Jump to content

దేవరపల్లి (పర్చూరు)

అక్షాంశ రేఖాంశాలు: 16°0′45.7″N 80°16′51.2″E / 16.012694°N 80.280889°E / 16.012694; 80.280889
వికీపీడియా నుండి
దేవరపల్లి (పర్చూరు)
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (A.E), దేవరపల్లి
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (A.E), దేవరపల్లి
పటం
దేవరపల్లి (పర్చూరు) is located in ఆంధ్రప్రదేశ్
దేవరపల్లి (పర్చూరు)
దేవరపల్లి (పర్చూరు)
అక్షాంశ రేఖాంశాలు: 16°0′45.7″N 80°16′51.2″E / 16.012694°N 80.280889°E / 16.012694; 80.280889
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల
మండలంపర్చూరు
విస్తీర్ణం8.2 కి.మీ2 (3.2 చ. మై)
జనాభా
 (2011)[1]
1,930
 • జనసాంద్రత240/కి.మీ2 (610/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు977
 • స్త్రీలు953
 • లింగ నిష్పత్తి975
 • నివాసాలు539
ప్రాంతపు కోడ్+91 ( 08594 Edit this on Wikidata )
పిన్‌కోడ్523169
2011 జనగణన కోడ్590722


దేవరపల్లి, బాపట్ల జిల్లా, పర్చూరు మండలంలోని గ్రామం.

భౌగోళికం

[మార్చు]

పర్చూరుకి ఉత్తరపు వైపున సుమారు 5 కిలోమీటర్ల దూరంలో, సమీప పట్టణమైన చీరాల నుండి 22 కి. మీ. దూరంలో ఉంది. గ్రామంలో సర్వే నం. 159/1 లోని కృష్ణంరాజు చెరువు (పెద్ద చెరువు) 39.37 ఎకరాలలో విస్తరించిఉంది.[2]

భూమి వినియోగం

[మార్చు]

భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 88 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 12 హెక్టార్లు
  • నికరంగా సాగుచేయబడె మెట్ట భూమి: 719 హెక్టార్లు

జనాభా వివరాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 539 ఇళ్లతో, 1930 జనాభాతో 820 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 977, ఆడవారి సంఖ్య 953..[3] 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,065. ఇందులో పురుషుల సంఖ్య 1,021, మహిళల సంఖ్య 1,044, గ్రామంలో నివాస గృహాలు 583 ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు

[మార్చు]
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ప్రాథమికోన్నత పాఠశాల పర్చూరులో ఉన్నది. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల పర్చూరులోను, ఇంజనీరింగ్ కళాశాల చీరాలలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, పాలిటెక్నిక్‌ నాగులపాలెంలోను, మేనేజిమెంటు కళాశాల చీరాలలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం చీరాలలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఒంగోలు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, పశు వైద్యశాల పర్చూరులో వుంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం ఊరిలో వుంది.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. నీటి కోసం రెండు చెరువులు వున్నాయి.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సమీప పర్చూరు మండలకేంద్రానికి పంచాయితీరాజ్ రహదారి వుంది. అక్కడినుండి రాష్ట్రరహదారి సౌకర్యం వుంది. సమీప రైల్వే స్టేషన్ చీరాలలో వున్నది.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం పర్చూరులో వున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

మెట్ట భూమి అయినందున, గ్రామంలో సెనగ, పొగాకు, మిరప, ప్రత్తి సాగుచేస్తారు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "ఈనాడు ప్రకాశం; 2017,ఆగష్టు-23; 1వపేజీ".
  3. "Village Amenities for Prakasam District of Andhra Pradesh, 2011".