2007 క్రికెట్ ప్రపంచ కప్

వికీపీడియా నుండి
(2007 Cricket World Cup నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
2007 ఐసిసి ప్రపంచకప్
నిర్వాహకులుఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్
క్రికెట్ రకంవన్డే ఇంటర్నేషనల్
టోర్నమెంటు ఫార్మాట్లురౌండ్ రాబిన్ & నాకౌట్
ఆతిథ్యం ఇచ్చేవారువెస్టిండీస్
ఛాంపియన్లుఆస్ట్రేలియా ఆస్ట్రేలియా (4th title)
పాల్గొన్నవారు16 (97 ఎంట్రీల్లో)
ఆడిన మ్యాచ్‌లు51
ప్రేక్షకుల సంఖ్య4,39,028 (8,608 ఒక్కో మ్యాచ్‌కు)
మ్యాన్ ఆఫ్ ది సీరీస్ఆస్ట్రేలియా గ్లెన్ మెక్ గ్రాత్
అత్యధిక పరుగులుఆస్ట్రేలియా మాథ్యూ హేడెన్ (659)
అత్యధిక వికెట్లుఆస్ట్రేలియా గ్లెన్ మెక్ గ్రాత్ (26)
2003
2011

2007 ఐసీసీ ప్రపంచ క్రికెట్ కప్ వెస్ట్ ఇండీస్ లో 13 మార్చి నుండి 2007 ఏప్రిల్ 28, వరకు జరిగింది. అది తొమ్మిదవ ప్రపంచ క్రికెట్ కప్, ఇందులో ఆటలన్నీ మామూలు వన్డే ఇంటర్నేషనల్ లాగే జరిగాయి.మొత్తం 51 మ్యాచ్ లు ఆడారు, 2003 ప్రపంచ క్రికెట్ కప్ కన్నా మూడు మ్యాచ్ లు ఎక్కువ ఆడారు. (2003 కన్నా రెండు జట్లు పెరిగాయి).

మొత్తం 16 జట్లు నాలుగు విభాగాలుగా పోటీ పడ్డాయి. ఒక్కొక్క విభాగంలో బాగా ఆడే జట్లు రెండు చొప్పున నాలుగు విభాగాల నుండి ఎనిమిది జట్లు సూపర్ 8 కి చేరుకున్నాయి.వీటిలో ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూ జీలాండ్ , దక్షిణ ఆఫ్రికా సెమీ-ఫైనల్స్ వరకు చేరాయి. ఆస్ట్రేలియా, శ్రీలంక పై ఫైనల్లో విజయం సాధించి వరుసగా మూడవ ప్రపంచ క్రికెట్ కప్ ను సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా ఈ టోర్నమెంట్ లో ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు. దీనితో ఆస్ట్రేలియా వరుసగా 29 మ్యాచ్ లు గెలిచింది. 1999 వరల్డ్ కప్ లో కూడా ఆస్ట్రేలియా ఇదే విధంగా అన్ని మ్యాచ్ లూ గెలిచింది.

ఈ టోర్నమెంట్ ముగిసాక వచ్చిన అధిక రాబడిలో 239 మిలియన్ డాలర్లు సభ్య దేశాలకు ఐసీసీ పంచింది.[1]

ఆతిధ్య దేశం ఎన్నిక

[మార్చు]
2007 ప్రపంచ కప్ లో వెస్ట్ ఇండీస్ లో ఆటలు జరిగే చోట్లు

ప్రపంచ క్రికెట్ కప్ వెస్ట్ ఇండీస్ లో జరగల్సిందిగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ రోటేషనల్ పాలసీ ద్వారా నిర్ధారించింది. ప్రపంచకప్ లు గెలవడంలో రెండవ విజయవంతమైన జట్టుగా వెస్ట్ ఇండీస్ నిలిచినా, ప్రపంచ క్రికెట్ కప్ కరీబియన్ దేశాల్లో జరగటం అదే మొదటిసారి.

అమెరికాలో అప్పటికి కొత్తగా నిర్మించిన లుదర్ హిల్, ఫ్లోరిడా,స్టేడియంలలో మ్యాచ్ లు జరగాలని పలు రకాలుగా ప్రయత్నించినా ఐసీసీ మాత్రం అన్ని మ్యాచ్ లను కెరిబియన్ దేశాలలో మాత్రమే నిర్వహించాలి అని నిర్ణయించింది. అలాగే బెర్ముడా, సెయింట్ విన్సెంట్ , గ్రెనడిన్స్ , జమైకా నుంచి వచ్చిన రెండు ప్రతిపాదనలను కూడా ఐసీసీ తిరస్కరించింది.

ప్రదేశాలు

[మార్చు]

వెస్ట్ ఇండీస్ లో ఎనిమిది క్రీడా స్థలాలను ప్రపంచ కప్ ఫైనల్ టోర్నమెంట్ కోసం ఎన్నుకున్నారు. వెస్ట్ ఇండీస్ దేశాలన్నీ ఆరు మ్యాచ్ లకు ఆతిథ్యాన్ని ఇచ్చాయి. వీటిలో సెయింట్. లూసియా, జమైకా , బార్బడోస్ (ఇవి ఫైనల్ కోసం ఆతిధ్యాన్ని ఇచ్చాయి) ఏడు మ్యాచ్లకు ఆతిథ్యాన్ని ఇచ్చాయి.

దేశం పట్టణం స్టేడియం కెపాసిటీ (ఎందరు కూర్చోగలరు) మ్యాచ్చులు ఖరీదు
ఆంటీగువా , బార్బుడా సెయింట్ జాన్స్ సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం 20,000 సూపర్ 8 యుయస్$54 మిలియన్ [2]
బార్బడోస్ బ్రిడ్జి టౌన్ కెన్సింగ్టన్ ఓవల్ 28,000 సూపర్ 8 & ఫైనల్ యుయస్$69.1 మిలియన్ [3]
గ్రెనడా సెయింట్ జార్జి'స్ క్వీన్స్ పార్క్ 20,000 సూపర్ 8
గుయానా జార్జి టౌన్ ప్రొవిడెన్స్ స్టేడియం 20,000 సూపర్ 8 యుయస్$26 మిలియన్/యుయస్$46 మిలియన్ [4]
జమైకా కింగ్స్టన్ సబిన పార్క్ 20,000 విభాగం డి & సెమీ-ఫైనల్ యుయస్$26 మిలియన్ [5]
సెయింట్ కిట్ట్స్ , నెవిస్ బస్సేట్టేర్రె వార్నర్ పార్క్ స్టేడియం 10,000 విభాగం ఎ యుయస్$12 మిలియన్
సెయింట్ లూసియా గ్రోస్ ఇస్లేట్ బెయుసేజౌర్ స్టేడియం 20,000 విభాగం సీ & సెమీ -ఫైనల్ యుయస్$13 మిలియన్ [6]
ట్రినిడాడ్ , టొబాగో పోర్ట్ అఫ్ స్పెయిన్ క్వీన్'స్ పార్క్ ఓవల్ 25,000 విభాగం బి

వీటితో పాటు నాలుగు ఆతిథ్య స్థలాల్లో ప్రాక్టీసు మ్యాచ్ లు నిర్వహించారు.

దేశం పట్టణం స్టేడియం పట్టే శక్తి ఖరీదు
బార్బడోస్ బ్రిడ్జి టౌన్ 3 డబల్యు యస్ ఓవల్ 8,500
జమైకా ట్రిలవ్నీ గ్రీన్ ఫీల్డ్ స్టేడియం 25,000 యుయస్$35 మిలియన్ [7]
సెయింట్ విన్సెంట్ , ది గ్రెనడిన్స్ కింగ్స్ టౌన్ ఆర్నోస్ వలె స్టేడియం 12,000
ట్రినిడాడ్ , టొబాగో సెయింట్. ఆగాస్టిన్ సర్ ఫ్రాంక్ వర్రేల్ మెమోరియల్ గ్రౌండ్ 22,000

జమైకన్ ప్రభుత్వం పిచ్ తయారీ కోసం 81 మిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చు చేసింది. ఈ మొత్తాన్ని సబినా పార్క్ మరమ్మత్తులకు, ట్రిలానిలో ఒక బహుళ అంతస్తుల కట్టడాన్ని నిర్మించడానికి ఉపయోగించారు. పిచ్ కాకుండా మిగతా ఖర్చుల కోసం ఇంకొక 20 మిలియన్ అమెరికన్ డాలర్లు వెచ్చించారు. దీనితో కలిపి మొత్తం ఖర్చు 100 మిలియన్ అమెరికన్ డాలర్లు అయింది (అనగా 7 బిలియన్ జమైకాన్ డాలర్లు).

విడివిడిగా సబిన పార్క్ మరమ్మత్తులకు 46 మిలియన్ అమెరికన్ డాలర్లు , ట్రిలానిలో స్టేడియం కోసం 35 మిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చయింది.[8][9] క్రీడా స్థలాల మీద వెచ్చించిన మొత్తం 301 మిలియన్ యుయస్ డాలర్లు

2006 సెప్టెంబరు 21 న ట్రినిడాడ్ లో ఉన్న బ్రియన్ లారా స్టేడియం టోర్నమెంట్ కు ముందు జరిగే వార్మ్-అప్ మ్యాచ్ లకు ఆతిధ్యానిచ్చే అర్హతను కోల్పోయింది.

అర్హత

[మార్చు]

ప్రపంచ క్రికెట్ కప్ లోనే ఎప్పుడూ లేనంత ఎక్కువగా పదహారు జట్లు పాల్గొన్నాయి. ఈ పదహారు జట్లకి వన్డే ఇంటర్నేషనల్ గుర్తింపు ఉంది. దీనిలో పది ఐసీసీ సభ్య దేశాలు కూడా కలవు (టెస్ట్ , వన్ డే అర్హత కలిగినవి):

  • ఆస్ట్రేలియా
  • బంగ్లాదేశ్
  • ఇంగ్లాండ్
  • భారతదేశం
  • న్యూజిలాండ్
  • పాకిస్తాన్
  • దక్షిణ ఆఫ్రికా
  • శ్రీలంక
  • వెస్ట్ ఇండీస్
  • జింబాబ్వే

మిగతా ఆరు ఓడిన దేశాలు కెన్యా (2009 వరకు ఓడిఐ అర్హత కలిగి ఉంది), మిగతా ఇదు జట్లు 2005 ఐసీసీ ట్రోఫీ ద్వారా అర్హత సాధించాయి. (2009 వరకు ఓడిఐ అర్హతను కలిగున్నాయి):

  • బెర్ముడా
  • కెనడా
  • కెన్యా
  • ఐర్లాండ్
  • నెదర్లాండ్స్
  • స్కాట్లాండ్

మీడియా కవరేజ్

[మార్చు]

ప్రపంచ క్రికెట్ కప్ లో జరిగిన ప్రతి టోర్నమేంట్ మీడియాకు ఒక ఈవెంట్లా మారిపొయాయి. 2003 , 2007 ప్రపంచ క్రికెట్ కప్ ను టీవీ ద్వారా ప్రదర్శించే హక్కులను 550 మిల్లియన్ యుయస్ డాలర్లకు[10] అమ్మేశారు. 2007 ప్రపంచ క్రికెట్ కప్ 200 దేశాల్లో టివి ద్వారా ప్రసారం చేశారు. దీనిని చూసిన వారు సుమారు రెండు బిలియన్ల కన్నా ఎక్కువ మంది ఉంటారని అంచనా, ప్రత్యక్షంగా వెస్ట్ ఇండీస్ స్టేడియంలలో చూడటానికి లక్ష కన్నా ఎక్కువ మంది ప్రయాణించి వచ్చారని అంచనా.[11][12]

కాషాయ రంగులో రక్కూన్ అనే అమెరికన్ జంతువును పోలివుండే "మేల్లో" (మస్కట్ పేరు)ని 2007 క్రికెట్ ప్రపంచ క్రికెట్ కప్ మస్కట్ (చిహ్నం)గా ఎంపికచేశారు. "మేల్లో"కి వయసు ఉండదు, ఆడ, మగ తేడా లేదు , అది ఏ జంతు జాతికి సంబంధించినది కాదని, కేవలం ఊహాత్మకంగా తయారుచేసినదని మ్యాచ్ జరిగేటప్పుడు వివరించారు. అది వెస్టిండీస్ యువత వైఖరికి ప్రతీకగా భావించారు. ప్రపంచ కప్ అధికారిక గీతంగా "ది గేమ్ అఫ్ లవ్ అండ్ యూనిటీ" ఎంపిక అయింది. జమైకాకు చెందిన షాగి, బార్బడైస్ కు చెందిన సంగీతకారుడు రూపీ, ట్రినిటాడ్ కి చెందిన ఫాయే జమైకాలో జన్మించిన షాగి, బాజన్ ఎంటర్టైనేర్ రూపీ, ట్రినిటాడ్ కి చెందిన ఫాయే-అన్ ల్యోన్స్ ఈ పాటని స్వరపరిచారు.

