కస్తూరి శంకర్
కస్తూరి శంకర్ | |
---|---|
జననం | 1970 మే 1 |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1991-2001 2009-ప్రస్తుతం |
కస్తూరి శంకర్ (జననం 1970 మే 1) భారతీయ సినీనటి, మోడల్, టెలివిజన్ వ్యాఖ్యాత. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషా చిత్రాలలో నటిస్తోంది.[1] స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మిలో తులసి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.[2] ఆమె మద్రాసులో ఉన్నత పాఠశాలలో ఉండగానే మోడలింగ్ ప్రారంభించింది.[3] ఆమె 1992లో మిస్ మద్రాస్ టైటిల్ గెలుచుకుంది. 1991లో ఆతా ఉన్ కోయిలిలే తమిళ చిత్రంతో కస్తూరి శంకర్ సినిమాలలో అడుగుపెట్టింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]కస్తూరి శంకర్ 2000లో డాక్టర్ రవికుమార్‌ని వివాహం చేసుకుంది.[4] ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆమె కుమార్తె లుకేమియా నుండి బయటపడింది.[5]
కెరీర్
[మార్చు]చెన్నైలోని ఇతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తిచేస్తూనే 1992లో కస్తూరి శంకర్ మిస్ చెన్నైగా గెలుపొందింది. రాష్ట్ర స్థాయి హాకీ ఛాంపియన్, వైమానిక దళ విభాగంలో ఆర్.డి క్యాడెట్‌గా వ్యవహరించడం ఆమె యుక్తవయసులో సాధించిన అనేక విజయాలలో ఒకటి. ‘బ్యూటీ విత్ బ్రెయిన్స్’. ఆమె విజయవంతమైన మోడల్ మాత్రమే కాదు, ఆమె బిబిసి మాస్టర్ మైండ్ ఇండియా 2000 క్విజ్‌లో ఫైనలిస్ట్ కూడా. ఆమె నటనా జీవితం 1991లో ఆతా ఉన్ కోయిలీలే చిత్రంతో ప్రారంభమైంది. చిన్న బడ్జెట్ తమిళ చిత్రాలలో పని చేయడం నుండి, ఆమె కమల్ హాసన్ వంటి లెజెండ్స్‌తో భారతీయుడు (1996) వంటి చిత్రాలలో పనిచేసింది. చిత్ర పరిశ్రమలో ఆమె సాధించిన విజయానికి గుర్తింపుగా 30 నిమిషాల నిడివి గల డాక్యుమెంటరీ చిత్రం కస్తూరి: సౌత్ ఇండియన్ ఫిల్మ్ స్టార్ విడుదలైంది. అన్నమయ్య (1997)లో తన నటనా నైపుణ్యం, కాదల్ కవితై (1998)లో నృత్య ప్రదర్శన ద్వారా ఆమె అందరిని మెప్పించింది. పెళ్లి తర్వాత కెరీర్‌కి బ్రేక్ తీసుకుని ఆమె అమెరికాలో స్థిరపడింది.
అయితే, ఆమె తిరిగి కెరీర్ లో రాణించాలని భారతదేశం వచ్చేసింది. ఆమె తొలి పునరాగమన చిత్రం మలై మలై (2009), పుతుయుగం టీవీలో 2013-2014 మధ్య కాలంలో ప్రసారమైన విన విదై వెట్టై లో కూడా నటించింది. ఆమె ది టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తాపత్రికలో కాలమ్ రాస్తూ సామాజిక సమస్యలపై తన స్వరాన్ని తరచుగా వినిపిస్తుంది.[6]
ఆమె ముఖ్యంగా అధిక్ రవిచంద్రన్ సారథ్యంలో వచ్చిన అన్బనవన్ అసరాధవన్ అడంగాధవన్ (2017)లో సిలంబరసన్ (శింబు)తో కలిసి పరిశోధనాత్మక ఏజెంట్‌గా కీలకమైన సహాయ పాత్రను పోషించింది.[7]
2018లో తమిళ రియాలిటీ టెలివిజన్ షో బిగ్ బాస్ తమిళ్లో కనిపించే అవకాశాన్ని తిరస్కరించిన ఆమె 2019లో షో మూడవ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్‌గా చేరింది.[8]
1990లలో కుముదం పత్రికలో "కీప్ ఇట్ సింపుల్ స్టుపిడ్" అనే శీర్షికతో వారానికో కాలమ్ కస్తూరి శంకర్ రాసింది.[9]
వివాదాస్పదం
[మార్చు]2014లో టాప్‌లెస్ ఫోటోషూట్ ద్వారా కస్తూరి శంకర్ వార్తల్లో వ్యక్తిగా మారింది. జేడ్ బెల్ పుస్తకం ది బాడీస్ ఆఫ్ మదర్స్: ఎ బ్యూటిఫుల్ బాడీ ప్రాజెక్ట్‌లో భాగంగా ఆమె అర్థనగ్నంగా ఫోటోలకి ఫోజులిచ్చింది.[10][11][12] అయితే ఆ షూట్ తరువాత భారతీయ వెబ్సైట్లు చట్టవిరుద్ధంగా వీటిని పంచుకున్నాయి. ఆ సైట్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కస్తూరి శంకర్ ప్రకటించింది.
