ఓబులవారిపల్లె
Appearance
ఓబులవారిపల్లె, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వైఎస్ఆర్ జిల్లా, ఓబులవారిపల్లె మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.[1]
గ్రామ విశేషాలు
[మార్చు]- ఈ గ్రామానికి చెందిన సయ్యద్ కాశీం అను ఒక చిన్న టీ దుకాణం యజమాని కుమారుడు, సయ్యద్ జాఫర్, పలు జిల్లా, జాతీయ ఫుట్ బాల్ పోటీలలో ఆడి పతకాలు సాధించాడు. తాజాగా ఇతనికి, అంతర్జాతీయ పోటీలలో ఆడేందుకు అవకాశం వచ్చింది.
- ఈ గ్రామం నుండి నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం ఓడరేవు వరకూ రైల్వే లైను నిర్మాణం జరుగుతుంది. మొత్తం లైను పొడవు 93 కి.మీ. అంచనా వ్యయం రు.750 కోట్లు. ఈ లైనులో కడప జిల్లా పరిధిలో 3 స్టేషన్లూ, నెల్లూరు జిల్లాలో 6 స్టేషనులూ వచ్చును. ఈ రైలు మార్గం కొరకు, ప్రధాన రహదార్లపై, 15 వంతెనలూ, చిన్న వంతెనలు 120 దాకా నిర్మాణం చేయవలసి ఉంటుంది.
- ఈ గ్రామంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థి అయిన వై.భవానీశంకర్, హర్యానా రాష్ట్రంలో, 2013 నవంబరు 27 నుండి 29 వరకూ జరిగిన అంతర్జాతీయ స్థాయి నెట్ ఫుట్ బాల్ ఆటలో ప్రతిభ కనబరచి, 3వ స్థానంలో నిలిచి, కాంస్యపత్రం & బహుమతి అందుకున్నాడు.
- ఓబులవారిపల్లెకు చెందిన ఎ.ఇజాజ్ బాషా, పి.శరణం, సి.హెచ్.అంజనీప్రసాద్ అను క్రీడాకారులు, 2014, జూన్ 5న పాండిచ్చేరిలో నిర్వహించిన జాతీయ నెట్ ఫుట్ బాల్ ఛాంపియిన్ పోటీలలో, ఆంధ్రప్రదేశ్ జట్టులో పాల్గొని, తమ ప్రతిభ ప్రదర్శించి, అంతర్జాతీయ నెట్ ఫుట్ బాల్ పోటీలలో పాల్గొనటానికి అర్హత సంపాదించారు. వీరు 2014, జూలై-29 నుండి 31 వరకూ, భూటాన్ లో నిర్వహించు అంతర్జాతీయ నెట్ ఫుట్ బాల్ పోటీలలో పాల్గొంటారు.
మూలాలు
[మార్చు]- ↑ "Obulavaripalli Town". www.onefivenine.com. Retrieved 2022-02-25.