2007 ప్రపంచ క్రికెట్ కప్ టోర్నమేంట్ అత్యధిక మొత్తాన్ని వసూలు చేసింది, 672,000[13] పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. 2007 వరల్డ్ కప్ సెమీ-ఫైనల్స్ కి వచ్చినవారు 403,000; మ్యాచ్ కి[14] సుమారు 8,500 మందికి పెరిగారు.

లీడప్/కార్యక్రమ ప్రారంభం

[మార్చు]

టెస్ట్ మ్యాచ్ లు ఆడే ప్రధాన దేశాలన్నిటికీ వరల్డ్ కప్ కు ముందు చాలా వన్ డే మ్యాచ్ లు ఆడే విధంగా ఖరారు చేశారు. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ , ఇంగ్లాండ్ దేశాలు కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్ లో ఆడాయి. అందులో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాని ఓడించింది. ఆస్ట్రేలియా తరువాత న్యూజిల్యాండ్ వెళ్లి చాప్పెల్-హాడ్లీ ట్రోఫీలో తలపడి 3-0 తో ఓడిపోయింది. దక్షిణ ఆఫ్రికా ఇండియాతో అయిదు మ్యాచ్ లు (4-0 తో దక్షిణ ఆఫ్రికా గెలిచింది) , పాకిస్తాన్ తో అయిదు మ్యాచ్ లు (3-1 తో దక్షిణ ఆఫ్రికా గెలిచింది) ఆడింది. ఇండియా కూడా వెస్ట్ ఇండీస్ తో నాలుగు ( ఇండియా 3-1 తో గెలిచింది) శ్రీలంకతో నాలుగు (ఇండియా 2-1 తో గెలిచింది) మ్యాచ్ లు ఆడింది. బంగ్లాదేశ్ జింబాబ్వే పై నాలుగు మ్యాచ్ లు ఆడి (బంగ్లాదేశ్ 3-1 పాయింట్లతో నెగ్గింది) కెనడా బెర్ముడా పై ముక్కోణపు సిరీస్ గెలిచింది.అసోసియెట్ దేశాలు ఆడిన ప్రపంచ క్రికెట్ లీగ్ లో కెన్యా గెలిచింది. ఈ దేశాలు ఇంకొన్ని సిరీస్ లో కూడా ఆడాయి.

ప్రపంచ క్రికెట్ కప్ ముందు జట్ల యొక్క ర్యాంకులు ఈ క్రింది విధంగా ఉండేవి:

స్థానం జట్టు పాయింట్లు స్థానం జట్టు పాయింట్లు
1 దక్షిణ ఆఫ్రికా 128 9 బంగ్లాదేశ్ 42
2 ఆస్ట్రేలియా 125 10 జింబాబ్వే 22
3 న్యూజిలాండ్ 113 11 కెన్యా 0
4 పాకిస్తాన్ 111 12 స్కాట్లాండ్ 0% / 69%
5 భారతదేశం 109 13 neదర్లాండ్స్ 0% / 50%
6 శ్రీలంక 108 14 ఐర్లాండ్ 0% / 44%
7 ఇంగ్లాండ్ 106 15 కెనడా 0% / 33%
8 వెస్ట్ ఇండీస్ 101 16 బెర్ముడా 0% / 28%

గమనిక: 12-16 జట్లకు అధికారికంగాగా ర్యాంక్ లు లేవు. ఆ దేశాల్ని అసోసియెట్ దేశాలపై గెలుపు , ప్రధాన దేశాల మీద వాటి గెలుపు శాతాన్ని బట్టి ప్రపంచ క్రికెట్ కప్ కి ముందు ర్యాంకులను నిర్ణయిస్తారు.

వార్మ్-అప్ మ్యాచ్

[మార్చు]

16 దేశాలకు సంబంధించిన ఆటగాళ్ళు అందరు ప్రాక్టీసు కోసం వార్మ్-అప్ మ్యాచ్ లు ఆడారు, అవి వాళ్ళు కొత్త ట్రిక్కులు నేర్చుకోవడానికి, బాగా ప్రిపేర్ అవడానికి , వెస్ట్ ఇండీస్ వాతావరణానికి అలవాటు పడటానికి ఆడేవారు. ఈ వార్మ్-అప్ మ్యాచ్ లు వన్డేలుగా.[15] పరిగణనలోకి రావు. ఈ మ్యాచ్ లు 2007 మార్చి 5 సోమవారం నుంచి 2007 మార్చి 9 శుక్రవారం వరకు ఆడారు.ఈ మ్యాచ్ లలో బంగ్లాదేశ్ న్యూజీలాండ్ పై ఆశ్చర్యకరంగా గెలిచి సంచలనం నమోదుచేసింది.

ప్రారంభ వేడుక

[మార్చు]
ప్రారంభోత్సవంలో అలిసన్ హిండ్స్ ప్రదర్శన

ప్రపంచ క్రికెట్ కప్ 2007 ప్రారంభ వేడుక 2007 మార్చి 11, ఆదివారం జమైకాలో [16] ఉన్న ట్రేలానీ స్టేడియంలో జరిగింది.

ప్రారంభ వేడుకలో సుమారు 2000 మంది నృత్య, , ఇతర కళాకారులు పాల్గొన్నారు. వీరు వెస్ట్ ఇండీస్ కు సంబంధించిన కాల్య్ప్సో, రగ్గా , సోక ప్రాంతాలకు చెందిన వారు. కొంతమంది కళాకారుల పేర్లు సీన్ పాల్, బైరాన్ లీ, కెవిన్ లిత్త్లె, బెర్స్ హంమొండ్, లక్కీ దుబే, బుజు బంటన్, హాఫ్ పింట్, ఆరో, మచెల్ మోన్టనో, అలిసన్ హిండ్స్, టోనీ రెబల్, థర్డ్ వరల్డ్, గ్రెగొరీ ఇసాక్స్, డేవిడ్ రుద్దర్, శాగ్గి, జిమ్మి క్లిఫ్ఫ్.

ప్రారంభ దినోత్సవానికి జమైకా గవర్నర్ జెనరల్ తో పాటు వివిధ రాష్ట్రాల పెద్దలు హాజరయ్యారు.సర్ సర్ గార్ఫీల్డ్ సోబెర్స్; మొదట ప్రసంగించారు.జమైకా , గ్రెనడా ప్రధాన మంత్రులు మూడు సందేశాలు ఇచ్చారు.

నియమ నిబంధనలు

[మార్చు]

మ్యాచ్ లు

[మార్చు]

అన్ని మ్యాచ్ లు 09:30 నుంచి 17:15 మధ్య సమయంలో జరిగాయి. మొదటి ఇన్నింగ్స్ 09:30 నుంచి 13:00 మధ్యలో , రెండవ ఇన్నింగ్స్ 13:45 నుంచి 17:15 మధ్యలో జరిగాయి. జమైకా తప్ప మిగతా అన్ని క్రీడ స్థలాలలో సమయం యుటిసీ-4 ఉంది, కానీ జమైకా క్రీడ స్థలంలో మాత్రం సమయం యుటిసీ-5 ఉంది.

మ్యాచ్ లన్ని వన్ డే ఇంటర్నషనల్స్, అవి మామూలు ఓడిఐ నియమాలకు అనుగుణంగా సాగాయి. నియమానుసారం అన్ని మ్యాచ్ లలో ఇన్నింగ్స్ కి 50 ఓవర్లు ఉంటాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంపైర్లు కాని మ్యాచ్ రిఫరీలు కాని ఓవర్లు తగ్గించమంటే అప్పుడు తగ్గిస్తారు. ప్రతి బౌలర్ గరిష్ఠంగా 10 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయచ్చు.

వాతావరణం బాగోని పరిస్థితుల్లో ఫలితం తెలియడానికి, ఇద్దరి జట్లూ 20 ఓవర్లు ఆడాలి (ఒకవేళ మ్యాచ్ గెలవకపోతే, ఉదాహరణకి రెండవసారి బ్యాటింగ్ చేసే జట్టు 20 ఓవర్లు ముగియకుండా ముందుగ అందరు అవుట్ అయితే). వాతావరణం బాగోనప్పుడు, డక్వర్త్ లూయీస్ పద్ధతి ద్వారా ఫలితాన్ని తేలుస్తారు. ఒకవేళ ఫలితం కనక ఆ రోజు తెలియక పోతే, రెండు జట్లు తర్వాత రోజు ఆటని పూర్తి చేయడానికి ముందు రోజు వదిలేసిన స్కోరు నుంచి మళ్లీ ఆడటం మొదలు పెడతాయి.

క్యాచ్ అవుట్ సందర్భంలో సరిగా పట్టారో లేదో తేల్చడానికి కొత్త పద్ధతి అమల్లోకి తెచ్చారు, దాని ప్రకారం మూడవ ఎంపైర్ రీప్లే చూసి నిర్ధారిస్తారు: ఒకవేళ గ్రౌండ్లో నించున్న అంపైర్ క్యాచ్ సరిగా పట్టాడో లేదో, లేదా ఆ బంతి "బంప్ బాల్" అయిందో అన్న సందేహం ఉంటే మూడవ అంపైర్ను సంప్రదిస్తారు. టీవీ రేప్లే ద్వారా మూడవ అంపైర్ చూసి బ్యాట్స్ మాన్ బ్యాటుకు బంతి తగల్లేదనో, మరే విధంగానో దాన్ని క్యాచ్ గా పరిగణించలేమనో చెప్తే దాన్ని నాటౌట్ గా ప్రకటిస్తారు.

టోర్నమేంట్ పాయింట్లు

[మార్చు]

గ్రూప్ స్టేజిలో , సూపర్ 8 స్టేజీలో పాయింట్లను ఈ క్రింది విధంగా నిర్దేశిస్తారు:

పాయింట్లు
ఫలితము పాయింట్లు
నెగ్గినవి 2 పాయింట్లు
సమానమైనవి/ఫలితం తేలనివి 1 పాయింట్
ఓడినవి 0 పాయింట్

ప్రతి గ్రూపు నుండి బాగా ఆడిన రెండు జట్లు సూపర్ 8 కి చేరుకుంటాయి, , అవే గ్రూపులో ఉన్న జట్ల వద్ద గెలిచిన పాయింట్లు కూడా సూపర్ 8 లో తీసుకుంటారు.అదే గ్రూపులో అర్హత పొందని జట్ల వద్ద పాయింట్లు సంపాదిస్తే అవి ఉపయోగపడవు.సూపర్ 8 లో, ప్రతి జట్టు వేరే గ్రూపు నుంచి వచ్చిన మిగతా ఆరు జట్లతో ఆడి, గెలిచిన నాలుగు జట్లు సెమీ-ఫైనల్స్ కు చేరుకుంటాయి.జట్ల యొక్క స్థాయిని పాయింట్ల ద్వారా నిర్దేశిస్తాయి.ఒకవేళ రెండు లేదా మూడు జట్లు సమానం అయితే, ఈ క్రింది పద్ధతులను పాయింట్ల విభజన కోసం వాడతారు.

  1. వారి గ్రూపులో కాని సూపర్ 8లో కాని ఎక్కువ సార్లు గెలిచిన జట్లకు పాయింట్లు ఇవ్వటం జరుగుతుంది.
  2. ఎక్కువ నెట్ రన్ రేట్
  3. ఒక బంతికి ఎన్ని ఎక్కువ వికెట్లు తీస్తారో
  4. ఒకరి ఫై ఒకరు ఆడిన మ్యాచ్ లో గెలుపు.
  5. లాటరీ పద్ధతి

విభాగాలు

[మార్చు]

సీడ్స్

[మార్చు]

టోర్నమేంట్ లీగ్ స్టేజీలో మొదలై ఒక్కొక్క విభాగంలో నలుగురు చొప్పున నాలుగు విభాగాలుగా విభజించారు.అదే విభాగంలో ఉన్న జట్లతో ఒక్కసారైనా ఒకరితో ఒకరు ఆడాలి. ఆస్ట్రేలియా,ఇండియా,ఇంగ్లాండ్ , వెస్ట్ ఇండీస్ టీంలను వేరే వేరే విభాగాల్లో నియమించారు, ఈ నాలుగు టీంలకు అభిమానులు ఎక్కువ వస్తారని అంచనా అందుకు కారణం, పైగా వెస్ట్ ఇండీస్లో ప్రయాణ సౌకర్యాలు, ఆతిధ్య వసతులు ఎక్కువ లేవు.

