Jump to content

అంబటి రాయుడు

వికీపీడియా నుండి
అంబటి తిరుపతి రాయుడు
అంబటి రాయుడు
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అంబటి తిరుపతి రాయుడు
పుట్టిన తేదీ (1985-09-23) 1985 సెప్టెంబరు 23 (వయసు 39)
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా
మారుపేరుఅంబ
ఎత్తు[convert: needs a number]
బ్యాటింగుకుడి చేతి బ్యాట్స్ మన్
బౌలింగురైట్ ఆర్మ్ , ఆఫ్ స్పిన్
పాత్రబ్యాట్స్ మన్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2001/02–2009/10హైదరాబాద్
2005/06ఆంధ్రా క్రికెట్ టీమ్
2010/11–presentబరోడా క్రికెట్ టీమ్
2007/08హైదరాబాద్ హార్సెస్
2010-2017ముంబై ఇండియన్స్
2017-2019సన్ రైజర్స్ హైదరాబాద్
2018-Presentచెన్నై సూపర్ కింగ్స్
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్ List A T20
మ్యాచ్‌లు 63 45 50
చేసిన పరుగులు 3754 1335 1128
బ్యాటింగు సగటు 42.17 32.56 24.52
100s/50s 9/19 1/11 0/8
అత్యధిక స్కోరు 210 117 75*
వేసిన బంతులు 660 216
వికెట్లు 9 8
బౌలింగు సగటు 47.88 25.25
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 n/a n/a
అత్యుత్తమ బౌలింగు 4/43 4/45
క్యాచ్‌లు/స్టంపింగులు 48/– 19/– 26/3
మూలం: Cricinfo, 2011 అక్టోబరు 10

1985, సెప్టెంబర్ 23న ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరులో సాంబశివరావు, విజయలక్ష్మి దంపతులకు జన్మించిన అంబటి రాయుడు (Ambati Thirupathi Rayudu) క్రికెట్ క్రీడాకారుడు. 2001-02లో రంజీ ట్రోఫిలో హైదరాబాదు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 2002-03 సీజన్‌లో రాయుడు ఆంధ్రప్రదేశ్ జట్టుపై ఒకే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ పూర్తిచేశాడు. 2005-06 సీజన్‌లో ఒకసారి ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున కూడా ఆడినాడు.

రాయుడు 2002లో అండర్-19 భారత క్రికెట్ జట్టు తరఫున ఇంగ్లాండు పర్యటించి అక్కడ మూడవ వన్డేలో 177 పరుగులు సాధించి 305 పరుగుల పక్ష్యఛేధనలో భారత జట్టు విజయానికి దోహదపడ్డాడు. అంతకు క్రితం మ్యాచ్‌లో 80 పరుగులు సాధించి అందులోనూ భారత జట్టు లక్ష్యసాధనకు తోడ్పడ్డాడు. 2003-04 లో జరిగిన అండర్-19 ప్రపంచ కప్ పోటీలో రాయుడు భారత జట్టుకు నేతృత్వం వహించాడు. 2015 ఫిబ్రవరి 14 నుండి ప్రారంభమయ్యే ప్రపంచ కప్ క్రికెట్ పోటీలకు ఎంపికైన భారతజట్టులో స్థానం సంపాదించుకున్నాడు.[1][2]ఆయన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 2010 నుండి చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరపున ఆడాడు. [3]

రాయుడు ఐపీఎల్‌లో 204 మ్యాచ్‌లు ఆడి 4348 పరుగులు చేశాడు. 23సార్లు 50 పైన స్కోర్లు సాధించాడు. ముంబయి తరఫున మూడుసార్లు (2013, 15, 17), చెన్నై తరఫున మూడుసార్లు (2018, 2021, 2023) ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

అంబటి రాయుడు 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ చెప్పి, 2023లో ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు.[4]

జననం

[మార్చు]

అంబటి రాయుడు 1985, సెప్టెంబర్ 23న ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరులో సాంబశివరావు, విజయలక్ష్మి దంపతులకు జన్మించాడు.అయన తన విద్యాభాసాన్ని హైదరాబాద్ సైనిక్ పూరి లోని శ్రీ రామకృష్ణ విద్యాలయంలో పూర్తి చేశాడు. రాయుడు తన స్నేహితురాలు చెన్నుపల్లి విద్యను 2009 ఫిబ్రవరి 14 న వివాహం ఆడాడు.[5]

రాజకీయ జీవితం

[మార్చు]

అంబటి రాయుడు 2023 డిసెంబర్ 28న తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. ఎడిటర్ (7 January 2015). "ప్రపంచకప్పుకు అంబటిరాయుడు ఎంపిక". సాక్షి. Archived from the original on 13 September 2015. Retrieved 7 January 2015.
  2. ఈనాడు, తాజావార్తలు (23 September 2019). "అంబటి రాయుడా.. నీవెక్కడ? - EENADU". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 23 September 2019. Retrieved 23 September 2019.
  3. Namasthe Telangana (1 May 2021). "IPL 2021: రాయుడు 27 బంతుల్లో 72..చెన్నై స్కోర్‌ 218". Archived from the original on 1 May 2021. Retrieved 1 May 2021.
  4. Eenadu. "ఈ గుంటూరు కుర్రాడికి ఘాటెక్కువే.. ఆటకు అంబటి రాయుడు గుడ్‌బై". Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.
  5. .thenationalbiography.in (21 April 2019). "The National Biography". www.thenationalbiography.in. Archived from the original on 30 August 2019. Retrieved 30 August 2019.
  6. 10TV Telugu (28 December 2023). "వైసీపీలో చేరిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు." (in Telugu). Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)

బయటి లింకులు

[మార్చు]