జాక్వెలిన్ ఫెర్నాండేజ్
జాక్వెలిన్ ఫెర్నాండేజ్ Jacqueline Fernandez | |
---|---|
జననం | |
జాతీయత | శ్రీలంక |
విద్యాసంస్థ | సిడ్నీ విశ్వవిద్యాలయం |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2009–ప్రస్తుతం |
జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (జననం 11 ఆగస్టు 1985) ప్రముఖ సినీ నటి, మోడల్. ప్రముఖంగా శ్రీలంకకు చెందిన ఈమె, 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంకగా ఎంపికైంది. శ్రీలంక తరఫున 2006లో ఆమె మిస్ యూనివర్స్ పోటీకి కూడా వెళ్ళింది.[1] సిడ్నీ విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పూర్తి చేసింది జాక్వెలిన్. శ్రీలంకలో టీవీ రిపోర్టర్ గా కూడా పని చేసింది ఆమె. 2009లో భారతదేశంలో అలాడిన్ అనే ఫాంటసీ డ్రామా కోసం ఆడిషన్ చేసింది ఆమె. ఈ ప్రాజెక్టు ద్వారానే ఆమె నటిగా కెరీర్ ప్రారంభించింది. 2011లో ఆమె నటించిన మర్డర్2 ద్వారా ఆమె మొట్టమొదటి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా విజయవంతం కావడంతో వరసగా ఆమెకు గ్లామర్ పాత్రలే ఎక్కవగా వచ్చాయి. ఆ తరువాత ఆమె నటించిన హౌస్ ఫుల్ 2(2012), రేస్ 2(2013) సినిమాలు 1 బిలియన్ వసూళ్ళు దాటాయి.[2] హౌస్ ఫుల్ 2 సినిమాలోని నటనకుగానూ ఆమెకు ఐఫా పురస్కారాల్లో ఉత్తమ సహాయ నటి పురస్కారానికి నామినేషన్ లభించింది. ప్రధాన కథానాయిక పాత్రలో ఆమె నటించిన కిక్(హిందీ) సినిమా భారతదేశంలో అత్యంత ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఆ తరువాత ఆమె నటీంచిన హౌస్ ఫుల్ 3, డిషూం, ఏ ఫ్లయింగ్ జట్(అన్నీ 2006లోనే విడుదలయ్యాయి.) సినిమాలు వరుసగా విజయం సాధించడం విశేషం.[3][4] 2020 సంవత్సరంలో ఈవిడ పై చిత్రీకరించిన గెంద ఫూల్ పాట భారతదేశంలో అత్యధిక మంది యూట్యూబ్ లో వీక్షించిన పాట గా నిలిఛింది.
నటించిన పలు సినిమాల జాబితా
[మార్చు]- విక్రాంత్ రోణ (2022)
- హౌస్ ఫుల్ 3
- భూత్ పోలీస్
- రామ్ సేతు
- బచ్చన్ పాండే
- అటాక్: పార్ట్ 1
- హరి హర వీరమల్లు
- రాధే
- జుడ్వా 2
- సర్కస్ (2022)
మనీలాండరింగ్ కేసు
[మార్చు]200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుఖేశ్ చంద్రశేఖర్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కొంటున్న అతడు తీహార్ జైల్లో ఉన్నాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అతని నుంచి ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు చెందిన రూ.7 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అధికారులు 2022 ఏప్రిల్ 30న అటాచ్ చేసారు.[5] గతంలో విదేశాలకు వెళ్లకుండా ఆమెను ముంబై విమానాశ్రయంలో ఈడీ నిలిపివేసింది. పైగా 2021 డిసెంబర్ 8న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరుకావాలని ఆమెను ఆదేశించింది.[6]
మూలాలు
[మార్చు]- ↑ "2006 Miss Universe Presentation Show". China Daily. Retrieved 31 October 2015.
- ↑ "Top Ten Worldwide Grossers 2012". Box Office India. 17 January 2013. Archived from the original on 2 జూన్ 2013. Retrieved 11 మే 2017.
- ↑ "Special Features: Box Office: Worldwide Collections and Day wise breakup of Dishoom - Box Office, Bollywood Hungama". Bollywood Hungama. Archived from the original on 13 ఆగస్టు 2016. Retrieved 11 August 2016.
- ↑ "Special Features: Box Office: Worldwide Collections and Day wise breakup of Housefull 3 - Box Office, Bollywood Hungama". Bollywood Hungama. Archived from the original on 11 ఆగస్టు 2016. Retrieved 11 August 2016.
- ↑ "Jacqueline Fernandez: నటి జాక్వెలిన్‌కు ఈడీ షాక్.. రూ.7కోట్ల ఆస్తులు అటాచ్". web.archive.org. 2022-05-01. Archived from the original on 2022-05-01. Retrieved 2022-05-01.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Who is Sukesh Chandrasekhar? The Millionaire Conman Whose Cosy Pics With Jacqueline Fernandez Went Viral". web.archive.org. 2022-05-01. Archived from the original on 2022-05-01. Retrieved 2022-05-01.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
బాహ్య లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పేజీ
- ఇన్స్టాగ్రాం లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్