Jump to content

ఎడమచేతి అనార్థడాక్స్ స్పిన్

వికీపీడియా నుండి
(Left-arm wrist spin నుండి దారిమార్పు చెందింది)

 

ఎడమ చేతి అనార్థడాక్స్ స్పిన్ డెలివరీలో బంతి పథం

లెఫ్ట్ ఆర్మ్ అన్‌ఆర్థడాక్స్ స్పిన్, క్రికెట్‌లో ఒక రకమైన స్పిన్ బౌలింగు. దీన్ని స్లో లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్-స్పిన్ అని కూడా అంటారు. లెఫ్ట్ ఆర్మ్ అనార్థడాక్స్ స్పిన్ బౌలర్లు బంతిని స్పిన్ చేయడానికి రిస్ట్ స్పిన్‌ని ఉపయోగిస్తారు. పిచ్ అయిన తర్వాత బంతిని ఎడమ నుండి కుడికి టర్న్ అయ్యేలా చేస్తారు. [1] టర్న్ అయ్యే దిశ, సాంప్రదాయిక కుడిచేతి ఆఫ్ స్పిన్ బౌలరు వేసినట్లే ఉంటుంది, అయితే ఇందులో స్పిన్‌ను ప్రధానంగా మణికట్టు ద్వారా ఇవ్వడం వలన బంతి మరింత పదునుగా టర్నవుతుంది.

కొంతమంది ఎడమచేతి అనార్థడాక్స్ బౌలర్లు పిచ్‌పై కుడి నుండి ఎడమకు తిరిగే గూగ్లీ లేదా 'రాంగ్'వన్'కి సమానమైన బౌలింగు కూడా చేస్తారు. ఎడమచేతి వాటం బౌలరు వేసినట్లు, బంతి కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ నుండి దూరంగా పోతుంది. ఈ డెలివరీని కొన్నిసార్లు చారిత్రికంగా చైనామాన్ అని అనేవారు.

ప్రముఖ లెఫ్ట్ ఆర్మ్ అనార్థడాక్స్ స్పిన్ బౌలర్లు

[మార్చు]

19వ శతాబ్దపు దక్షిణాఫ్రికా బౌలరు చార్లీ లెవెల్లిన్ ఈ పద్ధతిలో బౌలింగు చేసిన మొదటి క్రికెటరు. [1] [2] [3] లెవెల్లిన్ గూగ్లీ డెలివరీకి మూలకర్త అయిన బెర్నార్డ్ బోసాన్‌క్వెట్‌తో ఉత్తర అమెరికాలో పర్యటించాడు. లెవెల్లిన్ అతని వద్ద గూగ్లీ డెలివరీని నేర్చుకుని, తాను ఆ విధంగా ఎడమ చేతితో బౌలింగు చేశాడు. [3] రెండు చేతులతోనూ బౌలింగు చెయ్యగల చక్ ఫ్లీట్‌వుడ్-స్మిత్ అనే ఆస్ట్రేలియా బౌలరు, 1930లలో 10 టెస్ట్ మ్యాచ్‌లతో సహా అతను ఆడిన మ్యాచ్‌లలో ఈ డెలివరీ వేసాడు. [1] [2] [4]

