కలం పేరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆరుద్ర కలం పేరుగా గల భాగవతుల శివశంకరశాస్త్రి

రచనలు చేసే సాహిత్యవేత్తలు తమ రచనలను ప్రకటించే వేరే పేర్లను కలం పేరు అంటారు. రచనల్లో ప్రచురించే రచయితల మారుపేర్లకు కలం పేర్లని వ్యవహరిస్తారు. కలం పేరును తఖల్లస్ అని కూడా వ్యవహరిస్తారు. కవి తన కవితలలో తన కలం పేరును ఉపయోగించి తన ఉనికిని చాటుకుంటాడు. ఉర్దూ కవితా సాహిత్యంలో ఈ సాంప్రదాయం ఎక్కువగా కనబడుతుంది.

చరిత్ర

[మార్చు]

సాహిత్యంలో కలం పేర్లకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. సంస్కృత సాహిత్యంలో పలువురు రచయితలకు కూడా వివిధ కారణాలతో సంక్రమించినట్టుగా సాహిత్యంలో కథలు ఉన్నాయి. అనంతర కాలంలో తెలుగు కవులు తమ భావజాలాలకు అనుగుణంగా పేర్లను పెట్టుకున్న సందర్భాలు ప్రాచీన సాహిత్యంలో కనిపిస్తాయి. కంచర్ల గోపన్న తనకు రామునిపై ఉన్న భక్తిని ప్రదర్శించేలా రామదాసు అనే దీక్షానామంతో రచనలు చేశారు.

కారణాలు

[మార్చు]

ప్రక్రియను బట్టి, స్థితిగతులను బట్టి సాహిత్యకారులు కలంపేర్లు వాడడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కలంపేర్లు వాడేందుకు రచయితలను ప్రేరేపించే వివిధ కారణాలు:

  • రచయితల ప్రాచుర్యం వల్ల కొత్తగా చేపట్టబోయే ప్రక్రియపై పూర్వరచనల ప్రభావాలు పడకుండా ఉండేందుకు. ఉదాహరణకు ముళ్ళపూడి వెంకటరమణ కథలు, సినీసమీక్షలు వంటి వాటిలో లబ్దప్రతిష్ఠుడయ్యాకా గిరీశం లెక్చర్లు అనే ప్రక్రియను ప్రారంభించేందుకు ఎస్. పార్థసారధి అనే పేరు ఎంచుకుని రాశారు. అప్పటికే స్వంత పేరుతో ప్రతిష్ఠ మూటకట్టుకుని ఉండడంతో దానికీ తన పేరే పెడితే లోటుపాట్లు తెలియవని, అదే పేరుతో రాస్తే అలవాటుగా మెచ్చేసుకునే అవకాశం ఉంది, వేరే పేరుతో రాసినా మెచ్చుకుంటేనే నిఖార్సైన మంచి రచన అంటూ పాఠకులు అనుమానించడానికి కూడా వీల్లేకుండా వేరే వ్యక్తి పేరే అనిపించేలా ఇంటిపేరుతో కలిపి ఎస్. పార్థసారధి అని కలంపేరు పెట్టుకున్నారు.[1]
