Jump to content

ఇస్రా, మేరాజ్

వికీపీడియా నుండి
16వ శతాబ్దంలోని పర్షియన్ చిత్రం మహమ్మదు ప్రవక్త మేరాజ్ ప్రయాణానికి వెళ్ళుట. ఇస్లాంలో మనుషుల చిత్రీకరణ నిషిధ్ధం, ముఖంకప్పి చిత్రించడం, అదో విడ్డూరం, అదియూ మహమ్మదు ప్రవక్తగారి చిత్రం!

ఇస్లామీయ సాంప్రదాయాలలో ఇస్రా, మేరాజ్ (అరబ్బీ : الإسراء والمعراج), అనునవి సా.శ. 621 (1 హిజ్రీ పూర్వం) మహమ్మదు ప్రవక్త గారి షబ్-ఎ-మేరాజ్ న ఆరోహణాకార్యక్రమాల రెండు భాగాలు. మహమ్మదు ప్రవక్త భౌతికంగా మేరాజ్ ప్రయాణం చేశారని చాలామంది ముస్లిం పండితుల అభిప్రాయం. కొందరైతే ఆత్మపరంగా మేరాజ్ ప్రయాణం చేశారని భావిస్తారు.[1] క్లుప్తంగా ఈ ప్రయాణ సారాంశాన్ని ఖురాన్ లోని అల్-ఇస్రా సూరాలో 1 నుండి 60 సూక్తులలో వర్ణింపబడింది. ఇతరత్రా విషయాలు హదీసులలో నుండి లభించాయి.

  • ఇస్రా: మక్కా నగరంలోని కాబాలో మహమ్మదు ప్రవక్త విశ్రాంతి తీసుకొనుచుండగా జిబ్రయీల్ దూత ప్రత్యక్షమై, అల్లాహ్ ఆజ్ఞతో బుర్రాఖ్ పై కూర్చుబెట్టుకొని, మక్కానుండి "సుదూరపు మస్జిద్" (జెరూసలేం లోని మస్జిద్-అల్-అఖ్సా) కు తీసుకెళ్ళాడు. ఈ ప్రయాణాన్ని ఇస్రా అంటారు. ఇచ్చట ప్రవక్తల నమాజుకు ఇమామత్ చేశారు.
  • మేరాజ్: "సుదూరపు మస్జిద్" నుండి జిబ్రయీల్, మహమ్మదు ప్రవక్తను బుర్రాఖ్ పై కూర్చోబెట్టి, మేరాజ్ స్వర్గారోహణకై తీసుకెళ్ళాడు. ఈ ప్రయాణాన్ని మేరాజ్ అంటారు.

ఈ ఆరోహణలో మహమ్మదు ప్రవక్త ఇతర ప్రవక్తలతో సంభాషిస్తాడు. అల్లాహ్ తోనూ సంభాషిస్తాడు. ఈ శుభఘడియలో అల్లాహ్ తన బహుమానంగా మహమ్మదు ప్రవక్తకు 5 పూటల ప్రార్థనలను (నమాజ్ లను) ప్రసాదిస్తాడు.

ఈ మహమ్మదు ప్రవక్త 'ఇస్రా, మేరాజ్' ఆరోహణనూ, ప్రయాణాన్ని విశ్వాసులు నమ్ముతారు (అందులో అబూబక్ర్ ప్రథముడు), అవిశ్వాసులు నమ్మక గేలిచేస్తారు.

మహమ్మదు ప్రవక్త 'ఇస్రా మేరాజ్' లను పునస్కరించుకొని ముస్లింలు షబ్-ఎ-మేరాజ్ లేదా లైలతుల్ మేరాజ్ పర్వాన్ని గడుపుకొంటారు. రాత్రంతా జాగారం చేసి నమాజ్ చేస్తారు.

ప్రయాణ విధము

[మార్చు]

పెక్కు మంది ముస్లింలు ఈ ప్రయాణాన్ని 'భౌతిక (బొందితో) ప్రయాణ'మని నమ్ముతారు. కొందరైతే ఈ ప్రయాణం 'ఆత్మ పరమైన ప్రయాణం' (కల) అని భావిస్తారు. ఇస్లామీయ చరిత్రకారుడు ఇబ్న్ ఇస్ హాఖ్ ప్రకారం ఈ ప్రయాణం ఆత్మపర ప్రయాణం. హదీసుల ప్రకారం ఆయెషా సిద్దీఖా (మహమ్మదు ప్రవక్త గారి పత్ని) ఇలా చెప్పారు: "మహమ్మదు ప్రవక్త గారి ఆత్మ ఈ సుదూర ప్రయాణం (మేరాజ్) చేసింది" అని. కానీ అల్-తబరి, ఇబ్న్ కసీర్ ల ప్రకారం ఈ ప్రయాణం భౌతికమయినది.[2] అబుల్ అలా మౌదూది ప్రకారం : "ఇతర హదీసుల ప్రకారం ఈ ప్రయాణం భౌతికమయినది", " ఆత్మపరమైన ప్రయాణమని విశ్వాసులు అంగీకరించరు".[3]

మస్జిద్ అల్-అఖ్సా, సుదూరపు మస్జిద్

[మార్చు]

మేరాజ్ జరిగిన సమయంలో, ఆ ప్రాంతంలో మస్జిద్ లేదు. అందుకే ఆ మస్జిద్ కు 'సుదూరపు మస్జిద్' లేక మస్జిద్-ఎ-అఖ్సా (అరబ్బీ భాష : المسجد الأقصى ) అని అంటారు. దీని వర్ణన ఖురాన్ 17:1,లో జరిగింది.ఈ మస్జిద్ జెరూసలేం లోని మస్జిద్ ల సమూహంలో గలదు.[4]

నవీన అల్-అఖ్సా మస్జిద్, మహమ్మదు ప్రవక్త నిర్యాణం తరువాత నిర్మింపబడింది.