ఈ డెలివరీ వేసిన ప్రముఖ ఆటగాళ్ళలో డెనిస్ కాంప్టన్ ఒకడు. అతను మొదట్లో ఆర్థడాక్స్ స్లో-లెఫ్ట్ ఆర్మ్ డెలివరీలను బౌలింగు చేసాడు. అయితే అతను ఎడమ చేతి మణికట్టు స్పిన్‌ను అభివృద్ధి చేసి, తన 622 ఫస్ట్-క్లాస్ వికెట్లలో ఎక్కువ భాగం ఈ డెలివరీ ద్వారా సాధించాడు. [5] [6] ఫాస్ట్ బౌలింగుకు, ఆర్థడాక్స్ స్లో లెఫ్ట్ ఆర్మ్‌ స్పిన్‌కూ బాగా ప్రసిద్ధి చెందిన గార్ఫీల్డ్ సోబర్స్ కూడా ఈ డెలివరీని ప్రభావవంతంగా వేసేవాడు.[1] ఆధునిక యుగంలో, ఆస్ట్రేలియా బౌలరు బ్రాడ్ హాగ్ ఈ డెలివరీకి విస్తృత ప్రచారం కల్పించాడు.[1] రాంగ్ వన్‌లను చాలా బాగా వేయడంలో ఘనుడడు.[7] 2017 మార్చిలో భారతదేశం తరపున ప్రపంచ క్రికెట్ లోకి అడుగు పెట్టిన కుల్‌దీప్ యాదవ్, [8] [9] 1995 - 2004 మధ్య దక్షిణాఫ్రికా తరపున 45 టెస్ట్ మ్యాచ్‌లు, 24 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడిన పాల్ ఆడమ్స్‌లు ఈ బౌలింగు చేస్తారు. [1] [9] మైఖేల్ బెవన్, డేవ్ మొహమ్మద్ కూడా ఈ పద్ధతిలో వేసే బౌలర్లే. [1]

2021లో ది గార్డియన్, దక్షిణాఫ్రికాకు చెందిన కుల్‌దీప్, తబ్రైజ్ షమ్సీ, ఆఫ్ఘన్ బౌలరు నూర్ అహ్మద్ లను "ప్రపంచ క్రికెట్‌లో బహుశా అగ్రగామి ఎడమచేతి మణికట్టు-స్పిన్నర్ల"ని పేర్కొంది.[10] 2022 లో మైఖేల్ రిప్పన్ న్యూజిలాండ్ తరపున ఆడిన "మొదటి స్పెషలిస్ట్‌ ఎడమ చేతి మణికట్టు స్పిన్నరు". [11] మహిళల గేమ్‌లో హాంకాంగ్‌కు చెందిన క్యారీ చాన్ ఎడమ చేతి మణికట్టు స్పిన్ డెలివరీలను వేస్తుంది. [12]

లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్ బౌలర్లు అనార్థడాక్స్ంగా ఉంటారని క్రిక్‌ఇన్ఫో సూచించింది. ఎందుకంటే "ఎడమ చేయి మణికట్టు స్పిన్‌ను నియంత్రించడం చాలా కష్టం. పైగా... కుడిచేతి వాటం బ్యాటరు పైకి వచ్చే బంతి, అతని నుండి దూరంగా పోయే బంతికంటే తక్కువ ప్రమాదకరంగా పరిగణించబడుతుంది". [a] [1] ఒక టెస్టు మ్యాచ్‌లో ఎడమచేతి అనార్థడాక్స్ స్పిన్నర్లు పది వికెట్లు తీసిన సందర్భాలు చాలా అరుదు. 1936-37లో ఇంగ్లండ్‌పై చక్ ఫ్లీట్‌వుడ్-స్మిత్,[13] 1996-97లో వెస్టిండీస్‌పై మైఖేల్ బెవన్,[14] 2002-03లో బంగ్లాదేశ్‌పై పాల్ ఆడమ్స్ ఇందుకు ఉదాహరణలు. [15]

'చైనామాన్' అనే పదం ఉపయోగం

[మార్చు]

చారిత్రాత్మకంగా "చైనామాన్" అనే పదాన్ని కొన్నిసార్లు గూగ్లీ డెలివరీ లేదా ఇతర అనార్థడాక్స్మైన డెలివరీలను వర్ణించడానికి ఉపయోగించేవారు - కుడిచేతి లేదా ఎడమచేతి బౌలర్లకు కూడా. [16] గూగ్లీకి సమానమైన ఎడమ చేతి మణికట్టు స్పిన్నరు వేసే డెలివరీని "చైనామాన్" అనేవారు.

