిమాణంవందలాది సభ్యులు[1]
యుద్ధాలుజమ్మూ కాశ్మీరులో ఆందోళనలు
Designated as a terrorist group by

హర్కతుల్-జిహాద్-అల్-ఇస్లామీ ("ఇస్లామిక్ జిహాద్ ఉద్యమం", హుజి) అల్-ఖైదా, తాలిబాన్‌ లతో అనుబంధమున్న పాకిస్తానీ ఇస్లామిక్ ఛాందసవాద జిహాదీ సంస్థ. హుజి 1990ల ప్రారంభం నుండి దక్షిణాసియా దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారతదేశాల్లో చురుగ్గా ఉంది. 2005లో బంగ్లాదేశ్‌లో దీన్ని నిషేధించారు.

HuJI కార్యాచరణ కమాండర్, ఇలియాస్ కాశ్మీరీ, 2011 జూన్ 4 న పాకిస్తాన్ లోని దక్షిణ వజీరిస్తాన్‌లో అమెరికా డ్రోన్ దాడిలో మరణించాడు. [2] 2010 ఫిబ్రవరి 13న పూణేలోని జర్మన్ బేకరీపై జరిగిన బాంబు దాడితో అతనికి సంబంధం ఉంది. దాడి జరిగిన వెంటనే, ఇది కాశ్మీరీ చేసిన పని అని ఒక ప్రకటన విడుదల చేయబడింది; భారతదేశంలోని ఇతర నగరాలు, ప్రధాన క్రీడా కార్యక్రమాలలో కూడా బాంబులు వేస్తామని బెదిరించారు. [3] షా సాహిబ్ అనే స్థానిక తాలిబాన్ కమాండర్ కాశ్మీరీకి వారసుడిగా పేర్కొనబడ్డాడు. [4]

చరిత్ర

[మార్చు]

హుజీ ని 1984లో సోవియట్-ఆఫ్ఘన్ యుద్ధ సమయంలో ఫజ్లుర్ రెహ్మాన్ ఖలీల్, ఖారీ సైఫుల్లా అక్తర్‌లు స్థాపించారు. ఆ తర్వాత ఖలీల్ విడిపోయి తన సొంత గ్రూప్ అయిన హర్కత్-అల్-అన్సార్ (HuA)ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది కాశ్మీరులో అత్యంత భయంకరమైన ఉగ్రవాద సంస్థగా మారింది. [5] 1997లో HuA ను అమెరికా నిషేధించినప్పుడు ఈ సమూహమే హర్కత్-అల్-ముజాహిదీన్ (HuM) గా ఏర్పడింది, [6]

HuJI మొదట ఆఫ్ఘనిస్తాన్‌లో కమ్యూనిస్టులను ఓడించడానికే తన కార్యకలాపాలను పరిమితం చేసింది. అయితే సోవియట్‌లు వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత, సంస్థ జిహాద్‌ను జమ్మూ కాశ్మీర్‌కు ఎగుమతి చేసింది. ఒసామా బిన్ లాడెన్ నుండి ప్రత్యక్ష సహాయంతో 1992లో బంగ్లాదేశ్ శాఖను స్థాపించడంతో HuJI ప్రభావం బంగ్లాదేశ్‌లోకి విస్తరించింది. [7]

భావజాలం

[మార్చు]

హర్కత్-అల్-ముజాహిదీన్, జైష్-ఎ-మొహమ్మద్, అల్-ఖైదా & లష్కరే-ఇ-తైబా వంటి ఇతర జిహాదీ సమూహాలకు ఉన్నట్లుగా హుజికి కూడా అలాంటివే ప్రేరణలు లక్ష్యాలూ ఉన్నాయి. హర్కత్-ఉల్-జిహాద్ అల్-ఇస్లామీ, హర్కత్-ఉల్-ముజాహిదీన్ రెండింటికీ తాలిబాన్‌ల బలమైన మద్దతు ఉంది. అందువల్లనే ఈ సమూహం తాలిబాన్-లాంటి ఛాందసవాద ఇస్లాంను అనుసరించింది. రాడికల్ ఇస్లామిస్ట్ భావజాలాన్ని వ్యాప్తి చేసి, కాశ్మీర్, ఆఫ్ఘనిస్తాన్, పాలస్తీనా తదితర ప్రాంతాలను, ఇస్లామిక్ భూములనూ ఇస్లాం శత్రువుల బారి నుండి విముక్తి చేయడం, ముస్లిం మెజారిటీ ప్రాంతాలలో షరియా చట్టాన్ని అమలు చేయడం సంస్థ లక్ష్యం. [8]

