కాస్ట్యూమ్‌ కృష్ణ

వికీపీడియా నుండి
(కాస్ట్యూమ్స్ కృష్ణ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కాస్ట్యూమ్ కృష్ణ
జననం
కృష్ణ మాదాసు

1937
మరణం2023 ఏప్రిల్ 02
చెన్నై, తమిళనాడు
వృత్తిసినీ నటుడు, నిర్మాత

కాస్ట్యూమ్‌ కృష్ణ (1937 - 2023 ఏప్రిల్ 2) తెలుగు సినీ నటుడు, నిర్మాత.[1] అనేక చిత్రాలలో విలన్ గా, సహాయ పాత్రల్లో నటించాడు.[2] ఆయన కెరీర్ లో ఎనిమిది చిత్రాలను నిర్మించాడు.[3]

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఆయన స్వస్థలం విజయనగరం జిల్లా, లక్కవరపుకోట.[3]

కెరీర్[మార్చు]

1954లో చెన్నై వెళ్లి అసిస్టెంట్‌ కాస్ట్యూమర్‌గా సినిమారంగంలో ప్రవేశించాడు. అతి తక్కువ కాలంలోనే కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, చిరంజీవి లాంటి స్టార్‌ హీరోలతో పాటు వాణిశ్రీ, జయసుధ, జయప్రద, శ్రీదేవి లాంటి హీరోయిన్లకు కూడా ఆయన కాస్ట్యూమ్స్‌ అందించాడు.

కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన భారత్ బంద్ సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు.[2] కోడి రామకృష్ణను ఆయన గురువుగా భావిస్తాడు.[3] జగపతి బాబు హీరోగా వచ్చిన పెళ్ళిపందిరి చిత్రాన్ని నిర్మించాడు. అందులో ఓ పాత్రలో కూడా నటించాడు. కన్నడంలో విజయవంతమైన ఓ చిత్రాన్ని అరుంధతి పేరుతో రీమేక్ చేశాడు.[4]

సినిమాలు[మార్చు]

నటుడిగా[మార్చు]

నిర్మాతగా[మార్చు]

మరణం[మార్చు]

అనారోగ్యంతో 85 యేళ్ల ఆయన 2023 ఏప్రిల్ 2న చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచాడు.[5] ఆయనకు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.[6]

మూలాలు[మార్చు]

  1. "Constumes Krishna Profile on MAA website". maastars.com. Movie Artists Association. Retrieved 6 December 2016.
  2. 2.0 2.1 "ఒకే పేరుతో..." suryaa.com. సూర్య దినపత్రిక. Retrieved 6 December 2016.[permanent dead link]
  3. 3.0 3.1 3.2 "కఠినంగా ఉంటే అశ్లీల దృశ్యాలను తగ్గించవచ్చు". andhrabhoomi.net. ఆంధ్రభూమి. Retrieved 6 December 2016.[permanent dead link]
  4. "చిట్‌ఫండ్ వ్యాపారం కూడా చేశారట!". sakshi.com. సాక్షి. Retrieved 6 December 2016.
  5. "Senior Actor Costumes Krishna Passed Away - Sakshi". web.archive.org. 2023-04-02. Archived from the original on 2023-04-02. Retrieved 2023-04-02.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. Andhra Jyothy (3 April 2023). "కాస్ట్యూమ్‌ కృష్ణ కన్నుమూత". Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.

బయటి లింకులు[మార్చు]