వివిధ విభాగాలను కింది పట్టికలో చూపించిన విధంగా విభజించారు. (ఏప్రిల్ 2005 ర్యాంకులు) ప్రతి విభాగం అన్ని మ్యాచ్ లను ఒకే క్రీడా స్థలంలో ఆడాయి.

విభాగం ఏ విభాగం బి విభాగం సీ విభాగం డి
 ఆస్ట్రేలియా (1)
 దక్షిణాఫ్రికా (5)
 స్కాట్‌లాండ్ (12)
 నెదర్లాండ్స్ (16)
 శ్రీలంక (2)
 భారతదేశం (6)
 బంగ్లాదేశ్ (11)
 బెర్ముడా (15)
 న్యూజీలాండ్ (3)
 ఇంగ్లాండు (7)
 కెన్యా (10)
 కెనడా (14)
 పాకిస్తాన్ (4)
 వెస్ట్ ఇండీస్ (8)
 జింబాబ్వే (9)
 Ireland (13)

పద్ధతి

[మార్చు]

ఆటగాళ్లను ఉత్తేజపరచడానికి టోర్నమేంట్లో చాల వార్మ్-అప్ మ్యాచ్ లు జరిగాయి. గ్రూపులగా ఆడిన మ్యాచ్ లు 13 మార్చి మంగళవారం మొదలైయ్యి 25 మార్చి ఆదివారం ముగుస్తాయి. గ్రూపులుగా మొత్తం 24 మ్యాచ్ లు ఆడారు.

ప్రతి గ్రూపులో బాగా ఆడిన రెండు జట్లు లీగ్ పద్ధతి ద్వారా "సూపర్ 8" స్టేజికి వెళ్తాయి. ప్రతి జట్టు ముందు ఆటల నుంచి గెలిచిన వాళ్ళ స్కోరును సూపర్ 8 స్టేజికి తీసుకు వెళ్తారు. అక్కడ మిగతా గ్రూపుల నుంచి గెలిచిన ఆరు జట్లతో మళ్లీ ఆడతారు.లీగ్ లో ఉన్న మొదటి నాలుగు జట్లు సెమీ-ఫైనల్స్ కు చేరుకుంటాయి.ఈ పద్ధతిని ఇంతక ముందు ప్రపంచ కప్ లాగా సూపర్ 6 కాకుండా సూపర్ 8 గా మార్చారు. ఈ సూపర్ 8 మ్యాచ్ లు 27 మార్చి, మంగళవారం నుంచి 21 ఏప్రిల్, శనివారం వరకు జరిగాయి. ఈ సూపర్ 8 స్టేజిలో మొత్తం 24 మ్యాచ్ లు ఆడారు.

"సూపర్ 8"లో బాగా ఆడిన నాలుగు జట్లు సెమీ-ఫైనల్స్ కు చేరుకుంటాయి. టోర్నమెంట్ లో #1 జట్టు #4 జట్టుతో ఇంకా #2 జట్టు #3 జట్టుతో తలపడతాయి. ఓడిపోయిన జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది. సెమీ-ఫైనల్లో గెలిచిన రెండు జట్లు ఫైనల్స్ లో తలపడతాయి.

ఒకవేళ వాతావరణం బాగుండకపోతే ఆడటానికి వీలుగా ప్రతి టోర్నమేంట్ మ్యాచ్ లో ఒక రోజు మిగిలి ఉండేలా చూసుకున్నారు.

గ్రూప్ దశలు

[మార్చు]

గ్రూప్ ఎ

[మార్చు]

అన్ని మ్యాచ్ లు 1330 యు.టి.సి. వద్ద మొదలవుతాయి.

జట్టు పాయింట్లు ఆడినవి గెలిచినవి టై ఓడినవి ఫలితం తేలనివి నెట్ రన్ రేట్
ఆస్ట్రేలియా 6 3 3 0 0 0 +3.433
దక్షిణాఫ్రికా 4 3 2 0 1 0 +2.403
నెదర్లాండ్స్ 2 3 1 0 2 0 -2.527
స్కాట్లాండ్ 0 3 0 0 3 0 -3.793
14 మార్చి 2007
ఆస్ట్రేలియా
334/6 (50 ఓవర్లు)
v
స్కాట్లాండ్
131/9 (40.1 ఓవర్లు)
రికీ పాంటింగ్ 113 (93)
మజిద్ హక్2/49 (7 ఓవర్లు)
కాలిన్ స్మిత్ 51 (76)
గ్లెన్ మెక్ గ్రాత్ 3/14 (6 ఓవర్లు)
203 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది
వార్నర్ పార్క్ స్టేడియం, బాసెటెరె, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్
అంపైర్లు: స్టీవ్ బక్నర్, అశోకా డి సెల్వ
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రికీ పాంటింగ్

16 మార్చి 2007
దక్షిణాఫ్రికా
353/3 (40 ఓవర్లు)
v
నెదర్లాండ్స్
132/9 (40 ఓవర్లు)
జాక్వస్ కలిస్ 128* (109)
బిల్లీ స్టెల్లింగ్ 1/43 (8 ఓవర్లు)
ఆర్.టెన్ డొస్చటె 57 (75)
జస్టిన్ కెంప్ 2/18 (4 ఓవర్లు)
దక్షిణాఫ్రికా won by 221 runs
వార్నర్ పార్క్ స్టేడియం, బాసెటెరె, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్
అంపైర్లు: మార్క్ బెన్సన్, టోనీ హిల్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హెర్చ్సెల్లె గిబ్స్
  • మ్యాచ్ వాన కారణంగా 40 ఓవర్లకు కుదించారు.

18 మార్చి 2007
ఆస్ట్రేలియా
358/5 (50 ఓవర్లు)
v
నెదర్లాండ్స్
129 ఆలౌట్ (26.5 ఓవర్లు)
బ్రాడ్ హోడ్జ్ 123 (89)
టిమ్ డె లీడె2/40 (10 ఓవర్లు)
డాన్ వాన్ బంగ్ 33 (33)
బ్రాడ్ హాగ్ 4/27 (4.5 ఓవర్లు)
ఆస్ట్రేలియా 229 పరుగులతో గెలిచింది
వార్నర్ పార్క్ స్టేడియం, బాసెటెరె, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్
అంపైర్లు: స్టీవ్ బక్నర్, టోనీ హిల్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: బ్రాడ్ హోడ్జ్

20 మార్చి 2007
స్కాట్లాండ్
186/8 (50 ఓవర్లు)
v
దక్షిణాఫ్రికా
188/3 (23.2 ఓవర్లు)
డోగీ బ్రౌన్ 45* (64)
ఆండ్రూ హాల్ 3/48 (10 ఓవర్లు)
గ్రేమ్ స్మిత్ 91 (65)
మజిద్ హక్2/43 (6 ఓవర్లు)
దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో గెలిచింది
వార్నర్ పార్క్ స్టేడియం, బాసెటెరె, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్
అంపైర్లు: మార్క్ బెన్సన్, అశోకా డి సెల్వ
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: గ్రేమ్ స్మిత్

22 మార్చి 2007
స్కాట్లాండ్
136 ఆలౌట్ (34.1 ఓవర్లు)
v
నెదర్లాండ్స్
140/2 (23.5 ఓవర్లు)
గ్లెన్ రోజర్స్ 26 (30)
బిల్లీ స్టెల్లింగ్ 3/12 (8 ఓవర్లు)
ఆర్.టెన్ డొస్చటె 70* (68)
జాన్ బ్లైన్ 2/29 (5 ఓవర్లు)
నెదర్లాండ్స్ 8 వికెట్ల తేడాతో గెలిచింది
వార్నర్ పార్క్ స్టేడియం, బాసెటెరె, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్
అంపైర్లు: అశోకా డి సెల్వ, టోనీ హిల్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: బిల్లీ స్టెల్లింగ్

24 మార్చి 2007
ఆస్ట్రేలియా
377/6 (50 ఓవర్లు)
v
దక్షిణాఫ్రికా
294 ఆలౌట్ (48 ఓవర్లు)
మాథ్యూ హెడెన్ 101 (68)
ఆండ్రూ హాల్ 2/60 (10 ఓవర్లు)
ఎబె డి విలియర్స్92 (70)
బ్రాడ్ హాగ్ 3/61 (10 ఓవర్లు)
ఆస్ట్రేలియా 83 పరుగుల తేడాతో గెలిచింది
వార్నర్ పార్క్ స్టేడియం, బాసెటెరె, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్
అంపైర్లు: మార్క్ బెన్సన్, స్టీవ్ బక్నర్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మాథ్యూ హెడెన్

విభాగం బి

[మార్చు]

అన్ని మ్యాచ్ లు 1330 యు.టి.సి. వద్ద మొదలవుతాయి.

జట్టు పాయింట్లు ఆడినవి గెలిచినవి టై ఓడినవి ఫలితం తేలనివి నెట్ రన్ రేట్
శ్రీలంక 6 3 3 0 0 0 +3.493
బంగ్లాదేశ్ 4 3 2 0 1 0 -1.523
భారతదేశం 2 3 1 0 2 0 +1.206
బెర్ముడా 0 3 0 0 3 0 -4.345
15 మార్చి 2007
శ్రీలంక
321/6 (50 ఓవర్లు)
v
బెర్ముడా
78 ఆలౌట్ (24.4 ఓవర్లు)
మహేళా జయవర్ధనే 85 (90)
సలీం ముకుద్దం 2/50 (10 ఓవర్లు)
లియొనెల్ కాన్ 28 (32)
ఫర్వీజ్ మహరూఫ్ 4/23 (7 ఓవర్లు)
శ్రీలంక 243 పరుగుల తేడాతో గెలిచింది
క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్, టొబాగో
అంపైర్లు: డారెల్ హార్పర్, ఇయాన్ హోవెల్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మహేళా జయవర్ధనే

17 మార్చి 2007
భారతదేశం
191 ఆలౌట్ (49.3 ఓవర్లు)
v
బంగ్లాదేశ్
192/5 (48.3 ఓవర్లు)
సౌరవ్ గంగూలీ 66 (129)
మష్రాఫ్ మొర్తెజా 4/38 (9.3 ఓవర్లు)
ముష్ఫికర్ రహీం 56* (107)
వీరేంద్ర సెహ్వాగ్ 2/17 (5 ఓవర్లు)
బంగ్లాదేశ్ 5 వికెట్ల తేడాతో గెలిచింది
క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్, టొబాగో
అంపైర్లు: అలీం డర్, స్టీవ్ డేవిస్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మష్రాఫ్ మొర్తెజా

19 మార్చి 2007
భారతదేశం
413/5 (50 ఓవర్లు)
v
బెర్ముడా
156 ఆలౌట్ (43.1 ఓవర్లు)
వీరేంద్ర సెహ్వాగ్ 114 (87)
డెల్యోన్ బార్డెన్ 2/30 (5 ఓవర్లు)
డేవిడ్ హెంప్ 76* (105)
అజిత్ అగార్కర్ 3/38 (10 ఓవర్లు)
భారతదేశం 257 పరుగుల తేడాతో గెలిచింది
క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్, టొబాగో
అంపైర్లు: అలీం డర్, ఇయాన్ హోవెల్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: వీరేంద్ర సెహ్వాగ్

21 మార్చి 2007
శ్రీలంక
318/4 (50 ఓవర్లు)
v
బంగ్లాదేశ్
112 ఆలౌట్ (37 of 46 ఓవర్లు)
సనత్ జయసూర్య 109 (87)
మహమ్మద్ రఫీక్ 1/48 (10 ఓవర్లు)
మహమ్మద్ అష్రాఫుల్ 45* (63)
లసిత్ మలింగ 3/27 (6 ఓవర్లు)
శ్రీలంక 198 పరుగుల తేడాతో గెలిచింది (డక్ వర్త్ లూయీస్ పద్ధతి)
క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్, టొబాగో
అంపైర్లు: స్టీవ్ డేవిస్, డారెల్ హార్పర్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సనత్ జయసూర్య
  • వర్షం కారణంగా మ్యాచ్ కుదించారు; డక్ వర్త్ లూయీస్ పద్ధతిలో గెలుపు కోసం సవరించిన లక్ష్యం: బంగ్లాదేశ్ గెలుపుకు 46 ఓవర్లలో 311 పరుగులు.