బంగ్లాదేశ్‌లో కార్యకలాపాలు

[మార్చు]

1990లలో, సంస్థ చేర్చుకున్న కొత్త సభ్యులకు చిట్టగాంగ్, కాక్స్ బజార్‌లోని కొండ ప్రాంతాలలో శిక్షణ ఇచ్చారు. [7] [9] తరువాత, సమూహంలోని సభ్యులు 1999 జనవరిలో ఉదారవాద కవి అయిన షంసూర్ రెహమాన్‌పై హత్యా ప్రయత్నం చేశారు. [10] 2001 రామ్నా బటామూల్ బాంబు పేలుళ్లకు హుజీ బాధ్యత వహించింది. ఈ పేళుళ్ళలో 10 మంది మరణించారు. హుజీ ఆత్మాహుతి దళ సభ్యుడు కూడా మరణించాడు. ఇస్లామిక్ పాలన స్థాపనకు కట్టుబడిన హుజి, [11] [12] 2000 సంవత్సరంలో బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనాను హత్య చేసే పథకంలో ప్రధాన నిందితురాలు. 2005 అక్టోబరులో బంగ్లాదేశ్ ప్రభుత్వం దీనిని అధికారికంగా నిషేధించింది. [13] ఈ గ్రూపును హెఫాజాత్-ఎ-ఇస్లాం బంగ్లాదేశ్ వంటి ఇస్లామిస్ట్ గ్రూపులు వ్యతిరేకించాయి. [14] [15]

భారతదేశంలో కార్యకలాపాలు

[మార్చు]

భారత ప్రభుత్వం దీనిని ఉగ్రవాద సంస్థగా ప్రకటించి నిషేధించింది. [16] ఏప్రిల్ 2006లో, భారతదేశపు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆరుగురు హుజీ టెర్రరిస్టుల పన్నాగాన్ని, 2006 వారణాసి బాంబు పేలుళ్ల వెనుక నున్న సూత్రధారితో సహా వెలికితీసింది. అరెస్టు సమయంలో వారి ప్రణాళికల మ్యాపులను స్వాధీనం చేసుకున్నారు. 10 మంది మరణించి, దాదాపు 60 మంది గాయపడిన ఢిల్లీ హైకోర్టు పేలుళ్లకు హుజీ బాధ్యత వహించింది. [17] ఇస్లామిస్ట్ గ్రూపు సభ్యుడు, హుజీతో సంబంధం ఉన్న వికార్ అహ్మద్, హైదరాబాద్‌లో పోలీసు అధికారులను హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అతను మక్కా మసీదు బాంబు పేలుళ్లలో కూడా నిందితుడు. [18]

2011 ఢిల్లీ బాంబు దాడికి బాధ్యత వహిస్తున్నట్లు హర్కత్-ఉల్-జిహాద్ అల్-ఇస్లామీ ప్రకటించింది. అయితే, ఈ విషయాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ ధృవీకరించలేదు. [19] [20] బాంబు పేలుడులో 14 మంది మృతి చెందగా, 94 మంది గాయపడ్డారు. నిందితుల రెండు స్కెచ్‌లను పోలీసులు విడుదల చేశారు. [21] ఈ తాజా దాడికి సంబంధించిన పొందుపరిచిన వీడియో లింక్ ఇక్కడ ఉంది. ఈ లింక్‌లో ఇంగ్లీష్ న్యూస్ వీడియో క్లిప్ ఉంది. [22] ఇది హిందీ భాషలో ఉంది. [23] ఇతర భారతీయ నగరాలను లక్ష్యంగా చేసుకుంటామని బెదిరింపులు కూడా ఈ వీడియోలో చేశారు.