  • స్త్రీల గురించి, స్త్రీలు మాట్లాడుతున్నట్లుగా వ్రాసిన వ్యాసాలకు పురుషులు స్త్రీల పేర్లు పెట్టుకోవడం. ఉదాహరణకు ఇల్లాలి ముచ్చట్లు అంటూ స్త్రీలు మాటల్లోనే చమత్కారంగా విసుర్లు విసురుతూ సాగే కాలమ్ పురాణం సుబ్రహ్మణ్యశర్మ వ్రాసినా పురాణం సీత అనే కలంపేరుతోనే రచన చేశారు. ఆ రచనల్లో పలుమార్లు సుబ్రహ్మణ్యశర్మ భార్య ప్రస్తావిస్తున్నట్టే మావారు ముఫ్ఫయ్యేళ్ల క్రిందట డిల్లీలో రైల్వే ఉద్యోగం చేసేవారు అంటూ వ్రాశారు.[2] ముళ్లపూడి వెంకటరమణ పలు వ్యాసాలు సి.వి.విజయలక్ష్మి, సి.వి.వి.లక్ష్మి వంటి మారుపేర్లను వాడి ఒక ఆలోచనాపరురాలైన యువతి రాసినట్టుగా రాశారు.[1]
  • భారత స్వాతంత్ర్య పూర్వం బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం ఏర్పరిచిన నియమం ప్రకారం ప్రభుత్వ సేవకులు ఎవరూ సాంస్కృతిక కార్యకలాపాల్లో పాల్గొనరాదు. పాల్గొంటే ముందస్తుగా అనుమతి స్వీకరించి, ఒకవేళ సాంస్కృతిక కార్యక్రమాల వల్ల డబ్బు వస్తే అందులో మూడోవంతు ప్రభుత్వానికి ఇవ్వాల్సివుంటుంది. ఈ నియమాన్ని భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాకా కూడా 1963 వరకూ మార్పలేక కొనసాగింది. 1963 నాటికి ఈ నియమంలోని అసంబద్ధత అవగాహన చేసుకున్న ప్రభుత్వం మార్చింది. అంతవరకూ ప్రభుత్వోద్యోగాలు చేస్తున్న రచయితలు మారుపేర్లతో రచనలు చేయాల్సివచ్చింది. ఉదాహరణకు ప్రముఖ రచయిత, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత భమిడిపాటి రామగోపాలం 1951 లో ప్రభుత్వోద్యోగంలో చేరేవరకూ తన పేరుమీదే రచనలు చేశారు. 1951 లో ప్రభుత్వోద్యోగంలో చేరాకా తన పేరును దాచిపెట్టి వాహిని అనే మారుపేరుతో రచనలు చేశారు. చివరకు 1963 ఏప్రిల్‌లో నియమాన్ని ప్రభుత్వం సవరించి, ఆంక్షలు తొలగించడంతో తిరిగి భరాగోగా రచనలు చేయడం ప్రారంభించారు.[3]