23 మార్చి 2007
శ్రీలంక
254/6 (50 ఓవర్లు)
v
భారతదేశం
185 ఆలౌట్ (43.3 ఓవర్లు)
ఉపుల్ తరంగ 64 (90)
జహీర్ ఖాన్ 2/49 (10 ఓవర్లు)
రాహుల్ ద్రవిడ్ 60 (82)
ముత్తయ్య మురళీధరన్ 3/41 (10 ఓవర్లు)
శ్రీలంక 69 పరుగుల తేడాతో గెలిచంది
క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్, టొబాగో
అంపైర్లు: అలీం డర్, డారెల్ హార్పర్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ముత్తయ్య మురళీధరన్

25 మార్చి 2007
బెర్ముడా
94/9 (21 ఓవర్లు)
v
బంగ్లాదేశ్
96/3 (17.3 of 21 ఓవర్లు)
డేన్ మైనర్స్ 23 (25)
అబ్దుర్ రజాక్ 3/20 (4 ఓవర్లు)
మహమ్మద్ అష్రాఫుల్ 29* (32)
సలీం ముకుద్దం3/19 (5 ఓవర్లు)
బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో గెలిచింది (డక్ వర్త్ లూయీస్ పద్ధతి)
క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్, టొబాగో
అంపైర్లు: స్టీవ్ డేవిస్, ఇయాన్ హోవెల్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మహమ్మద్ అష్రాఫుల్
  • బెర్ముడా ఇన్నింగ్స్ సమయంలో వర్షం కారణంగా మ్యాచ్ 21 ఓవర్లకు తగ్గించారు; డక్ వర్త్ లూయీస్ పద్ధతిలో గెలుపు కోసం సవరించిన లక్ష్యం: బంగ్లాదేశ్ విజయానికి 96 పరుగులు.

విభాగం సి

[మార్చు]

అన్ని మ్యాచ్ లు 1330 యు.టి.సి. వద్ద మొదలవుతాయి.

జట్టు పాయింట్లు ఆడినవి గెలిచినవి టై ఓడినవి ఫలితం తేలనివి నెట్ రన్ రేట్
న్యూజిలాండ్ 6 3 3 0 0 0 +2.138
ఇంగ్లాండ్ 4 3 2 0 1 0 +0.418
కెన్యా 2 3 1 0 2 0 -1.194
కెనడా 0 3 0 0 3 0 -1.389
14 మార్చి 2007
కెనడా
199 ఆలౌట్ (50 ఓవర్లు)
v
కెన్యా
203/3 (43.2 ఓవర్లు)
జి.బర్నెట్ 41 (50)
జిమ్మీ కమాండె 2/25 (10 ఓవర్లు)
స్టీవ్ టికొలో 72* (76)
సునీల్ ధనిరాం 1/34 (9 ఓవర్లు)
కెన్యా 7 వికెట్ల తేడాతో గెలిచింది
బేవ్సెజార్ స్టేడియం, గ్రాస్ ఐలెట్, సెయింట్ లూసియా
అంపైర్లు: అసద్ రాఫ్, పీటర్ పార్కర్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: స్టీవ్ టికొలో

16 మార్చి 2007
ఇంగ్లాండ్
209/7 (50 ఓవర్లు)
v
న్యూజిలాండ్
210/4 (41 ఓవర్లు)
కెవిన్ పీటర్సన్ 60 (92)
షేన్ బాండ్ 2/19 (10 ఓవర్లు)
స్కాట్ స్టైరిస్ 87 (113)
జేమ్స్, ఎర్సన్ 2/39 (8 ఓవర్లు)
న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో గెలచింది
బేవ్సెజార్ స్టేడియం, గ్రాస్ ఐలెట్, సెయింట్ లూసియా
అంపైర్లు: అసద్ రాఫ్, రాడీ కెర్ట్ జెన్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: స్కాట్ స్టైరిస్

18 మార్చి 2007
ఇంగ్లాండ్
279/6 (50 ఓవర్లు)
v
కెనడా
228/7 (50 ఓవర్లు)
ఎడ్ జోయ్స్ 66 (103)
సునీల్ ధనిరాం 3/41 (10 ఓవర్లు)
ఆసిఫ్ ముల్లా 58 (60)
రవీంద్ర బోపార 2/43 (9 ఓవర్లు)
ఇంగ్లాండ్ 51 పరుగుల తేడాతో గెలిచింది
బేవ్సెజార్ స్టేడియం, గ్రాస్ ఐలెట్, సెయింట్ లూసియా
అంపైర్లు: బిల్లీ డాక్ట్రోవ్, పీటర్ పార్కర్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: Paul Collingwood

20 మార్చి 2007
న్యూజిలాండ్
331/7 (50 ఓవర్లు)
v
కెన్యా
183 ఆలౌట్ (49.2 ఓవర్లు)
రాస్ టేలర్85 (107)
థామస్ ఓడొయో 2/55 (10 ఓవర్లు)
రవీందు షా 81 (89)
జేమ్స్ ఫ్రాంక్లిన్ 2/20 (7.2 ఓవర్లు)
న్యూజిలాండ్ 148 పరుగుల తేడాతో గెలిచింది.
బేవ్సెజార్ స్టేడియం, గ్రాస్ ఐలెట్, సెయింట్ లూసియా
అంపైర్లు: బిల్లీ డాక్ట్రోవ్, రాడీ కెర్ట్ జెన్

22 మార్చి 2007
న్యూజిలాండ్
363/5 (50 ఓవర్లు)
v
కెనడా
249/9 (49.2 ఓవర్లు)
లోవ్ విన్సెంట్ 101 (107)
కెవిన సంధర్ 2/58 (10 ఓవర్లు)
జాన్ డేవిడ్ సన్ 53 (31)
జీతన్ పటేల్ 3/25 (9.2 ఓవర్లు)
న్యూజిలాండ్ 144 పరుగుల తేడాతో గెలిచింది.
బేవ్సెజార్ స్టేడియం, గ్రాస్ ఐలెట్, సెయింట్ లూసియా
అంపైర్లు: అసద్ రాఫ్, బిల్లీ డాక్ట్రోవ్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: లోవ్ విన్సెంట్

24 మార్చి 2007
(scorecard)
కెన్యా
177 ఆలౌట్ (43 ఓవర్లు)
v
ఇంగ్లాండ్
178/3 (33 of 43 ఓవర్లు)
స్టీవ్ టికొలో 76 (97)
జేమ్స్, ఎర్సన్ 2/27 (9 ఓవర్లు)
ఎడ్ జోయ్స్ 75 (90)
థామస్ ఓడొయో 1/27 (6 ఓవర్లు)
ఇంగ్లాండ్ 7 వికెట్ల తేడాతో గెలిచింది
బేవ్సెజార్ స్టేడియం, గ్రాస్ ఐలెట్, సెయింట్ లూసియా, Att: 10,800
అంపైర్లు: రాడీ కెర్ట్ జెన్, పీటర్ పార్కర్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఎడ్ జోయ్స్
  • రాత్రి నుంచీ కురిసిన వర్షం వల్ల ప్రారంభం ఆలస్యం. మ్యాచ్ ఇరువైపులా 43 ఓవర్లకు కుదించారు.

విభాగం డి

[మార్చు]

అన్ని మ్యాచ్ లు 1430 యూటీసీ వద్ద మొదలయ్యాయి.

జట్టు పాయింట్లు ఆడినవి గెలిచినవి టై ఓడినవి ఫలితం తేలనివి నెట్ రన్ రేట్
వెస్టిండీస్ 6 3 3 0 0 0 +0.764
ఐర్లాండ్ 3 3 1 1 1 0 -0.092
పాకిస్తాన్ 2 3 1 0 2 0 +0.089
జింబాబ్వే 1 3 0 1 2 0 -0.886
13 మార్చి 2007
వెస్టిండీస్
241/9 (50 ఓవర్లు)
v
పాకిస్తాన్
187 ఆలౌట్ (47.2 ఓవర్లు)
మర్లోన్ శామ్యూల్స్ 63 (70)
ఇఫ్తిఖర్ అంజుమ్ 3/44 (10 ఓవర్లు)
షోయిబ్ మాలిక్ 62 (54)
డి.స్మిత్ 3/36 (10 ఓవర్లు)
వెస్టిండీస్ 54 పరుగుల తేడాతో గెలిచింది
సబీనా పార్క్, కింగ్ స్టన్, జమైకా
అంపైర్లు: బిల్లీ బౌడెన్, సిమోన్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ద్వాయ్నే స్మిత్

15 మార్చి 2007
ఐర్లాండ్
221/9 (50 ఓవర్లు)
v
జింబాబ్వే
221 ఆలౌట్ (50 ఓవర్లు)
జెరెమె బ్రే 115* (139)
ఎల్టాన్ చిగుంబరా 2/21 (6 ఓవర్లు)
స్టూవర్ట్ మత్సికెన్యెరి 73* (77)
కైలె మెక్ కలన్ 2/56 (9 ఓవర్లు)
మ్యాచ్ టై అయింది
సబీనా పార్క్, కింగ్ స్టన్, జమైకా, Att: 2,011
అంపైర్లు: ఇయాన్ గ్లౌడ్, బ్రియాన్ జెర్లింగ్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జెరెమె బ్రే

17 మార్చి 2007
పాకిస్తాన్
132 ఆలౌట్ (45.4 ఓవర్లు)
v
ఐర్లాండ్
133/7 (41.4 ఓవర్లు)
కమ్రాన్ అక్మల్ 27 (53)
బోయ్డ్ రాంకిన్ 3/32 (9 ఓవర్లు)
నియాల్ ఓ'బ్రియాన్ 72 (106)
మహమ్మద్ సమి 3/29 (10 ఓవర్లు)
ఐర్లాండ్ 3 వికెట్ల తేడాతో గెలిచింది (డక్ వర్త్ లూయీస్ పద్ధతి)
సబీనా పార్క్, కింగ్ స్టన్, జమైకా
అంపైర్లు: బిల్లీ బౌడెన్, బ్రియాన్ జెర్లింగ్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: నియాల్ ఓ'బ్రియాన్
  • తక్కువ కాంతి, వర్షం కారణంగా మ్యాచ్ కుదించారు; డక్ వర్త్ లూయీస్ పద్ధతిలో గెలుపు కోసం సవరించిన లక్ష్యం: 47 ఓవర్లలో ఐర్లాండ్ కి 128 పరుగులు.

19 మార్చి 2007
జింబాబ్వే
202/5 (50 ఓవర్లు)
v
వెస్టిండీస్
204/4 (47.5 ఓవర్లు)
సీన్ విలియమ్స్ 70* (88)
జెరోమ్ టైలర్ 2/42 (10 ఓవర్లు)
బ్రియాన్ లారా 44* (68)
క్రిస్టోఫర్ మ్ఫోహు 1/34 (9 ఓవర్లు)
వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో గెలిచింది
సబీనా పార్క్, కింగ్ స్టన్, జమైకా
అంపైర్లు: ఇయాన్ గ్లౌడ్, సిమోన్ టౌఫెల్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సీన్ విలియమ్స్

21 మార్చి 2007
పాకిస్తాన్
349 ఆలౌట్ (49.5 ఓవర్లు)
v
జింబాబ్వే
99 ఆలౌట్ (19.1 of 20 ఓవర్లు)
ఇమ్రాన్ నాజిర్ 160 (121)
గ్యారీ బెంట్ 3/68 (10 ఓవర్లు)
ఎల్టాన్ జిగుంబరా 27 (11)
షాహిద్ అఫ్రిదీ 3/20 (4 ఓవర్లు)
93 పరుగుల తేడాతో పాకిస్తాన్ గెలిచంది (డక్ వర్త్ లూయీస్ పద్ధతి)
సబీనా పార్క్, కింగ్ స్టన్, జమైకా
అంపైర్లు: బ్రియాన్ జెర్లింగ్, సిమోన్ టోఫెల్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఇమ్రాన్ నాజిర్
  • వర్షం కారణంగా మ్యాచ్ కుదించారు; డక్ వర్త్ లూయీస్ పద్ధతిలో గెలుపు కోసం సవరించిన లక్ష్యం: జింబాబ్వే విజయానికి 20 ఓవర్లలో 193 పరుగులు.