ఉగ్రవాద సంస్థగా ప్రకటన

[మార్చు]

దిగువన ఉన్న దేశాలు, సంస్థలు అధికారికంగా హర్కత్-ఉల్-జిహాద్ అల్-ఇస్లామీ (HUJI)ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి.

దేశం తేదీ ప్రస్తావనలు
యునైటెడ్ కింగ్‌డమ్ 2005 అక్టోబరు 14
భారతదేశం 2004 డిసెంబరు 29 [24]
బంగ్లాదేశ్ 2005 అక్టోబరు 17 [25]
ఇజ్రాయెల్ 2005 [26]
న్యూజిలాండ్ 2010 డిసెంబరు 15 [27]
సంయుక్త రాష్ట్రాలు 2010 ఆగస్టు 6 [28]

2010 ఆగస్టు 6 న, ఐక్యరాజ్యసమితి హరకత్-ఉల్ జిహాద్ అల్-ఇస్లామీని ఒక విదేశీ టెర్రర్ గ్రూప్‌గా గుర్తించింది. దాని కమాండర్ ఇలియాస్ కాశ్మీరీని బ్లాక్ లిస్ట్ చేసింది. సంస్థపై తీసుకున్న చర్యలు సమూహం నుండి వస్తున్న ముప్పును ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సమాజపు సంకల్పాన్ని ప్రదర్శించాయని అమెరికా లోని స్టేట్ డిపార్ట్‌మెంట్ కౌంటర్ టెర్రరిజం కోఆర్డినేటర్ డేనియల్ బెంజమిన్ చెప్పాడు. "HUJI, అల్-ఖైదా మధ్య సంబంధాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేటి ప్రకటనలు ఈ సంస్థల మధ్య కార్యాచరణ సంబంధాన్ని తెలియజేస్తాయి" అని బెంజమిన్ చెప్పాడు. [29] [30]

