తమిళిసై సౌందరరాజన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తమిళిసై సౌందరరాజన్
తమిళిసై సౌందరరాజన్


పదవీ కాలం
సెప్టెంబర్ 8, 2019 - 2024 మార్చి 19
ముందు ఈ.ఎస్.ఎల్.నరసింహన్
తరువాత సీ.పీ. రాధాకృష్ణన్

వ్యక్తిగత వివరాలు

జననం జూన్ 2, 1961
నాగర్ కోయిల్, తమిళనాడు, భారతదేశం
తల్లిదండ్రులు కుమరి అనంతన్‌, కృష్ణకుమారి [1]
జీవిత భాగస్వామి సౌందరరాజన్
సంతానం సుగానాథన్ సౌందరరాజన్
నివాసం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
మతం హిందూ

తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ రాష్ట్రానికి రెండవ గవర్నర్. ఈమె తమిళనాడుకు చెందిన మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు, వృత్తిరీత్యా వైద్యురాలు. తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్. 2019 సెప్టెంబర్ 8న గవర్నర్‌గా భాద్యతలు చేపట్టింది.[2][3][4] తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌కు పుదుచ్చేరి గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఫిబ్రవరి 2021లో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశాడు. ఆమె కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా 18 ఫిబ్రవరి 2021న భాద్యతలు చేపట్టింది.[5][6]

తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్ పదవికి 2024 మార్చి 18న రాజీనామా చేసింది.[7] 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న నేపథ్యంలో గవర్నర్ పదవికి రాజీనామా చేసిన ఆమె 18 ఫిబ్రవరి 2021న చెన్నైలోని పార్టీ కార్యాలయంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై సమక్షంలో బీజేపీలో చేరింది.[8]

జననం

[మార్చు]

ఈమె 1961 జూన్ 2న కృష్ణ కుమారి, కుమార్ అనంతన్ దంపతులకు తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ ప్రాంతంలో జన్మించింది. ఈమె తండ్రి కుమారి అనంత‌న్ మాజీ లోక్ సభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాజకీయ నాయకుడు.ఆమె వృత్తి రీత్యా వైద్యులు. ఆమె సోద‌రుడు వ‌సంత్‌కుమార్‌. [9]

విద్యాభ్యాసం

[మార్చు]

ఈమె తన ఎంబీబీఎస్ విద్యను చెన్నైలోని మద్రాస్ మెడికల్ విశ్వవిద్యాలయంలో, ప్రసూతి, గైనకాలజీ విద్యను డాక్టర్ ఎంజిఆర్ మెడికల్ విశ్వవిద్యాలయంలో అభ్యసించింది. సోనాలజీ, ఎఫ్.ఈ.టీ థెరపీలో ఉన్నత శిక్షణను కెనడా లో పూర్తిచేసింది.

వివాహం

[మార్చు]

తమిళసై, సౌందరరాజన్ ను వివాహమాడింది. ఆమె భర్త తమిళనాడులో వైద్యుడు, భారత వైద్య పరిశోధన మండలిలో పాలక మండలి సభ్యుడు.[10]

రాజకీయ ప్రస్థానం

[మార్చు]

ఈమెకు చిన్నతనం నుంచే రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది. తన ఎంబీబీఎస్ విద్యను మద్రాస్ వైద్య కళాశాలలో చదువుతుండగా విద్యార్థి సంఘం నాయకురాలిగా పనిచేసి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల వైపు ఆకర్షితులై ఆ పార్టీలో చేరింది. 1999లో దక్షిణ చెన్నై జిల్లా వైద్య విభాగం కార్యదర్శిగా, 2001 లో తమిళనాడు రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శిగా, 2007 లో అఖిల భారత కో-కన్వీనర్ గా, 2007 లో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా, 2010లో తమిళనాడు రాష్ట్ర భారతీయ పార్టీ ఉపాధ్యక్షురాలిగా, 2013 లో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, 2014వ సంవత్సరం నుంచి తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతుంది. 2006, 2011 లో రెండుసార్లు శాసనసభ సభ్యురాలిగా, 2009, 2019 లో రెండుసార్లు లోక్ సభ సభ్యురాలిగా పోటీచేసి ఓడిపోయింది.[11]

మహిళా దర్బార్

[మార్చు]
2019 హైదరాబాదులోని రాజ్ భవన్ లో జరిగిన బతుకమ్మ వేడుకలలో పాల్గొన్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

తెలంగాణ గవర్నర్‌గా రాజ్‌భవన్‌లో 2022 జూన్ 10న మరుగునపడిపోయిన మహిళల గొంతుకను ఆలకించడానికి మహిళా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించింది.

మూలాలు

[మార్చు]
  1. Andrajyothy (5 September 2021). "ఎప్పటికీ అమ్మే నా గురువు!". Archived from the original on 5 September 2021. Retrieved 5 September 2021.
  2. నమస్తే తెలంగాణ (4 September 2019). "8న గవర్నర్‌గా తమిళసై ప్రమాణస్వీకారం". ntnews.com. Archived from the original on 4 September 2019. Retrieved 4 September 2019.
  3. నమస్తే తెలంగాణ, తాజా వార్తలు (8 September 2019). "గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం". ntnews.com. Archived from the original on 8 September 2019. Retrieved 8 September 2019.
  4. సాక్షి, తెలంగాణ (9 September 2019). "గవర్నర్‌గా తమిళిసై ప్రమాణం". Sakshi. Archived from the original on 8 September 2019. Retrieved 8 September 2019.
  5. Telugu, TV9 (18 February 2021). "పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా తమిళిసై ప్రమాణ స్వీకారం.. పుదుచ్చేరి రాజకీయాల్లో కీలకం కానున్న తెలంగాణ గవర్నర్‌ - Tamilsai sworn in as Governor of Puducherry". TV9 Telugu. Archived from the original on 1 June 2021. Retrieved 1 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. The Hindu (18 February 2021). "Tamilisai Soundararajan sworn in as Puducherry Lt. Governor". The Hindu (in Indian English). Archived from the original on 1 June 2021. Retrieved 1 June 2021.
  7. Andhrajyothy (18 March 2024). "తెలంగాణ గవర్నర్‌ పదవికి తమిళిసై రాజీనామా". Archived from the original on 18 March 2024. Retrieved 18 March 2024.
  8. Eenadu (21 March 2024). "మళ్లీ భాజపాలో చేరిన మాజీ గవర్నర్‌ తమిళిసై". Archived from the original on 21 March 2024. Retrieved 21 March 2024.
  9. Dr Tamilisai Soundararajan. "New Governors Appointed In 5 States, Tamil Nadu BJP Chief Gets Telangana". www.ndtv.com. Retrieved 1 September 2019.[permanent dead link]
  10. సాక్షి, గెలుపెరుగని తమిళిసై.. తొలి మహిళా గవర్నర్‌గా రికార్డ్‌ (1 September 2019). "హోం » పాలిటిక్స్". Sakshi. Archived from the original on 1 September 2019. Retrieved 1 September 2019.
  11. BBC Telugu, తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై (1 September 2019). "తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై, హిమాచల్ గవర్నర్‌గా దత్తాత్రేయ". Archived from the original on 1 September 2019. Retrieved 1 September 2019.