23 మార్చి 2007
ఐర్లాండ్
183/8 (48 ఓవర్లు)
v
వెస్టిండీస్
190/2 (38.1 of 48 ఓవర్లు)
జెరెమె బ్రే 41 (71)
క్రిస్ గేల్ 2/23 (10 ఓవర్లు)
శివ్ నారినె చందర్ పాల్ 102* (113)
కైలె మెక్ కలన్1/35 (10 ఓవర్లు)
వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో గెలిచింది (డక్ వర్త్ లూయీస్ పద్ధతి)
సబీనా పార్క్, కింగ్ స్టన్, జమైకా
అంపైర్లు: బిల్లీ బౌడెన్, ఇయాన్ గ్లౌడ్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శివ్ నారినె చందర్ పాల్
  • వర్షం కారణంగా మ్యాచ్ కుదించారు; డక్ వర్త్ లూయీస్ పద్ధతిలో గెలుపు కోసం సవరించిన లక్ష్యం: వెస్టిండీస్ విజయానికి 48 ఓవర్లలో 190 పరుగులు.

సూపర్ 8 స్టేజి

[మార్చు]

ప్రతి తొలి రౌండ్ గ్రూపు నుంచి టాప్ రెండు జట్లు సూపర్ ఎయిట్ స్టేజి పొందారు. అయితే ఎనిమిది జట్లూ ఒక్కొక్కటి ఏడు కాకుండా ఆరు మ్యాచులే ఆడాయి, ప్రతి జట్టు తమ ప్రతినిధియైన వారి ఫలితాన్ని కూడా లెక్కించారు. తద్వారా కింది పట్టికలో, ఒక్కొక్క జట్టుకు ఏడు మ్యాచులు కనిపిస్తాయి.

పచ్చరంగు నేపథ్యంతో చూపించిన జట్లు సెమీఫైనల్స్ కు అర్హతసాధించాయి.

Team ఆడినవి గెలిచినవి టై అయినవి ఓడినవి ఫలితం తేలనివి నెట్ రన్ రేట్ పాయింట్లు
ఆస్ట్రేలియా 7 7 0 0 0 +2.400 14
శ్రీలంక 7 5 0 2 0 +1.483 10
న్యూజిలాండ్ 7 5 0 2 0 +0.253 10
దక్షిణాఫ్రికా 7 4 0 3 0 +0.313 8
ఇంగ్లాండ్ 7 3 0 4 0 −0.394 6
వెస్టిండీస్ 7 2 0 5 0 −0.566 4
బంగ్లాదేశ్ 7 1 0 6 0 −1.514 2
ఐర్లాండ్ 7 1 0 6 0 −1.730 2
27 మార్చి2007
స్కోర్ కార్డ్
ఆస్ట్రేలియా
322/6 (50 ఓవర్లు)
v వెస్టిండీస్
219 (45.3 ఓవర్లు)
ఆస్ట్రేలియా 103 పరుగులతో గెలిచింది.
సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం, నార్త్ సౌండ్, ఆంటిగ్వా అండ్ బర్బుడా
28 మార్చి2007
స్కోర్ కార్డ్
శ్రీలంక
209 (49.3 ఓవర్లు)
v దక్షిణాఫ్రికా
212/9 (48.2 ఓవర్లు)
దక్షిణాఫ్రికా 1 వికెట్ తేడాతో గెలిచింది
ప్రావిన్స్ స్టేడియం, జార్జియా టౌన్, గయానా
29 మార్చి2007
స్కోర్ కార్డ్
వెస్టిండీస్
177 (44.4 ఓవర్లు)
v న్యూజిలాండ్
179/3 (39.2 ఓవర్లు)
న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో గెలిచింది
సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం, నార్త్ సౌండ్, ఆంటిగ్వా అండ్ బర్బుడా
30 మార్చి2007
స్కోర్ కార్డ్
ఇంగ్లాండ్
266/7 (50 ఓవర్లు)
v ఐర్లాండ్
218 (48.1 ఓవర్లు)
ఇంగ్లాండ్ 48 పరుగుల తేడాతో గెలిచింది
ప్రావిన్స్ స్టేడియం, జార్జియా టౌన్, గయానా
31 మార్చి2007
స్కోర్ కార్డ్
బంగ్లాదేశ్
104/6 (22 ఓవర్లు)
v ఆస్ట్రేలియా
106/0 (13.5 ఓవర్లు)
ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో గెలిచింది
సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం, నార్త్ సౌండ్, ఆంటిగ్వా అండ్ బర్బుడా
1 ఏప్రిల్ 2007
స్కోర్ కార్డ్
శ్రీలంక
303/5 (50 ఓవర్లు)
v వెస్టిండీస్
190 (44.3 ఓవర్లు)
శ్రీలంక 113 పరుగుల తేడాతో గెలిచింది
ప్రావిన్స్ స్టేడియం, జార్జియా టౌన్, గయానా
2 ఏప్రిల్ 2007
స్కోర్ కార్డ్
బంగ్లాదేశ్
174 (48.3 ఓవర్లు)
v న్యూజిలాండ్
178/1 (29.2 ఓవర్లు)
న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో గెలిచింది
సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం, నార్త్ సౌండ్, ఆంటిగ్వా అండ్ బర్బుడా
3 ఏప్రిల్ 2007
స్కోర్ కార్డ్
ఐర్లాండ్
152/8 (35 ఓవర్లు)
v దక్షిణాఫ్రికా
165/3 (31.3 ఓవర్లు)
దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో గెలిచింది (డక్వర్త్-లూయీస్ పద్ధతి)
ప్రావిన్స్ స్టేడియం, జార్జియా టౌన్, గయానా
4 ఏప్రిల్ 2007
స్కోర్ కార్డ్
శ్రీలంక
235 (50 ఓవర్లు)
v ఇంగ్లాండ్
233/8 (50 ఓవర్లు)
శ్రీలంక 2 పరుగుల తేడాతో గెలిచింది
సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం, నార్త్ సౌండ్, ఆంటిగ్వా అండ్ బర్బుడా
7 ఏప్రిల్ 2007
స్కోర్ కార్డ్
బంగ్లాదేశ్
251/8 (50 ఓవర్లు)
v దక్షిణాఫ్రికా
184 (48.4 ఓవర్లు)
బంగ్లాదేశ్ 67 పరుగుల తేడాతో గెలిచింది
ప్రావిన్స్ స్టేడియం, జార్జియా టౌన్, గయానా
8 ఏప్రిల్ 2007
స్కోర్ కార్డ్
ఇంగ్లాండ్
247 (49.5 ఓవర్లు)
v ఆస్ట్రేలియా
248/3 (47.2 ఓవర్లు)
ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో గెలిచింది
సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం, నార్త్ సౌండ్, ఆంటిగ్వా అండ్ బర్బుడా
9 ఏప్రిల్ 2007
స్కోర్ కార్డ్
న్యూజిలాండ్
263/8 (50 ఓవర్లు)
v ఐర్లాండ్
134 (37.4 ఓవర్లు)
న్యూజిలాండ్ 129 పరుగుల తేడాతో గెలిచింది
ప్రావిన్స్ స్టేడియం, జార్జియా టౌన్, గయానా
10 ఏప్రిల్ 2007
స్కోర్ కార్డ్
దక్షిణాఫ్రికా
356/4 (50 ఓవర్లు)
v వెస్టిండీస్
289/9 (50 ఓవర్లు)
దక్షిణాఫ్రికా 67 పరుగుల తేడాతో గెలిచింది
క్వీన్స్ పార్క్, సెయింట్ జార్జ్, గ్రెనడా
11 ఏప్రిల్ 2007
స్కోర్ కార్డ్
బంగ్లాదేశ్
143 (37.2 ఓవర్లు)
v ఇంగ్లాండ్
147/6 (44.5 ఓవర్లు)
ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో గెలచింది
కీన్సింగ్టన్ ఓవల్, బ్రిడ్జ్ టౌన్, బార్బడోస్
12 ఏప్రిల్ 2007
స్కోర్ కార్డ్
న్యూజిలాండ్
219/7 (50 ఓవర్లు)
v శ్రీలంక
222/4 (45.1 ఓవర్లు)
శ్రీలంక 6 వికెట్ల తేడాతో గెలిచింది
క్వీన్స్ పార్క్, సెయింట్ జార్జ్, గ్రెనడా
13 ఏప్రిల్ 2007
స్కోర్ కార్డ్
ఐర్లాండ్
91 (30 ఓవర్లు)
v ఆస్ట్రేలియా
92/1 (12.2 ఓవర్లు)
ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో గెలిచింది
కీన్సింగ్టన్ ఓవల్, బ్రిడ్జ్ టౌన్, బార్బడోస్
14 ఏప్రిల్ 2007
స్కోర్ కార్డ్
దక్షిణాఫ్రికా
193/7 (50 ఓవర్లు)
v న్యూజిలాండ్
196/5 (48.2 ఓవర్లు)
న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో గెలిచింది
క్వీన్స్ పార్క్, సెయింట్ జార్జ్, గ్రెనడా
15 ఏప్రిల్ 2007
స్కోర్ కార్డ్
ఐర్లాండ్
243/7 (50 ఓవర్లు)
v బంగ్లాదేశ్
169 (41.2 ఓవర్లు)
ఐర్లాండ్ 74 పరుగుల తేడాతో గెలిచింది
కీన్సింగ్టన్ ఓవల్, బ్రిడ్జ్ టౌన్, బార్బడోస్
16 ఏప్రిల్ 2007
స్కోర్ కార్డ్
శ్రీలంక
226 (49.4 ఓవర్లు)
v ఆస్ట్రేలియా
232/3 (42.4 ఓవర్లు)
ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో గెలిచింది
క్వీన్స్ పార్క్, సెయింట్ జార్జ్, గ్రెనడా
17 ఏప్రిల్ 2007
స్కోర్ కార్డ్
ఇంగ్లాండ్
154 (48 ఓవర్లు)
v దక్షిణాఫ్రికా
157/1 (19.2 ఓవర్లు)
దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో గెలిచింది
కీన్సింగ్టన్ ఓవల్, బ్రిడ్జ్ టౌన్, బార్బడోస్
18 ఏప్రిల్ 2007
స్కోర్ కార్డ్
ఐర్లాండ్
77 (27.4 ఓవర్లు)
v శ్రీలంక
81/2 (10 ఓవర్లు)
శ్రీలంక 8 వికెట్ల తేడాతో గెలుపొందింది
క్వీన్స్ పార్క్, సెయింట్ జార్జ్, గ్రెనడా
19 ఏప్రిల్ 2007
స్కోర్ కార్డ్
వెస్టిండీస్
230/5 (50 ఓవర్లు)
v బంగ్లాదేశ్
131 (43.5 ఓవర్లు)
వెస్టిండీస్ 99 పరుగుల తేడాతో గెలిచింది
కీన్సింగ్టన్ ఓవల్, బ్రిడ్జ్ టౌన్, బార్బడోస్
20 ఏప్రిల్ 2007
స్కోర్ కార్డ్
ఆస్ట్రేలియా
348/6 (50 ఓవర్లు)
v న్యూజిలాండ్
133 (25.5 ఓవర్లు)
ఆస్ట్రేలియా 215 పరుగుల తేడాతో గెలిచింది
క్వీన్స్ పార్క్, సెయింట్ జార్జ్, గ్రెనడా
21 ఏప్రిల్ 2007
స్కోర్ కార్డ్
వెస్టిండీస్
300 (49.5 ఓవర్లు)
v ఇంగ్లాండ్
301/9 (49.5 ఓవర్లు)
ఇంగ్లాండ్ 1 వికెట్ తేడాతో గెలిచింది
కీన్సింగ్టన్ ఓవల్, బ్రిడ్జ్ టౌన్, బార్బడోస్

నాక్ అవుట్ స్టేజ్

[మార్చు]
  Semi-finals Final
24 April - సబీనా పార్క్, కింగ్ స్టన్, జమైకా
  2  శ్రీలంక 289/5  
  3 న్యూజిలాండ్ 208  
 
28 April - కింగ్స్టన్ ఓవల్, బ్రిడ్జ్ టౌన్, బార్బడోస్
     శ్రీలంక 215/8
   ఆస్ట్రేలియా 281/4
25 April - బీసెజర్ స్టేడియం, గ్రోస్ ఐస్ లెట్, సెయింట్ లూసియా
  1  ఆస్ట్రేలియా 153/3
  4 దక్షిణాఫ్రికా 149  

