Jump to content

68వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు

వికీపీడియా నుండి
68వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
Awarded for2020 ఉత్తమ చలనచిత్రాలు
Awarded byచలనచిత్రోత్సవ డైరెక్టరేట్
Presented byచలనచిత్రోత్సవ డైరెక్టరేట్
Announced on2022 జూలై 22
Presented on2022 సెప్టెంబరు 30
Official websitedff.nic.in
Highlights
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ చలనచిత్రంసూరయైపొట్రు
Best Non-feature Filmటెస్టిమొని ఆఫ్ అనా
Best Bookది లాంగెస్ట్ కిస్
Lifetime achievementఆశా పరేఖ్
ఎక్కువ పురస్కారాలుసూరయైపొట్రు (5)

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు భారతదేశంలో ప్రతిష్ఠాత్మకగా భావించే సినిమా అవార్డులు. ఇవి భారత ప్రభుత్వంచే ఏడాదికి ఒకసారి ప్రకటించబడి రాష్ట్రపతి చేతులమీదగా గ్రహీతలకు అందజేయబడతాయి. ముందటి సంవత్సరము దేశంలో విడుదలైన అన్ని భాషల చిత్రాలను ప్రత్యేక జ్యూరీ పరిశీలించి ముఖ్య విభాగాలలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేస్తారు. అంతేకాకుండా వివిధ భాషలలోని ఉత్తమమైన చిత్రాలను కూడా ఎంపిక చేస్తారు. 68వ జాతీయ చలనచిత్ర అవార్డులకు ఈసారి 400 సినిమాలు అవార్డుల కోసం పోటీపడగా 15 ప్రాంతీయ భాషా చిత్రాలకు అవార్డులు వరించాయి. 2022 జూలై 22న సాయంత్రం 4:00 గంటలకు ప్రకటించబడ్డాయి.[1][2]

ఎంపిక విధానం

[మార్చు]

చలన చిత్రోత్సవ డైరెక్టరేట్ 2021 మార్చి 12 వరకు ఆన్లైన్ ద్వారా ఎంట్రీలను ఆహ్వానించింది. 2020 జనవరి 1 నుండి 2020 డిసెంబరు 31 మధ్యకాలంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వారు సర్టిఫై చేసిన ఫీచర్, నాన్-ఫీచర్ ఫిల్మ్స్ ఈ 68వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలకు అర్హత సాధించాయి. అలాగే భారతీయ వార్తాపత్రికలు, పత్రికలు, పత్రికలలో ప్రచురించబడిన సినిమాపై పుస్తకాలు, విమర్శనాత్మక అధ్యయనాలు, సమీక్షలు లేదా కథనాలు సినిమా విభాగంలో ఉత్తమ రచన పురస్కారానికి అర్హులు.[3]

ఫీచర్, నాన్-ఫీచర్ ఫిల్మ్‌ల విభాగాల కోసం, ఏదైనా భారతీయ భాషలోని సినిమాలు, 16 ఎంఎం, 35 ఎంఎం, ఫిల్మ్ గేజ్ లేదా డిజిటల్ ఫార్మాట్‌లో చిత్రీకరించబడి, సినిమాల్లో, డిజిటల్ ఫార్మాట్‌లలో విడుదల చేయడానికి అర్హత పొంది ఉండాలి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా సినిమాలు ఫీచర్ ఫిల్మ్, ఫీచర్ లేదా డాక్యుమెంటరీ/న్యూస్‌రీల్/నాన్ ఫిక్షన్ సర్టిఫికేట్ పొందాలి.

జ్యూరీ సభ్యులు

[మార్చు]

అవార్డుల ఎంపికకు జ్యూరీ సభ్యులను నియమించడం జరుగుతుంది.[4]

  • చైర్‌పర్సన్: విపుల్ షా

  • సభ్యులు: ధరమ్ గులాటి, శ్రీలేఖ ముఖర్జీ, జిఎస్ భాస్కర్, ఎస్. తంగదురై, సంజీవ్ రత్తన్, ఎ. కార్తీకరాజా, వి.ఎన్. ఆదిత్య, విజి తంపి,  తంగదురై, నిషిగంధ.

బెస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్

[మార్చు]

రాష్ట్ర ప్రభుత్వ విధానం ద్వారా సినిమాని ఒక కళారూపంగా అధ్యయనం చేయడం, ప్రశంసించడం, సమాచారాన్ని వ్యాప్తి చేయడం, ఈ కళారూపానికి విమర్శనాత్మక ప్రశంసలను ప్రోత్సహించడం వంటి అంశాలలో ఈ అవార్డు అందించబడుతోంది.