ఆపాదించుకున్న, ఆపాదించబడిన దాడులు

[మార్చు]
తేదీ దేశం వివరణ
1999 బంగ్లాదేశ్ మానవతావాది కవి షంసూర్ రెహమాన్‌ను హత్య చేసేందుకు విఫలయత్నం చేశారు
2000 బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను హత్య చేసేందుకు పథకం - విఫలమైంది
2001 ఏప్రిల్ 14 బంగ్లాదేశ్ రామనా బటాముల్‌పై పహేలా బైశాఖ్ దాడి
2003 భారతదేశం గుజరాత్ మాజీ హోం మంత్రి హరేన్ పాండ్యా హత్యలో పాత్ర.
2002 జనవరి భారతదేశం కోల్‌కతాలోని అమెరికన్ సెంటర్ సమీపంలో ఉగ్రదాడి, దావూద్‌తో సంబంధం ఉన్న మాఫియోసో అఫ్తాబ్ అన్సారీ సహకారంతో అమలు చేసారు
2004 బంగ్లాదేశ్ 2004 షేక్ హసీనాను హత్య చేసేందుకు ఢాకా గ్రెనేడ్ దాడి ప్రయత్నం
2005 జూన్ భారతదేశం జౌన్‌పూర్‌లో ఢిల్లీ-పాట్నా శ్రమజీవి ఎక్స్‌ప్రెస్‌పై బాంబు దాడి
2005 భారతదేశం ఆంధ్రప్రదేశ్ పోలీసు ఉగ్రవాద నిరోధక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ప్రధాన కార్యాలయంపై ఆత్మాహుతి దాడి. బంగ్లాదేశ్‌కు చెందిన మొహతసిన్ బిలాల్ బాంబు దాడికి పాల్పడ్డాడు
మార్చి 2006 వారణాసి, ఉత్తర ప్రదేశ్ సంకట్ మోచన్ ఆలయంపై బాంబు దాడి, ఇది HuJI యొక్క బంగ్లాదేశ్ ఆధారిత సెల్‌ల ద్వారా గుర్తించబడింది
25 ఆగస్టు 2007 హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ 25 ఆగష్టు 2007 హైదరాబాద్ బాంబు దాడులు (అనుమానించబడింది, కానీ సెప్టెంబరు ప్రారంభంలో ఎటువంటి ఆధారాలు వెల్లడి కాలేదు)
13 మే 2008 జైపూర్, రాజస్థాన్ 13 మే 2008 జైపూర్ బాంబు దాడులు (అనుమానితం; సాక్ష్యం పెండింగ్‌లో ఉంది. )
25 జూలై 2008 బెంగళూరు 2008 బెంగళూరు వరుస పేలుళ్లు (అనుమానితం; సాక్ష్యం పెండింగ్‌లో ఉంది. )
26 జూలై 2008 అహ్మదాబాద్ 2008 అహ్మదాబాద్ వరుస పేలుళ్లు (అనుమానాలు; ఆధారాలు పెండింగ్‌లో ఉన్నాయి. )
13 సెప్టెంబరు 2008 ఢిల్లీ 2008 ఢిల్లీ వరుస పేలుళ్లు (అనుమానితం; ఆధారాలు పెండింగ్‌లో ఉన్నాయి. )
20 September 2008 ఇస్లామాబాద్, పాకిస్తాన్ 2008 మారియట్ హోటల్ బాంబింగ్ (HuJI ద్వారా క్లెయిమ్ చేయబడింది; సాక్ష్యం పెండింగ్‌లో ఉంది. )
1 అక్టోబరు 2008 అగర్తల, త్రిపుర 2008 అగర్తల బాంబు దాడులు (హుజీపై అనుమానం; సాక్ష్యం పెండింగ్‌లో ఉంది. )
30 అక్టోబరు 2008 గౌహతి, బార్పేట, కోక్రాఝర్, బొంగైగావ్ 2008 అస్సాం బాంబు దాడులు (హుజీపై అనుమానం; సాక్ష్యం పెండింగ్‌లో ఉంది. )
13 ఫిబ్రవరి 2010 పూణే 2010 పూణే బాంబు దాడి (హుజీపై అనుమానం) [31]
7 సెప్టెంబరు 2011 న్యూఢిల్లీ 2011 ఢిల్లీ బాంబు దాడి (చేసామని HuJI చెప్పుకుంది; సాక్ష్యం పెండింగ్‌లో ఉంది. )