చైనామాన్ అనే పదం యార్క్‌షైర్‌లో 1920 లలో వాడుకలో ఉందని, రాయ్ కిల్నర్‌ను సూచించడానికి దాన్ని మొదట ఉపయోగించబడి ఉండవచ్చనీ తెలిసినప్పటికీ, అది ఎలా వచ్చిందనేది అస్పష్టంగా ఉంది. [b] [9] [19] గూగ్లీకి సమానమైన బౌలింగు చేసిన మొదటి ఎడమ చేతి బౌలరు చార్లీ లెవెల్లిన్‌ను సూచించేందుకు లోపాయికారీకా వాడిన పదం కావచ్చు. [c] [21] యార్క్‌షైర్ బౌలరు జార్జ్ మెకాలే గూగ్లీ వేయడాన్ని సూచించడానికి 1926లో ది గార్డియన్‌లో ముద్రణలో వాడారు.[d] అయితే, 1933లో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఇంగ్లాండ్, వెస్టిండీస్‌ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ తర్వాత ఈ పదం వాడుక మరింత విస్తృతంగా మారింది. చైనీస్ మూలానికి చెందిన ఆటగాడు ఎల్లిస్ అచోంగ్, స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్ బౌలింగు చేసి, వాల్టర్ రాబిన్స్‌ను ఆఫ్ స్టంప్ వెలుపల నుండి కుడిచేతి బ్యాటరు మీదికి టర్నయ్యేలా ఆశ్చర్యకరమైన డెలివరీ వేసి అతన్ని స్టంపౌట్ చేశాడు. పెవిలియన్‌కి తిరిగి వెళుతూ రాబిన్స్ అంపైర్‌తో, "బ్లెడీ చైనామ్యాన్ చేతిలో ఔటవడమే వెరైటీ!", అని అన్నాడని ప్రతీతి. [9] [22] [23] ఆ విధంగా ఈ పదం మరింత విస్తృతంగా ఉపయోగం లోకి వచ్చింది.[2]

2017లో, చైనీస్ సంతతికి చెందిన ఆస్ట్రేలియా జర్నలిస్టు ఆండ్రూ వూ, ఈ పదాన్ని వాడడం "జాతిపరంగా అభ్యంతరకరం" అని ఆందోళన వ్యక్తం చేశాడు. [22] ఈ పదం "చైనీయులను న్యూనంగా వర్ణించడానికి ఉపయోగించారు" అని వాదించాడు. [22] విస్డెన్ అధికారికంగా 2018 అల్మానాక్ ఎడిషన్‌లో స్లో లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్-స్పిన్ అనే పదాన్ని మారుస్తూ, చైనామాన్‌ అనే పదం "ఇకపై తగినది కాదు" అని అభివర్ణించింది. [2] [21] [24] క్రిక్‌ఇన్‌ఫో కూడా 2021లో దీనిని అనుసరించింది. క్రికెట్‌లో దాని ఉపయోగం "అవమానకరమైనది కాదు" అని కొందరు వాదించినప్పటికీ, దాని వినియోగం సరికాదని అది పేర్కొంది. [25] కొంతమంది రచయితలు ఈ పదాన్ని ఇంకా ఉపయోగిస్తూనే ఉన్నారు. [e]

