Jump to content

అనంతవరప్పాడు

అక్షాంశ రేఖాంశాలు: 16°13′59″N 80°27′16″E / 16.23306°N 80.45444°E / 16.23306; 80.45444
వికీపీడియా నుండి
అనంతవరప్పాడు
పటం
అనంతవరప్పాడు is located in ఆంధ్రప్రదేశ్
అనంతవరప్పాడు
అనంతవరప్పాడు
అక్షాంశ రేఖాంశాలు: 16°13′59″N 80°27′16″E / 16.23306°N 80.45444°E / 16.23306; 80.45444
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాగుంటూరు
మండలంవట్టిచెరుకూరు
విస్తీర్ణం
10.3 కి.మీ2 (4.0 చ. మై)
జనాభా
 (2011)
4,238
 • జనసాంద్రత410/కి.మీ2 (1,100/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు2,099
 • స్త్రీలు2,139
 • లింగ నిష్పత్తి1,019
 • నివాసాలు1,118
ప్రాంతపు కోడ్+91 ( 0863-2287 Edit this on Wikidata )
పిన్‌కోడ్522017
2011 జనగణన కోడ్590311

అనంతవరప్పాడు, గుంటూరు జిల్లా, వట్టిచెరుకూరు మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన వట్టిచెరుకూరు నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గుంటూరు నుండి 10 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1118 ఇళ్లతో, 4238 జనాభాతో 1030 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2099, ఆడవారి సంఖ్య 2139. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1488 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 133. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590311.[1]

సమీప గ్రామాలు

[మార్చు]

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల గుంటూరులో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ గుంటూరులో ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులో ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

అనంతవరప్పాడులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది. రివర్స్ ఆస్మాసిస్ మంచినీటి సుద్ది కేంద్రం ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు వచ్చింది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ ఉండి.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

అనంతవరప్పాడులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామానికి 9 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామంలో సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

వాణిజ్య బ్యాంకు - చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, లక్ష్మీ విలాస్ బ్యాంక్ - ఇటీవలి కాలంలో డిబిఎస్ (DBS) బ్యాంక్ లో విలీనం చేయబడింది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 20 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

అనంతవరప్పాడులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 332 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 183 హెక్టార్లు
  • బంజరు భూమి: 11 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 503 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 619 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 78 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

అనంతవరప్పాడులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 78 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

అనంతవరప్పాడులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, ప్రత్తి, మిరప

పారిశ్రామిక ఉత్పత్తులు

[మార్చు]

బియ్యం

గ్రామంలోని మౌలిక సదుపాయాలు

[మార్చు]

త్రాగునీటి సౌకర్యం

[మార్చు]

గ్రామానికి దూరంగా ఉన్న ఎస్.సి.కాలనీలో, గ్రామానికి చెందిన దాత శ్రీ యడ్లపల్లి బాబూరావు అందజేసిన ఒక లక్ష రూపాయల ఆర్థిక సహకారంతో నిర్మించు రెండు మంచినీటి బోర్ల నిర్మాణానికి, 2017, ఏప్రిల్-9న శంకుస్థాపన నిర్వహించారు. ఈ బోర్ల నిర్మాణం పూర్తి అయినచో, వీటి నుండి ఈ కాలనీవాసులకు రక్షిత మంచినీటి సౌకర్యం కలిగించెదరు. [14]