కలం పేర్లు అసలు పేర్లు

[మార్చు]
  1. ఆత్రేయ ( కిళాంబి వెంకట నరసింహాచార్యులు)
  2. ఆరుద్ర ( భాగవతుల శివశంకరశాస్త్రి )
  3. ఓల్గా ( పోవూరి లలిత కుమారి )
  4. అంపశయ్య నవీన్ ( డి.మల్లయ్య )
  5. బుచ్చిబాబు ( శివరాజు వెంకటసుబ్బారావు )
  6. కరుణశ్రీ ( జంధ్యాల పాపయ్యశాస్త్రి )
  7. దేవీప్రియ (ఖాజా హుస్సేన్ )
  8. వడ్డెర చండీదాస్ ( చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి )
  9. పురాణం సీత (పురాణం సుబ్రహ్మణ్యశర్మ )
  10. శ్రీరమణ (వంకమామిడి రాధాకృష్ణ, కామరాజు రామారావు )
  11. సౌదామని (బసవరాజు రాజ్యలక్ష్మమ్మ)
  12. బీనాదేవి (బి. నరసింగరావు, బాలాత్రిపురసుందరమ్మ)
  13. కాంతాకాంత, జాస్మిన్ (రాచకొండ విశ్వనాథశాస్త్రి)
  14. వాచస్పతి ( యం. పద్మావతి)
  15. జరుక్ శాస్త్రి (జలసూత్రం రుక్మీణనాథ శాస్త్రి)
  16. అజంతా (పెనుమర్తి విశ్వనాథ శాస్త్రి)
  17. భయంకర్ (యర్నాగుల సుధాకర రావు)
  18. రాధేయ (వి.ఎన్.సుబ్బన్న)
  19. సౌభాగ్య (పి.విజయకుమార్)
  20. సుగమ్‌బాబు (మహబూబ్ ఖాన్)
  21. సుధామ (అల్లంరాజు వెంకట్రావు)
  22. శిఖామణి (కర్రి సంజీవరావు)
  23. యామినీ సరస్వతి (దొర్నేపాటి వేంకట సుబ్బారావు)
  24. తలమర్ల కళానిధి (కొల్లప్ప)
  25. తులికా భూషణ్ (బుద్ధవరపు చినకామరాజు)
  26. రాళ్ళబండి కవితాప్రసాద్ (రాళ్ళబండి వేంకటేశ్వర ప్రసాదరాజు)
  27. కణ్వశ్రీ (మైసూరు చంద్రశేఖరం)
  28. ఎల్లోరా (గొడవర్తి భాస్కరరావు)
  29. చిత్రకవి ఆత్రేయ (కిళాంబి రామానుజాచార్యులు)
  30. శ్రీ విరించి (ఎన్.సి.రామానుజాచారి)
  31. జాతశ్రీ (జంగం ఛార్లెస్)
  32. జ్వలిత (దెంచనాల విజయకుమారి)
  33. రాధశ్రీ (దిడుగు అనంత వేంకట రాధాకృష్ణ ప్రసాద్)
  34. కనక్ ప్రవాసి (చామర్తి కనకయ్య)
  35. భరాగో - భమిడిపాటి రామగోపాలం
  36. కొ.కు. - కొడవటిగంటి కుటుంబరావు 3
  37. కా.రా - కాళీపట్నం రామారావు
  38. గద్దర్ - గుమ్మడి విఠల్
  39. నగ్నముని - మానేపల్లి హృషీకేశవరావు
  40. చెరబండరాజు - బద్దం భాస్కరరెడ్డి
  41. శ్రీశ్రీ - శ్రీరంగం శ్రీనివాసరావు
  42. సినారె -- సింగిరెడ్డి నారాయణరెడ్డి
  43. శిలాలోలిత -   పి. లక్ష్మి
  44. అఖిలాశ - జాని తక్కెడశిల
  45. కుంచెశ్రీ - చింతా లక్ష్మీనారాయణ
  46. మృదువిరి-రమాదేవి బాలబోయిన
  47. ఈమని - (ఈమని శ్రీసత్యసాంబశివరావు)

ఉర్దూ సాహిత్యంలో తఖల్లస్

[మార్చు]

కొందరు కవుల పేర్లు, వారి 'తఖల్లుస్' లను చూడండి.

  • మిర్జా అసదుల్లా ఖాన్ గాలిబ్
  • డాక్టర్ ముహమ్మద్ ఎక్బాల్
  • కిషన్ బిహారీ నూర్
  • బహాదుర్ షా జఫర్
  • ముహమ్మద్ ఇబ్రాహీం జౌఖ్
  • మీర్ తఖి మీర్
  • ఖ్యాజా మీర్ దర్ద్
  • నిసార్ అహ్మద్ నిసార్
  • బ్రిజ్ నారాయణ్ చక్ బస్త్
  • దయాశంకర్ నసీమ్
  • రఘుపతి సహాయ్ ఫిరాఖ్

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 ముళ్లపూడి వెంకటరమణ సాహితీ సర్వస్వం-5 కదంబరమణీయం-2 సంపుటికి డైవర్సిటీ.. దై నేమ్ ఈజ్ రమణా! పేరిట ఎం.బి.ఎస్.ప్రసాద్ ముందుమాట
  2. ఇల్లాలి ముచ్చట్లు:పురాణం సీత(సుబ్రహ్మణ్యశర్మ):నవోదయ ప్రచురణలు
  3. అత్తలూరి, నరసింహారావు (1990-03-01). [[ఇట్లు మీ విధేయుడు]] (పదినిమిషాల్లో భరాగో పరిచయము వ్యాసం). విశాఖపట్టణం: విశాఖ సాహితి. Retrieved 10 March 2015. {{cite book}}: URL–wikilink conflict (help)

ఇతర లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కలం_పేరు&oldid=4338985" నుండి వెలికితీశారు