అదుర్స్ (సినిమా)
అదుర్స్ | |
---|---|
దర్శకత్వం | వి. వి. వినాయక్ |
రచన | కోన వెంకట్ |
నిర్మాత | వల్లభనేని వంశీ మోహన్ |
తారాగణం | జూనియర్ ఎన్.టి.ఆర్ నయనతార షీలా మహేష్ మంజ్రేకర్ ఫిష్ వెంకట్ |
ఛాయాగ్రహణం | ఛోటా. కె. నాయుడు |
కూర్పు | గౌతం రాజు |
సంగీతం | దేవి శ్రీ ప్రసాద్ |
విడుదల తేదీ | 13 జనవరి 2010 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | 27 కోట్లు |
అదుర్స్ 2010 లో వి.వి.వినాయక్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో జూనియర్ ఎన్. టి. ఆర్, నయనతార, షీలా ప్రధాన పాత్రల్లో నటించారు. జూనియర్ ఎన్.టి.ఆర్ మొదటి సారిగా ద్విపాత్రాభిమానం చేసిన చిత్రం ఇది. వల్లభనేని వంశీమోహన్ ఈ చిత్ర నిర్మాత. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్నందించాడు. 2010 జనవరి 13 న ప్రపంచ వ్యాప్తంగా 1300 తెరలమీద విడుదలైన ఈ సినిమా వాణిజ్య పరంగా మంచి లాభాలు రాబట్టింది. 155 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. ఈ సినిమాను మలయాళంలో కవచం అనే పేరుతో అనువాదం చేశారు.
పాటలు
[మార్చు]- శివ శంభో, రచన: చంద్రబోస్, గానం. దేవిశ్రీ ప్రసాద్
- చంద్రకళ , రచన, రామజోగయ్య శాస్త్రి, గానం. హారీహరన్, రీటా
- పిల్లా నా వల్ల కాదు , రచన: చంద్రబోస్ , గానం.మిఖాసింగ్, సుచిత్ర
- నీతోనే , రచన: కులశేఖర్ , గానం.కునాల్ గంజ్వలా, శ్రేయా ఘోషల్
- చారీ, రచన: రామజోగయ్య శాస్త్రీ , గానం.జూనియర్ ఎన్ టి రామారావు, రీటా
- అస్లం వెల్కమ్ , రచన: రామజోగయ్య శాస్త్రి , గానం.బాబా సెహగల్ , ప్రియ హిమేష్
- శివ శంభో ,(రీమిక్స్) , రచన: చంద్రబోస్, గానం.దేవిశ్రీ ప్రసాద్
కథ
[మార్చు]కథ ప్రారంభంలో ఒక ముసలామె కోడలు మూడోసారి కానుపులో మృత శిశువుకు జన్మనిచ్చేసరికి పక్కనే ఉన్న కవల పిల్లల్లో ఒకడిని తమ బిడ్డగా తీసేసుకుంటుంది. కవలపిల్లల్లో ఒకడైన నరసింహ మాత్రమే ఒంటరియైన తల్లి దగ్గర పెరుగుతాడు. పోలీసు కావాలనే లక్ష్యంతో పోలీసు అధికారియైన నాయక్ దగ్గర అండర్ కవర్ ఏజెంటుగా పనిచేస్తుంటాడు. మరో వైపు చారి బ్రాహ్మణ కుటుంబంలో పెరుగుతుంటాడు. అతనికి గురువైన భట్టు చంద్రకళ అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. కానీ ఆమె మాత్రం చారిని ప్రేమిస్తుంటుంది. దానికి కారణం అదే పోలికలతో ఉన్న నరసింగ ఆమెను పోకిరీల నుండి ఆమెను రక్షిస్తూ ఉంటాడు. నరసింహ నాయక్ కూతురైన నందును ప్రేమిస్తూ ఉంటాడు. ధనరాజ్, బాబా అనే ఇద్దరు వ్యక్తులు ఒక పేరొందిన ఆర్మీ సైంటిస్ట్ కుటుంబంకోసం వెతుకుతుంటారు. ఆయనే నరసింహ తండ్రి. నరసింహను వారిద్దరూ కనిపెట్టి, నాయక్ తన కూతురు మీదున్న ప్రేమను ఆసరాగా తీసుకుని నరసింహను తమ దగ్గరికి రప్పించుకుంటారు. నరసింహ వారినుంచి తప్పించుకుంటాడు. కానీ అదే సమయానికి ఇద్దరు వ్యక్తులు వెళ్ళి చారిని నరసింహగా నటించేందుకు ఒప్పిస్తారు.
నటీ నటులు
[మార్చు]- నందమూరి తారక రామారావు, జూనియర్ - నరసింహ, చారి
- నయనతార - చంద్రకళ
- షీలా - నందు
- కవల పిల్లల తల్లిగా వినయ ప్రసాద్
- నాజర్
- బ్రహ్మానందం - భట్టు
- బాబాగా మహేష్ మంజ్రేకర్
- పోలీసు ఆఫీసర్ నాయక్ గా సాయాజీ షిండే
- ధనరాజ్ గా ఆశిష్ విద్యార్థి
- తనికెళ్ళ భరణి
- శంకరాభరణం రాజ్యలక్ష్మి
- ధన్రాజ్
- ఆలీ
- కృష్ణుడు
- శ్రీనివాస రెడ్డి
- రమాప్రభ
- ముకుల్ దేవ్
- భాషా భాయ్ గా ఎం. ఎస్. నారాయణ
- రఘుబాబు
- సుప్రీత్ రెడ్డి
- సుధ
- వత్సల రాజగోపాల్
- రోషన్ బాబుగా కొండవలస లక్ష్మణరావు
- పేరి శాస్త్రిగా అనంత్
- కారుమంచి రఘు
- ఫిష్ వెంకట్
- పృధ్వీరాజ్
ఫలితం
[మార్చు]రెడిఫ్ ఈ చిత్రానికి 4/5 రేటింగ్ ఇచ్చింది.[1]
మూలాలు
[మార్చు]- ↑ "Adurs is NTR's show all the way". Rediff. Archived from the original on 16 జనవరి 2010. Retrieved 20 జూన్ 2020.