సెమీ-ఫైనల్స్

[మార్చు]
24 ఏప్రిల్ 2007 1430 యూటీసీ
శ్రీలంక
289/5 (50 ఓవర్లు)
v
న్యూజిలాండ్
208 all out (41.4 ఓవర్లు)
మహేలా జయవర్థనే 115* (109)
జేమ్స్ ఫ్రాంక్లిన్ 2/46 (9 overs)
పీటర్ ఫల్టన్ 46 (77)
ముత్తయ్య మురళీధరన్ 4/31 (8 overs)
శ్రీలంక 81 పరుగుల తేడాతో గెలచింది
సబీనా పార్క్, కింగ్ స్టన్, జమైకా
అంపైర్లు: రూడీ కోర్ట్ జన్, సిమోన్ టాఫెల్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మహేలా జయవర్థనే

25 April 2007 1330 యూటీసీ
దక్షిణాఫ్రికా
149 ఆలౌట్ (43.5 ఓవర్స్)
v
ఆస్ట్రేలియా
153/3 (31.3 ఓవర్స్)
జస్టిన్ కెంప్ 49* (91)
షాన్ 4/39 (10 ఓవర్స్)
మైకేల్ క్లార్క్ 60* (86)
షాన్ పొలాక్ 1/16 (5 overs)
ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది
బీసెజర్ స్టేడియం, గ్రోస్ ఐస్లెట్, సెయింట్ లూసియా
అంపైర్లు: అలీం డెర్, స్టీవ్ బక్నర్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: గ్లెన్ మెక్ గ్రాత్

ఫైనల్

[మార్చు]
28 ఏప్రిల్ 2007 1330 యూటీసీ
ఆస్ట్రేలియా
281/4 (38 ఓవర్స్)
v
శ్రీలంక
215/8 (36 ఓవర్స్)
ఆడమ్ గిల్ క్రిస్ట్ 149 (104)
లసిత్ మలింగా 2/49 (8 ఓవర్లు)
సనత్ జయసూర్య 63 (67)
మైకేల్ క్లార్క్ 2/30 (4 ఓవర్స్)
ఆస్ట్రేలియా 53 పరుగులతో గెలిచింది (డక్వర్త్ లూయిస్)
కింగ్ స్టన్ ఓవల్, బ్రిడ్జిటౌన్, బార్బడోస్
అంపైర్లు: స్టీవ్ బక్నర్, అలీం డర్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఆడమ్ గిల్ క్రిస్ట్
  • ముందు వాన పడడంతో ఇరుపక్షాలకు 38 ఓవర్లకు కుదించారు. వర్షం వల్ల శ్రీలంకకు మరింతగా 36 ఓవర్లకు కుదింపు జరిగింది.

ఈ ప్రపంచ కప్ లో ఇంతకుముందు 1996 లో ఆడిన శ్రీ లంక , ఆస్ట్రేలియాలు మళ్లీ ఆడారు. ఇలా ఇంతకు ముందు ఆడిన జట్లు మళ్లీ ఆడటం ఇదే మొదటి సారి. 1996 లో శ్రీ లంక గెలిచింది.ఆ మ్యాచ్ లో తప్ప శ్రీ లంకతో జరిగిన ప్రతి ప్రపంచ కప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియానే నెగ్గింది. 2007 ప్రపంచ కప్ లో శ్రీ లంక ఫైనల్స్ కు రావటం రెండవ సారి, , ఆస్ట్రేలియా ఆరవ సారి.

10,000 కంటే ఎక్కువ అభిమానులు మొదటిసారిగా ప్రపంచ కప్ హాట్-ట్రిక్ సాధించినందుకు ఆస్ట్రేలియా జట్టుని ఆహ్వానిస్తున్నారు - మార్టిన్ ప్లేస్, సిడ్నీ

రికీ పాంటింగ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.వర్షం కారణంగా ఆట ఆలస్యం అవటంతో ఇద్దరికీ 38 ఓవర్లకు కుదించారు.ఆ మ్యాచ్ లో ఆడం గిల్చ్రిస్ట్ 149 పరుగుల అత్యధిక స్కోరు సాధించి ప్రపంచ కప్ ఫైనల్స్ లోనే ఎక్కువ స్కోరు సాధించిన వ్యక్తిగా పేరు సంపాదించాడు. శ్రీ లంక, ఆస్ట్రేలియా వాళ్ళ స్కోరును అందుకోలేని విధంగా అతను ఆడాడు.శ్రీ లంక ఆటగాళ్లైన కుమార్ సంగక్కార , సనత్ జయసురియ రెండవ వికెట్ కి 116 పరుగుల భాగస్వామ్యం జోడించారు. కాని వారిద్దరి భాగస్వామ్యం ఉన్నంత వరకు గెలుస్తారనే నమ్మకం ఉండేది, వాళ్ళు అవుట్ అయిన తర్వాత మ్యాచ్ పై నమ్మకం నిమ్మదిగా సన్నగిల్లింది.వర్షం ఎక్కువవటం వల్ల శ్రీ లంక ఇన్నింగ్స్ ని 36 ఓవర్లకు, లక్ష్యాన్ని 269 పరుగులకు కుదించారు. డక్ వర్త్-లూయిస్ లక్ష్యం ప్రకారం 33 వ ఓవర్ వద్ద 37 పరుగుల తర్వాత అంపైర్లు వెలుగు సరిగా లేనందుకు మ్యాచ్ ను నిలిపివేశారు.ఆస్ట్రేలియా ఆటగాళ్ళు నేగ్గుతామని సంబరాలు జరుపుకుంటున్నారు (20 ఓవర్లు అయిపొయాయి), మ్యాచ్ వెలుగు సరిగా లేనందు వల్ల ఆపారని వర్షం వల్ల కాదని అంపైర్లు తప్పుగా చెప్పారు, కాబట్టి ఆఖరి మూడు ఓవర్లు ఆ తర్వాత రోజు ఆడాల్సి వచ్చింది.శ్రీలంక 18 బంతులలో 61 పరుగులు చేయాల్సి ఉంది. మహేలా జయవర్దేనే తర్వాత రోజు కాకుండా అదే రోజు ఆడటానికి అంగీకరించి, తన జట్టుని బ్యాటింగ్కి రమ్మని పిలుపునిచ్చి, రికీ పాంటింగ్ తో స్పిన్నర్లు మాత్రమే బౌల్ చెయాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంపైర్లు తరువాత వాళ్ళ తప్పుకు క్షమాపణ చెప్పారు, మ్యాచ్ ఆస్ట్రేలియా 37 పరుగుల తేడాతో గెలిచింది.ఆఖరి మూడు ఓవర్లు శ్రీ లంక ఆటగాళ్ళు చీకట్లో ఆడినట్లు ఆడారు, శ్రీ లంక తొమ్మిది పరుగులు జోడించింది, ఆస్ట్రేలియా డియల్ పద్ధతి ప్రకారం 53-పరుగుల తేడాతో గెలిచింది. శ్రీ లంక ఆస్ట్రేలియా కన్నా రెండు ఓవర్లు తక్కువ ఆడింది.

ఆస్ట్రేలియా జట్టు కేప్టన్ రికి పాంటింగ్

ఆస్ట్రేలియా ఎక్కడా ఓడిపోకుండా టోర్నమేంట్ గెలిచింది. ఆస్ట్రేలియా ఇప్పటికి 29 ప్రపంచ కప్ మ్యాచ్ లు ఓడిపోకుండా గెలిచింది. ఆస్ట్రేలియా బౌలర్ గ్లేన్న్ మక్ గ్రాత్ ను 'ప్లేయర్ అఫ్ ది సిరీస్'[17] ఇచ్చి సత్కరించారు.

గణాంకాలు

[మార్చు]
2007 క్రికెట్ ప్రపంచ కప్ రికార్డ్స్
రికార్డు ఆడిన విధానం ఆటగాడు దేశం
ఎక్కువ పరుగులు
659 మాథ్యు హేడెన్ ఆస్ట్రేలియా
548 మహేలా జయవర్థనే శ్రీలంక
539 రికి పాంటింగ్ ఆస్ట్రేలియా
ఎక్కువ వికెట్స్
26 గ్లెన్ మెక్ గ్రాత్ ఆస్ట్రేలియా
23 ముత్తయ్య మురళీథరన్ శ్రీ లంక
షాన్ టైట్ ఆస్ట్రేలియా
ఎక్కువ సార్లు అవుట్ చెయ్యటం
(వికెట్ కీపర్)
17 ఆడం గిల్ క్రిస్ట్ ఆస్ట్రేలియా
15 కుమార్ సంగక్కర శ్రీ లంక
14 బ్రెండన్ మెక్కల్లం న్యూజిలాండ్
ఎక్కువ క్యాచెస్
(ఫీల్డర్)
8 పోల్ కాలింగ్వుడ్ ఇంగ్లాండ్
గ్రేం స్మిత్ దక్షిణ ఆఫ్రికా
7 హెర్షల్ గిబ్స్ దక్షిణ ఆఫ్రికా
ఇయాన్ మోర్గాన్ ఐర్లాండ్
మాథ్యూ హేడెన్ ఆస్ట్రేలియా
రికీ పాంటింగ్ ఆస్ట్రేలియా
Source: Cricinfo.com

అవలోకనం

[మార్చు]