బెస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్: మధ్యప్రదేశ్[5]

అవార్డులు

[మార్చు]

నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్స్

[మార్చు]

నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్స్

[మార్చు]
  • ఉత్తమ వాయిస్‌ ఓవర్‌: శోభా రాప్సోడీ ఆఫ్‌ రెయిన్స్‌- మాన్‌సూన్స్‌ ఆఫ్‌ కేరళ (ఇంగ్లీష్‌)
  • ఉత్తమ సంగీతం: విశాల్‌ భరద్వాజ్‌ (1232 కి.మీ: మరేంగే తో వహీన్‌ జాకర్‌) (హిందీ)
  • ఉత్తమ కూర్పు: అనాదీ అతలే (బార్డర్‌ ల్యాండ్స్‌)
  • ఉత్తమ ఆన్‌లొకేషన్‌ సౌండ్‌ రికార్డిస్ట్‌- సందీప్‌ భాటి, ప్రదీప్‌ లెహ్వార్‌ (జాదూయ్‌ జంగల్‌) (హిందీ)
  • ఉత్తమ ఆడియోగ్రఫీ (ఫైనల్‌ మిక్స్‌డ్‌ ట్రాక్‌): అజిత్‌ సింగ్‌ రాథోడ్‌ (పర్ల్‌ ఆఫ్‌ ద డిసర్ట్‌ ) (రాజస్థానీ)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ: నిఖిల్‌ ఎస్‌ ప్రవీణ్‌ (శబ్దికున్‌ కలప్ప) (మలయాళం)
  • ఉత్తమ దర్శకత్వం: ఆర్‌వీ రమణి (ఓ దట్స్‌ భాను- ఇంగ్లీష్‌, తమిళ్‌, మలయాళం, హిందీ)
  • ఉత్తమ కుటుంబ కథా చిత్రం: కుంకుమార్చన్‌ (మరాఠి)
  • ఉత్తమ షార్ట్‌ ఫిక్షన్‌ ఫిల్మ్: కచీచినుతు (అస్సాం)
  • స్పెషల్‌ జ్యూరీ అవార్డు: అడ్మిటెడ్‌ (హిందీ, ఇంగ్లీష్‌)
  • ఉత్తమ ఇన్వెస్టిగేటివ్‌ ఫిల్మ్: ద సేవియర్‌: బ్రిగేడియర్‌ ప్రీతమ్‌ సింగ్‌ (పంజాబీ)
  • ఉత్తమ ఎక్స్‌ప్లోరేషన్‌ ఫిల్మ్: వీలింగ్‌ ద బాల్‌ (ఇంగ్లీష్‌, హిందీ)
  • ఉత్తమ ఎడ్యుకేషనల్‌ ఫిల్మ్: డ్రీమింగ్‌ ఆఫ్‌ వర్డ్స్‌ (మలయాళం)
  • ఉత్తమ పర్యావరణ చిత్రం: మాన అరు మానుహ్‌ (అస్సామీస్‌)
  • ఉత్తమ ప్రమోషనల్‌ ఫిల్మ్: సర్‌మొంటింగ్‌ చాలెంజెస్‌ (ఇంగ్లీష్‌)
  • ఉత్తమ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఫిల్మ్: ఆన్‌ ద బ్రింక్‌ సీజన్‌ 2- బ్యాట్స్‌ (ఇంగ్లీష్‌)
  • ఉత్తమ కళా, సాంస్కృతిక చిత్రం: నాదదా నవనీతా
  • ఉత్తమ జీవితకథాచిత్రం: పబుంగ్‌ శ్యామ్‌
  • ఉత్తమ ఎత్నోగ్రాఫిక్‌ ఫిల్మ్: మందల్‌ కె బోల్‌ (హిందీ)
  • ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు: విశేష్‌ అయ్యర్‌ (పరాయా- మారాఠీ, హిందీ)

మూలాలు

[మార్చు]
  1. "National Film Awards: ఉత్తమ తెలుగు చిత్రం 'కలర్‌ ఫోటో'.. ఉత్తమ నటులు సూర్య, అజయ్‌దేవగణ్‌". EENADU. 2022-07-22. Archived from the original on 2022-07-22. Retrieved 2022-07-22.
  2. "68th National Film Awards". The Hindu (in Indian English). 2022-07-22. ISSN 0971-751X. Retrieved 2022-07-22.
  3. "Call for entries; 68th National Film Awards for 2020" (PDF). Directorate of Film Festivals. Archived from the original (PDF) on 26 జూలై 2021. Retrieved 7 March 2020.
  4. Bureau, ABP News (2022-07-22). "National Film Awards 2022: 'Soorarai Pottru' Wins Big, Suriya, Ajay Devgn Are Best Actors". news.abplive.com (in ఇంగ్లీష్). Retrieved 2022-07-23.
  5. "68th National Film Awards winners list: Suriya's Soorarai Pottru wins big". The Indian Express (in ఇంగ్లీష్). 2022-07-22. Retrieved 2022-07-22.
  6. "'Jeetige' wins National Film Award in Tulu category". The Hindu (in Indian English). Special Correspondent. 2022-07-22. ISSN 0971-751X. Retrieved 2022-07-23.{{cite news}}: CS1 maint: others (link)
  7. Jangra, Manoj (2022-07-22). "यशपाल शर्मा की 'दादा लखमी' को मिला सर्वश्रेष्ठ हरियाणवी फीचर फिल्म का पुरस्कार | Hari Bhoomi". www.haribhoomi.com. Retrieved 2022-07-23.
  8. PanajiNovember 22, Mohit Sharma; November 22, 2021UPDATED:; Ist, 2021 13:17. "IFFI 2021 opens with Semkhor, first movie in Dimasa language to make it to film festival". India Today (in ఇంగ్లీష్). Retrieved 2022-07-23. {{cite web}}: |first3= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు

[మార్చు]