గమనికలు

[మార్చు]
  1. A left-arm wrist spin bowler's standard delivery will turn towards a right-handed batsman, as opposed to a right-arm leg spin bowler who will turn the ball away from them. The majority of batters are right-handed.
  2. Kilner bowled slow left-arm orthodox deliveries rather than wrist spin. Although it is possible that the term was first used either by Kilner or in reference to his bowling, it was not used by Wisden Cricketers' Almanack in 1924 when he was one of their five Cricketers of the Year or in his 1929 obituary.[17][18]
  3. Llewellyn had a white father and a mother who had been born on St Helena.[20] She was described as "black" by historian Rowland Bowen, although it is possible that she was from a Madagascan or Indian background. Andy Carter has suggested that there could be a link between Llewellyn's mixed-race heritage and the use of the term "chinaman".[21]
  4. Macaulay was a right-arm bowler who did not bowl wrist spin deliveries.
  5. For example, the term remained in use to describe Kuldeep Yadav in the Hindustan Times[26] and The Indian Express in 2021.[27]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 Leggie in the mirror, CricInfo, 22 November 2007. Retrieved 21 March 2021.
  2. 2.0 2.1 2.2 2.3 Rubaid Iftekhar (25 June 2020) The 'Chinaman mystery': Racism and left-arm leg-spin, The Business Standard. Retrieved 21 March 2021.
  3. 3.0 3.1 Carter A (2019) Beyond the Pale: early black and asian cricketers in Britain 1868–1945, p.74. Leicester: Troubador. ISBN 9781838592028 (Available online. Retrieved 14 August 2021.)
  4. Fleetwood-Smith, Leslie O'Brien, Obituaries in 1971, Wisden Cricketers' Almanack, 1972. Retrieved 21 March 2021.
  5. Denis Compton, Obituary, Wisden Cricketers' Almanack, 1998. Retrieved 21 March 2021.
  6. Arlott J (1988) The great entertainer, Wisden Cricket Monthly, May 1988. Retrieved 21 March 2021.
  7. Dorries B (20 March 2014) Aussie spinner Brad Hogg admits he didn’t know what wrong-un was early in his career, The Courier Mail. Retrieved 21 March 2021.
  8. Kuldeep Yadav, CricInfo. Retrieved 18 December 2019.
  9. 9.0 9.1 9.2 9.3 Bull A (18 March 2017) Isn't it about time cricket consigned 'chinaman' to the past?, The Guardian. Retrieved 21 March 2021.
  10. Liew J (23 July 2021) Jake Lintott reviving English left-arm wrist-spin after half a century The Guardian. Retrieved 2 August 2022.
  11. Michael Rippon becomes first left-arm wristspinner picked by New Zealand CricInfo, 21 June 2022. Retrieved 2 August 2022.
  12. Kary Chan CricInfo. Retrieved 2 August 2022.
  13. Full Scorecard of Australia vs England 4th Test 1936-7, CricInfo. Retrieved 21 July 2022.
  14. Full Scorecard of West Indies vs Australia 4th test, 1996/97, CricInfo. Retrieved 21 May 2022.
  15. Full Scorecard of Bangladesh vs South Africa 1st Test 2002-3 CricInfo. Retrieved 21 July 2022.
  16. Carter, op. cit., pp.75–76.
  17. Bowler of the Year: Roy Kilner, Wisden Cricketers' Almanack, 1924. Retrieved 21 March 2021.
  18. Roy Kilner, Obituary, Wisden Cricketers' Almanack, 1929. Retrieved 21 March 2021.
  19. Maurice Leyland, Obituary, Wisden Cricketers' Almanack, 1968. Retrieved 21 March 2021.
  20. Carter, op. cit., pp.69–70.
  21. 21.0 21.1 21.2 Carter, op. cit, p.76.
  22. 22.0 22.1 22.2 Andrew Wu (26 March 2017) Australia v India Test series 2017: Does cricket really need to continue using the term 'chinaman'?, The Sydney Morning Herald. Retrieved 23 March 2019.
  23. The Original Chinaman, CricInfo, 31 August 1995. Retrieved 21 March 2021.
  24. Wisden replaces Chinaman with slow left-arm wrist-spin bowlers, CricketCountry, 12 April 2018. Retrieved 23 March 2019.
  25. Bal S (16 April 2021) Why we're replacing 'batsman' with 'batter', CricInfo. Retrieved 15 August 2021.
  26. Samyal SK (19 July 2021) Kuldeep Yadav finds his rhythm in opening Sri Lanka ODI win, Hindustan Times. Retrieved 15 August 2021.
  27. Sandip G (12 February 2021) India vs England: No room for Chinaman Kuldeep Yadav, The Indian Express. Retrieved 15 August 2021.