గుర్తుంచుకోవలసిన విషయాలు

[మార్చు]
  • ఐర్లాండ్ జింబాబ్వైతో ఆడిన మొదటి మ్యాచ్ టైగా ముగిసింది. ప్రపంచ కప్ లో టై అవటం అది మూడోసారి.
  • ప్రపంచ కప్ లో రికీ పాంటింగ్ స్కాట్లాండ్ పై సాధించిన 113 పరుగుల స్కోర్ అతని వరల్డ్ కప్ చరిత్రలో నాల్గవ సెంచరి/శతకం.అతను మార్క్ వా, సచిన్ టెండూల్కర్ , సౌరవ్ గంగూలీ లాంటి ఎక్కువ సెంచురీలు చేసిన వారి ఖాతాలో చేరుకున్నాడు.
  • దక్షిణ ఆఫ్రికాకు చెందినహర్షెల్ గిబ్బ్స్ నేదర్ లాండ్స్ కు చెందిన డాన్ వాన్ బుంగి కి సెయింట్ కిట్ట్స్ అండ్ నెవిస్ వార్నర్ పార్క్ లో ఒకే ఓవర్ లో ఆరు సిక్సులు కొట్టి వన్డే మ్యాచ్ లో మొదటి సారి ఈ ఘనత సాధించాడు.
  • దక్షిణ ఆఫ్రికా బ్యాట్స్ మెన్ నెదర్లాండ్స్ పై 18 సిక్సులు కొట్టారు.అది ప్రపంచ కప్ ఓడిఐ ఇన్నిన్గులలో ఎక్కువ సిక్సులు కొట్టినట్టు. ఈ రికార్డ్ ఇండియా వాళ్ళు బెర్ముడా పై సమానం చేసారు.
  • న్యూజిలాండ్ కు చెందిన బ్రెండన్ మక్కుల్లుం కెనడా ఫై తక్కువ సమయంలో యాభై పరుగులు సాధించాడు (20 బంతులలో). దీనితో 6 రోజుల క్రితం మార్క్ బౌచర్ 21- బంతుల్లో నేదర్ లాండ్స్ ఫై నెలకొల్పిన రికార్డ్ చెరిగిపోయింది.
  • ప్రపంచ కప్ లో ఇండియా , బెర్ముడా పై గెలిచి బంగ్లాదేశ్తొలి సారి గ్రూప్ స్టేజిలో అర్హత పొందింది.బంగ్లాదేశ్సూపర్ 8 స్టేజిలో దక్షిణ అఫ్రికాని ఓడించింది.
  • ఐర్లాండ్ పాకిస్తాన్ ని గ్రూప్ మ్యాచ్ లో ఓడించి టోర్నమేంట్లో నుంచి బయటకు పంపింది.ఐర్లాండ్ సూపర్ 8 స్టేజిలో అర్హత సాధించడం ఇదే మొదటి సారి.
  • ఐర్లాండ్ తో పాకిస్తాన్ ఓడిన తర్వాత, పాకిస్తాన్ కోచ్ బాబ్ వూల్మర్, అతని హోటల్ గదిలో మరణించి ఉన్నాడు.వుల్మేర్ చనిపోవడంపై హత్య విచారణ జరిపారు,కాని ఆఖరుకి అతను సాధారణంగానే చనిపోయాడని నిర్ధారించారు.
  • ఇమ్రాన్ నజీర్ పాకిస్తాన్ కోసం 160 పరుగులు జిమ్బంబేపై ఆఖరి గ్రూప్ స్టేజి మ్యాచ్ లో సాధించాడు. ఇది వెస్ట్ ఇండీస్ లో ఏ ఆటగాడు సాధించ లేనన్ని పరుగులు.
  • పాకిస్తాన్ సారథి ఇంజామం-ఉల్-హక్ వన్ డే క్రికెట్ నుండి అతని రిటైర్మెంట్ను, , అతను జట్టు సారథి బాధ్యత నుండి ప్రపంచ కప్ అయిపోగానే వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు.
  • నిభంధనలను అతిక్రమించడం వల్ల చాల మంది ఇంగ్లీష్ ఆటగాళ్లకు కఠిన చర్యలు తీసుకున్నారు.చాల మంది ఆటగాళ్లకు ఫైన్ విధించారు , ఆండ్రూ ఫ్లింట్ఆఫ్ను వైస్-కెప్టెన్ పదవి నుంచి తొలగించి కెనడాతో జరిగే ఆటలో ఆడకుండా ఆంక్షలు విధించారు.
  • బెర్ముడా పై ఇండియా 50 ఓవర్లలో 413-5 పరుగులు సాధించింది. ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా ఘనత సృష్టించారు, , ప్రపంచ కప్ ఇన్నింగ్స్ లో మొదటి సారి 400 పరుగులు సాధించిన ఘనత కూడా ఇండియాకి దక్కింది.వెస్ట్ ఇండీస్ లో ఎవ్వరు చేయలేనన్ని పరుగులు ఇండియా సాధించింది, , ఇండియా బెర్ముడాని 156 పరుగుల వద్ద అందర్నీ అవుట్ చేసింది. బెర్ముడా ఇంకా 257 పరుగుల లక్ష్యం ఉండగానే అందరు వైదొల్గారు, అంత లక్ష్యం ఉండగా అందరు వైదొలగడం కూడా ఓడిఐలలో ఎప్పుడు జరగలేదు.
  • ప్రపంచ కప్ మొత్తానికి మాత్యు హెడెన్ తొందరగా సెంచరీ చేసాడు (66 బంతుల్లో). ఆస్ట్రేలియా, దక్షిణ ఆఫ్రికాపై ఆడిన మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు, అంతకు ముందు రికార్డు కన్నా ఒక బంతి తక్కువకే ఈ రికార్డు సాధించాడు.
  • వారి వారి సొంత రికార్డ్లను వారే తిరిగి రాసినందుకు హీర్స్చేల్లే గిబ్బ్స్ , మాత్యు హేడెన్ ఇద్దరికీ సెయింట్ కిట్ట్స్ , నెవిస్ యొక్క గౌరవ పౌరసత్వాన్ని కానుకగా ఇచ్చారు.
  • శ్రీ లంక, దక్షిణ ఆఫ్రికా పై ఆడిన మ్యాచ్ లో లసిత్ మలింగ వరసగా మూడు వికెట్లు తీసి, అలా తీసిన వారిలో అతను ఐదవ ఆటగాడుగా పేరు సంపాదించాడు. కాని తరువాత బంతిలో కూడా ఇంకొక వికెట్ సాధించటంతో వరసగా నాలుగు వికెట్లు సాధించిన ఏకైక వ్యక్తిగా ఘనత సాధించాడు.
  • ప్రపంచ కప్ చరిత్ర లోనే గ్లేన్న్ మక్ గ్రాత్ 56 వికెట్లు తీసి వాసిం అక్రం 55 వికెట్ల రికార్డు బద్దలు కొట్టాడు. దానితో అతను ఎక్కువ వికెట్లు తీసిన వ్యక్తిగా పేరు సంపాదించాడు.
  • వెస్ట్ ఇండీస్ సారథి బ్రయాన్ లారా అన్ని రకాల క్రికెట్ల నుంచి వైదొలుగుతున్నట్లు తన రిటైర్మెంట్ను ప్రకటించాడు.
  • పాకిస్తాన్ , బంగ్లాదేశ్ను ఓడించడం ద్వారా ఐర్లాండ్ ఓడిఐ ఛాంపియన్షిప్ టేబుల్[18]లో స్థానం సంపాదించింది.
  • పాకిస్తాన్ , బంగ్లాదేశ్పైన ఐర్లాండ్ గెలవటం వల్ల వాళ్ళ జట్టు యొక్క రాంక్ ఐసీసీ సభ్యులైన కెన్యా , జిమ్బంబే రంకుల కన్నా ముందుకొచ్చి పదవ ర్యాంకు సాధించింది.
  • శ్రీ లంకతో జరిగిన సూపర్-8 గేమ్ లో ఆడం గిల్క్రిస్ట్ , మాత్యు హేడన్ కలిసి మొదటి వికెట్ కి 76 పరుగులు జోడించారు.ఇది వారు 50 పరుగులు దాటి బాగస్వామ్యం చేయటం 40 వ సారి. వెస్ట్ ఇండీస్ ఆటగాళ్లైన దేస్మోండ్ హాయ్న్స్ , గోర్డాన్ గ్రీనిడ్జ్ ఇద్దరు కలిసి 39 సార్లు 50 పరుగులకు పైగా బాగస్వామ్యం నెలకొల్పారు.
  • న్యూ జీలాండ్ పై మాత్యు హేడన్ సెంచరీ ప్రపంచ కప్ చరిత్రలో వందవ సెంచరీ , మొదటి సారి ఒకే టోర్నమేంట్లో ఒకే వ్యక్తి మూడు సార్లు సెంచరీ చేసిన ఘనత మాత్యు హేడన్ కు దక్కింది.మార్క్ వా సౌరవ్ గంగూలీ , మాత్యు హేడన్ మాత్రమే ఒకే టోర్నమేంట్లో మూడు సార్లు సెంచరీ సాధించారు.
  • ఇంగ్లాండ్-వెస్ట్ఇండీస్ మ్యాచ్ లో అంపయిరింగ్ చెయ్యటంతో రూఢి కోయిర్ద్జెన్ వన్డేలో ఎక్కువ మ్యాచ్ లు అంపయిరింగ్ చేసినవాడిగా డేవిడ్ షేపెర్డ్ రికార్డ్ ను అధిగమించాడు. షెపర్డ్ 172 మ్యాచ్ లలో అంపయిరింగ్ చెయ్యగా కోయిర్ద్జెన్ కు ఇది 173వ మ్యాచ్.
  • స్టీవ్ బక్నోర్ వరసగా ఐదవ ప్రపంచ కప్ ఫైనల్లో అంపైర్ గా పాల్గొన్నారు.
  • శ్రీ లంక ఆటగాడైన రసెల్ ఆర్నాల్డ్ అంతర్జాతీయ క్రికెట్ నుండి తన రిటైర్మెంట్ను ప్రకటించాడు.
  • పది సంవత్సరాల తర్వాత న్యూ జీలాండ్ సారథి అయిన స్టీఫెన్ ఫ్లెమింగ్ సబిన పార్కులో శ్రీ లంకతో జరిగిన సెమీ-ఫైనల్స్ లో ఓడిన కారణంగా వన్-డే జట్టు సారథిగా వైదొలిగాడు.న్యూ జీలాండ్ 218 వన్-డే మ్యాచ్ లకు స్టీఫెన్ ఫ్లెమింగ్ సారథిగా వ్యవహరించాడు.
  • ఆస్ట్రేలియా వరసగా నాల్గవ సారి ప్రపంచ కప్ ఫైనల్స్ లో అడుగు పెట్టి చరిత్ర సృష్టించింది.
  • దక్షిణ ఆఫ్రికా ఆస్ట్రేలియా సెమీ-ఫైనల్స్ మ్యాచ్ లో 149 పరుగుల తక్కువ లక్ష్యనికే దక్షిణ ఆఫ్రికా అల్ అవుట్ అవ్వటం అదే మొదటిసారి.
  • దక్షిణ ఆఫ్రికాపై మూడు వికెట్లు తీసిన గ్లేన్న్ మక్ గ్రాత్ మొత్తం టోర్నమేంట్లో 25 వికెట్లు తీసిన వ్యక్తిగా పేరు సంపాదించాడు.
  • దక్షిణ ఆఫ్రికా పై 41 పరుగులు సాధించిన మాత్యు హేడెన్ మొత్తం టోర్నమేంట్లో 600 పరుగులు సాధించిన రెండవ వ్యక్తిగా పేరు సంపాదించాడు. శ్రీలంక పై ఫైనల్ లో మరొక 38 పరుగులు సాధించాడు, దానితో 673 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డ్ కు హేడెన్ కు మధ్య 14 పరుగుల తేడా ఉంది.
  • ప్రపంచ కప్ ఫైనల్ లో 172 అత్యధిక పరుగుల ఓపెనింగ్ బాగస్వామ్యాన్ని ఆడం గిల్చ్రిస్ట్ , మాత్యు హెడెన్ సాధించారు.
  • క్లివ్ ల్లోయ్ద్ 1975 లో, వివ్ రిచర్డ్స్ 1979లో అరవింద డి సిల్వా 1996 లో , రికీ పాంటింగ్ 2003 వీళ్ళందరి తరువాత ఆడం గిల్చ్రిస్ట్ 2007 ప్రపంచ క్రికెట్ కప్ ఫైనల్ లో సెంచరీ చేసిన ఐదవ వాడిగా పేరు సంపాదించాడు. రికీ పాంటింగ్ 149 పరుగులు చేయటం ప్రపంచ కప్ ఫైనల్స్ లోనే ఎవ్వరు చేయలేనన్ని పరుగులు సాధించాడు. 2003 లో 140* పరుగులు చేసి అజేయంగా నిలిచిన తన రికార్డును తనే బద్దలు కొట్టుకున్నాడు.
  • వరసగా మూడుసార్లు ప్రపంచ కప్ సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా సంచలనం సృష్టించింది.
  • గ్లేన్న్ మక్ గ్రాత్ అన్ని రకల క్రికెట్ల నుంచి వైదొలుగుతున్నట్లు తన రిటైర్మెంట్ను ప్రకటించాడు.

బాబ్ వూల్మర్ మృతి

[మార్చు]

పాకిస్తాన్ కోచ్ బాబ్ వూల్మర్ 2007 మార్చి 18 లో మృతి చెందాడు. ఐర్లాండ్ మీద పాకిస్తాన్ ఓడిన మర్నాడు అతను మరణించాడు. ఈ ఓటమి వల్ల పాకిస్తాన్ వాళ్ళు ప్రపంచ కప్ నుండి నిష్క్రమించారు.జమైకా పోలిసులు ఆటోప్సి చేసినా ఏ నిర్ణయానికి రాలేకపోయారు.అదే రోజు పోలిసులు అతని మృతి సాధారణమైనది కాదు, అందువల్ల పూర్తిస్థాయి విచారణ చేయాలని నిర్ధారించారు.[19] విచారణలో వూల్మర్ ని ఎవరో ఊపిరి ఆడకుండా నొక్కి పెట్టటంతో[20] మృతి చెందాడని, అందువల్ల అది ఒక హత్య [21] కేసుగా విచారణ చేస్తామని చెప్పారు.చాలా విచారణ తరువాత జమైకా పోలిసులు వూల్మర్ ది సాధారణమైన మృతి[22] అని, ఎవరూ చంపలేదని తేల్చారు. పోలీసులు వూల్మర్ ని ఎవరో చంపారని చెప్పిన వ్యాఖ్యలని కూడా వెనక్కి తీసుకున్నారు.