గ్రామ పంచాయతీ

[మార్చు]
  1. యర్రగుంట్ల సుబ్బారావు -ఈ గ్రామపంచయతీకి 1956 లో జరిగిన ఎన్నికలలో (ఆదెయ్య) ఎన్నికైనారు. ఆ సమయంలో గ్రామంలో గ్రంథాలయ భవనం నెలరోజులలో నిర్మించడానికి పంచాయతీ బోర్డు అనుమతి మంజూరు చేసింది. అపుడు, ఏ విధమయిన సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ రోజులలో పగలూ రేయీ కష్టపడి కూలీలతో 25 రోజులలో పనులు పూర్తిచేసి, 29వ రోజుననే శంకుస్థాపన చేసిన (27-2-1959) ఎం.ఎల్.ఏ శ్రీ తెల్లాకుల జాలయ్య గారిచేతనే 26–3-1959 న ప్రారంభొత్సవం చేయించారు. గ్రామంలో గ్రంథాలయంలో మైకులుఏర్పాటు చేయించి, ప్రతి రోజూ ఉదయం సాయంత్రం వార్తలు చదివి వినిపింపజేశారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్ధను సంప్రదించి అవసరమైన పుస్తకాలు తెప్పించారు. గ్రామంలో తొలి అంతర్గత రహదారులు, ప్రధాన మార్గం నిర్మాణంలో విశేష కృషిచేశారు.
  2. కోయ సాంబశివరావు - 1958 ప్రాంతంలో పొగాకులో అధిక దిగుబడి సాధించిన రైతు. 1958 పంచాయతీ ఎన్నికలలో గ్రామంలో మూడవ వార్డు సభ్యునిగా ఆయనను గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన సేవలకు మెచ్చి 1964లో ఉప సర్పంచిగా ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 1970లో గ్రామ సర్పంచిగా ఎన్నికైనారు. 10 సంవత్సరాల పాటు ఆ పదవిలో ఉన్నారు. వీరు తమ స్వంతనిధులతో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు తరగతి గదులు నిర్మించారు. 1977 నవంబరులో, తుఫాను వలన పేదల గృహాలు కూలిపోవడంతో, ఉచితంగా ఆహారం, వసతి సౌకర్యాలు కల్పించారు. గ్రామంలోని మూడు ఎస్.సి.కాలనీలలోని మంచినీటి చెరువులలో పూడికతీయించారు. బి.సి., ఎస్.సి.కాలనీలలో ప్రాథమిక పాఠశాలల నిర్మాణం, విద్యుత్తు సౌకర్యం, అనంతవరప్పాడు గ్రామం నుండి గుండారం, గొడవర్రు, నారాకోడూరుకు రహదారులు నిర్మించారు. ప్రభుత్వం నుండి నిధులు విడుదల కాకపోవడంతో, తన స్వంత నిధులతో పనులు పూర్తి చేయించిప్రజాభిమానం పొందినారు.
  3. ఉప్పుటూరి సుబ్రహ్మణ్యం - మాజీ సర్పంచి:- వీరి హయాంలో ఈ గ్రామం ఉత్తమ పంచాయతీగా ఎంపికైనది. వీరు ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి విశేష కృషి చేసారు. వీరు 2015, సెప్టెంబరు-11న అనారోగంతో కన్నుమూసినారు
  4. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో ముప్పా మోహనవంశీ సర్పంచిగా ఎన్నికైనాడు.
  5. 2021 ఫిబ్రవరిలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో దారా వెంకట రావు సర్పంచిగా ఎన్నికైనాడు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ భ్రమరాంబికా సమేత శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయం

[మార్చు]

శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం

[మార్చు]

ఈ గ్రామములో కోటి రూపాయల విలువగల ఆస్తులున్న శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం శిథిలావస్థలో ఉంది. గ్రామస్థులంతా కలిసి, 50 లక్షల విరాళాలతో, ఈ ఆలయ జీర్ణోద్ధరణ చేయ సంకల్పించి, 2014, ఫిబ్రవరి-5 న దేవాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. [5]

శ్రీ ప్రసన్నాంజనేయస్వామి ఆలయo

[మార్చు]
  1. ఈ ఆలయ నిర్మాణానికి 2014, ఫిబ్రవరి-9, ఆదివారం నాడు, శంకుస్థాపన చేశారు. [6]
  2. ఈ ఆలయంలో, 2015, జూన్-4వ తేదీ గురువారంనాడు, స్వామివారి శాంతికళ్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించారు. [10]

పోలేరమ్మ అమ్మవారి ఆలయం

రామాలయం గుడి

గ్రామంలోని ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

[మార్చు]
  • రావి రంగారావు: ఈ గ్రామంలో పుట్టారు. గొప్ప కవి. సాహిత్య విమర్శకుడు. బాల సాహిత్యవేత్త. మినికవితా పితామహుడు.సుమారు 40 గ్రంథాలు ప్రచురించారు. మఛిలీపట్నంలో ఆంధ్ర జాతీయ బి.ఎడ్. కాలేజిలో ప్రిన్సిపాలుగా, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎడ్యుకేషన్ విభాగం బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మనుగా పనిచేసారు.మచిలీపట్నంలో "సాహితీమిత్రులు" సంస్థ స్థాపించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం పదవీ విరమణ చేసాక గుంటూరుకు మకాం మార్చారు. రావి రంగారావు సాహిత్య పీఠం నెలకొల్పి సాహిత్య సాంస్కృతిక కళా కార్యక్రమాలు నిర్వహించటం ప్రారంభించారు. 2014, జూన్ నెలలో 13 జిల్లాల కవులతో "సీమాంధ్ర కవి సమ్మేళనం" దిగ్విజయంగా నిర్వహించారు. గుంటూరులో "అమరావతి సాహితీ మిత్రులు" సంస్ధ స్థాపించి 2016నుండి సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తూ సాహిత్య చైతన్యం పెంచుతున్నారు.

గ్రామ విశేషాలు

[మార్చు]
  1. ఈ గ్రామాన్ని గుంటూరు లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్, ఆదర్శగ్రామంగా దత్తత తీసికొన్నాడు.
  2. ఈ గ్రామములోని మొత్తం 301 వీధిదీపాలకు, ఎల్.ఇ.డి. దీపాలను అమర్చి, గ్రామములో విద్యుత్తు వెలుగులను ప్రసరింపజేయడానికి నెడ్ క్యాప్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ విధంగా చేసి, ఇంధన పొదుపునకు శ్రీకారం చుట్టనున్నది.

గణాంకాలు

[మార్చు]
  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం *జనాభా 4187* పురుషుల సంఖ్య 2126*మహిళలు 2061*నివాసగృహాలు 1005, విస్తీర్ణం 1030 హెక్టారులు

మూలాలు

[మార్చు]
  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".