అల్యూమినియం నైట్రేట్

వికీపీడియా నుండి
(Al(NO3)3 నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అల్యూమినియం నైట్రేట్
పేర్లు
IUPAC నామము
Aluminium nitrate
ఇతర పేర్లు
Nitric acid, aluminum salt
aluminum nitrate
aluminium(III) nitrate
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [13473-90-0]
పబ్ కెమ్ 26053
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య BD1040000 (anhydrous)
BD1050000 (nonahydrate)
SMILES [Al+3].O=[N+]([O-])[O-].[O-][N+]([O-])=O.[O-][N+]([O-])=O
ధర్మములు
Al(NO3)3
మోలార్ ద్రవ్యరాశి 212.996 g/mol (anhydrous)
375.134 g/mol (nonahydrate)
స్వరూపం White crystals, solid
hygroscopic
వాసన odorless
సాంద్రత 1.72 g/cm3 (nonahydrate)
ద్రవీభవన స్థానం 66 °C (151 °F; 339 K) (anhydrous)[1]
73.9 °C (165.0 °F; 347.0 K) (nonahydrate)
బాష్పీభవన స్థానం 150 °C (302 °F; 423 K) (nonahydrate) decomposes
anhydrous:
60.0 g/100ml (0°C)
73.9 g/100ml (20 °C)
160 g/100ml (100 °C)
nonahydrate:
67.3 g/100 mL
ద్రావణీయత in methanol 14.45 g/100ml
ద్రావణీయత in ethanol 8.63 g/100ml
ద్రావణీయత in ethylene glycol 18.32 g/100ml
వక్రీభవన గుణకం (nD) 1.54
ప్రమాదాలు
భద్రత సమాచార పత్రము External MSDS
జ్వలన స్థానం {{{value}}}
Lethal dose or concentration (LD, LC):
4280 mg/kg, oral (rat)
US health exposure limits (NIOSH):
PEL (Permissible)
none
REL (Recommended)
2 mg/m3
IDLH (Immediate danger)
N.D
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

అల్యూమినియం నైట్రేట్ ఒకరసాయన సంయోగపదార్థం.ఇది ఒక అకర్బన రసాయన సమ్మేళన పదార్థం.అల్యూమినియం, నైట్రోజన్, ఆక్సిజన్ మూలకాలసంయోగం వలన ఏర్పడిన సమ్మేళన పదార్థం అల్యూమినియం నైట్రేట్. నైట్రిక్ ఆమ్లం,, అల్యూమినియం లోహంల లవణం అల్యూమినియం నైట్రేట్.అల్యూమినియం నైట్రేట్ సాధారణంగా ఆర్ద్ర (hydrate) రూపంలో లభిస్తుంది.అతిసాధారణంగా తొమ్మిది జలాణువులను కలిగిన నోనాఅల్యూమినియం నైట్రేట్ (Al (NO3) 39H2O) రూపంలో ఉండును.

భౌతిక ధర్మాలు

[మార్చు]

అల్యూమినియం నైట్రేట్ తెల్లని స్పటిక రూపంలో ఉండు ఘనపదార్థం. చెమ్మగిల్లు/తేమను పీల్చు (hygroscopic) గుణం కలిగి ఉంది. అనార్ద్ర/నిర్జల అల్యూమినియం నైట్రేట్ అణుభారం212.996 గ్రాములు/మోల్.[2] నోనాహైడ్రేట్ అల్యూమినియం నైట్రేట్ అణుభారం 375.134 గ్రాములు/మోల్.[3] నోనాహైడ్రేట్ అల్యూమినియం నైట్రేట్ సాంద్రత1.72 గ్రాములు/సెం.మీ3. అనార్ద్ర/నిర్జల అల్యూమినియం నైట్రేట్ ద్రవీభవన స్థానం 66 °C (151 °F;339K) . నోనాహైడ్రేట్ అల్యూమినియం నైట్రేట్ ద్రవీభవన స్థానం 73.9 °C (165.0 °F;347.0K) .నోనాహైడ్రేట్ అల్యూమినియం నైట్రేట్ బాష్పీభవన స్థానం150°C (302 °F; 423K, ఈ ఉష్ణోగ్రత వద్ద ఈ రసాయనపదార్థం విఘటన చెందును. అల్యూమినియం నైట్రేట్ నీటిలో కరుగుతుంది.నిiటి ఉష్ణోగ్రత పెరిగే కొలది నీటిలో కరుగు అల్యూమినియం నైట్రేట్ పరిమాణం కూడా పెరుతుంది. మెథనాల్, ఇథనాల్ లలో కరుగుతుంది.