విమర్శలు

[మార్చు]

ప్రపంచ కప్ నిర్వాహకులు క్రికెట్ ని ఒక వ్యాపారం లా మార్చేశారని విమర్శించారు.మ్యాచ్ లకు ఐసీసీ భద్రతా నియమాల వల్ల, బయట తిను బండారాలు, సంగీత వాద్యాలు అనుమతించకపోవటం వల్ల తక్కువ జనాలు వచ్చారని ఆరోపించారు. కెరిబియన్ వారి క్రికెట్ ఆచారాలకు[23] వ్యతిరేకంగా అధికారులు ఆటని జనాలకి దూరంగా తీసుకుపోతున్నారని, అందువల్ల ఆట ఉనికిని[24] కోల్పోతుందని నిందించారు. సర్ వివ్ రిచర్డ్స్ కూడా ఇదే విధంగా అభిప్రాయపడ్డారు.[25] టికెట్ల ఖరీదు ఎక్కువ అని, చాల ప్రాంతాలలో[26] జనాలకు అంత ఖరీదు పెట్టి కొనే స్తోమత లేదని కూడా ఐసీసీని తప్పు పట్టారు. ఈ విషయాన్నీ ముందే ఐసీసీ గమనించిందని, కాని ఆ ప్రాంతంలో ఉన్న అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని ఐసీసీ సీఈఓ, మల్కాం స్పీడ్ వివరించారు.టోర్నమేంట్ గడిచే కొద్ది జనాలు రావటం పెరిగింది. అధికారులు కూడా నియమాలను తగ్గించారు.[27] ముందుగ అనుకొన్న లక్ష్యం ప్రకారం 42 మిలియన్ యుయస్ డాలర్లు ఆదాయం రాకపోయినా టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయం క్రిందటి ప్రపంచ కప్ తో పోలిస్తే రెండింతలు అయింది. ఇది అన్ని ప్రపంచ కప్ లతో పోలిస్తే టికెట్ల ద్వారా అత్యధికంగా 32 మిలియన్ యుయస్ డాలర్ల ఆదాయం [13][14][28] వచ్చింది.

ఇండియా , పాకిస్తాన్ రెండేసి మ్యాచ్ లు ఓడిపోయిన వెంటనే ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించటంతో ఈ విధానాన్ని విమర్శించారు.దీని వల్ల ఐర్లాండ్ , బంగ్లాదేశ్జట్లు సూపర్ 8 దశకు చేరుకుని అన్ని మ్యచుల్లోని ఓడిపోయాయి. (బంగ్లాదేశ్సౌత్ ఆఫ్రికా మీద గెలిచిన ఒక్క మ్యాచ్ తప్ప)ఇండియా , పాకిస్తాన్ నిష్క్రమించడంతో చాల మంది అభిమానులు వెనక్కి వెళ్లి పోయారు. దీనితో వాళ్లకు చాల నష్టాలు వచ్చాయి. ఈ మ్యాచ్ బాగా లాభాలు తెచ్చే మ్యాచ్[29]గా భావిస్తారు.2011 క్రికెట్ ప్రపంచ కప్.[29] నాటికి ఐసీసీ ప్రపంచ కప్ విధానాన్ని మారుస్తుందని బిసీసీఐ అభిప్రాయపడింది.

టోర్నమేంట్ చాల రోజులు జరగడాన్ని కూడా విమర్శించారు. ఆరు వారాలు జరిగిన ఈ ప్రపంచ కప్ 2003 ప్రపంచ కప్ జరిగినట్టే జరిగింది. అయిదు వారాలు జరిగిన 1999 ప్రపంచ కప్ , నాలుగు వారాలు జరిగిన 1996 ప్రపంచ కప్ కన్నా 2007 ప్రపంచ కప్ పెద్దది.ప్రఖ్యాత వెస్ట్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ మైఖేల్ హోల్డింగ్ కూడా 2007 ప్రపంచ కప్ క్వాలిఫై మ్యాచ్ లు బాగోలేదని పేర్కొన్నారు.చిన్న జట్లు పెద్ద జట్లతో ఆడటం వల్ల ఎక్కువ పరుగుల తేడాతో ఓడిపోతున్నారని,[30] దీనివల్ల లాభం ఏమిటని హోల్డింగ్ ప్రశ్నించారు. పెద్ద జట్లతో స్కాట్లాండ్ లాంటి చిన్న జట్లు ఆడటం వల్ల ఎటువంటి లాభం ఉండదని స్కాట్లాండ్ కెప్టెన్ అయిన జార్జి సల్మొండ్ అభిప్రాయపడ్డాడు, , హోల్డింగ్[31] అన్నట్లు ఎన్నాళ్ళు ఇలా ఉంటుందని ప్రశ్నించాడు.టోర్నమేంట్ లో పాల్గొన్న పెద్ద జట్ల ఆటగాళ్ళు చిన్న జట్లను ప్రపంచ కప్[32] నుండి నిష్క్రమించేలా చేశారు.ఐర్లాండ్ , బంగ్లాదేశ్బాగా ఆడి సూపర్ 8 దశకు చేరుకుని పోటిపడుతూ టోర్నమేంట్[33] అంతా ఆడారు.

అంపైర్లు ఆటను వెలుతురు లేనందు వల్ల ఆపారు, కాని స్కోరు బోర్డు , ఆట గురించి ప్రకటించే వారు ఆస్ట్రేలియా గెలిచిందని ప్రకటించారు. దీనివల్ల ఆస్ట్రేలియా వాళ్ళు గెలిచామని సంబరాలు చేసుకోవటం మొదలు పెట్టారు, అప్పుడు అంపైర్లు ఆట ఇంకా అవ్వలేదని ఇంకా మూడు ఓవర్లు ఆడాలని తప్పుగా ప్రకటించారు. దీని వల్ల ఫైనల్ మ్యాచ్ చివరిలో కలకలం చెలరేగింది.వెలుతురు సరిగా లేని సమయంలో ఆఖరి మూడు ఓవర్లు శ్రీ లంక వాళ్ళు బ్యాటింగ్ చేసారు. రెండు జట్ల సారధుల మాటకు గౌరవమిచ్చి ఆటను కొనసాగించారు.[34] ఆ పరిస్థితి ఒత్తిడి వల్ల అలా జరిగిందని అంపైర్లు , ఐసీసీ ఆ అనవసరమైన విషయం కోసం క్షమించమని అడిగారు.ఆన్ ఫీల్డ్ అంపైర్లైన స్టీవ్ బక్నర్ , అలీం డర్,ఇంకా మ్యాచ్ లో ఉండాల్సిన మిగతా అంపైర్లైన రూడి కోఎర్ట్జెన్ , బిల్లీ బౌడెన్ , మ్యాచ్ రెఫరీ ఐన జేఫ్ఫ్ క్రౌవ్ లను తర్వాత జరిగే 2007 ట్వంటీ20 వరల్డ్ ఛాంపియన్షిప్ నుంచి బహిష్కరిస్తునట్లు జూన్లో ఐసీసీ ప్రకటించింది.[35]

మొదటి దశలో కలిగిన ఇబ్బందులు

[మార్చు]

ప్రపంచ కప్ మొదలవుతున్నప్పుడు చాల సమస్యలు ఎదురయ్యాయి.2007 మార్చి 11. ప్రారంభ దినోత్సవం నాటికి కొన్ని క్రీడ స్థలాలు పూర్తి కాలేదు. కొన్ని భద్రత కారణాల వల్ల సబిన పార్క్ వద్ద కొత్తగా కట్టిన నార్త్-స్టాండ్లో నిర్మించబడిన కొన్ని సీట్లు నిర్ములించాల్సి వచ్చింది. జమైకాలో త్రేలవ్నీ స్టేడియం లో గ్రౌండ్ ఉద్యోగులకి కొన్ని అనివార్య కారణాల వల్ల వార్మ్-అప్ మ్యాచ్ రావడానికి అనుమతి లభించలేదు.దీనికి తోడు, సౌత్ ఆఫ్రికా , ఆస్ట్రేలియా జట్లు ప్రాక్టీసు సౌకర్యాలపై [36] శ్రద్ధ చూపించారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

గమనికలు

[మార్చు]
  1. ఇది 31 డిసెంబర్ 2007 కాలానికి ముగిసిన ఆర్ధిక లావాదేవిల పట్టిక – 9 నెలలకి మొత్తం (నోట్ 12 లో పేర్కొన్న వివరాలతో కలిపి).
  2. "Stadium named after Richards getting ready". The Hindu (India). Archived from the original on 6 అక్టోబరు 2008. Retrieved 24 May 2007.
  3. "Grand stage awaits fitting drama". Retrieved 14 February 2009.
  4. "Guyana Providence Stadium - Progress Information". netfirms.com. 18 February 2007. Archived from the original on 6 మే 2007. Retrieved 24 May 2007.
  5. "Mayor Mckenzie Lobbies for Sabina Park to Host World Cup Cricket". 24 February 2004. Archived from the original on 27 సెప్టెంబరు 2007. Retrieved 24 May 2007.
  6. "The Saint Lucia Bid for Cricket World Cup West Indies 2007" (PDF). Archived from the original (PDF) on 5 జూన్ 2007. Retrieved 24 May 2007.
  7. "More planning needed for Cricket World Cup". 9 July 2006. Archived from the original on 6 డిసెంబరు 2012. Retrieved 24 May 2007.
  8. "World Cup 2007: Eyes Wide Shut by Claude Robinson from www.caribbeancricket.com". Archived from the original on 29 అక్టోబరు 2006. Retrieved 9 April 2007.
  9. "Cricket: 'Run wid it again!'". 2006-04-24. Retrieved 9 April 2007.
  10. "Sponsorship revenue". Archived from the original on 9 మార్చి 2007. Retrieved 9 April 2007.
  11. "Taipai Times Editorial". Retrieved 2007-04-18.
  12. "World Cup Overview". cricketworldcp.com. Archived from the original on 2007-01-24. Retrieved 2007-01-29.
  13. 13.0 13.1 ప్రపంచ కప్ లో వచ్చిన లాభాల వల్ల విండీస్ బోర్డు కు అప్పులు తీర్చుకోడానికి కొంత సహకారం అందినట్లయింది.
  14. 14.0 14.1 "ICC CWC 2007 Match Attendance Soars Past 400,000". Cricketworld.com. 2007-04-24. Archived from the original on 2007-09-28. Retrieved 2007-04-25.
  15. "ICC Cricket World Cup 2007 match schedule announced (from icc-cricket.org; explains that there are 51 ODIs scheduled but that only fits with the main tournament)". Archived from the original on 16 ఏప్రిల్ 2007. Retrieved 9 April 2007.
  16. క్రికెట్ యొక్క అతిపెద్ద షో పీస్ అయిన | ఇండియన్ ముస్లిమ్స్ Archived 2012-02-07 at the Wayback Machine ప్రారంభోత్సవానికి అంతా సిద్దమయింది.
  17. "ICC World Cup - Final". Cricinfo. 2007-04-28. Retrieved 2007-04-28.
  18. "Ireland qualifies for LG ICC ODI Championship". International Cricket Council. 16 April 2007. Archived from the original on 26 సెప్టెంబరు 2007. Retrieved 2007-05-25.
  19. "Woolmer's death 'suspicious' - police". CricInfo. 2007-03-21. Retrieved 2007-03-23.
  20. Raedler, John. "Woolmer was strangled, police say". cnn.com. Retrieved 2007-03-24.
  21. "Pakistan Woolmer death treated as murder". BBC. 2007-03-23. Retrieved 2007-03-23.
  22. "Woolmer 'dIED OF NATURAL CAUSES'". BBC. 2007-06-12. Retrieved 2007-06-12.
  23. Tim de Lisle (2007-04-03). "A public relations disaster". Cricinfo. Retrieved 2007-05-24.
  24. Mike Selvey (2007-04-05). "Weep for the ghosts of calypsos past in this lifeless forum". Guardian. Retrieved 2007-05-24.
  25. "Richards attacks Cup organisation". BBC. 2007-04-05. Retrieved 2007-05-24.
  26. "Crushing the essence of the Caribbean". Cricinfo. 2007-04-05. Retrieved 2007-05-24.
  27. "Barbados determined to restore local flavour". Cricinfo. 2007-04-05. Retrieved 2007-05-24.
  28. "Ticket sales double of previous World Cup - Dehring". Cricinfo. 2007-04-16. Retrieved 2007-04-30.
  29. 29.0 29.1 [1] బిసీసీఐ అధ్యక్షుడు ఇండియా నిష్క్రమించటానికి కారణం ప్రపంచ కప్ వైఖరి అని అభివర్ణించారు.
  30. "Holding slams World Cup minnows". 2007-02-20. Retrieved 9 April 2007.
  31. ఐసీసీ సహకారకులు హోల్డింగ్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.
  32. "Bermuda have 'wonderful experience' in huge loss". Cricinfo. 2007-03-16. Retrieved 9 April 2007.
  33. "Ireland qualifies for ODI Championship". ICC. 2007-04-22. Archived from the original on 2007-04-28. Retrieved 2007-04-22.
  34. "Speed apologises for light chaos". Cricinfo. 2007-04-28. Retrieved 2007-04-30.
  35. "World Cup officials banned by ICC". Cricinfo. 2007-06-22. Retrieved 2007-06-24.
  36. "Warmup matches start amid last minute preparations". 2007-03-04. Archived from the original on 6 మార్చి 2007. Retrieved 9 April 2007.

వెలుపటి వలయము

[మార్చు]