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Chapter 6. Foreign Terrorist Organizations". state.gov. Retrieved 6 April 2018.
  2. M Ilyas Khan (4 June 2011). "US strike 'kills' key Pakistan militant Ilyas Kashmiri". BBC News. Retrieved 8 November 2011.
  3. "Asia Times Online :: South Asia news, business and economy from India and Pakistan". Asia Times. 13 February 2010. Archived from the original on 19 February 2010. Retrieved 8 November 2011.{{cite web}}: CS1 maint: unfit URL (link)
  4. "Shah Sahib new chief of 313 Brigade". Pakistan Today. 13 August 2011. Retrieved 7 March 2011.
  5. Hussain, Zahid (2007). Frontline Pakistan: The Struggle with Militant Islam. Columbia University Press. p. 71. ISBN 978-0-231-14224-3. In 1984 Khalil, along with another militant leader Saifullah Akhtar, founded Harkat-al-Jihad-al-Islami (HJI) ... A few years later he broke away to form his own group, Harkat-ul-Ansar (HuA). By 1990, HuA had emerged as one of the most feared militant groups fighting in Kashmir.
  6. Hussain, Zahid (2007). Frontline Pakistan: The Struggle with Militant Islam. Columbia University Press. p. 72. ISBN 978-0-231-14224-3. HuA was one of the groups on the [1997 list of terrorist organizations]. After being blacklisted by the US administration it resurfaced under a new banner, HuM.
  7. 7.0 7.1 Sudha Ramachandran.
  8. Hussain, Zahid (2007). Frontline Pakistan: The Struggle with Militant Islam. Columbia University Press. p. 52. ISBN 978-0-231-14224-3. The first Pakistani jihadist group emerged in 1980 ... By 2002, Pakistan had become home to 24 militant groups ... among them were LeT, JeM, Harakat-ul-Mujahideen (HuM) and Harkat-al-Jihad-al-Islami (HJI). All these paramilitary groups, originally from the same source, had similar motivations and goals ... HuM and HJI were both strongly linked with the Taliban.
  9. John Wilson.
  10. "Shamsur Rahman, Bangladeshi Poet, Dies". The New York Times. 19 August 2006. Archived from the original on 23 April 2009. Retrieved 22 February 2017.
  11. Sudha Ramachandran.
  12. "Assassination Attempt on Hasina: Ten Huji men get death by shooting". The Daily Star. 21 August 2017. Archived from the original on 22 August 2017.
  13. "Bangladesh Nabs Five Suspected HuJI Militants". Benar News. 8 December 2016. Archived from the original on 9 December 2016.
  14. Azam, Kawsar (4 September 2014). "Al Qaeda won't gain ground in Bangladesh: Politicians". English24.com. Archived from the original on 18 January 2017. Retrieved 17 January 2017.
  15. Mirsab, A (7 September 2014). "Condemnation continues to pour from all corners against Al-Qaeda establishment in South Asia". Indian Muslim Relief and Charities. Indian Muslim Relief and Charities. Archived from the original on 18 జనవరి 2017. Retrieved 17 January 2017.
  16. "List of Banned Organisations". Ministry of Home Affairs, GoI. Government of India. Archived from the original on 3 May 2018. Retrieved 3 May 2018.
  17. Web18 (7 September 2011). "NIA team of 20 to probe Delhi blast". Firstpost. Retrieved 8 November 2011.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  18. Islamist extremism related incidents in Andhra Pradesh since 2007 South Asia Terrorism Portal
  19. "11 dead, 76 injured in terror strike". Hindustan Times. 7 September 2011. Archived from the original on 23 October 2012. Retrieved 8 November 2011.
  20. Vishwa Mohan (7 September 2011). "HuJI claims responsibility for Delhi high court blast". The Times of India. Archived from the original on 6 November 2012. Retrieved 8 November 2011.
  21. "Briefcase bomb at Delhi high court kills 11, injures 62". The Times of India. New Delhi. TNN. 7 September 2011. Archived from the original on 6 November 2011.
  22. "Another e-mail claims responsibility for Delhi blasts". YouTube. 9 September 2011. Archived from the original on 12 సెప్టెంబరు 2016. Retrieved 8 November 2011.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  23. "Delhi Police Releases Sketches of Two Blast Suspects" (in హిందీ). YouTube. 7 September 2011. Archived from the original on 6 జూలై 2015. Retrieved 8 November 2011.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  24. "The Unlawful Activities (Prevention) Amendment Act, 2004" (PDF). The Gazette of India. 30 December 2004. p. 13. Archived from the original (PDF) on 10 April 2018. Retrieved 10 April 2018.
  25. Rahman, Waliur (17 October 2005). "Dhaka outlaws third Islamic group". BBC News. Archived from the original on 11 March 2008. Retrieved 24 August 2010.
  26. "The Proclamation & Orders List". Ministry of Justice (Israel). Archived from the original (DOC) on 10 August 2014.
  27. "Lists associated with Resolution 1373". New Zealand Police. 20 July 2014. Retrieved 16 August 2014.
  28. "Foreign Terrorist Organizations". U.S. Department of State. Retrieved 20 May 2015.
  29. "US, UN declare HuJI a terrorist organisation". Hindustan Times. PTI. 7 August 2010. Retrieved 27 July 2015.
  30. "Designations of Harakat-ul Jihad Islami (HUJI) and its Leader Mohammad Ilyas Kashmiri" (Press release). US Department of State. 6 August 2010. Retrieved 12 August 2010.
  31. "Pune blast probe: Maha ATS detains suspected HuJI member". Zee News. 23 February 2010.