సోషల్ మీడియా
[మార్చు]సామాజిక సమస్యలపై నిత్యం సోషల్ మీడియాలో గళం వినిపించే కస్తూరి శంకర్ తాజాగా సరోగసీ పై ట్వీట్ చేసింది. నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతులు సరోగసీ ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులైయ్యారు. ఈ విషయాన్ని 2022 అక్టోబరు 9న వారు ప్రకటించిన కాసేపటికే కస్తూరి శంకర్ సరోగసీపై ట్వీట్ చేయడం గమనార్హం. "భారతదేశంలో సరోగసీపై నిషేధం ఉంది. 2022 జనవరి నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. క్లిష్ట పరిస్థితుల్లో తప్ప సరోగసీని అనుమతించరు. రానున్న రోజుల్లో దీని గురించి ఎక్కువగా వినబోతున్నాం" అన్నది ఆమె ట్వీట్ సారాంశం. దీనికి నయనతార అభిమానులు కస్తూరి శంకర్ పై మండిపడ్డారు.[13]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | గమనికలు |
---|---|---|---|---|
1991 | ఆత అన్ కోయిలీలే | కస్తూరి | తమిళం | |
చక్రవర్తి | ప్రసీత | మలయాళం | ||
రసతి వారు నాల్ | రాధ | తమిళం | ||
1992 | ప్రభుత్వ మాప్పిళ్ళై | మల్లారియా | ||
చిన్నవర్ | మీనా | |||
ఉరిమై ఊంజలాడుగిరాడు | ఉమా | |||
సెంథమిజ్ పట్టు | షణ్మతి | |||
అభిరామి | ధనం | |||
గ్యాంగ్ వార్ | కావేరి | తెలుగు | ||
1993 | రక్కాయి కోయిల్ | వెల్లైయమ్మ | తమిళం | |
పుధియ ముగం | రాజా మొదటి భార్య | |||
పాస్ మార్క్ | శాంతి | |||
ఆత్మ | ఉమా | |||
ఉడాన్ పిరప్పు | సుమతి | |||
నిప్పు రవ్వ | భారతి | తెలుగు | ||
ఎంగ ముతాలాలి | కల్యాణి | తమిళం | ||
1994 | అమైధి పాడై | తాయమ్మ | ||
వాచ్మెన్ వడివేల్ | రాధ | |||
రాజా పాండి | పొన్నుతాయి | |||
తెండ్రాల్ వరుమ్ తేరు | నళిని | |||
జానా | కస్తూరి | కన్నడ | ||
1995 | సింధు బాత్ | శోభన | తమిళం | |
చిన్న మణి | చిన్న మణి | |||
కొలంగల్ | ఉమా | |||
ఆకాయ పూకల్ | కామాక్షి | |||
గాడ్ ఫాదర్ | అరుణ | తెలుగు | ||
అగ్రజన్ | శ్రీదేవి | మలయాళం | ||
రధోల్సవం | చెంపకం | |||
అనియన్ బావ చేతన్ బావ | అమ్ము | |||
1996 | ఇబ్బర నడువే ముద్దిన ఆట | కన్నడ | ||
భారతీయుడు | కస్తూరి | తమిళం | ||
కృష్ణుడు | లిజీ | |||
సోగ్గాడి పెళ్ళాం | జ్యోతి | తెలుగు | ||
మెరుపు | ప్రేమ | |||
రెండు కుటుంబ కథ | హేమ | |||
1997 | చిలక్కొట్టుడు | కస్తూరి | ||
రథ యాత్ర | గంగ | |||
అన్నమయ్య | అక్కలమ్మ | |||
మా ఆయన బంగారం | ||||
1998 | మాంగల్య పల్లక్కు | సీతాలక్ష్మి | మలయాళం | |
తుట్ట ముట్ట | డాక్టర్ సీమ | కన్నడ | ||
అతడే ఒక సైన్యం | కస్తూరి | |||
స్నేహం | రాధిక | మలయాళం | ||
కాదల్ కవిధై | స్వప్న | తమిళం | ||