నవీన ధృక్పదం

[మార్చు]

ఇస్లాంలో పర్వదినమైన లైలతుల్-మేరాజ్, హిజ్రత్కు ముందు తాయిఫ్ ప్రజలవద్దకు వెళ్ళకముందు జరిగింది. రజబ్ నెల 27వ తేదీన రాత్రి జరిగింది.

లైలతుల్-మేరాజ్ (అరబ్బీ: لیلة المعراج, లేదా షబ్-ఎ-మేరాజ్ అరబ్బీ شب معراج, ప్రపంచంలోని అన్ని దేశాలలోని ముస్లింలు ఘనంగా జరుపుకుంటారు. ఈ పర్వాన మస్జిద్ లకు దీపాలతో అలంకరిస్తారు. రాత్రంతా జాగారం జేస్తూ ప్రార్థనలు చేస్తారు. ఇస్రా, మేరాజ్ ల కథ వివరింపబడుతుంది. మహమ్మదు ప్రవక్త ఏ విధంగా అల్లాహ్ను కలవడానికి జిబ్రయీల్తో బుర్రాఖ్ పై ప్రయాణ మయ్యారు, వారి ప్రయాణం యేవిధంగా జరిగింది, అల్లాహ్, మహమ్మద్ ల మధ్య సంభాషణ, వాటి విషయాలు యేవి ఇవన్నియూ ప్రసంగరూపంలో సాగుతాయి. ఈ రాత్రిప్రయాణం జరిగి అల్లాహ్ తో సంభాషించిన తరువాత అల్లాహ్, మహమ్మదు ప్రవక్త ఆయన అనుచరులంతా రోజుకు అయిదు సార్లు నమాజ్ చెయ్యాలని ఆదేశిస్తాడు.[5][6]

ఖురాన్, హదీసులు

[మార్చు]

ఈ విషయంగూర్చి ఖురాన్లో కొద్దిగా మాత్రంమే చర్చింపబడింది. హదీసులలో సంపూర్ణంగా వివరింపబడింది. ఇస్రా గూర్చి ఖురాన్ లోని 17వ సూరా అల్-ఇస్రాలో వర్ణింపబడింది. సూరా అన్-నజ్మ్లో కూడా ఇస్రా, మేరాజ్ గురించి వర్ణింపబడింది.[7]

ఖురాన్

[మార్చు]

ఖురాన్ లో వర్ణనలు

QuoteQuran

—Glory to (Allah) Who did take His servant for a Journey by night from the Sacred Mosque to the farthest Mosque, whose precincts We did bless,- in order that We might show him some of Our Signs: for He is the One Who heareth and seeth (all things)., 102

QuoteQuran

—Behold! We told thee that thy Lord doth encompass mankind round about: We granted the vision which We showed thee, but as a trial for men,- as also the Cursed Tree (mentioned) in the Qur'an: We put terror (and warning) into them, but it only increases their inordinate transgression!, 102

QuoteQuran-range

—18, For indeed he saw him at a second descent, Near the Lote-tree beyond which none may pass: Near it is the Garden of Abode. Behold, the Lote-tree was shrouded (in mystery unspeakable!) (His) sight never swerved, nor did it go wrong! For truly did he see, of the Signs of his Lord, the Greatest!

హదీసులు

[మార్చు]

హదీసులలో అతిముఖ్యమైన హదీసులు అనస్ బిన్ మాలిక్ (612-712) చే ఉల్లేఖించబడినవి. మహమ్మదు ప్రవక్త మేరాజ్ సమయంలో అనస్ బిన్ మాలిక్ యువకుడు.

ఇవీ చూడండి

[మార్చు]
  1. Al-Mawrid Institute. "A Question on the Night Journey of the Prophet". understanding-islam.com. Archived from the original on 2008-01-27. Retrieved 2008-02-25.
  2. Encyclopedia of Islam and Muslim world, Macmillan reference, USA, 2004. p.482
  3. Sayyid Abul Ala Maududi, The Meaning of the Qur'an (tafsir), 17:60 Archived 2007-09-28 at the Wayback Machine
  4. Moiz Amjad, The Position of Jerusalem and the Bayet al-Maqdas in Islam Archived 2008-01-26 at the Wayback Machine, understanding-islam.com Archived 2016-03-07 at the Wayback Machine, Al-Mawrid Institute
  5. BBC Religion and Ethics - Lailat al Miraj
  6. WRMEA article on Muslim holidays
  7. Sayyid Abul Ala Maududi, The Meaning of the Qur'an (tafsir).53:13 Archived 2007-09-28 at the Wayback Machine

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]