Jump to content

జాల్నా జిల్లా

వికీపీడియా నుండి
జాల్నా
जालना जिल्हा
జిల్లా
రోహిలాగడ్‌లోని శాతవాహన శిధిలాలు
రోహిలాగడ్‌లోని శాతవాహన శిధిలాలు
దేశం India
రాష్ట్రంమహారాష్ట్ర
Administrative Divisionఔరంగాబాద్
ప్రధాన కార్యాలయంజాల్నా
విస్తీర్ణం
 • Total7,612 కి.మీ2 (2,939 చ. మై)
జనాభా
 (2001)
 • Total16,12,357
 • జనసాంద్రత209/కి.మీ2 (540/చ. మై.)
భాషలు
Time zoneUTC+5:30 (IST)
Tehsils1. Jalna, 2. Ambad, 3. Bhokardan, 4. Badnapur, 5. Ghansavangi, 6. Partur, 7. Mantha, 8. Jafrabad
LokSabha1. Jalna (shared with Aurangabad district) 2. Parbhani (shared with Parbhani district)
Websitehttp://jalna.gov.in/
దస్త్రం:Bill Clinton & Deelip Mhaske.jpg
Bill Clinton & Deelip Mhaske

మహారాష్ట్ర లోని జిల్లాలలోజాల్నా జిల్లా ఒకటి. జల్నా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా ఔరంగాబాద్ డివిషన్‌లో భాగంగా ఉంది. జిల్లావైశాల్యం 7718 చ.కి.మీ. జిల్లాలో 970 గ్రామాలు ఉన్నాయి.

సరిహద్దులు

[మార్చు]

జిల్లా ఉత్తర సరిహద్దులో జలగావ్ జిల్లా, తూర్పు సరిహద్దులో పర్భణి జిల్లా, బుల్ఢానా జిల్లా, దక్షిణ సరిహద్దులో బీడ్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో ఔరంగాబాద్ జిల్లా ఉన్నాయి.

సమర్ధరామదాస్

[మార్చు]

జిల్లాలోని జాంబ్ సమర్ధ్ గ్రామం సమర్ధరామదాస్ స్వామి జన్మస్థానంగా ప్రసిద్ధిచెందింది. ఈ గ్రామం సమీపంలో 1803 సెప్టెంబరు 23 న అస్సాయే యుద్ధం జరిగింది. జిల్లా 19.01' నుండి - 21.03' ఉత్తర అక్షాంశం, 75.04' నుండి 76.04' తూర్పు రేఖాంశంలో ఉంది.

భౌగోళికం

[మార్చు]

జిల్లా మాధ్వా భూభాగం ఉత్తర భాగంలో మధ్య మహారాష్ట్రలో ఉంది. మాధ్వా భూభాగంలోని 8 జిల్లాలలో ఇది ఒకటి. జిల్లా భౌగోళికంగా ఎత్తుపల్లాలతో ఏటవాలుగా ఉంటుంది. జిల్లా ఉత్తరభూభాగంలో అజంతా, సత్మల పర్వతావళి ఉంది.

నదులు, సరోవరాలు

[మార్చు]

జిల్లాలో గోదావరి నది దక్షిణ సరిహద్దులో పశ్చిమదిశ నుండి తూర్పుదిశగా ప్రవహిస్తుంది. జిల్లా మధ్యభాగంలో పూర్ణా నది ప్రవహిస్తూ పక్కన ఉన్న జిల్లాలో గోదావరి నదిలోసంగమిస్తుంది. పూర్ణా నది ప్రధాన ఉపనదులు ఖెల్నా, గిరిజా జిల్నా జిల్లాలో ప్రవహిస్తున్నాయి. జాల్నా జిల్లా బత్తాయి పంటకు ప్రసిద్ధి చెందింది. అందువలన ఈ జిల్లా " బత్తాయి నగరం " (సిటీ ఆఫ్ స్వీట్ లెమన్) అని ప్రసిద్ధి చెందింది. జల్నానగరం సమీపంలో ఉన్న ఘనెవాడి సరసును నగరానికి త్రాగునీటి అవసరాల కొరకు నిర్మించబడింది.

చరిత్ర

[మార్చు]

జల్నా ప్రాంతం హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉండేది. 1947లో భరతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత ఇది ఔరంగాబద్ జిల్లాలో భాగంగా మారింది. 1982 మే 1 న ఔరంగాబాద్ జిల్లా నుండి జాల్నా, భొకర్దన్, జఫ్రాబాద్, అంబద్ తాలూకాలు, పర్భాణి జిల్లా పరతూర్ తాలూకాలతో జాల్నా జిల్లా రూపొందించబడింది.

విభాగాలు

[మార్చు]
  • జిల్లాలో 2 ఉపవిభాగాలు ఉన్నాయి : జల్నా, పర్తూర్.
  • జిల్లాలో 8 తాలూకాలు ఉన్నాయి : జాల్నా, అంబద్, భొకర్దన్, బద్నపుర్, ఘన్సవంగి, పర్తుర్, మంతా, జఫ్రబద్.
  • జిల్లాలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు :పర్తుర్, ఘన్సవంగి, జాల్నా, బద్నపుర్, భొకర్దన్.
  • పర్భణి పార్లమెంటు నియోజకవర్గం : జాల్నా, బద్నపుర్, భొకర్దన్.
  • లోనె పార్లమెంటు నియోజకవర్గం : పర్తుర్, ఘన్సవంగి

నియోజకవర్గాలు, విధానసభ దాని సభ్యుడు 1. జాల్నా - మిస్టర్ అర్జున్ ఖొత్కర్ 2. బద్నపుర్ - మిస్టర్ సంతోష్ వసంత్లల్ హైనె 3. భొకర్దన్ - మిస్టర్ చంద్రకాంత్ పుంద్లిక్రఒ దన్వె 4. పర్తుర్ - మిస్టర్ సురెష్కుమర్ కణైయలల్ జెథలియ 5. ఘన్సవంగి - మిస్టర్ రజెష్భయ్య తోపే

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,958,483,[1]
ఇది దాదాపు. లెసొతొ దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 237వ స్థానంలో ఉంది..[1]
1చ.కి.మీ జనసాంద్రత. 255 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 21.84%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 929:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 73.61%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

వెలుపలి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2019-01-07. Retrieved 2011-10-01. Lesotho1,924,886
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. New Mexico – 2,059,179
  4. Deo N S (2012). Darul Majanine, Jalna to Institute of Mental Health, Erragadda Hyderabad: The Forgotten History, Research Aaj Tak Vol.1 No.4 (Sept-Dec 2012).

వెలుపలి లింకులు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]