1999 | హబ్బా | అను | కన్నడ | |
సుయంవరం | ఉమా | తమిళం | ||
పంచపాండవర్ | నందిని | మలయాళం | ||
2001 | ఎంగలుక్కుమ్ కాలం వరమ్ | పూజ | తమిళం | |
దోస్త్ | "హే సాల్ సాల్" పాటలో ప్రత్యేక ప్రదర్శన | |||
ఆకాశ వీధిలో | పద్మ | తెలుగు | ||
ప్రేమక్కే సాయి | వేద | కన్నడ | ||
2002 | అధీనా | యువరాణి అధినా | మలయాళం | |
2009 | మలై మలై | లక్ష్మి | తమిళం | |
2010 | తమిళ్ పదం | "కుత్తువిళక్కు" పాటలో ప్రత్యేక పాత్ర | ||
గూడు గూడు గుంజాం | మల్లీశ్వరి | తెలుగు | ||
డాన్ శీను | లక్ష్మి | |||
2011 | పఠినారు | ఇళవరసి | తమిళం | అతిథి పాత్ర |
తూంగా నగరం | ప్రత్యేక ప్రదర్శన | |||
2012 | నాంగా | చిత్ర | ||
2013 | అజగన్ అజగి | "ఏతువరై వానం" పాటలో ప్రత్యేక పాత్ర | ||
నాన్ రాజవగా పొగిరెన్ | భారతి | |||
2014 | వడకూర | సతీష్ కోడలు | ||
నాన్ పొన్ను ఒండ్రు కండేన్ | "ఒతయ రెతాయ" పాటలో ప్రత్యేక ప్రదర్శన | |||
2017 | అన్బానవన్ అసరాధావన్ అడంగాధవన్ | రూబీ | ||
శమంతకమణి | కృష్ణుని తల్లి | తెలుగు | ||
2018 | ట్రాఫిక్ రామసామి | కోర్టులో సాక్షి | తమిళం | అతిథి పాత్ర |
తమిళ్ పదం 2 | "వా వా కామ" పాటలో ప్రత్యేక పాత్ర | |||
2020 | వెల్వెట్ నగరం | గౌరీ | ||
2021 | EPCO 302 | S. దుర్గా IPS | ||
2022 | గాడ్ ఫాదర్ | బ్రహ్మ తల్లి | తెలుగు | |
2023 | తమిళరసన్ | తమిళం | ||
రాయర్ పరంబరై | రాయర్ సోదరి | తమిళం | ||
స్ట్రైకర్ | తమిళం | |||
2024 | సింబా | తెలుగు |
- టెలివిజన్
సంవత్సరం | పేరు | పాత్ర | భాష | ఛానెల్ | గమనికలు |
---|---|---|---|---|---|
ఏష్టదానం | మలయాళం | DD మలయాళం | క్రమ | ||
1995 | కాయలవు మనసు | వాణి | తమిళం | సన్ టీవీ | క్రమ |
2000 | సూత్రధారి భారతదేశం | పోటీదారు | తమిళం | BBC | |
2010 | సూర్య కుటుంబం అవార్డులు 2010 | హోస్ట్ | సన్ టీవీ | ||
2010 | స్టార్ సింగర్ | ప్రత్యేక న్యాయమూర్తి | మలయాళం | ఏషియానెట్ | వాస్తవిక కార్యక్రమము |
2013-14 | విన విదై వేట్టై | హోస్ట్ | తమిళం | పుతుయుగం టీవీ | |
2014 | విన విదై వెట్టై జూనియర్స్ | హోస్ట్ | పుతుయుగం టీవీ | ||
2014 | వావ్ 2 | పాల్గొనేవాడు | తెలుగు | E TV | |
2019 | బిగ్ బాస్ తమిళ్ 3 | పోటీదారు | తమిళం | స్టార్ విజయ్ | తొలగించబడిన
రోజు 63 |
2020 - 2024 | ఇంటింటి గృహలక్ష్మి | తులసి | తెలుగు | స్టార్ మా | క్రమ |
2020 | నగదు | పాల్గొనేవాడు | తెలుగు | ETV | వాస్తవిక కార్యక్రమము |
2020 | అగ్ని నక్షత్రం | రుద్ర | తమిళం | సన్ టీవీ | క్రమ |
2021 | పరంపర | ఇందిర | తెలుగు | డిస్నీ+ హాట్‌స్టార్ | వెబ్ సిరీస్ |