ఉత్పత్తి

[మార్చు]

అల్యూమినియం పాసివేసన్ పొరను (passivation layer) ఏర్పరచు గుణం కలిగిఉన్నందున, నేరుగా అల్యూమినియాన్ని నైట్రిక్ ఆమ్లంతో చర్య జరిపీ అల్యూమినియం నైట్రేట్ ఉత్పత్తి కావించటం సులభం కాదు. నైట్రిక్ ఆమ్లాన్ని అల్యూమినియం ట్రైక్లోరైడుకు చేర్చడం ద్వారా అల్యూమినియం నైట్రేట్ ను ఉత్పత్తి చేయ్యుదురు. ఈ చర్యలో నైట్రోసైల్ క్లోరైడ్ (Nitrosyl chloride) ఉపఉత్పత్తిగా ఏర్పడును.నైట్రోసైల్ క్లోరైడ్ వాయువుగా రసాయన ద్రావణం నుండి విడుదల అగును.[4]

అల్యూమినియం సల్ఫేట్ ద్రావణానికి లెడ్ సల్ఫేట్ ద్రావణాన్ని కలపడం ద్వారా అనార్ద్ర /నిర్జల అల్యూమినియం నైట్రేట్ ను ఉత్పత్తి చెయ్యవచ్చును.ఉత్పత్తి అయ్యిన అల్యూమినియం సల్ఫేట్ ద్రావణంలో ద్రావణియత లేని (insoluble) లెడ్ సల్ఫేట్, అవక్షేపంగా ఏర్పడును.[4]

అల్యూమినియం సల్ఫేట్ ద్రావణంనకు కాల్సియం నైట్రేట్ ను కలపడం ద్వారా కూడా అల్యూమినియం నైట్రేట్ ను ఉత్పత్తి చెయ్యవచ్చును. ఉత్పన్న ద్రవంలో కాల్సియం సల్ఫేట్ అవక్షేపంగా ఏర్పడి వేరుపడును. ఏర్పడిన నోనహైడ్రేట్ అల్యూమినియం నైట్రేట్‌ను స్పటికరణ వలన శుద్ధపరచెదరు. అల్యూమినియం నైట్రేట్ ఉత్పత్తికిబేరియం, స్ట్రాన్షియం, వెండి కేటాయాను/cationsలనుకలిగిన సమ్మేళనాలను ఉపయోగిస్తారు. వాటి సల్ఫేట్‌ల ద్రవంలో కరుగని స్వభావం వలన వాటిని అవక్షేపాలుగా వేరు పరచవచ్చును.

ఉపయోగాలు

[మార్చు]
  • అల్యూమినియం నైట్రేట్ శక్తి వంతమైన ఆక్సీకరణ కారకం. అందువలన అల్యూమినియం నైట్రేట్ ను లెథర్ టాన్నింగ్ (tanning leather) /తోళ్ళను పదునుపెట్టుటలోలో ఉపయోగిస్తారు.[5]
  • స్వేదనిరోధకముగా (antiperspirants), క్షయికరణ/తుప్పు నిరోధకంగా (corrosion inhibitors) ఉపయోగిస్తారు.యురేనియం సంగ్రహణలో ఉపయోగిస్తారు. అలాగే పెట్రోలియం శుద్ధిచెయ్యుటకు ఉపయోగిస్తారు.[5]
  • , నైట్రేటింగ్ కారకంగా ఉపయోగిస్తారు.[5] తొమ్మిది జలాణువులు కలిగిన ఆర్ద్ర అల్యూమినియం నైట్రేట్, ఇతర సజల అల్యూమినియం నైట్రేట్ వలన పలుప్రయోజానాలు ఉన్నాయి.
  • కాథోడ్ రేట్యూబ్ హిటింగ్ ఎలెమెంట్ లో వాడు ఇన్సులేటింగ్ పేపరు తయారికి ఉపయోగించు అల్యూమినను తయారు చేయుటకు ఈ అల్యూమినియం నైట్రేట్ లవణాలను వాడెదరు.
  • అలాగే ట్రాన్స్‌ఫారంల కోర్ లామినేసన్ లో కూడా అల్యూమినియం నైట్రేట్ ను ఉపయోగిస్తారు.
  • ఆర్ద్ర/సజల అల్యూమినియం నైట్రేట్ ను ఆక్టినాయిడ్ మూలకాల సంగ్రహణలో ఉపయోగిస్తారు.
  • తరగతిప్రయోగశాల, పరిశోధనశాలలలో సోడియం హైడ్రాక్సైడ్ తో రసాయన చర్యవలన అల్యూమినియం ట్రైహైడ్రాక్సైడ్, సోడియం నైట్రేట్ లు ఏర్పడును.
Al(NO3)3 + 3NaOH → Al(OH)3 + 3NaNO3

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు/ఆధారాలు

[మార్చు]
  1. http://chemister.ru/Database/properties-en.php?dbid=1&id=8810
  2. "Aluminium nitrate". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2015-10-17.
  3. "Aluminium nitrate nonahydrate". chemspider.com. Retrieved 2015-10-17.
  4. 4.0 4.1 "Aluminum Nitrate". chemistrylearner.com. Retrieved 2015-10-17.
  5. 5.0 5.1 5.2 "Aluminum nitrate". chemicalbook.com. Retrieved 2015-10-17.

ఇతర లింకులు

[మార్చు]