2021 | సిక్స్త్ సెన్స్ | పాల్గొనేవాడు | తెలుగు | స్టార్ మా | ఆటల కార్యక్రమం |
2022 | అరువి | ఆమెనే | తమిళం | సన్ టీవీ | క్రమ |
2022 | శ్రీదేవి డ్యాన్స్ కంపెనీ | ఆమెనే | తెలుగు | ETV | |
2024 | సీతే రాముడికి కట్నం | రాముని తల్లి | తెలుగు | జీ తెలుగు |
మూలాలు
[మార్చు]- ↑ https://www.filmibeat.com/tamil/news/2020/kasthuri-shankar-reveals-why-she-is-tight-lipped-about-her-husband-305399.html
- ↑ Pasupuleti, AuthorPriyanka. "Kasthuri Shankar testing her luck on small screen". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-06-04.
- ↑ "Exclusive biography of #Kasthuri and on her life".
- ↑ James, Anu (2015-10-29). "Actress Kasthuri goes topless to highlight motherhood, photos go viral". www.ibtimes.co.in (in ఇంగ్లీష్). Retrieved 2021-06-02.
- ↑ "Casting couch in filmdom isn't a myth, it does exist - Times of India". The Times of India.
- ↑ "Kollywood Movie Actress Kasthuri Biography, News, Photos, Videos".
- ↑ "I am too old for Vijay, too young for Rajinikanth: Kasthuri".
- ↑ "Bigg Boss Tamil 3 contestant Kasthuri makes shocking revelations over her payment dues".
- ↑ "Bittorrent coin deutsch-the best payaone". Archived from the original on 20 April 1999.
- ↑ "Actor Kasthuri's photo shoot for motherhood wins hearts, she says amazed at response". The News Minute. 2015-10-30. Retrieved 2019-10-21.
- ↑ "Actress Kasthuri Poses Semi-nude for Photo-book 'Bodies of Mothers'". The New Indian Express. Retrieved 2021-06-25.
- ↑ Team, DNA Web (2015-10-31). "South Indian actress Kasthuri poses topless for Jade Beall's 'A Beautiful Body Project'". DNA India (in ఇంగ్లీష్). Retrieved 2021-06-25.
- ↑ "Kasthuri: 'సరోగసి'పై నటి ట్వీట్ దుమారం." web.archive.org. 2022-10-11. Archived from the original on 2022-10-11. Retrieved 2022-10-11.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- భారత చలనచిత్ర నటీమణులు
- మలయాళ నటీమణులు
- తమిళ నటీమణులు
- తెలుగు నటీమణులు
- కన్నడ నటీమణులు
- 20వ శతాబ్దపు భారతీయ నటీమణులు
- 21వ శతాబ్దపు భారతీయ నటీమణులు
- బిగ్ బాస్ (తమిళ టీవీ సిరీస్) పోటీదారులు
- తమిళ టెలివిజన్ నటీమణులు
- తెలుగు టెలివిజన్ నటీమణులు
- మలయాళ టెలివిజన్ నటీమణులు
- 1974 జననాలు